অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఒత్తిడి మరియు మానసిక వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సా శాస్త్రం

ఒత్తిడి మరియు మానసిక వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సా శాస్త్రం

  1. పరిచయం
  2. ఒత్తిడి అంటే ఏమిటి?
  3. ఒత్తిడిని కలిగించే సామాన్య మూలాధారాలు
    1. బతికి బయటపడడానికి సహకరించే ఒత్తడి
    2. అంతర్గత ఒత్తిడి
    3. పర్యావరణ సంబంధిత ఒత్తిడి
    4. ఒత్తిడులను స్వల్పకాలికమైనవిగా గాని లేక దీర్ఘకాలికమైనటువంటివి
  4. ఒత్తిడివల్ల కలిగే పరిణామాలను ప్రభావితం చేసే అంశాలు మరియు ఒత్తిడికి అవకాశాన్ని కలిగించేవి
  5. ఒత్తిడి ప్రభావాలు
    1. శారీరక లేక భౌతిక ప్రభావాలు (Physical Effects)
    2. మానసిక ప్రభావాలు
    3. వ్రవర్తనా సంబంధిత ఒత్తిడులు
    4. కొన్ని ఒత్తిడి సంబంధిత వ్యాధులు
  6. ఒత్తిడి నిర్వహణ
    1. ఒత్తిడిపై పత్రిక (స్ట్ర్రెస్ జర్నల్) ఒకదానిని ప్రారంభించండి.
    2. ఒత్తిడితో తట్టుకుని ఉండగలగడంలో అనుసరించే అనారోగ్యకరమైన మార్గాలు
    3. పరిస్ధితిని మార్చండి
    4. మీ ప్రతిస్పందనను మార్చండి
    5. అనవరమైన ఒత్తిడిని తప్పించండి
    6. పరిస్ధితిని మార్చండి
    7. ఒత్తిడిని కలిగించే అంశాలను అనుకూలంగా మార్చుకుంటూ, సర్దుకుపోండి
    8. మీరు మార్చలేని వాటితో సమ్మతించండి., సరిపెట్టుకోండి
  7. సేద తీర్చుకోవడానికి, పునరావేశం (రిఛార్జ్) పొందడానికి ఆరోగ్యకరమైన మార్గాలు
  8. ఆరోగ్యకరమైన జీవన విధానం
  • సహజంగా ఒత్తిడిని తగ్గించే కొన్ని ఆహర పదార్ధాలు
  • పరిచయం

    ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము. బహుశా, సాధారణ మనోవికాసానికి, అవసరమయ్యే ఒక దశ వరకు జీవితంలో మానసిక ఒత్తిడి విడదీయరాని అనుబంధాన్ని కలిగివుంటుంది,. అయితే, ఈ ఒత్తిడులు మరీ తీవ్రరూపాన్ని దాలిస్తే మాత్రం ఇది ఒక పెద్ద అసాధారణ మనోవ్యాధి లక్షణాలను తెలుసుకునే విజ్ఞాన శాస్త్రానికి, హఠాత్ మానసిక అనారోగ్యానికి ఉసిగొల్పేటటువంటి లేక గణనీయమైన మనోవ్యాధికి దోహదం చేసే కారణం కావచ్చు. సాధారణంగా ఒత్తిడివల్ల కలిగే నిర్దిష్ట ప్రమాదాన్ని గురించి కానీ లేక దీనినుండి రక్షణను కలుగజేసే యంత్రాంగాన్ని గురించి అంతగా తెలియకపోయినప్పటికీ, అసాధారాణ మానసిక వ్యాధులకు సంబంధించిన మనస్తత్వ శాస్త్రంలో ఒత్తిడికి అధిక ప్రాముఖ్యత ఉన్నట్లు మంచి సాక్ష్యాధారాలున్నట్లు నివేదించబడింది. వ్యతిరేక, లేక ప్రతికూలం కాని లేక ఒత్తిడితో కూడుకున్న జీవితంలోని సంఘటనలు సర్వ సాధారణంగా ఈ మనోభావాలు, మానసిక శక్తికి సంబంధించి, ఆదుర్దా, ఆతృతల వంటి వివిధ రుగ్మతల అభివృధ్దికి ముడిపడి ఉన్నాయి. సాంఘిక, కుటుంబ, మానసిక మరియు జీవశాస్త్ర సంబంధిత అంశాల యొక్క క్లిష్టమైన పరస్పర ప్రభావం ద్వారా బాల్యంలోనూ, పెద్దవారయ్యాక లైంగిక, శారీరక, మానసిక వేధింపులు, గృహ హింస మరియు బలం చూపి భయపెట్టుట, బంధించుట వంటివి మానసిక రుగ్మత వృధ్ది చెందడానికి సంబంధం కలిగివున్నాయు. ఒక్కొక్కసారి కేవలం ఒక పెద్ద మానసిక కలవరము లేదా కలత పి.టి.ఎస్.డి. వంటి అసాధారణ మనోవ్యాధి లక్షణాలను తెలుకొనే పరిక్షలకు (విజ్ఞాన శాస్త్రానికి) దారితీస్తున్నప్పటికీ, కాలక్రమేణా సాంఘిక, కుటుంబ, మానసిక మరియు జీవశాస్త్ర సంబంధిత అంశాల ద్వారా గడించిన అనుభవాల కలయిక నుండి పేరుకుపోయినదాని ఫలితమే ఇది అన్నట్లు కనిపిస్తుంది, ఇటువంటి ఇబ్బందికర అనుభవాలనుండి, పరిస్ధితులనుండి తట్టుకుని తిరిగి యధాస్ధితికి చేరుకునే శక్తి వివిధ స్ధాయిలలో ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి కొన్ని రకాలైన అనుభవాలలో కొంత వరకూ ఎదిరించి నిలిచి ఉండవచ్చు కాని ఇతరములైవ వాటికి తేలికగా వశమైపోతాడు. జన్యుపరమైన బలహీనత, స్వభావసిద్దమైన లక్షణాలు, అర్ధం చేసుకోగలిగే శక్తి, వివిధములైన తట్టుకోగలిగే శక్తిలో ఉండే తేడాలకు సంబంధించినవి మరియు ఇతర అనుభవాలకి సంబంధించిన అంశాలుగా వుంటాయి.

    ఒత్తిడి అంటే ఏమిటి?

    ఒత్తిడిని ఏదైనా శారీరక, రసాయనిక లేక భావావేశపూరిత, ఉద్విగ్నభరితమైన ఆంశంగానైనా పరిగణించవచ్చు, అలాగే, శారీరక లేక మానసిక అశాంతిని, ఆందోళనను కలిగించడంతో ఈ వ్యాధి సంక్రమించడానికి ఇది ఒక హేతువుగా, సకారణయుతమైన అంశం కూడా కావచ్చు. ఒత్తిడిని కలుగజేసే శారీరక మరియు రసాయనిక అంశాలు తీవ్ర గాయం, అఘాతం, అంటురోగాలు, జీవ విషాలు (టాక్సిన్స్), అనారోగ్యం మరియు ఏ విధమైన ఇతర గాయాలతోనైనా కూడి వుండవచ్చు. ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనేకమై, వివిధ రకాలుగా కూడా ఉంటాయి. ‘ఒత్తిడి’ అనే మాట మానసిక ఒత్తిడితో సంబంధం కలగినదిగా భావిస్తున్నప్పటికీ, శాస్త్రజ్ఞులు మరియు వైద్యులు మాత్రం ఇదే మాటను శరీరం నిర్వహించే విధులలో స్ధిరత్వాన్ని మరియు సమతుల్యతను మందగింపచేసే ఒక బలీయమైన శక్తిగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. తమ చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నప్పుడు దాని ద్వారా ఒత్తిడికి గురైనట్లు భావించే చాలామంది తమ శరీరాలు రసాయనాలను రక్తంలోకి విడుదల చేస్తున్నట్లుగా ప్రతిస్పందిస్తారు. ఇటువంటి రసాయనాలు వీరికి ఎంతో శక్తిని మరియు బలాన్ని కలుగజేస్తాయి.

    తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి. ఉదాహరణకుః ఒక ప్రోజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహస్తున్నప్పుడు తక్కువ స్ధాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగలిగేటట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది, ఒత్తిడిలో రెండు రకాలున్నాయిః స్ట్రెస్ (‘అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి’) మరియు డిస్ట్రెస్ (‘ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి‘) ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్ మరియు అదనపు బరువు. ఒత్తిడి ఉధృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్నప్పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది.

    ఒత్తిడిని కలిగించే సామాన్య మూలాధారాలు

    బతికి బయటపడడానికి సహకరించే ఒత్తడి

    ఎవరైనా, ఏదైనా తనకు భౌతికంగా హాని కలిగించవచ్చని భయపడుతూ ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా శరీరం సహజంగానే పూర్తి శక్తితో విజృంభిస్తుంది, అతను ఈ ప్రమాదకరమైన ఘటన (కొట్లాట)నుండి బతికి బయట పడేలాగ లేకపోతే అసలు మొత్తంమీద అటువంటి పరస్ధితినుండి పూర్తిగా తప్పించుకునే (ఎగిరి, పారిపోవడం). లాగ ఇది బతికి మనుగడ సాగించడానికి ఉపకరించే ఒత్తిడి.

    అంతర్గత ఒత్తిడి

    తమంతట తాముగా ఒత్తిడికి గురి చేసుకునే విధానాన్నే అంతర్గత ఒత్తిడి అని చెప్పవచ్చు. ఇది తరుచుగా మనవల్ల గాని లేక మనంతట మనం అదుపు చేయలేని వాటివల్ల మనంతట మనంగా ఒత్తిడికి గురిచేసుకునే పరిస్ధితుల్లో చిక్కుకోవడం వంటిది. కొంతమంది ఆదరా బాదరా, ఉద్రిక్తభరితంగా ఉండే జీవనశైలికిలోనై జీవిస్తూ ఉంటారు. ఫలితంగా ఒత్తిడికిలోనై ఉంటారు. చివరికి వీరు ఒత్తిడితో ఉండే పరిస్ధితుల కోసం చూస్తూ ఉంటారు, అలాగే అంతగా ఒత్తిడిగాలేని వాటిగురించి కూడా ఒత్తిడితో ఉన్నట్లు భావిస్తూ ఉంటారు

    పర్యావరణ సంబంధిత ఒత్తిడి

    ఒత్తిడికి కారణమవుతూ మనచుట్టూ వుండే వాటి ప్రతిస్పందనే ఇది. అంటే శబ్దం, జనాలు గుంపులుగా, గుమిగూడి ఉండడం మరియు పనివల్ల లేక కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడి. ఈ పర్యావరణ సంబంధిత ఒత్తిడులను కనిపెట్టడం, వాటినెలా తప్పించాలి లేక సమర్ధవంతంగా ఎలా చక్కబెట్టాలి అన్నది నేర్చుకోవడం ఈ ఒత్తిడుల స్ధాయిలను తగ్గించుకోవడానికి ఉపకరిస్తుంది.

    ఒత్తిడులను స్వల్పకాలికమైనవిగా గాని లేక దీర్ఘకాలికమైనటువంటివి

    ఈ మాదిరి ఒత్తిడి కాలక్రమేణా పేరుకుపోతుంది, మీ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూసిస్తూ మీరు మీ పనిలో పాఠశాలలో గాని, ఇంటివద్ద గాని అతిగా నిమగ్నమై చేయడం లేక అతి కష్టమైన పనిని చేయడం దీనికి కారణ మవుతుంది. కాలాన్నెలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలి లేక కాలాన్ని విశ్రాంతికోసం, సేదతీర్చుకోవడం కోసం ఎలా కేటాయించుకోవాలి అన్న వాటిపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ ఒత్తిడి కారణం కావచ్చు. ఈ మాదిరి ఒత్తిడినుండి తప్పించుకోవడానికి ఇది ఒక జటిల సమస్యగా కూడా అనిపించవచ్చు, ఎందుకంటే చాలామంది ఇది తమ అదుపులో లేని విషయం అని భావిస్తూ ఉంటారు కాబట్టి.

    • స్వల్పకాలికమనే ‘తీవ్రమైన‘ ఒత్తిడి తక్షణ హెచ్చరిక, బెదిరింపు వంటి వాటి ప్రతిస్పందన వంటిది – దానిని ఎదుర్కోవడం గాని లేక దానినుండి తప్పించుకుని ఎగిరిపోవడం గాని అనే ప్రతిచర్యగా కూడా పిలువబడేది. మెదడులో పెరుగుదలలో ఉండే భాగం, ఆలాగే మెదడులోనే ఉండే కొన్ని రసాయనపదార్ధాలు పొంచి ఉన్న, హానికరమైన ఒత్తిడులకు లేక హెచ్చరికలకు ప్రతిస్పందించడానికి కారణమవుతున్నప్పడు జరిగే సందర్భం ఇది.
    • దీర్ఘ కాలిక ‘ఎడతెగని‘ ఒత్తిడులు అన్నవి ప్రస్తుతం ఉన్న మరియు కోనసాగుతున్నటు వంటివి మరియు వాటినెలా తప్పించాలి లేక వాటినుండి ఎగిరిపోయి ఎలా బయటపడాలి అన్న బలీయమైన కొరికను బలవంతంగా అణిచిపెట్టి ఉంచినపుడు సంభవించేవి. ఈ మాదిరి ఎడతెగని, దీర్ఘకాలిక ఒత్తిడులకు ఉదాహరణలుః ప్రస్తుతం నిర్వహిస్తున్న, ఒత్తిడితో కూడిఉన్న పని, కొనసాగుతున్న సంబంధ బాంధవ్యాల సమస్యలు, ఒంటరిగా దూరంగా విసిరేసినట్లుండే భావం మరియు వదిలిపెట్టకుండా, నిరంతరం వెంటాడుతూ ఉండే ఆర్ధిక సమస్యలు.

    ఒత్తిడివల్ల కలిగే పరిణామాలను ప్రభావితం చేసే అంశాలు మరియు ఒత్తిడికి అవకాశాన్ని కలిగించేవి

    ఒక వ్యక్తి ఒత్తిడికి సులువుగా గురయ్యే అవకాశం ఈ క్రింది ఏ ఒక్క అంశం వల్ల గాని అన్ని అంశాల వలన గానీ జరగవచ్చు, అంటే ఒత్తిడికి ప్రతీ వారు కూడా వివిధ మోతాదులో ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అయితే ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి ఒత్తిడిని సులువుగా కలుగజేసే వాటిని ఎంచి, వాటిని ఇవే అని ఖచ్చితంగా నిర్ణయించలేము. అందుచేత కాలక్రమాన ప్రతి వ్యక్తి ఒత్తిడిని భరించగలిగే, ఓర్చుకోగలిగే స్ధాయి మారుతూ ఉంటుంది.

    • చిన్ననాటి, బాల్యావస్ధలోని అనుభవాలు (ఒత్తిడికి గురయ్యే అవకాశాన్ని నింద, దుర్వినియోగం, హింస అనేవి మరింత పెంచవచ్చు).
    • వ్యక్తిత్వం (కొందరి వ్యక్తిత్వాలు ఇతరుల కంటే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నవిగా ఉంటాయి).
    • జన్యుపరంగా (ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తూ వుండే ‘సేద తీర్చుకోవడం, విశ్రాంతిని తీసుకోవడానికి స్పందించడం ‘సిరోటినిన్ స్ధాయిలు’ మెదడును క్షేమంగా చూస్తూ ఉండే రసాయనపదార్ధాలు)
    • వ్యాధి నిరోధక శక్తిలో అసామాన్యత, తేడా (కొన్ని రకాల వ్యాధులను కలుగజేసేవిగా, అంటే కీళ్ల, జాయింట్లలో నొప్పులు మరియు చర్మవ్యాధి వంటి ఒత్తిడిని భరించగలిగే, నిభాయించు కోగలిగే శక్తిని బలహీనపరిచేవి)
    • జీవనశైలి (ప్రధానంగా అంతగా పుష్టికరంగాలేని ఆహారం మరియు వ్యాయామాలు చేస్తూ ఉండకపోవడం)
    • ఒత్తిడుల కాలవ్యవధి మరియు తీవ్రత.

    ఒత్తిడి ఉందా అని చూసేందుకు దర్యాప్తు చేయడానికి ఉసిగొలిపే సూచికలుః

    • నిద్రపోవడంలో ఇబ్బందులు
    • ఆకలి లేకపోవడం
    • ఏకాగ్రత లేదా దృష్టిని నిలపడంలో లోపం లేక ఏదైనా జ్ఞాపకముంచుకోవడంలో ఇబ్బంది
    • పనితనంలోనూ, సామర్ధ్యంలోనూ తరుగుదల.
    • విశేషంలేని, అసామాన్యమైన పొరపాట్లు, తప్పులు లేక స్వయంగా విధించుకున్న హద్దులను, ఆంక్షలను పాటించకపోవడం, నిలబెట్టుకోలేకపోవడం.
    • క్రోధం, కోపోద్రేకం
    • హింసాత్మక లేక సంఘవ్యతిరేక ప్రవర్తన
    • మానసిక సంఘర్షణ, ఒక్కసారిగా రెచ్చిపోవడం
    • మత్తుపానీయాలు లేక మాదకద్రవ్యాల దుర్వినియోగం
    • నరాల బలహీనత లేక అధైర్యంగా ఉండే అలవాట్లు

    ఒత్తిడి ప్రభావాలు

    శారీరక లేక భౌతిక ప్రభావాలు (Physical Effects)

    ఒత్తిడి వల్ల కలిగే శారీక ప్రభావాలు ప్రధానంగా నాడీ-అంతఃస్రవణ-వ్యాధినిరోధక (న్యూరో-ఎండాక్రినో-ఇమ్యునోలాజికల్) మార్గాల ద్వారా సంభవించడం జరుగుతుంది. ఒత్తిడి కలిగించే అంశాలు ఎటువంటివైనా, వీటికి శరీర స్పందనలు ఒక మాదిరిగా ఉంటాయి. ఈ క్రింద ఉదహరించినవి మన శరీరంపై ఒత్తిడివల్ల కలిగే కొన్ని ప్రభావాలుః

    • గుండె కొట్టుకోవడం : గుండె వేగవంతంగా కొట్టుకోవడం
    • బలహినంగా ఊపిరిపీల్చుకోవడం అధికమవడం
    • వణుకు, ప్రకంపనలు
    • జలుబు, అతి తీవ్రమైన, పరాకాష్టకు చేరుకున్న వాతావరణ మార్పులు/చెమటలు పట్టడం
    • కనురెప్పలు చెమర్చడం
    • నరాలు బిగుసుకుపోవడం, పొత్తికడుపు నరాలు బిగుసుకు పోయినట్లు కనిపించడం, చేతులు, కాళ్లు బిగుసుకు పోవడం, పళ్లుకొరకడానికి కారణమవుతూ. దవడలు బిగుసుకుపోవడం.
    • అజీర్తి/పేగులలో ఇబ్బందులు
    • అతిగా మూత్ర విసర్జన (చాలా సార్లు)
    • జుట్టు రాలిపోవడం
    మానసిక ప్రభావాలు

    దానిని గమనించి చూస్తూ, సరైన రీతీలో నివారణా చర్యలు చేపట్టేంత వరకూ ఒత్తిడి అనేక రూపాలలో సంభవించవచ్చు.
    పరిష్కరించకుండా అలాగే వదిలివేసిన భావోద్రేకపూరితమైన ఒత్తిడి, చివరికి మానసిక వ్యధలకు దారి తీయవచ్చన్న విషయం విదితమైనదే. అటు తరువాత ఇది శారీరక అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు (సైకోసోమేటిక్ (మనో వికృతి) అని పిలువబడే అనారోగ్యం).
    ఒత్తిడి వల్ల కలిగే ఇతర సాధారణ మానసిక ప్రభావాలుః

    • దేనిమీదా కూడా దృష్టిని పెట్టలేకపోవడం
    • నిర్ణయాలకు రావడంలో అసమర్ధత
    • ఆత్మవిశ్వాసం లోపించడం
    • చిరాకు పడడం లేక తరచుగా కోపం వస్తూ ఉండడం
    • అసంతృప్తి, దురాశతో తీవ్రమైన వాంఛ, లాలసత్వం
    • అనవసరంగా బాధపడుతూ ఉండడం, నలతగా, వ్యాకులత మరియు ఆదుర్ధాతో, అతృతతో ఉండడం
    • అసంబధ్దమైన, సహేతుకం గాని భయం
    • గాభరా, భయాందోళనలతో దాడి చేయడం
    • అలవిగాని, తప్పని భావోద్రేకాలు మరియు మనోభావపూరిత ఊగిసలాటలు
    వ్రవర్తనా సంబంధిత ఒత్తిడులు

    ఒత్తిడి ప్రభావానికి లోనై ఉన్నప్పుడు ఇవి వ్యక్తి యొక్క చేష్టలు మరియు అతను ప్రవర్తించే తీరును ప్రదర్శిస్తాయి
    ఈ క్రింద ఉదహరించినవి ఒత్తిడి మూలంగా సంభవించే ప్రవర్తనా సంబంధిత ప్రభావాలు:

    • అతిగా పొగత్రాగడం
    • నరాలు, కండరాలు సంకోచించడం
    • అధికమైన మాదకద్రవ్యాల మరియు మత్తుపానీయాల వాడకం
    • ప్రవర్తనా సరళి – గోళ్లు కొరుకుతూ ఉండడం, జుట్టు పీక్కుంటూ ఉండడం మొ.వి.
    • అతిగా తినడం లేక తక్కువ తినడం
    • అన్యమనస్కుడై, ఏమరుపాటుగా ఉండడం (ఆబ్సెంట్ మైండెడ్)
    • ప్రమాదోన్ముఖుడై ఉండడం
    • అతి స్వల్ప ప్రేరణకే, దౌర్జన్యపూరిత స్వభావం కలిగి ఉండడం

    ప్రవర్తనా సంబంధిత ఒత్తిడులు చాలా ప్రమాదకరమైనవన్నది ఋజువైన విషయమే. ఇవి అన్యోన్య సంబంధాలను మరియు సామాజిక భాంధవ్యాలను దెబ్బతీసి, చెడగొట్టేవి కూడా.
    ఒత్తిడి వల్ల సంభవించే కొన్ని రకాలైన దీర్ఘకాలిక, ఎడతెగని మరియు కంటికి కనబడని ప్రఛ్చన్నమైన అనర్ధాలు ఒంటరితనం వల్ల, బీదరికం వల్ల, వియోగం, కాలవసిన వారు మృతి చెందడం వల్ల, దుఃఖం, వ్యాకులత, విచారం వల్ల మరియు పక్షపాతం, వివక్షత వల్ల కలిగిన నైరాశ్యం, నిరాశ, నిస్పృహల వల్ల సంభవించేవి - వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, వైరస్ సంభంధిత రుగ్మతలకు తట్టుకోలేకపోవడం – అంటే సాధారణ జలుబు నుండి బొబ్బలు నుండి ఎయిడ్స్ మరియు కేన్సర్ వరకూ ఉండేవి.
    ఇతర హార్మోన్లమీద, మెదడులోని నాడిమండల సంబంధిత ట్రాన్స్ మిట్టర్స్ (సమాచారాన్ని ప్రసారం చేసే పరికరం) వేరే చోట్ల అదనంగా ఉండే చిన్న రసాయన సంబంధిత సంకేతాలను చేరవేసేవి, ప్రోస్టాగ్లాండిన్స్ (హర్మోన్ లాగ పనిచేసే ఒక పదార్ధం), అలాగే క్లిష్టమైన ఎంజైమ్ (రసాయనిక మార్పును వేగంగా కలుగజేయు రసాయనిక పదార్ధం) పనిచేసే విధానంపైనా, అలాగే ఇంతవరకు తెలియరాని జీవక్రియ సంబంధిత కార్యకలాపాలపై కూడా ఒత్తిడి తన ప్రభావాన్ని చూపిస్తుంది.

    కొన్ని ఒత్తిడి సంబంధిత వ్యాధులు

    ఒత్తిడి ప్రభావానికి లోనై ఉన్నప్పుడు ఇవి వ్యక్తి యొక్క చేష్టలు మరియు అతను ప్రవర్తించే తీరును ప్రదర్శిస్తాయి
    ఈ క్రింద ఉదహరించినవి ఒత్తిడి మూలంగా సంభవించే ప్రవర్తనా సంబంధిత ప్రభావాలు:

    • యాసిడ్ పెప్టిక్ డిసీజ్ (ఆమ్లం జీర్ణ ప్రక్రియకు సహకరించే వ్యవస్ధలో వచ్చే అవరోధం వంటి వ్యాధి)
    • మద్యపాన వ్యసనం
    • ఉబ్బసం
    • అలసట, ఆయాసం
    • ఆందోళనతో కూడిన తలనెప్పి
    • అధిక రక్తపోటు (నరాలు బిగుసుకుపోవడం)
    • నిద్రలేమి
    • వ్యధను కలిగించే పేగులలోని అసౌకర్యం (సిండ్రోమ్)
    • రక్తప్రసరణ హీనతతో వచ్చే గుండె జబ్బు
    • మానసిక రుగ్మతలు
    • లైంగిక దుర్భలత్వం
    • సోరియాసిస్ (ఎర్రటి, శరీరమంతా వ్యాపించి ఉండే మచ్చలు), లిచెన్ ప్లేనస్, దద్దుర్లు, దురదలు, నాడీ సంబంధిత చర్మ వ్యాధి మొ.వి. ఈ జాబితా అసంపూర్ణమైనది.

    ఒత్తిడి వల్ల సంభవిస్తున్న, ప్రేరేపించబడుతున్న వ్యాధులను గురించి అర్ధం చేసుకోవ డంలోనూ, ఒత్తిడిని నియంత్రీకరిస్తూ, సక్రమంగా నిర్వహిస్తూ ఉండడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడానికి పై అంశాలను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. (రోగ) చికిత్సా సంబంధిత పరీక్షా స్ధాయిలో వ్యక్తులలో ఉండే ఒత్తిడిని గురించి తెలుసుకుని, కోర్టిసోల్ మరియు డి.హెచ్.ఇ.ఏ. (డిహైడ్రో ఎపియాండ్రోస్టేరోన్) అనే ఎడ్రినాల్ గ్రంధుల ద్వారా తయారుచేయబడుతూ ఉండే రెండు హార్మోన్ల స్ధాయిలను కొలిచి శాస్త్రయుక్తంగా మదింపు చేయవచ్చు.

    హోమ్స్ మరియు రాహె స్ట్రెస్ స్కేల్ ప్రకారం ఒత్తిడిని కొలవడానికి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో గత సంవత్సరంలో జరిగిన సంఘటనలకు వర్తించు ‘లైఫ్ ఛేంజింగ్ యూనిట్ల’ (జీవితంలో మార్పును తీసుకువస్తూ ఉండే యూనిట్లను) సంఖ్యలను కలిపిన తరువాత చివరిగా వచ్చిన స్కోర్ ను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకుః జీవిత భాగస్వామి మరణం 100 పాయింట్లనిస్తుంది.

    • 300+ స్కోర్ - అనారోగ్యం సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు
    • 150 - 299+ స్కోర్ – అనారోగ్య ప్రమాదం అంతగా లేకుండా ఒక మాదిరిగా ఉన్నప్పుడు ( పైన చెప్పిన అనారోగ్య ప్రమాదాన్నుండి 30 శాతంతో తగ్గించబడింది)
    • 150 - స్కోర్ - కొద్దిగా మాత్రమే అనారోగ్య ప్రమాదం ఉంది.

    ఒత్తిడి నిర్వహణ

    ఒత్తిడిపై పత్రిక (స్ట్ర్రెస్ జర్నల్) ఒకదానిని ప్రారంభించండి.

    జీవితంలో క్రమం తప్పకుండా సంభవిస్తూ ఉండే ఒత్తిడిని గుర్తించడానికి మరియు వీటితో మనం ఎలా ఉండాలి అన్న విధానంపై ఒత్తిడిని గురించి వివరించే ఒక పత్రిక (జర్నల్) మీకు సహాయకారిగా ఉంటుంది. ఒత్తిడిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, అతడు/ఆమె ఎప్పుడైనా పత్రికలో ఒత్తిడికి గురైనట్లు భావిస్తే, రోజు వారిగా దీనిని గురించి వ్రాసి పెట్టుకుంటూ ఉండడంతో, అతడు/ఆమె వివిధ తరహాలను, సాధారణాంశాలను, ఇతివృత్తాలను చూడడం ప్రారంభిస్తారు. వాటిని ఈ విధంగా వ్రాయండిః

    • మీకు ఒత్తిడి కలగడానికి కారణమేమై ఉంటుంది (మీరు చెప్పబోయేది సరైనది కాదనిపిస్తే ఊహించుకుని చెప్పండి)?
    • శారీరకంగానూ, మానసికంగానూ కూడా మీరెలా అనుకుంటున్నారు?
    • దీనికి ప్రతిస్పందనగా మీరేం చేసారు?
    • బాగానే ఉన్నానుకోవడానికి మీరేం చేసారు?

    ప్రస్తుతం మీరు దీనిని అదుపుచేయడంలో అనుసరించే పధ్దతులను గురించి ఆలోచించండి, అలాగే మీ జీవితంలో ఈ ఒత్తిడికి తట్టుకోగలిగి ఉండండి. వీటిని గుర్తించడానికి మీ ఒత్తిడి పత్రిక మీకు సహకరించగలదు. దీనికి తట్టుకుని ఉండగలిగే మీ వ్యూహాలు ఆరోగ్యకరమైనవేనా లేక అనారోగ్యకరమైనవా, సహకరించేవేనా లేక ఫలితమివ్వని, అనుత్పాదకమైనవా? దురదృష్టవశాత్తూ చాలామంది ఒత్తిడికి తట్టుకోవడంలో అనుసరించే విధానాలు ఈ సమస్యతో రాజీపడుతున్నట్లుగా ఉంటాయి.

    ఒత్తిడితో తట్టుకుని ఉండగలగడంలో అనుసరించే అనారోగ్యకరమైన మార్గాలు

    ఒత్తిడికి తట్టుకునేందుకు ఉపయోగించే ఈ వ్యూహాలు దానిని తాత్కాలికంగా తగ్గించవచ్చు, కాని, దీర్ఘకాలంలో ఇవి మరింత హానిని కలుగజేయవచ్చు.

    • పొగత్రాగడం
    • అతిగా మద్యం సేవించడం
    • అతి ఎక్కువగా గాని లేక అతి తక్కువగా గాని తినడం
    • టి.వి. ముందు గాని లేక కంప్యూటర్ ముందుగాని గంటల తరబడి అలాగే అంటిపెట్టుకుని కూర్చుని ఉండడం
    • స్నేహితుల వద్ద నుండి గాని, కుటుంబాన్నుండి గానీ లేక ఇతర కార్యకలాపాలనుండి గాని విరమించుకోవడం అంటే వైదొలగడం.
    • సేద తీర్చుకోవడానికి బిళ్లలను లేక మాదక ద్రవ్యాలను ఉపయోగించడం
    • అతిగా నిద్ర పోవడం
    • దేన్నైనా ఊరికే సాగదీయడం, తాత్సారం చేయడం
    • సమస్యలనుండి తప్పించుకోవడానికి రోజులో ప్రతి నిముషం కూడా వినియోగిస్తూ ఉండడం
    • ఇతరులపై మీ ఒత్తిడిని చూపించడం (వారిపై విరుచుకు పడుతూ ఉండడం, కోపంతో ఒక్కసారిగా ఉద్రిక్తులవుతూ ఉండడం, శారీరక హింస)
    • ఒత్తిడిని తట్టుకుని, దానిని చక్కగా అదుపుచేస్తూ, సరైన రీతిలో నిర్వహించుకుంటూ ఉండడానికి అనేక పధ్దతులున్నాయి. అయితే, ఇవన్నీ కూడా మార్పును ఆశిస్తున్నాయి. పరిస్ధితిని, సంఘటనను మనం మార్చడమేనా చెయ్యాలి లేదా మన ప్రతిస్పందననైనా మార్చుకుంటూ ఉండాలి. దీనిని గురించి తీక్షణంగా ఆలోచించి, ఈ ఒత్తిడికి మూలమైన కారణాలను గురించి ఇతరులతో కూడా మాట్లాడండి. అలాగే వీటిని నివారించడానికి, తగ్గించుకోవడానికి ఈ ఒత్తిడికి గల కారణాలనుండి అటువంటి పరిస్ధితినుండి, ఒత్తిడికి గురైన వ్యక్తిని తప్పించడానికి తగిన చర్యలు తీసుకోండి.
    • ఒత్తిడిని అదుపుచేయడంలోనూ, దాని సరైన నిర్వహణలోనూ, మీ నిర్వహణా విధానాన్ని మరింత మెరుగు పరచడానికి, అభివృధ్ది చేయడానికి మీ ధృక్ఫధం, మీరు చేపట్టే చర్యలు, అనుసరించే విధానం చాలా ముఖ్యమైనవని గ్రహిస్తూ, ఒత్తిడికి గురైన వ్యక్తి నుండి దానికి గల కారణాలను, దీనిలో ఉండే వివిధ రకాలను గురించి అర్ధంచేసుకోండి, అలాగే ఈ ఒత్తిడిని కలిగించే పరిస్ధితి రావడానికి సహకరించే అంశాలను గురించి కూడా ఆలోచించండి.
    పరిస్ధితిని మార్చండి
    • ఒత్తిడిని కలిగించే అంశాలను తప్పించండి
    • ఒత్తిడిని కలిగించే అంశాలను మార్చండి
    మీ ప్రతిస్పందనను మార్చండి
    • ఒత్తిడికి అనుకూలంగా ఇమడగలిగేటట్లు ఉండండి
    • ఒత్తిడిని కలిగించే అంశాలతో సరిపెట్టుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ ఉండండి
    అనవరమైన ఒత్తిడిని తప్పించండి
    • ‘లేదు/కాదు (నో)‘ అని చెప్పడమెలాగో నేర్చుకోండి.మీ పరిమితులు, పరిధులు ఏమిటో తెలుసుకుని, వాటికి కట్టుబడి ఉండండి. మీ వ్యక్తిగత జీవితంలో గాని లేక వృత్తిపరమైన జీవితంలో గాని, అదనపు బాధ్యతలను తీసుకోవడం మానండి. మీరు చెయ్యగలిగిన దానికంటే ఎక్కువగా చెయ్యడం ఖచ్చితంగా ఒత్తిడిని కలిగించడంలో అగ్నికి ఆజ్యం పోసినట్లే.
    • మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టివేసే వారి నుండి తప్పించుకోండిమీ జీవితంలో నిరంతరం విడువకుండా స్ధిరంగా ఎవరైనా ఒత్తిడిని కలుగజేస్తూ ఉంటే, అలాగే మీరు కూడా ఈ సంభంధ బాంధవ్యాన్ని తిరస్కరించలేని పరిస్ధితిలో ఉంటే, అటువంటి వ్యక్తితో మీరు గడిపే కాలాన్ని కుదించండి లేకపోతే అటువంటి సంబంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోండి.
    • మీ చుట్టూ ఉండే పర్యావరణాన్ని అదుపులో పెట్టుకోండి.ఒకవేళ సాయంకాలం పూట వార్తలు మీలో ఆదుర్దాను, కంగారును పుట్టిస్తూ వుంటే, టి.వి. కట్టి వేయండి. ఒక వేళ ట్రాఫిక్ మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తూ, ఉద్రిక్తంగా ఉంటే, దూరమైనా సరే, తక్కువ ప్రయాణం చేయగలిగే, వేరే మార్గాన్ని చూసుకోండి. మార్కెట్ కు వెళ్లడం అంత ఉల్లాసభరితమైనదిగా అనిపించకుండా, అయిష్టంగా ఉంటే, వెచ్చాల కోసం ఆన్ లైన్ సౌకర్యాన్ని ఉపయోగించు కుంటూ, షాపింగ్ చెయ్యండి.
    • వేడిని, ఉద్రేకాన్ని పుట్టించే విషయాలపై చర్చించకండిఒక వేళ మీరు మతం గురించి గాని, రాజకీయాలపై గాని నిరుత్సాహపడడం, కలత చెందడం గాని జరిగితే, అటువంటి విషయాన్ని మీ సంభాషణల జాబితాలోనుండి కొట్టివేయండి. అదే విషయంపై అదే వ్యక్తులతో మీరు అదేపనిగా, మరల మరల వాదించవలసి వస్తే, అటువంటి విషయంపై అసలు సంభాషణనే లేవనెత్తకండి, లేకపోతే అదే విషయంపై చర్చించవలసి వస్తే ఏదో సాకు చూపిస్తూ చర్చ నుండి వైదొలగండి.
    • మీరు చేయవలసిన పనుల జాబితాను కుదించండి.మీ షెడ్యూలును, బాధ్యతలను మరియు దైనందిన కార్యక్రమాలను విశ్లేషించి చూడండి. మీ ప్లేటు మరీ మితిమీరి ఉన్నట్లనిపిస్తే, ‘చెయ్యాలి‘ అన్న మాటలను ‘తప్పనిసరిగా చెయ్యాలి‘ అన్న మాటలను ప్రత్యేకంగా విభజించి, వర్గీకరించి చూడండి. వాస్తవంగా అంత ప్రాధాన్యం లేని పనులను జాబితా క్రిందికి, అట్టడుగుకి చేర్చండి లేకపోతే మొత్తానికే వాటిని తొలగించండి.
    పరిస్ధితిని మార్చండి
    • మీలోని భావాలను వ్యక్తీకరించండి, వాటితో పోరాడడానికి, మదనపడుతూ ఉండడానికి బదులుగాఏదైనా లేక ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గానీ లేక బాధ పెడుతుంటే గాని, మీ ఆందోళనను బాహాటంగా, స్పష్టంగా, సగౌరవంగా తెలియజేయండి. మీ భావాలను తెలియజేయకపోతే, పరిస్ధితి అలాగే ఉంటూ అసహనం, కోపాన్ని మరింత పేరుకుపోయేటట్లు చేయడంతో పాటు, అది అలాగే కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది.
    • రాజీపడడానికి సమ్మతించండిమీరు మరొకరినెవరినైనా వారి ప్రవర్తనను మార్చుకొమ్మని అడిగినప్పుడు, మీరు కూడా అదే పని చేయడానికి సమ్మతించి, సిధ్దపడి ఉండండి. కనీసం కొంత మేరకైనా మీరిద్దరు కాస్త ఒంగి ఉండడానికి అంగీకరిస్తే, ఒక ఆనందభరితమైన, సంతోషకరమైన, మధ్యస్తంగా నిలదొక్కుకోవడానికి మీకు మంచి అవకాశం చిక్కినట్లే.
    • నిక్కచ్చిగా, ఖచ్ఛితంగా ఉండండిమీ స్వంత జీవితంలో మీరు వెనుకసీటులో కూర్చొని ఉండనక్కరలేదు. సమస్యలను సూటిగా, తిన్నగా ఎదుర్కోండి, అటువంటిది జరుగుతుందని ముందే గ్రహించుకుని ఉండడానికి అలాగే అటువంటి పరిస్ధితిని నివారించడానికీ మీకు చేతనైనంత చేయండి. మీరు పరీక్షలు వ్రాయడానికి సిధ్దమవుతూ ఉండగా, ఊరికే అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చేసే, మీ గదిలోనే ఉండే మీ సహచరుడు అప్పుడే ప్రత్యక్షమయితే, అతనితో ధైర్యంగా, మీరు మాట్లాడడానికి కేవలం 5 నిముషాల సమయమే ఉందని ముక్కుసూటిగా చెప్పివేయండి.
    • కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి.కాలాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే, అది కావలసినంత ఒత్తిడికి కారణమవుతుంది. మీకున్న టైము చాలా తక్కువగా ఉన్నప్పుడు, అప్పటికే మీరు మీ పనులలో వెనుకబడి ఉన్నట్లయితే, కేంద్రీకరించిన దృష్టితో, మౌనంగా, ప్రశాంతంగా ఉండడం కష్టమే. కానీ ముందుగానే మీరు ఒక ప్రణాళికాబధ్దంగా ఉంటూ, అతిగా ప్రయాసపడకుండా చూసుకుంటే, మీరనుభవిస్తున్న ఒత్తిడిని మీరు కాస్త మార్చవచ్చు.
    ఒత్తిడిని కలిగించే అంశాలను అనుకూలంగా మార్చుకుంటూ, సర్దుకుపోండి
    • సమస్యలను తిరగరాయండి:మరింత ప్రోత్సాహకరమైన, వాస్తవ ధృక్ఫధం నుండి ఒత్తిడితో నిండి ఉన్న సమస్యలను చూడడానికి ప్రయత్నించండి. ట్రాఫిక్ జామ్ తో కోపంగా ఉద్రిక్తులవడానికి బదులు, దానిని కాస్త సేద తీర్చుకోవడానికి, స్వాంతన పొందడానికి లేక మీకిష్టమైన రేడియో స్టేషన్ ను వినడానికి లేకపోతే ఒంటరిగా కాస్త కాలాన్ని అనుభవించడానికి చిక్కిన అవకాశంగా భావించండి.
    • విశాల ధృక్పధంతో ఉండండి:విశాలమైన చిత్రాన్ని ఊహించుకోండి. ఒత్తిడితో కూడి ఉండే పరిస్ధితి వైపు సరైన ధృక్కోణంలో చూడండి. రాబోయే, దీర్ఘకాలంలో అది ఎంత ముఖ్యమైనదో మీకు మీరే ప్రశ్నించుకోండి. అది ఒక నెల మాటా? లేక ఒక సంవత్సరమా? అసలు దీనిని గురించి కలత చెందవలసిందేముంది? ఒకవేళ సమాధానం కనక కాదు అనిపిస్తే, మీ దృష్టిని, కాలాన్ని, శక్తిని వేరేదానిపై కేంద్రీకరించండి.
    • మీ ప్రామాణికాలను అనుకూలంగా సర్దుబాటు చేసుకోండి :పరిపూర్ణతను, పూర్తి సమగ్రతను సాధించాలనే వాదం తప్పించుకోవలసిన ఒత్తిడికి ఒక పెద్ద మూలకారణం వంటిది. పరివూర్ణత, సమగ్రతను సాధించాలనుకునే మీ బలమైన కోరిక వైఫల్యం చెందేలాగ, మీరు సిధ్దపడకండి. మీకోసం, ఇతరులకోసం సకారణయుతమైన ప్రామాణికాలను నెలకొల్పండి, అలాగే ‘బాగానే ఉంది (ఓ కే) – ఇక చాలు‘ అనిపించుకునే లాగ ఉండడం నేర్చుకోండి.
    • వాస్తవ, ప్రోత్సాహకరమైన వాటిమీదనే దృష్టిని కేంద్రీకరించండి :ఒత్తిడి మిమ్మల్ని క్రిందికి నెట్టివేయాలని చూస్తుంటే, మీరు మీ జీవితంలో కొనియాడతగ్గ అంశాలవైపు మీ స్వంత, ప్రోత్సాహకరమైన యోగ్యతలను మరియు బహుమతుల వంటి వాటితో - వీటివైపు దృష్టిని మరల్చండి కాసేపు, ఈ చిన్న, సులువైన వ్యూహం అన్నింటిని సరైన మార్గంలో, ధృక్కోణంలో ఉంచేటట్లు చేయడంలో మీకు సహకరిస్తుంది.
    మీరు మార్చలేని వాటితో సమ్మతించండి., సరిపెట్టుకోండి

    ఒత్తిడిని కలిగించే కొన్ని ఆధారాలు, కారణాలు తప్పించలేనటువంటివి. మీకు ప్రియమైన, ఇష్టమైనవారి మరణం, తీవ్ర అనారోగ్యం లేక ఒక జాతీయ మాంద్యం వంటి ఒత్తిడిని కలిగించే అంశాలను మీరు తప్పించడం గాని లేక మార్చడం గాని చేయలేరు. అటువంటి సందర్భాలలో మీరు చేయగలిగే శ్రేష్టమైన పని ఏమిటంటే ఈ ఒత్తిడితో సరిపెట్టుకోవడానికి, సర్దుకుపోవడానికి ఏది ఎలా జరిగితే అలాగే స్వీకరించడం. అయితే, ఇటువంటి పరిణామాలను అంగీకరించి, సమ్మతించడం కష్టతరమైనదే, కాని దీర్ఘ కాలంలో మీరు మార్చలేని పరిస్ధితికి ఎదురీది వెళ్లేకంటే ఇదే సులువైన మార్గం అనిపిస్తుంది.

    • అదుపు చేయలేని దానిని నియంత్రించాలని ప్రయత్నించకండి :మన జీవితంలో మన అదుపులో, ఆధీనంలో లేని విషయాలెన్నో ఉన్నాయి – ముఖ్యంగా ఇతరుల ప్రవర్తన. ఇటువంటప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చేకంటే, మీరు అదుపుచేయగలిగే వాటిపై మీ దృష్టిని పెట్టండి – సమస్యలకు మీరు ఎంచుకున్న, ప్రతిస్పందించే విధానం వంటివి.
    • పై వైపుకు చూడండి :‘మనల్ని చంపలేనిది మననింకా బలవంతులను చేస్తుంది‘ అనేది ఒక నానుడి. తీవ్రమైన పోటిలనేదుర్కునేటప్పుడు, వాటివైపు మీ వ్యక్తిగత పురోభివృధ్దికి మీకంది వచ్చిన అవకాశాలుగా చూడండి. ఒకవేళ మీ స్వంత నిర్ణయాలు, మీరు ఎంచుకున్న బలహీనమైన పధ్దతులు ఒత్తిడితో కూడుకున్న పరిస్ధితిని సృష్టిస్తే, వాటిపై మీ దృష్టిని కేంద్రీకరించి, మీ పొరపాట్లు, తప్పులనుండి నేర్చుకోండి.
    • మీ భావాలను పంచుకోండి :మీకు విశ్వాసపాత్రుడైన స్నేహితుడితో మాట్లాడండి, లేకపోతే ఒక చికిత్సకుడు (తెరపిస్ట్) వద్ద అపాయింట్ మెంట్ తీసుకోండి. పరిస్ధితిని అదుపుచేయడంలో, మార్చడంలో మీరు చేయగలిగిందేమీ లేకపోయినప్పటికీ, మీరనుభవిస్తున్న పరిస్ధితులను గురించి వ్యక్తీకరించడం చేదు మందువంటిదే కావచ్చు.
    • దయచూపిస్తూ, మన్నించడం నేర్చుకోండి :మనం అసంపూర్ణమైన, అసమగ్రమైన ప్రపంచంలో నివశిస్తున్నామని అలాగే ప్రజలు పొరపాట్లను, తప్పులను చేస్తూ ఉంటారు అనే వాస్తవాన్నికూడా అంగీకరించండి. కోపం, తిరస్కృతి అనే వాటిని వదలించుకుందాం. పొరపాట్లను మన్నిస్తూ, అందరితో కలిసి సాగిపోతూ, ప్రతికూలమైన శక్తినుండి మీరు స్వేశ్చగా బయటపడండి.
    • మీరు క్రమం తప్పకుండా సరదాగా, కులాసాగా, సేద తీర్చుకుంటూ గడపడానికి కాలాన్ని కేటాయిస్తే, జీవితంలో, అనివార్యమైనవిగా తారసపడే ఒత్తిడులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ఉన్నత స్ధానంలో ఉండగలుగుతారు.

    సేద తీర్చుకోవడానికి, పునరావేశం (రిఛార్జ్) పొందడానికి ఆరోగ్యకరమైన మార్గాలు

    • కాసేపు వాహ్యాళికి (వాకింగ్) వెళ్లండి
    • ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చెయ్యండి
    • ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి.
    • ఒక చక్కటి వ్యాయామంతో ఉద్రిక్తతను పారద్రోలండి
    • మీ పత్రిక (జర్నల్)లో వ్రాయండి
    • ఎక్కువసేపు స్నానం చేయండి
    • సువాసన వెదజల్లుతూ ఉండే ఒక కొవ్వొత్తిని వెలిగించండి. వెచ్చటి ఒక కప్పు కాఫీ గానీ టీ గాని త్రాగండి
    • మీ పెంపుడు జంతువుతో కాసేపు ఆడుతూ కాలక్షేపం చేయండి
    • మీ ఉద్యానవనంలో పనిచేయండి
    • ఏదైనా ఒక సందేశాన్నందుకోండి
    • ఒక మంచి పుస్తకంలో నిమగ్నమవండి
    • సంగీతాన్ని అలకించండి
    • ఒక హాస్య చిత్రాన్ని చూడండి
    • సేద తీర్చుకోవడానికి కాలాన్ని వేరే కేటాయించండి :మీ దైనందిన కార్యక్రమంలో విశ్రాంతి మరియు సేద తీర్చుకోవడాన్ని చేర్చండి. వేరే ఇంక ఏ వ్యాపకాలను మీ పక్కన చేరనివ్వకండి. అన్ని బాధ్యతలనుండి మీరు కాసేపు విశ్రాంతిని తీసుకుని గడపడానికి, అలాగే మీ శక్తి (బ్యాటరీ) ని తిరిగి పొందడానికి ( రిఛార్జ్) ఇదే మీ సమయము.
    • ఇతరులతో కలిసి ఉండండి: మీ జీవితాన్ని ఉత్సాహభరితంగీ చేసి ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉండే వారితో కాలాన్ని గడపండి. ఒత్తిడివల్ల కలిగిన ప్రభావాన్ని తగ్గించి, బలమైన సహాయ, సహకారాలను మీకందించే విధానం ఒత్తిడితో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
    • ఏదో ఒకటి చేయండి, ప్రతిరోజూ ఆనందంగా గడపండి: తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసే కార్యక్రమాలను చేపట్టిండి – అవి ఏవైనా కావచ్చు – జ్యోతిష శాస్త్రం గురించి కావచ్చు, పియానో వాయించడం లేక మీ బైక్ మీద సవారి చేయడం.
    • మీ హాస్యధోరణిని కొనసాగించండి: మీ అంతటమీరే హాయిగా నవ్వుకో గలిగే సమర్ధతతో కూడి ఉంటుంది ఇది. ఒత్తిడిని అనేక విధాలుగా ఎదుర్కోవడంలో నవ్వుతూ ఉండడం మీ శరీరానికి సహకరిస్తుంది.

    ఆరోగ్యకరమైన జీవన విధానం

    • ఆహారాన్ని మెరుగుపరచే గ్రూప్ బి విటమిన్లు మరియు మెగ్నిషియమ్ చాలా ముఖ్యమైనవి. అయితే, మిగతా అన్ని విటమిన్లు కూడా అదే శక్తిని కలిగి వుంటాయి. ఒత్తిడినుండి కాపాడడానికి విటమిన్ సి అవసరమైనది. విటమిన్ డి ఆరోగ్యవంతమైన శరీర పోషణకు సహకరిస్తుంది, ముఖ్యంగా ఎముకల విషయంలో. ఆరోగ్యవంతమైన శరీరం మరియు మెదడుకు సరిపోయినంత స్ధాయిలో ఖనిజాలను తీసుకోవడం కూడా ఆవశ్యకరమైనదే కాకుండా ఇవి ఒత్తిడికి గురయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. ప్రస్తుతం మీరు తీసుకునే ఆహారాన్ని మదింపు చేసి ఎక్కడ మెరుగుపరచాలి అన్న దానిని గుర్తించి, అటువంటి మెరుగుపరచిన చర్యలకు కట్టుబడి ఉండండి. కాల్చి వండే వాటిని, డబ్బాలలో నిలువచేసి ఉంచే ఆహారాన్ని, అధికంగా ఉప్పు మరియు మందు గోళీలు, బిళ్లలను వాడడం మానండి.
    • జీవవిషాన్ని (టాక్సిన్) లోపలికి తీసుకోవడం తగ్గించండి. స్పష్టంగా చెప్పాలంటే పొగాకు, ముఖ్యంగా మత్తుపానీయాలు – ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు, కాని ఇవి శరీరం యొక్క సమతుల్యానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి, దీనితో ఒత్తిడినే మరింతగా పెంచివేస్తూ, ఒత్తిడికి మరిన్ని అవకాశాలను కలుగజేస్తాయి.
    • మరికాస్త ఎక్కువగా వ్యాయామం చెయ్యండి. సాధారణంగా, విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు. వ్యాయామం అడ్రినాలిన్ ను మండించి, సహకారాన్నందించే రసాయ నాలను ఉత్పిత్తి చేస్తుంది, ప్రోత్సాహకరమైన మనోభావాలను కూడా పెంచుతూ ఒత్తిడిని కలిగించే కారణాలనుండి వ్యాయామం మన ధ్యానాన్ని మరల్చి, మనల్ని దానినుండి దూరంగా ఉంచుతుంది. ఒత్తిడిగా ఉంది అన్న భావాన్నుండి ఒత్తిడి కలగడానికి సహకరించే ధాతువు, కణజాలం నుండి వెచ్చదనంతో, జలుబునుండి బిగుసుకుపోయిన నరాలనుండి వ్యాయామం మనల్ని విముక్తులను చేస్తుంది. వ్యాయామం మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇది మనకు మంచిది. ఒత్తిడికి గల అవకాశాలను తగ్గిస్తూ వ్యాయామం ఆరోగ్యవంతమైన శరీర పోషణకు మరియు శరీరపుష్టికి సహకరిస్తుంది.
    • వ్యక్తిగత మనోభావాలకు మరియు మానసికావస్ధ (మూడ్) లను గురించి స్వయం అవగాహనను పెంచుకోండి. అతి తీవ్రమైనదిగా తయారయ్యే ముందు దానిని గమనించి, సరైన చర్యలు తీసుకుంటూ ఒత్తిడి పెరుగుదలను, పేరుకుపోవడాన్ని నిరోధించండి. సేద తీర్చుకునే పధ్దతులను అన్వేషించండి. యోగా, ధ్యానం, స్వయం-యోగముద్ర (సెల్ఫ్-హిప్నోసిస్) మసాజ్, స్వశ్చమైన గాలిని పీల్చడంతో పాటూ ఏ ప్రత్యేక పరిస్ధితిలోనైనా చేయగలిగేది, ఏదైనా సరే చేయగలిగితే, ఇవన్నీ కూడా ఒక అవకాశమిస్తే చక్కగా పనిచేస్తాయి.
    • ఆరోగ్యవంతమైన జీవిత సమతుల్యానికి నిద్ర, విశ్రాంతి అవసరమైనవి. పగటిపూట నిద్రపోవడం కూడా ఆరోగ్యకరమైనదే. ఇది మనల్ని రిఛార్జ్ చేసి, కొత్త శక్తిని పుట్టించి, సేద తీర్చి, మెదడును ఒత్తిడినుండి, అంతగా ఆనందకరం కాని మనోభావాలను మెదడునుండి శుభ్రంగా తుడిచివేసినట్లు చేస్తుంది.
    • పనిచేసే చోట వచ్చే కోపం ఒత్తిడి లక్షణం. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం (ఆ మాటకొస్తే ఏ ఇతర సకారణయుతం గాని, ఆవేశపూరితమైన ప్రవర్తన అయినా కూడా) మరియు దాని కారణంగా వచ్చే ఒత్తిడిని మార్చి, మెరుగువరచవచ్చు – అటువంటి వ్యక్తి మార్పును కోరుకుంటేనే, అంటే అంగీకారం, సమ్మతి, గుర్తించడం, కట్టుబడి ఉండడం. దీనిపై సరైన అవగాహన కలిగి వుండడం అన్నది అన్నింటికంటే ముందు ఆవశ్యకత. కోపంతో ఉండే కొంతమంది తమ కోపంలో గర్వాన్ని పొందుతారు, అలాగే మారడానికి వీరు ఇష్టపడరు, మరికొందరు దీని ప్రభావం తమపైన, ఇతరులపైనా ఎలా వుంటుంది అన్నదానిని తెలుసుకోలేరు. కోపాన్ని అదుపుచేయడం కోపంతో ఉన్న వ్యక్తి దానిని ఒప్పుకుని, మార్పుచెందడానికి అంగీకరిస్తూ, దానికి కట్టుబడి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఒత్తిడి యొక్క మూలకారణాలను తెలుసుకోవడానికి సలహా, సంప్రదింపు (కౌన్సెలింగ్) లు అవసరమవుతాయి. తమ కోపానికి పర్యవసానంగా కలిగే ప్రభావాన్ని (తమకు, ఇతరులకూ కూడా) అటువంటి వ్యక్తి నిష్పాక్షికంగా, బుధ్దికుశలతో ఇతరులవైపు చూడవలసి ఉంటుంది, వారి ప్రవర్తన వినాశనకరమైనదని, ప్రతికూలమైనదని తెలుసుకోవడానికి కోపంతో ఉన్న వారికి నచ్చచెప్పడం ముఖ్యమైన ముందడుగు వంటిది. వారి ఆరోగ్యంపైనా మరియు వారి కుటుంబంపైనా పడే దీని ప్రభావాలను గురించి వారితో చర్చించండి. బయట నుండి వాస్తవాలను తమంతట తాము చూడడానికి అటువంటి వ్యక్తిని చేరదీయండి. కోపాన్ని నియంత్రీకరించడంలో, వేయవలసిన రెండో అడుగు వారి కోపిష్టి స్వభావానికి కారణాలను అర్ధంచేసుకోవడం. ఇది ఒత్తిడికి కారణమయ్యే అంశాలతో పాటుగా ఒత్తిడిని కలుగజేసే అవకాశాలతో కలిసి ఉంటుంది. తగినంత విశ్వాసాన్ని మరియు సౌహార్ద్రతను పెంపొందించుకోవడానికి కౌన్సెలర్ అనేక సార్లు సమావేశాలను నిర్వహించ వలసి ఉంటుంది

    ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తున్నది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను ఒక దశకు వచ్చే నియంత్రణ చేయాలి.

    చిన్నప్పుడు ఇష్టంగా తిన్నామని, పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.

    సహజంగా ఒత్తిడిని తగ్గించే కొన్ని ఆహర పదార్ధాలు

    బొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాన్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం మనస్సు తేలికపడి ఒత్తిడి తగ్గిపోతుంది.

    కమలం : అత్యధికంగా కమలాల్లో లభించే విటమిన్ 'సి' వల్ల ఒత్తిడి వలితంగా ప్రభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

    అరటి పండు: దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మేగ్నిషియం టెన్షన్ ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్ధ సక్రమంగా పనిచేయడంలో అరటి పండు ఎంతో మేలు చేస్తుంది.

    బంగాళ దుంప: జింక్, విటమిన్ ‘సి’ పెరిగి రోగ నిరోధక శక్తి ఇనుమడించి మనసును దృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

    చాక్లెట్ : వీటిలో సహజంగా ఉండే ఫెనిల్ ధిలమైన ఎండార్ఫిన్ స్ధాయిల్ని తొలగించి సహజ సిద్ధమైన యాంటి డిప్రెసేంట్గా పనిచేస్తుంది.

    • యాప్రికాట్ లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
    • పెరుగులోని విటమిన్ ‘బి’ నెర్వస్ నెస్ ను తగ్గిస్తుంది.
    • గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్ని ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్ ను నివారిస్తుంది.
    • ఓమోగా 3 ఫ్యాటి యాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెన్ ను తగ్గిస్తాయి.
    • పాలలోని లాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.

    ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

    చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate