অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బుధ్ది ( మానసిక ) మాంద్యం

బుధ్ది ( మానసిక ) మాంద్యం

నిర్వచనం :

మేధస్సు పనిచేసే స్ధాయిగా దీనిని వర్ణించడం జరిగింది (ప్రజ్ఞ్యా సూచి కొరకు సాధారణ పరీక్షల ద్వారా కొలవబడిన మేధాశక్తి), దైనందిన జీవితంలో జీవ నైపుణ్యాలు సగటు స్ధాయికంటే తక్కువగా ఉండి అలాగే చెప్పుకోతగ్గ పరిమితులతో ఉండేదే ఇది (అనుకూలమైన విధంగా పనిచేసేది).

వివరణ

  • ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం),’ ప్రకారం, 1990ల లో బుధ్ది ( మానసిక ) మాంద్యం సాధారణ జనాభాలో 2.5 నుండి 3 శాతం వరకూ సంభవిస్తుంది, బుధ్ది ( మానసిక ) మాంద్యం బాల్యంలో గాని లేక కౌమారదశలో గానీ 18 ఏళ్లకు ముందుగానే ప్రారంభమవుతుంది.
  • యుక్తవయసులో ఉన్నంత కాలం అది పట్టువిడవకుండా ఉంటుంది. మేధస్సు పనిచేసే స్ధాయి సాధారణంగా ప్రామాణీకరించబడిన పరీక్షల ద్వారా వివరించబడుతుంది. (వెష్లర్-ఇంటెలిజెన్స్ స్కేల్స్). ఇది సహేతుకంగా ఆలోచించగలిగే సమర్ధతను మానసికంగా ఎదిగిన వయసుకు సంబంధించి (మేధోశక్తి) లేక ప్రజ్ఞ్యా సూచి) కొలుస్తుంది. ఒక వ్యక్తి సగటు స్ధాయి కంటే తక్కువగా మేధస్సు పనిచేసే స్ధాయిని కలిగివుండడాన్ని బట్టి వుంటుంది మరియు అనుకూలమైన రెండు లేక మూడు నైపుణ్యం గల అంశాలలో చెప్పుకోతగ్గ పరిమితులను కలిగివున్నప్పుడు, బుధ్ది మాంద్యం నిర్ధారణ చేయబడుతుంది.
  • బుధ్ది మాంద్యాన్ని ప్రజ్ఞ్యా సూచి స్కోర్ 70 నుండి 75 పాయింట్ల కంటే తక్కువగా ఉండడంగా వివరించబడింది.
  • అనుకూలంగా, సద్దుకుపోవడానికి వీలుగా ఉండే నేర్పరితనం, ప్రావీణ్యాలు దైనందిన జీవితంలో అవసరమయ్యే కౌశల్యం వంటివి. అటువంటి నైపుణ్యాలు ఉత్పత్తి చేయగలిగే సామర్ద్యం మరియు భాషను అర్ధంచేసుకోగలిగే సమర్ధత (మనోభావాలను తెలియజేయడం మరియు అందుకోగలగడం), ఇంట్లో సాధారణ కుటుంబ జీవితాన్ని నడుపుకోగలిగే నైపుణ్యం, సామాజిక వర్గాలకు చెందిన వనరులను ఉపయోగించుకోగలగడం, ఆరోగ్యం, భధ్రత, తీరిక, స్వయం శ్రధ్ద మరియు సాంఘిక సంబంధిత కౌశల్యం, స్వయం నిర్దేశకత్వం, పనిచేస్తూ ఉండే విద్యా సంబంధిత నైపుణ్యం (చడవడం, వ్రాయడం మరియు అంకగణితం) మరియు పనిలో అవసరమయ్యే నైపుణ్యం వంటి వాటితో కూడి ఉంటాయి.
  • సాధారణంగా బుధ్ది మాంద్యంతో ఉన్న పిల్లలు అభివృధ్ది చెందినట్లు సూచించే మైలురాళ్లను అంటే నడవటం, మాట్లాడటం వంటివి, జీవితంలో సాధారణ ప్రజానీకాని కంటే ఆలస్యంగా చేరుకుంటారు.
  • బుధ్ది మాంద్యపు లక్షణాలు పుట్టుకతోనే గాని లేక బాల్యం తరువాత దశలో గాని కనిపించవచ్చు.
  • ఈ వైకల్యం ప్రారంభమయ్యే వయస్సు ఈ లోపానికి గల అనుమానించతగ్గ కారణంపై ఆధారపడి ఉంటుంది.
  • కొన్ని సందర్భాలలో స్వల్పస్ధాయిలో ఉండే ఈ బుధ్ది మాంద్యం బిడ్డ పూర్వప్రాథమిక విద్యలో చేరేవరకు కూడా నిర్ధారణ చేయబడి ఉండదు.
  • ప్రత్యేకంగా ఇటువంటి పిల్లలు భావ వ్యక్తీకరణ, సాంఘిక మరియు విద్యాసంబంధిత అభ్యసన నైపుణ్యాలలో ఇబ్బందులకు గురవతూ ఉంటారు.
  • నాడీసంభంధిత వైకల్యం లేక అనారోగ్యం అంటే మెదడువాపు లేక నాడీమండల శోధ (మెదడును, వెన్నుపామును చుట్టి ఉండే పొరలు బాక్టీరియా లేదా వైరస్ కారణంగా వాచిపోవుట) వంటివాటితో ఒక్కసారిగా నేర్చుకోవడంలోనూ, అర్ధంచేసుకోవడంలోనూ అలాగే కొత్త పరిస్ధితులతో ఇమిడి ఉండడంలోనూ ఇబ్బంది పడుతూ, బలహీనులై, వెనకపడి ఉండే లక్షణాలను కనబరుస్తారు.

మానసిక మాంద్యంలో రకాలు :

మానసిక వయసు, అంటే ఎదుగుదలకు సంబంధించి (మేధాశక్తి లేక ప్రజ్ఞ్యా సూచి) బుధ్ది మాంద్యం సహేతుకంగా ఆలోచించే సామర్ధ్యాన్ని కొలవడం చేస్తుంది. బుధ్ది మాంద్యానికి సంబంధించి 4 వివిధ స్ధాయిలు ఉన్నాయి. కొద్దిపాటి (స్వల్ప) స్ధాయిలో ఉండేది, ఒక మాదిరి స్ధాయిలో ఉండేది, తీవ్రంగా ఉండేది మరియు అతి విస్తారంగా ఉండేది. ఒక వ్యక్తి తన పనిని తాను చేయగలిగే స్ధాయి సామర్ధ్యంపై ఈ వివిధ రకాలు (కేటగిరీలు) ఆధారపడి ఉంటాయి.

స్వల్పమైన బుధ్ది మాంద్యం

బుధ్ది మాంద్యంతో ఉండే జనాభాలో ఇంచుమించుగా 85 శాతం స్వల్పస్ధాయి మాంద్యంతో ఉండే రకానికి చెందినవారై ఉంటారు. వారి ప్రజ్ఞ్యా సూచి స్కోరు 50 నుండి 75 వరకూ ఉంటుంది. అలాగే, ఒకోసారి ఇటువంటి వారు 6వ తరగతి స్ధాయి వరకు విద్యాసంభంధిత నైపుణ్యాన్ని సంపాదించుకోగలరు. వారు చెప్పుకోతగ్గ స్ధాయిలోనే స్వయం-సమృధ్దిని సాధించి, కొన్ని సందర్భాలలో సాధారణ ప్రజాస్రవంతిలో మమేకమై సామాజిక మరియు తోటివారి సహాయ, సహకారాలతో జీవించగలరు.

ఒక మాదిరి స్ధాయిలో ఉండే బుధ్ది మాంద్యం

బుధ్ది మాంద్యానికి గురైన వారిలో ఇంచుమించుగా 10 శాతం వరకూ ఒక మాదిరి స్ధాయిలో బుధ్ది మాంద్యంతో ఉన్నట్లు పరిగణించవచ్చు ఈ విదంగా ఒక మాదిరి స్ధాయిలో బుధ్ది మాంద్యంతో ఉండే వారు 35 నుండి 55 వరకు ప్రజ్ఞ్యా సూచి స్కోరును కలిగి ఉంటారు. ఒక మాదిరి పర్యవేక్షణతో వారు తమ పనులను తామే చేసుకోగలుగుతూ, స్వయం జాగ్రతను పరిరక్షణను పాటిస్తూ ఉంటారు. వీరు భావ వ్యక్తీకరణ, మాట్లాడగలిగే నైపుణ్యాన్ని బాల్యంలోనే ప్రధానంగా సంపాదించుకోగలరు అలాగే ప్రజా బాహుళ్యంలోనే, పర్యవేక్షక పూరితమైన వాతావరణంలో అంటే ఇళ్ల సముదాయాలలో నివసిస్తూ విజయవంతంగా పనిని నిర్వహించుకుంటూ ఉండగలుగుతారు.

తీవ్రమైన బుధ్ది మాంద్యం

బుధ్ది మాంద్యంతో ఉండే వారిలో ఇంచుమించుగా 3 నుండి 4 శాతం వరకూ తీవ్రమైన బుధ్ది మాంద్యంతో ఉన్నవారే. ఈ విదంగా తీవ్రమైన స్ధాయిలో బుధ్ది మాంద్యంతో ఉండే వారు 20 నుండి 40 వరకు ప్రజ్ఞ్యా సూచి స్కోరును కలిగి ఉంటారు. అతి ప్రాధమిక స్ధాయిలో వారు స్వయం-పరిరక్షణ, జాగ్రత్త అనే వాటితో పాటుగా కాస్త భావ వ్యక్తీకరణ, మాట్లాడగలగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. తీవ్రమైన బుధ్ది మాంద్యంతో ఉండే వారు గృహ సముదాయాలలో ఉంటూ కలిసి జీవిస్తూ ఉండగలరు.

విస్తారమైన బుధ్ది మాంద్యం

బుధ్ది మాంద్యంతో ఉండే వారిలో కేవలం 1 నుండి 2 శాతం వరకూ మాత్రమే విస్తారంగా, అతి తీవ్రమైన బుధ్ది మాంద్యంతో బాధపడుతున్నవారున్నారు. ఈ విధంగా అతి తీవ్రమైన, విస్తారమైన స్ధాయిలో బుధ్ది మాంద్యంతో ఉండే వారు 20 నుండి 25 కంటే తక్కువ ప్రజ్ఞ్యా సూచి స్కోరును కలిగి ఉంటారు. వారు స్వయం-పరిరక్షణ, జాగ్రత్త అనే వాటితో పాటుగా తగిన సహాయ, సహకారాలతోనూ, శిక్షణ తోనూ భావ వ్యక్తీకరణ, మాట్లాడగలగే నైపుణ్యాన్ని వృధ్ది చేసుకో కలిగి ఉంటారు, వీరి మానసిక మాంద్యం తరచు వారిలో ఉండే నాడీ సంబంధింత వైకల్యం, అనారోగ్యంతో కలిసి ఉంటుంది. ఈ అతి తీవ్రమైన, విస్తారమైన మానసిక మాంద్యానికి గురైనవారికి ఉన్నత స్ధాయిలో నిర్మాణ క్రమంతో పాటుగా పర్యవేక్షణకూడా అవసరమవుతుంది.

బుధ్ది మాంద్యానికి గల కారణాలు :

పుట్టుకకు ముందునుండే ఉండే కారణాలు

  • వర్ణగ్రాహక (అనువంశికతకు మూలమైన జన్యువులు) వైకల్యాలు : డౌన్స్ సిండ్రోమ్, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్, ప్రేడర్ విలి సిండ్రోమ్, క్లిన్ ఫెల్టర్స్ సిండ్రోమ్.‌
  • ఒంటరి జన్యువు వైకల్యాలు : పుట్టుకతోనే వచ్చే జీవక్రియ లోని (శరీరంలోని జీవకణములలో కలుగు భౌతిక, రసాయనిక మార్పులు – కణాలు వృధ్ది చెందుతున్నప్పుడు గానీ లేక నాశనమగునప్పుడు గాని) లోపాలు – అంటే గేలాక్టోనేమియా, -ఫినైల్ కెటోనీరియా, హైపోధైరాయిడిజమ్, మ్యుకో పోలిసక్కారిడోసెస్, టే శాక్స్ వ్యాధి వంటివి.
  • న్యూరో క్యుటానియస్ సిండ్రోమ్స్ : ట్యూబరస్ స్కెలిరోసిస్, న్యూరోఫైబ్రోమేటోసిస్.
  • డిసోమార్ఫిక్ సిండ్రోమ్స్ : లారెన్స్ మూన్ బీడిల్ సిండ్రోమ్
  • మెదడు సరైన రీతిలో తయారవకపోవడం : మైక్రో సిఫాలి (తల అతి చిన్నదిగా ఉండడం), హైడ్రోసిఫాలస్ (సజలశీర్షం (కపాలములో ఉండే ద్రవం హెచ్చు స్ధాయిలో ఉండి కపాలము పెద్దదవడం), మయెలో మెనిన్గోసిలి (వెన్నుపూస నిర్మాణక్రమంలో లోపం వంటిది)

అసాధారణ మాతృ సంబంధిత పర్యావరణ ప్రభావాలు

  • లోపాలు, కొరతలు : అయోడిన్ లోపం, ఫోలిక్ ఆమ్లం కొరత, తీవ్ర పోషకాహారం లోపం
  • ద్రవ్య వినియోగం : ఆల్కహాల్ (మద్యం), -నికోటైన్ (పొగాకులో ఉండే విషపదార్ధం వంటిది), కోకైన్ (పొగాకు వంటి చిన్న మొక్క. దీని ఆకునుండి తీసిన మందు మత్తుపదార్ధంగా, బాధను తేలియనీయకుండా ఉండేటట్లు చేస్తుంది)
  • హానికరమైన రసాయనాలకు గురవడం :కల్మషాలు -భారీ లోహలు -హానికరమైన మందులు అంటే థాలిడోమైడ్, ఫినిటోయిన్, వర్ఫారిన్ సోడియమ్ మొదలగునవి.
  • మాతృ సంభంధిత అంటురోగాలు : రుబెల్లా టాక్సోప్లాస్మాసిస్, సైటోమెగాలోవైరస్ అంటురోగం - సిఫిలిస్ హెచ్.ఐ.వి
  • రేడియో ధార్మిక శక్తికి గురవడం మరియు ఆర్.హెచ్. ఇన్-కంపాటిబిలిటీ (పొంతన లేకపోవడం).
  • గర్భంతో వచ్చే ఉపద్రవాలు, ఇబ్బందులు :గర్భధారణ వల్ల సంభవించిన రక్తపు పోటు, యాంటీ పార్టమ్ హేమరేజ్ (ప్రసవానికి ముందు సంభవించే రక్తస్రావం) మావి సంబంధిత ఇబ్బందులు (సరిగా పనిచేయకపోవడం )
  • మాతృసంబంధిత వ్యాధి : మధుమేహం, గుండె మరియు మూత్రపిండాల వ్యాధి.

ప్రసవ సమయంలో

కష్టమైన మరియు/లేక ఇబ్బందికరమైన, క్లిష్టమైన ప్రసవం, పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుండడం శ్వాస స్ధంభన, పుట్టుకతోనే ఊపిరాడకపోవడం, పుట్టుకతోనే అఘాతం, తీవ్రమైన, బలమైన గాయం (ట్రోమా)

  • ప్రసవానంతరం కొద్ది రోజుల కాలవ్యవధి : సెప్టిసెమియా (ప్రసూతి పూతిక), (పచ్చ)కామెర్లు, హైపోగ్లిసేమియా (రక్తంలో గ్లూకోజ్ తక్కువవడం), ప్రసవానంతరం కంపం, మూర్ఛరోగం.
  • శైశవావస్ధ మరియు బాల్యావస్ధ : మెదడుకు అంటువ్యాది, - క్షయ, జాపనీస్ మెదడువాపు వ్యాధి, బ్యాక్టీరియా లేక వైరస్ వల్ల మెదడు వాచిపోవడం, తలకు గట్టి అఘాతం కావడం సీసానికి దీర్ఘకాలంగా గురవుతూ ఉండడం, - తీవ్రమైన, దీర్ఘకాలంపాటు పోషకాహార లోపం, అతి తక్కువ స్ధాయిలో ఉద్దీపన చెందడం లేక ఉత్దేజాన్ని పొందడం

    (సూచన: గుర్తుతో వున్న పరిస్ధితులు ఖచ్చితంగా తప్పించడానికి గానీ లేక తప్పించుకునే అవకాశం గాని కలిగి ఉన్నటువంటివే)

బుధ్ది మాంద్యం యొక్క లక్షణాలు :

  • మేధస్సును అభివృధ్ది చేసుకునే స్ధాయిని అందుకోవడంలో విఫలమవడం
  • అభివృధ్ది సూచికలైన మైలురాళ్లను అందుకోవడంలో విఫలమవడం, అంటే ఒక సమయం ప్రకారం కూర్చోవడం, పాకడం, నడవడం లేక మాట్లాడడం.
  • చిన్నపిల్లల మాదిరిగా చిలిపి ప్రవర్తనను వదిలిపెట్టకుండా కొనసాగిస్తూ ఉండడం – మాట్లాడే రీతిలో లేక సాంఘిక నియమాలను లేక ప్రవర్తన వల్ల సంభవింమచే పరిణామాలను అర్ధంచేసుకోవడంలో విఫలమవడం.
  • ఆతృత, ఉబలాటం లేకపోవడం మరియు సమస్యను పరిష్కరించడంలో కష్టం, ఇబ్బంది.
  • తగ్గిపోతూ వుండే నేర్చుకోవడంలోని ఆసక్తి మరియు సహేతుకంగా ఆలోచించగలిగే సమర్ధత.
  • విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇబ్బంది, కష్టం.
  • పాఠశాల ఆశించే, కావలసిన మేరకు విద్యాపరమైన ఆవశ్యకతలను నెరవేర్చడంలో అసమర్ధత

చికిత్సలు :

  • బుధ్ది మాంద్యానికి చేసే చికిత్స ఈ వైకల్యాన్ని ‘నయం‘ చేయడానికి ఉద్దేశింపబడలేదు. చికిత్సా విధానాలు, ఆశయాలు భధ్రతా సంబంధిత ప్రమాదాలను తగ్గించడం కోసమే (అంటే ఇంటి వద్ద లేక పాఠశాలలో ఒక వ్యక్తి క్షేమంగా, భధ్రంగా ఉండడం) మరియు జీవితానికి అనువైన నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని నేర్పడం, తగిన రీతిలో విద్యాబోధన చేయడం వంటివి మాత్రమే. ప్రధానంగా, ఒక వ్యక్తి యొక్క సమర్ధతను పూర్తి స్ధాయికి అభివృధ్ది చేసి, పెంపొందించే లక్ష్యంతో వ్యక్తులకు, కుటుంబాలకు వారి ఖచ్చితమైన అవసరాలకు తగ్గట్టుగా, వాటిపై ఆధారపడి చొరవ తీసుకోవడం, జోక్యం చేసుకోవడం చెయ్యాలి.
  • వ్యాధిగ్రస్తతతో సంబంధం కలిగి వుండే సహ-అనారోగ్య లక్షణాలకు చికిత్సలు అవసరమవు తాయి, అంటే దురాక్రమణ, మానసికావస్ధ (మూడ్స్) లో లోపాలు, స్వయంగానే గాయపరుచుకునే నైజం, ఇతర ప్రవర్తనా పరమైన సమస్యలు మరియు 40 నుండి 70 శాతం కేసులలో సంభవిస్తూ ఉండే మూర్ఛరోగం వంటివి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate