హోమ్ / ఆరోగ్యం / పథకాలు / జననీ శిశు సురక్ష కార్యక్రమము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జననీ శిశు సురక్ష కార్యక్రమము

గర్భిణీ స్త్రీలు మరియు ఆనారోగ్యంతో పుట్టిన శిశువు తలిదండ్రుల కష్టాలు మరియు ప్రసవానికి మరియు వారి చికిత్సకు అయ్యే ఖర్చుల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (MoHFW) మంత్రిత్వశాఖ వారికి ఉచితంగా చికిత్స అందిచాలని పూనుకుంది. దీనిలో మామూలు ప్రసవం, సిసరీను ఆపరేషను మరియు శిశువు జబ్బు (పుట్టిన 30 రోజూల వరకు)కు ఉచితంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేస్తారు. జననీ శిశు సురక్ష కార్యక్రమము (JSSK), 1 జూన్, 2011 న ప్రారంభించబడింది.

గర్భిణీ స్త్రీల ఉచిత సదుపాయాలు

 • ఉచిత మరియు నగదు రహిత డెలివరీ
 • ఉచిత సి-విభాగం
 • ఉచిత మందులు మరియు తినుబండారాలు
 • ఉచిత కారణనిర్ణయం
 • ఆరోగ్య కేంద్రాలలో ఉండే సమయంలో ఉచిత ఆహారం
 • ఉచిత రక్తం సదుపాయం
 • యూజర్ చార్జీలలో మినహాయింపు
 • ఇంటి నుండి ఆరోగ్య కేంద్రానికి ఉచిత రవాణా
 • రిఫరల్లకు ఫెసిలిటీల మధ్య ఉచిత రవాణా
 • 48గం. గడిపిన తర్వాత ఆరోగ్య కేంద్రం నుండి ఇంటికి తిరిగి దించటం

జబ్బుతో పుట్టిన శిశువులకు పుట్టిన 30 రోజుల వరకు ఉచిత సదుపాయాలు

 • ఉచిత చికిత్స
 • ఉచిత మందులు మరియు తినుబండారాలు
 • ఉచిత కారణ నిర్ణయం
 • ఉచిత రక్త సదుపాయం
 • యూజర్ చార్జీల మినహాయింపు
 • హోమ్ హెల్త్ కేంద్రాల నుండి ఉచిత రవాణా
 • రిఫరల్ విషయంలో ఆరోగ్యకేంద్రాల మధ్య ఉచిత రవాణా
 • ఆరోగ్యకేంద్రాల నుండి ఇంటికి ఉచితంగా దింపడం

పథకం ముఖ్య లక్షణాలు

 • ప్రజా ఆరోగ్య కేంద్రాలలో ప్రసవం చెసుకొనే గర్భిణీ స్త్రీల ప్రసవం, సిజేరియన్ విభాగంతో సహా ఖచ్చితంగా ఉచితంగా చేస్తారు.
 • ఉచిత మందులు మరియు తినుబండారాలు, సాధారణ డెలివరీ సమయంలో 3 రోజులు ఉచిత ఆహారం మరియు C సెక్షనులో 7 రోజుల వరకు ఉచిత ఆహారం, ఉచిత డయాగ్నోస్టిక్స్, మరియు ఉచిత రక్తం ఇందులో ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఇంటి నుండి అరోగ్య కేంద్రానికి ఉచిత రవాణా మరియు తిరిగి దించటం ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు అనారోగ్యంతో పుట్టిన శిశువులకు పుట్టిన 30 రోజుల వరకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అందిస్తారు. దీనిని ఇప్పుడు జబ్బుపడిన శిశువులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకున్నారు.
 • పథకం ముఖ్య లక్ష్యం గర్భిణీ స్త్రీలు మరియు జబ్బుతో పుట్టిన శిశువులకు పూర్తిగా ఉచితంగా ఏ వ్యయాలు లేకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చికిత్స జరిపించడం.
 • ఈ పథకం కింది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చూపించుకుంటున్న 1.2 కోట్ల గర్భిణీ స్త్రీలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. అంతేకాక దీని వలన ఇప్పటికీ ఇంటిలో ప్రసవం చేసుకుంటున్న వారు ఆరోగ్య కేంద్రానికి రావడానికి వచ్చే ఆస్కారం ఉంది.
 • అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం అమలు పరుస్తున్నాయి.

మూలం: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్

సంబంధిత మూలాలు

 1. JSSK సూచనలు
2.98823529412
వందనం మద్దు Jul 05, 2016 11:45 AM

మంచి విషయాలు తెలిపారు. సంతోషం.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు