హోమ్ / ఆరోగ్యం / పథకాలు / రోగీ కళ్యాణ్ సమితి (RKS)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రోగీ కళ్యాణ్ సమితి (RKS)

అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రాథమిక నివారణ, అభివృద్ధి మరియు స్వస్థత సేవల ఏర్పాటు అక్కడి ప్రభుత్వ మరియు నిర్ణయాలు చేసేవారికి ఒక ప్రధాన అంశం అని చెప్పవచ్చు.

పరిచయం

అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రాథమిక నివారణ, అభివృద్ధి మరియు స్వస్థత సేవల ఏర్పాటు అక్కడి ప్రభుత్వ మరియు నిర్ణయాలు చేసేవారికి ఒక ప్రధాన అంశం అని చెప్పవచ్చు. జనాభా పెరుగుదల మరియు వైద్య సాంకేతికతలో అభివృద్ది వలన ప్రజలలో నాణ్యత, నివారణ మరియు రక్షణలపై ఆకాంక్ష పెరిగింది. ఇప్పుడు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణా సేవలు సంస్థాగతంగా అందించడం అత్యవసరగా మారింది.

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాలు (IPHS)కు CHCల అభివృద్ధి ఒక ప్రధాన వ్యూహాత్మక చర్య. స్థిరమైన నాణ్యత సంరక్షణ, జవాబుదారీతనంతో పాటు మొత్తం పారదర్శకత మరియు ప్రజల భాగస్వామ్యం దీని ఉద్దేశ్యం.

భావన

రోగి కళ్యాణ్ సమితి (రోగి సంక్షేమ కమిటీ)/హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక సాధారణ సామర్థ నిర్వహణ వ్యవస్థ. ఈ కమిటీ, ఒక నమోదిత సంఘము. ఆస్పత్రులు మరియు వాటి వ్యవహారాలను చూసుకోవడానికి ట్రస్టీగా పనిచేస్తుంది. దీనిలో స్థానిక పంచాయతీ రాజ్ సంస్థలు (PRIలు), NGO లు, స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆస్పత్రి/కమ్యూనిటీ హెల్త్ సెంటర్/FRU ల సరైన కార్యాచరణ మరియు నిర్వహణకు బాధ్యులుగా ఉంటారు. RKS/ HMS మందుల ఉత్పత్తి మరియు సులవైన పనితీరుకు అనుగుణంగా నిధులను పెంచటం మరియు వాటిని ఉపయోగించటం చేయగలరు.

RKS/HMS లక్ష్యాలు క్రిందివి HMS విస్తృత లక్ష్యములు:

 • వైద్యం కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలోని కనీస ప్రమాణాలను ఆచరణలో ఉండేలా చూడచం.

 • సమాజానికి ప్రజారోగ్యాన్ని కల్పంచే వారి నుంచి జవాబుదారీ;

 • నిధుల నిర్వహణకు సంబంధించి పారదర్శకత కల్పించటం;

 • ఆసుపత్రులు మరియు సంబంధిత సేవల పెంపుదల మరియు ఆరోగ్య సేవల ఆధునీకరణ;

 • ఆస్పత్రి మరియు దాని పరిపాలనా పరిధిలోని ఇతర ఆరోగ్య సంస్థల్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పర్యవేక్షించడం;

 • ఆసుపత్రి పరిధిలోని కేంద్రాలలో సేవలు/ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం;

 • ఆరోగ్య కేంద్రంలో ఒక పౌర పట్టికను ప్రదర్శించాలి మరియు ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చెసి దానిని ఉపయోగించేలా చూడటం;

 • విరాళాలు, యూజర్ ఫీజు మరియు ఇతర మార్గాల ద్వారా స్థానికంగా వనరులు ఉత్పత్తి;

 • సేవలు మెరుగు పరచడానికి ప్రైవేట్ సంస్థలతో సహభాగిత;

 • ఆసుపత్రి భవనం నిర్మాణం మరియు విస్తరణ చేపట్టడం;

 • ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రిలో భూమిని సరిగా ఉపయోగించటం;

 • ఆసుపత్రి నిర్వహణలో ప్రజలు పాల్గొనేలా చేయటం;

 • ఆసుపత్రి వ్యర్థాలను శాస్త్రీయంగా పారవేసేలా చూడంటం;

 • వైద్యులు మరియు సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వటం;

 • రోగులు మరియు వారి సహాయకులకు సబ్సిడీ ఆహారం, మందులు మరియు నీరు ఇంకా శుభ్రత అందేలా చూడటం;

 • ఆసుపత్రి భవనము, పరికరాల వాడకము మరియు యంత్రాలు మరమ్మత్తుల నిర్వహణ సకాలంలో జరిగేలా చూడాలి;

ప్రాథమిక నిర్మాణం

RKS/HMS సూచించిన కూర్పు ఈ క్రింది విధంగా ఉంటుంది:

 • RKS/HMS అనేది అన్ని జిల్లా ఆసుపత్రులు/సబ్ జిల్లా ఆస్పత్రులు/CHC/FRU/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటైన ఒక నమోదిత సొసైటీ. ఇది క్రింది సభ్యులు కలిగి ఉండవచ్చు: -

  • ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే / ఎంపీ

  • ఆరోగ్య అధికారులు (ఒక ఆయుష్ వైద్యుడితో సహా)

  • స్థానిక జిల్లా అధికారులు

  • కమ్యూనిటీ ప్రముఖ సభ్యులు

  • స్థానిక CHC/FRU ఇన్చార్జి

  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు

  • స్థానిక సంస్థల సభ్యులు మరియు పంచాయతీ రాజ్ ప్రతినిధి

  • ప్రధాన చందాదారులు


RKS/HMSలు ప్రభుత్వ ఏజెన్సీగా పని చేయవు, కాని పనితీరు సంబంధించినంత వరకు ఒక NGO లాగా పనిచేస్తాయి. ఇవి అన్ని ప్రభుత్వ ఆస్తులు మరియు సేవలకు వినియోగదారు సేవా రుసుమును విధించవచ్చు మరియు స్థానిక పరిస్థితుల ఆధారంగా వెల నిర్ణయించే స్వతంత్ర్యాన్ని కలిగి ఉంటాయి. విరాళాలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, ప్రభుత్వం అలాగే ఇతర దాత సంస్థలు నుండి నిధుల ద్వారా అదనంగా నిధులను సమకూర్చుకొనే అవకాశం కూడా వీటికి లేకపోలేదు. అంతేకాక, RKS/HMSలు అందుకున్న నిధులు రాష్ట్రం ఖజానాలో జమ కావు. ఇవి RKS/HMSలు ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా ఖర్చు చేయడానికి అందుబాటులో ఉంటాయి. పాథాలజీ, MRI, సీటీ స్కాన్, సేలోగ్రఫీ మొదలైన అధిక సాంకేతిక సేవలు అందించటానికి ప్రైవేట్ సంస్థలు ఒక రేటు RKS/HMSల ద్వారా పరిష్కరించబడుతుంది. వారి సేవల కోసం ఆసుపత్రి ప్రాంగణంలో వారి విభాగాలను ఏర్పాటు అనుమతి ఇవ్వాలి.

విధులు కార్యకలాపాలు సొసైటీ లక్ష్యాలను సాధించడానికి, కింది కార్యకలాపాలు/కార్యక్రమాలు చేపడతారు:

 • CHC/PHCలలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం;

 • ఆస్పత్రి కోసం పరికరాలు, ఫర్నిచర్, అంబులెన్స్ (కొనుగోలు, విరాళం, అద్దె, బ్యాంకుల నుంచి రుణాలు లేదా ఇతర మార్గాల ద్వారా) అమర్చటం;

 • రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి లేదా దాని మార్గదర్శకాలకు లోబడి, ఆసుపత్రి భవనం విస్తరించటం;

 • ఆసుపత్రి భవనం (నివాస భవనాలతో సహా), వాహనాలు మరియు ఆసుపత్రిలో అందుబాటులోని పరికరాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చూడటం;

 • రోగులు మరియు వారి సహాయకుల భోజనవసతి/బస ఏర్పాట్లు మెరుగు పరచటం;

 • క్లీనింగ్, లాండ్రీ సేవలు, రోగ నిర్ధారణ సేవలు, అంబులెన్స్ సౌకర్యాలు మొదలైన సహాయ సేవలను అభివృద్ధి చేయటానికి (వ్యక్తులతో సహా) ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి పనిచేయటం;

 • సొసైటీ ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచే దృష్టితో ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న భూమిని అద్దెకు/అభివృద్ధికి ఇవ్వటం;

 • ఆసుపత్రి నిర్వహణలో ప్రజలను పాల్గొనేలా ప్రోత్సహించటం;

 • సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా వార్డుల వనరుల సంరక్షణ కోసం చర్యలను ప్రోత్సహించడం మరియు,

 • ఆసుపత్రి రోజువారీ నిర్వహణ కోసం స్థిరమైన మరియు పర్యావరణ స్నేహపూర్వక చర్యలును అనుసరించటం ఉదా: శాస్త్రీయ ఆసుపత్రి వ్యర్థపదార్థాల వ్యవస్థ, సౌర వెలుతురు వ్యవస్థలు, సౌర శీతలీకరణ వ్యవస్థలు, నీటి వినియోగం మరియు నీటి రీఛార్జింగ్ వ్యవస్థలు మొదలైనవి.

RKS/HMS నిర్మాణం

పరిపాలన వ్యవస్థ:

 • ఛైర్పర్సన్: జిల్లా మేజిస్ట్రేట్

 • మెంబర్ సెక్రటరీ: ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్

 • సభ్యులు:

  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మునిసిపల్ కార్పొరేషన్

  • చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్

  • జిల్లా ఆయుష్ డైరెక్టర్

  • PRIతరఫున ఇద్దరి వరకు ప్రతినిధులు

  • జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన ముగ్గురు వరకు ప్రముఖ పౌరులు

  • MNGO ప్రతినిధి

  • స్థానిక మెడికల్ కాలేజ్ ప్రతినిధి

  • జిల్లా కలెక్టర్ నామినేట్ చెసిన నగరంలోని కార్పొరేట్ రంగం/NGO ఆస్పత్రుల ప్రతినిధి

  • స్థానిక MP/ఎమ్మెల్యే

 • అసోసియేట్ సభ్యులు : ఒకే సమయంలో విరాళం ఇచ్చిన వ్యక్తికి [ఉదా: రూ .5,000/- లేదా జిల్లా ఆరోగ్య సొసైటీ ఇచ్చినది] సొసైటీ పరిపాలక సంఘ సభ్యుడిగా ఎంపికైయ్యే అర్హతను కల్పించవచ్చు.

 • సంస్థాగత సభ్యులు : ఏదైనా సంస్థ నిర్థారిత మొత్తాన్ని విరాళంగా [ఉదా: ఏదైనా సంస్థ, రూ. 50,000 / - లేదా అంతకంటే ఎక్కువ జిల్లా ఆరోగ్య సొసైటీ ద్వారా ఇచ్చినది] లేదా ఆసుపత్రి వార్డ్ స్వీకరించి దాని నిర్వహణ ఖర్చును భరించినట్లైతే వారు ఒక పాలక సభ సభ్యుడిగా తమ సంస్థ నుండి ఒక వ్యక్తిని నామినేట్ చేయవచ్చు.

పాలక మండలి వ్యవహార క్రమం

 • పాలక మండలి సమావేశాలు త్రైమాసికంలో కనీసం ఒకసారి చైర్పర్సన్ నిర్ణయించిన సమయం మరియు ప్రదేశంలో నిర్వహించాలి. ఒకవేళ చైర్ పర్సన్ గవర్నింగ్ బాడీ మూడోవంతు సభ్యులనుంచి సంతకాలు చేసిన ఒక సమావేశ పిలుపు అందుకుంటే వెంటనే సాధ్యమైనంత తొందరగా అవసరమైన ప్రదేశంలో పిలవాలి.

 • క్రింది కనీస పనులను ముందుకు తీసుకు తీసుకురావాలి మరియు ప్రతి పాలక మండలి సమావేశంలో చర్చించాలి:

  • ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్స్ మరియు ప్రొటోకాల్స్ అంగీకిచటం.

  • గత త్రైమాసికంలో ఆసుపత్రి OPD మరియు IPD సేవల పనితీరుల సమీక్ష మరియు తరువాతి త్రైమాసికంలో సేవా లక్ష్యాలు నిర్ణయించటం.

  • గత త్రైమాసిక సమయంలో అవుట్రీచ్ పని ప్రదర్శణ సమీక్ష మరియు తదుపరి త్రైమాసికంలో పని పట్టిక తయారు చేయటం .

  • ప్రజలు, వాణిజ్య/పరిశ్రమలు మరియు IMA మరియు FOGSI తదితర ప్రొఫెషనల్ సంఘాల స్థానిక శాఖల నుండి పొందిన వనరులు పంపిణీ ప్రయత్నాల సమీక్ష.

  • పర్యవేక్షణ కమిటీ సమర్పించిన నివేదికలు సమీక్షించటం.

  • నిధులు, పరికరాలు మరియు ప్రభుత్వ వివిధ కార్యక్రమాల కింద అందుకున్న మందుల వినియోగ స్థితిని ఆన్లైన్లో సమీక్షించటం.

  • పౌర పట్టిక పునర్విచారణను పాటిస్తున్న ఆసుపత్రి మరియు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగ సమర్థతను పరిశీంచటం.

 • పై సాధారణ అంశాలకు అదనంగా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చర్చ జరగని సొసైటీ వార్షిక నివేదిక కూడా త్రైమాసిక సమావేశంలో చర్చించాలి.

 • గవర్నింగ్ బాడీ ప్రతి సమావేశ పిలుపు నోటీసు సమావేశ తేదీ, సమయం మరియు స్థల వివరాలను కలిగి ఉండాలి. దానిని గవర్నింగ్ బాడీ ప్రతి సభ్యుని ఇరవై ఒక్కరోజూల ముందు తెలియ చేయాలి. ఇటువంటి నోటీసు సొసైటీ సభ్య కార్యదర్శి జారీ చేయాలి. సమావేశపు అజెండా దానికి జతచేయాలి. ప్రమాదవశాత్తు ఏ సభ్యుడికైనా అలాంటి నోటీసు ఇవ్వకపోతే అటువంటి సమావేశం ఆమోదించిందిచిన ఏనిర్ణయం చెల్లుబాటు కాదు. ఏదైనా అత్యవసర అవసరానికి చైర్ పర్సన్ స్పష్టమైన పది రోజుల నోటీసుతో గవర్నింగ్ బాడీ సమావేశాన్ని పిలవవచ్చు.

 • ఛైర్పర్సన్ గవర్నింగ్ బాడీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. అతను/ఆమె లేనప్పుడు పరిపాలక సభ సమావేశానికి చైర్ పర్సన్ గా ప్రస్తుత సభ్యులు ఒకరిని ఎన్నుకోవాలి.

 • రూల్ 5.3.8 ప్రకారం ప్రస్తుత నామినేట్ సభ్యులతో సహా గవర్నింగ్ బాడీ సభ్యులు, మూడవ వంతు, ప్రతి సమావేశంలో ఒక కూటమి ఏర్పాటును నిర్ణయించాలి.

 • సొసైటీ పాలక ఎక్స్ అఫీషియో సభ్యుల సభ్యత్వం ముగిసినవెంటనే అతని/ఆమె వారసులు సభ్యులుగా చేరతారు.

 • నామినేటెడ్ సభ్యులు తమ నామినేషన్ తేదీ నుండి మూడు సంవత్సరాలు సభ్యులుగా ఉంటారు. ఇటువంటి సభ్యులకు మరో 3 సంవత్సరాల కాలానికి తిరిగి నామినేషన్ కోసం అర్హత ఉంటుంది.

 • సొసైటీ తన రిజిస్టర్డ్ కార్యాలయంలో సభ్యుల జాబితాను నిర్వహిస్తుంది. ప్రతి సభ్యుడు తన హోదా వృత్తి మరియు చిరునామాతో అందులో సైన్ చేయాలి . ఏ సభ్యుడూ అతను/ఆమె రోల్ సంతకం చేయకుండా తమ హక్కుల మరియు ప్రత్యేకాధికారాలను ఉపయోగించకూడదు.

 • సొసైటీ సభ్యుడు రాజీనామా చేసినప్పుడు, మానసికంగా బాగాలేడని రుజువైతే, దివాలా తీస్తే లేదా అనైతికత లేదా ఏదైనా నేర నిర్ధారణ జరిగితే అతని సభ్యత్వం తొలగించబడుతుంది.

 • సభ్యత్వ రాజీనామా దాని సభ్య కార్యదర్శి స్వయంగా గవర్నింగ్ బాడీకి అందించాలి. అది చైర్పర్సన్ ద్వారా పాలక సభ తరపున ఆమోదించబడే వరకు ప్రభావితం కాదు.

 • సొసైటీ సభ్యులు తమ చిరునామా మార్చినట్లయితే, సభ్యుల జాబితాలో చేర్చడానికి, నమోదు కమిటీ సభ్య కార్యదర్శికి కొత్త చిరునామా తెలియజేయాలి. సభ్యులు వారి కొత్త చిరునామాను అందించకపోతే సభ్యుల జాబితాలోని చిరునామా అతని/ఆమె చిరునామాగా భావించడం జరుగుతుంది.

 • సొసైటీలో ఏదైనా ఖాళీ ఉంటే అటువంటి నియామకం చేయడానికి అర్హులైన అధికారి ద్వారా నియామకం జరగాలి.

 • సొసైటీ లేదా దాని గవర్నింగ్ బాడీ యొక్క ఏ సభ్యుడికి ఏరకమైన వేతనం ఉండదు.

మూలం: జాతీయ ఆరోగ్య మిషన్.

3.06024096386
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు