హోమ్ / ఆరోగ్యం / చర్చా వేదిక - ఆరోగ్యం / జుట్టు రాలుట - జుట్టు నేరవటం / జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
పంచుకోండి

జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Re: జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ చేయబడింది kanakadurga తేదీ July 02. 2014

జుట్టు రాలకుండా  నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Re: జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 02. 2014
జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు. అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి, ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది. కలబంద గుజ్జును కూడా ఇలా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.

Re: జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ November 19. 2015
జుట్టు ఊది పోతుంది ఎందుకు

Re: జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ December 02. 2015
Previously kanakadurga wrote:

జుట్టు రాలకుండా  నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Re: జుట్టు రాలకుండా నేరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ March 14. 2016
సిద్ద ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారంలో అధికంగా కారం,పులుపు ఉన్న పదార్థాలను తినడం వలన,అధిక ఒత్తిడిని కలిగించే పనులునలు నిరంతరం చేస్తూ ఉండటం వలన శరీరంలో వాతము,శ్లేష్మము అధికం అయ్యి శిరస్సును చేరి వెంట్రుకలను ఊడిపోఎలాగా,తెల్లవెంట్రుకలు మరియు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.అయితే బట్టతల అనువంశికంగా కుడా వచ్చే అవకాశం ఉంది. సిద్ద ఆయుర్వేదంలో వెంట్రుకలు ఉడిపోకుండా ఉండటానికి మరియు బట్టతల వంటి వ్యాధులను నిర్మూలించి ఆరోగ్యంగా పెరగడానికి అనేక ఔషదాలు ఉన్నాయి అందులో నేను అనేక మందికి చికిత్స చేసి సత్ఫలితాలను పొందిన ఔషదాన్ని తయారుచేయడం చెప్తాను. 1. మన చేను గట్లలో దొరికే గున్తగలగరాకు రసం - 100gm 2. సుబ్రమైన కొత్త ఇనుప పాత్ర- 1 లీటర్ పరిమాణం కలది 3. త్రిఫలములు( కరక్కాయ,తానికాయ,ఉసిరికాయ) చూర్ణం-50 గ్రాములు 4.సుగందిపాలవేరు చూర్ణం- 25 గ్రాములు పైన చెప్పిన ఔషధులను ఇనుప పాత్రలో బాగా కలిపి నురవలెను తర్వాత అందులోనికి మీరు రోజు పెట్టుకునే కొబ్బరి నునె కాని మరేదైనా నునెను కాని 500 గ్రాములు అందులో పోసి 10 నిముషాలు సన్నని మంటలో చిక్కగా అయ్యేంతవరకు కాచాలి. చల్లారిన తర్వాత తడి తగలకుండా ఉండే బాటిల్లో జాగ్రత్త చేసుకుని రోజు నిద్ర పోయేముందు తలకు బాగా పట్టించి ఉదయమే గోరు వెచ్చని నీతితో స్నానం చేస్తున్నట్లయితే 10 దినములలో వెంట్రుకలకు సంబందించిన సమస్త వ్యాదులు తగ్గిపోయి ఆరోగ్యంగా పెరుగుతాయి. దీనిని వాడుతున్న మొదటి 10 రోజులు ఆహారంలో నిమ్మ పండ్లు,ఆలుగడ్డ,పచ్చి మెరప,అరటిపండ్లు తీసుకోకూడదు...10 రోజుల తర్వాత అన్నీ తినవచ్చు. ఆరోగ్యానికి సంబందించిన అన్ని సమస్యలకు సలహాల కోసం మరియు ఔషదాల కోసం నన్ను 99****51 ( నీలకంత సిద్ద,సిద్ద ఆయుర్వేద వైద్యులు,పల్లిపట్టు,తమిళనాడు) నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు