హోమ్ / ఆరోగ్యం / పథకాలు / ఇతర పథకాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతర పథకాలు

ఆరోగ్యానికి సంబందించిన పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి

ఆపద్బంధు పథకం

 • లక్ష్యం: ప్రమాదంలో ఏకైక కుటుంబ ఆధారమును కోల్పోయిన పేద మరియు పి.ఓ.పి కుటుంబాల వారికి ఆర్థిక సాయం అందించడం.
 • అర్హత: ప్రమాదంలో కుటుంబ ఆధారమును కోల్పోయిన పేద మరియు పి.ఓ.పి కుటుంబాలు.
 • లబ్దిదారులు:
  1. ప్రమాదంలో సంపాదించే కుటుంబ సభ్యున్ని కోల్పోయిన పేద కుటుంబాలు.
  2. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.11,000/- మించకూడదు.
  3. ప్రమాద బాధితుడి వయసు 18-60 సంవత్సరాల మధ్య ఉండాలి.
 • ప్రయోజనాలు: ఆర్థిక సాయం రూ.50,000/-.
 • సంప్రదించాల్సిన వివరాలు: గ్రామ పంచాయతి కార్యదర్శి/ఎం.ఆర్.ఓ/అర్.డి.ఓ/జిల్లా కలెక్టర్.
 • జి.ఓ నం.: G.O.Ms.No.1712, రెవెన్యూ ఉత్తర్వు (DM1), తేది 1-10-2005.

పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు

 • లక్ష్యం: హృద్రోగంతో బాధపడే పిల్లలకు గుండె శస్త్రచికిత్సల కోసం ఆర్థిక సాయం అందించడం.
 • అర్హత: హృద్రోగంతో బాధపడే బి.పి.ఎల్ కుటుంబాల పిల్లలు.
 • లబ్దిదారులు: హృద్రోగంతో బాధపడే బి.పి.ఎల్ కుటుంబాలకు చెందిన పిల్లలు.
 • ప్రయోజనాలు: రూ.50,000/- ఆర్థిక సాయం.
 • సంప్రదించాల్సిన వివరాలు: ఎం.ఆర్.ఓ/అర్.డి.ఓ/జిల్లా కలెక్టర్/ప్రభుత్వం ఆసుపత్రుల ప్రధాన కార్యాలయాలు.
 • జి.ఓ నం.: G.O.Ms.No.05, HM & FW (K1) డిపార్టుమెంటు. తేది 6.1.2005.

నిరంతర మహిళ ఆరోగ్య కేంద్రాలు

 • లక్ష్యం: సాధారణ డెలివరీ సేవలను అందించడానికి.
 • అర్హత: గర్భిణీ మహిళలందరూ.
 • లబ్దిదారులు: రాష్ట్రవ్యాప్తంగా అందరు గర్భిణీ స్త్రీలు.
 • ప్రయోజనాలు: ఒక వారం లో ఒక స్థిర రోజున నియమించబడిన 490 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, ప్రత్యేక వైద్యశాలలో గైనకాలజిస్ట్ మరియు శిశువైద్యుల ద్వారా సాధారణ డెలివరీ సేవలు. టెలిఫోన్ మరియు అత్యవసర సందర్భాలలో రవాణా సౌకర్యం అందిస్తారు.
 • సంప్రదించాల్సిన వివరాలు: ఎ.ఎన్.ఎం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా మెడికల్ & అరోగ్య ఆఫీసర్.
 • జి.ఓ నం.: Rc.No.7633/RCH-10/SDB-138 కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ,తేది 28.12.1998.

పిల్లల ఆరోగ్య వృద్ధి పథకం

పిల్లల ఆరోగ్య వృద్ధి పథకం గురించి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

సమగ్ర శిశు అభివృద్ధి పథకం

బిడ్డ పుట్టిన నాటి నుండి ఆరేళ్ళ దాకా పిల్లలు, గర్భిణీ, బాలింతలకు సేవలందించటానికి రూపొందించిన కార్యక్రమం సమగ్ర శిశు అభివృద్ధి పథకం. ఈ పథకం యొక్క పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. మరియు సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐ.సి.డి.యస్.)

ఆధారము: అపార్డ్ మరియు అక్షర ఎన్.జి.ఓ.

2.94285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు