హోమ్ / ఆరోగ్యం / పథకాలు / జనని సురక్ష యోజన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జనని సురక్ష యోజన

జననీ సురక్ష యోజన (JSY) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHM) కింద సురక్షితమైన మాతృత్వం కోసం చేయబడింది.

జననీ సురక్ష యోజన (JSY) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHM) కింద సురక్షితమైన మాతృత్వం కోసం చేయబడింది. గర్భవతి మహిళలలో సంస్థాగత డెలివరీని ప్రోత్సహించడం ద్వారా తల్లి మరియు శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో దినిని అమలు చేస్తున్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, తక్కువ ప్రదర్శన గల రాష్ట్రాలు (LPS) పై ప్రత్యేక దృష్టి తో, మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (UT) లో అమలవుతుంది.

జననీ సురక్ష యోజనను నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ (NMBS)ను సవరించటం ద్వారా ఏప్రిల్ 2005 లో ప్రారంభించారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమ (NSAP) భాగాలలో ఒకటిగా NMBS ఆగష్టు 1995 లో అమలులోకి వచ్చింది. ఈ పథకాన్ని 2001-02 సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుండి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. రెండు ప్రత్యక్ష జననాల వరకు, దారిద్ర్య రేఖకు దిగువ (బిపిఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన 19 సంవత్సరాలు వయస్సు కంటే ఎక్కువ ఉన్న గర్భవతి మహిళలకు పుట్టిన ప్రతి బడ్డకు NMBS రూ 500 / - ఆర్థిక సాయం అందిస్తుంది. NMBS క్రింది JSY ప్రారంభించినప్పుడు రూ 500 / - ఆర్థిక సాయం సమిష్టగా అన్ని బిపిఎల్ గర్భిణీ స్త్రీలకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. తర్వాత రాష్ట్రాల వర్గీకరణపై అలాగే పట్టణ/గ్రామీణ ప్రాంతానికి చెందిన లబ్దిదారుల ఆధారంగా ఈ సహాయం శ్రేణీకృతం చేసారు. సంస్థాగత డెలివరీ రేటు ఆదారంగా రాష్టాలను తక్కువ ప్రదర్శన మరియు ఎక్కువ ప్రదర్శన కలవిగా గుర్తించారు. అంటే రాష్ట్రాల సంస్థాగత డెలివరీ రేటు 25% లేదా తక్కువ ఉంటే వాటిని తక్కువ ప్రదర్శన రాష్రంగా (LPS) మరియు సంస్థాగత డెలివరీ రేటు 25% కంటే ఎక్కువ కలిగి ఉంటే వటిని ఎక్కువ ప్రదర్శనగల రాష్ట్రంగా (HPS) వేరుచేసారు. దీని ప్రకారం, ఎనిమిది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఒడిశా, అస్సాం & జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాలు తక్కువ ప్రదర్శన రాష్ట్రాలలో, మిగిలిన రాష్ట్రాలను ఎక్కువ ప్రదర్శన గల రాష్ట్రాల్లోకి చేర్చారు.

JSY నేపథ్యం

భారతదేశం లో సుమారు 56,000 మంది మహిళలు గర్భానికి సంబంధించిన సంక్లిష్టతల వల్ల ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 13 లక్షల శిశువులు పుట్టిన 1 సంవత్సరం లోపల మరణిస్తున్నారు మరియు సుమారు 2/ 3 శిశు మరణాల మొదటి నాలుగు వారాలలో జరుగుతున్నాయి. వీటిలో సుమారు 75% పుట్టిన ఒక వారం లోపల జరుగుతున్నాయి మరియు వీటిలో ఎక్కువగా పుట్టిన తర్వాత మొదటి రెండు రోజులలో జరుగతున్నాయి.

ప్రసూతి మరియు శిశు మరణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్య కార్యక్రమాన్ని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHM) కింద ప్రారంభించారు. ప్రసవ సమయంలో పిల్లల మరణాలను తగ్గించటానికి సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడానికి ఇది పని చేస్తుంది.

కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను జననీ సురక్ష యోజన (JSY) ద్వారా (MoHFW) ప్రారంభించింది. దీనివలన సంస్థాగత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఉద్దేశం

గర్భిణీ స్త్రీలకు సంస్థాగత డెలివరీ ప్రోత్సహించడం ద్వారా ప్రసూతి మరియు శిశు మరణాలను తగ్గించడం.

లక్ష్య వర్గం మరియు ప్రయోజనాలు:

దారిద్య్రరేఖకు (బీపీఎల్) క్రింద ఉన్న కుటుంబాలు మరియు ST వర్గానికి చెందిన గర్భిణీ స్త్రీలు. JSY కింద, అర్హత గల గర్భిణీ స్త్రీలు నగదు సహాయానికి అర్హులు. ఇందులో తల్లి వయసు మరియు లిల్లల సంఖ్య కు సంబంధం లేకుండా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించవచ్చు.

గర్భవతి మహిళలలో సంస్థాగత డెలివరీ ప్రచారం చేసే ఆశా (గుర్తించబడిన సామాజిక ఆరోగ్య కార్యకర్త) కార్యకర్తలకు మహిళ ఆరోగ్య పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఈ పథకం అందిస్తుంది. దీనికింద, అర్హత గల గర్భిణీ స్త్రీలు వారి బ్యాంకు ఖాతాలలోకి నేరుగా JSY ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు. వివిధ వర్గాల తల్లుల నగదు అర్హత కింది విధంగా ఉంటుంది

సంస్థాగత డెలివరీ కోసం నగదు సహాయం (రూ. లలో)

వర్గం

గ్రామీణ ప్రాంతం

అర్బన్ ఏరియా

 

తల్లి ప్యాకేజీ

ఆశా ప్యాకేజీ *

తల్లి ప్యాకేజీ

ఆశా ప్యాకేజీ *

LPS

1400

600

1000

400

HPS

700

600

600

400

* గ్రామీణ ప్రాంతాల్లో ఆశా ప్యాకేజీ రూ .600ఇస్తారు. అందులో ANC భాగంగా రూ. 300 మరియు సంస్థాగత డెలివరీ సదుపాయం కోసం రూ. 300 ఉంటాయి.

** పట్టణ ప్రాంతాల్లో ఆశా ప్యాకేజీ రూ.400 రూపాయల ఇస్తారు. అందలో ANC భాగంగా రూ 200. సంస్థాగత డెలివరీ సదుపాయం కోసం రూ. 200 ఉంటాయి.

ఇంట్లో జరగే కాన్పు కోసం నగదు సాయం

బిపిఎల్ గర్భిణీ స్త్రీలు ఇంట్లో కాన్పును ఇష్టపడతారు. దీనిలో గర్భిణీ స్త్రీ వయసు మరియు పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా 500 రూపాయల నగదు సాయాన్ని పొందడానికి అర్హురాలు.

పరిస్థితి

సంస్థాగత ప్రసవాల విషయంలో గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబాలు మందులు, యూజర్ ఛార్జీలు, నిర్ధారణ పరీక్షలు, ఆహారం, సి -సెక్షన్ కోసం అయ్యె ఖర్చులను భరించ వలసి ఉంటుంది.

మూలం:జాతీయ ఆరోగ్య మిషన్

2.93975903614
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు