హోమ్ / ఆరోగ్యం / పథకాలు / ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY)

ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం మార్చి 2006 లో ఆమోదించబడింది.

లక్ష్యాలు

ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY) సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో, అసమానతలను సరిదిద్దడం కోసం, సరసమైన ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి తేవటం మరియు ముఖ్యంగా వెనుకబడీన రాష్ట్రాలలో నాణ్యమైన వైద్య విద్య సదుపాయాల వృద్ధి లక్ష్యంగా చేసుకుంటుంది. పథకం మార్చి 2006 లో ఆమోదించబడింది.

అమలు

మొదటి దశ

PMSSY మొదటి దశ రెండు విభాగాలను కలిగి ఉంది - ఎయిమ్స్ లాంటి ఆరు సంస్థల ఏర్పాటు; మరియు ప్రస్తుతం ఉన్న 13 ప్రభుత్వ వైద్య కళాశాల సంస్థల అభివృద్ధి.

ఇది 6 ఎయిమ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించబడింది. ఒకటి బీహార్ రాష్ట్రాంలో (పాట్నా), చత్తీస్ (రాయ్పూర్), మధ్యప్రదేశ్ (భూపాల్), ఒరిస్సా (భువనేశ్వర్), రాజస్థాన్ (జోధ్పూర్) మరియు ఉత్తరాంచల్ (రిషికేశ్) లో ప్రతి సంస్థను రూ 840 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకుంటుంది. ఈ రాష్ట్రాల ఎంపికకు మానవ అభివృద్ధి సూచిక, అక్షరాస్యత శాతం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు పర్ కాపిటా సంపాదనలను పరిగణలోకి తీసుకున్నారు. వీటితో పాటు ప్రజలకు బెడ్ నిష్పత్తి, తీవ్రమైన అంటు వ్యాధుల ప్రాబల్యం రేటు, శిశు మరణాల రేటు మొ ఆరోగ్య సూచికలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి సంస్థ 960 పడకల ఆసుపత్రిని కలిగి ఉంటుంది (వైద్య కళాశాల ఆసుపత్రికి 500 పడకల; స్పెషాలిటీ/సూపర్ స్పెషాలిటీ 300 పడకలు; ఐసియు/ ప్రమాదకర గాయాలకు 100 పడకలు; ఫిజికల్ మెడిసన్ & రీహాబిలిటేషన్ 30 పడకలు మరియు ఆయుష్ కోసం 30 పడకలు). దీని ఉద్దేశం 42 స్పెషాలిటీ/సూపర్ స్పెషాలిటీ విభాగాల సౌకర్యాలు అందించటం. మెడికల్ కాలేజీ వివిధ విభాగాల్లో పీజీ/డాక్టోరల్ కోర్సులకు 100 UGని తీసుకోవడమేకాక, ఎక్కువగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నిబంధనల ఆధారంగా మరియు నర్సింగ్ కళాశాల నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల పై పనిచేస్తుంది.

దీనికి అదనంగా, 10 రాష్ట్రాలలో విస్తరించిన ఇప్పటికే ఉన్న 13 వైద్య సంస్థలు కూడా మెరుగుపరుస్తారు. ప్రతి సంస్థకు రూ 120 కోట్లు (. కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి 20 కోట్ల రూపాయలు) కేటాయిస్తారు. ఈ సంస్థలు

 • ప్రభుత్వ వైద్య కళాశాల, జమ్మూ, జమ్మూ & కాశ్మీర్
 • కొల్కత్తా మెడికల్ కాలేజ్, కొల్కత్తా, వెస్ట్ బెంగాల్
 • సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో, ఉత్తర ప్రదేశ్
 • ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీఎచ్యూ, వారణాసి, ఉత్తరప్రదేశ్
 • నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్, తెలంగాణ
 • శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, సేలం, తమిళ్ నాడు
 • బి.జే. మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్, గుజరాత్
 • బెంగుళూర్ మెడికల్ కాలేజ్, బెంగుళూరు, కర్ణాటక
 • ప్రభుత్వ వైద్య కళాశాల, తిరువంతపురం, కేరళ
 • రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), రాంచీ
 • గ్రాంట్స్ మెడికల్ కాలేజ్ & సర్ జే.జే. గ్రూప్ ఆఫ్ హస్పటిల్స్, ముంబై, మహారాష్ట్ర .

రెండో దశ: PMSSY రెండో దశలో ప్రభుత్వం మరో రెండు ఎయిమ్స్ వంటి సంస్థలు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభిచాలనుకుంటుంది. మరియు ఆరు వైద్య కళాశాల సంస్థలు అభివృద్ధి చేయాలనుకుంటుంది. వాటి పేర్లు

 • ప్రభుత్వ వైద్య కళాశాల, అమృత్సర్, పంజాబ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, అడోవాల్, హిమాచల్ ప్రదేశ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, మధురై, తమిళనాడు
 • ప్రభుత్వ వైద్య కళాశాల, నాగ్పూర్, మహారాష్ట్ర
 • జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఆఫ్ అలిగర్, అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం
 • పండిట్. బి.డి. శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోతక్

ప్రతి ఎయిమ్స్ వంటి సంస్థ కోసం అంచనా వ్యయం రూ. 823 కోట్లు. వైద్య కళాశాల సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ 125 కోట్లు ప్రతి సంస్థకు సహాయం చేస్తుంది.

మూడో దశ :

PMSSY మూడవ దశలో, ఇప్పటికే ఉన్న క్రింది వైద్య కళాశాల సంస్థలు అప్గ్రేడ్ ప్రతిపాదించబడింది

 • ప్రభుత్వ వైద్య కళాశాల, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, రేవా, మధ్యప్రదేశ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, గోరఖ్పూర్, ఉత్తర ప్రదేశ్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, ధర్ బంగా, బీహార్
 • ప్రభుత్వ వైద్య కళాశాల, కోజికోడ్, కేరళ
 • విజయనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెల్లారే, కర్ణాటక
 • ప్రభుత్వ వైద్య కళాశాల, ముజఫర్పూర్, బీహార్

ప్రతి వైద్య కళాశాల సంస్థ అభివృద్ధి కోసం ప్రాజెక్టు వ్యయం రూ 150 కోట్ల అంచనా వేయబడింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ 125 కోట్లు దోహదం చేస్తుంది, మిగిలిన రూ. 25 కోట్ల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

Source : PMSSY

2.97590361446
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు