హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / ఆకుకూరలు - వినియెగం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆకుకూరలు - వినియెగం

ఆకుకూరలు - వినియెగం.

ఆకుకూరలు ఆరోగ్యాన్నిచ్చే హౌషదాలు. వీటిని మన రోజు వారి ఆహారంలో చేర్చటం వలన లాభాలెన్నో. ముఖ్యంగా ఖనిజాలకు మరియు విటమిన్లకు భండాగారాలు. అందుచేత ఆకుకూరలను సంరాశాత్మక ఆహారాలుగా పిలువవచ్చు. ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, ముఖ్యంగా రైబోప్లావిన్, పోలికసిడ్ తో గల బి-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ధాన్యాలు, పప్పులతో కలిపి వంగినప్పుడు ఆహారంలో మాంసకృత్తుల నాణ్యత ఎలా పెరుగుతుందో ఆకుకూరలను కలిపి వంగినప్పుడు కూడా ఖనిజలవణాలు లభ్యత పెరుగుతుంది. ఇవి ముఖ్యమ్గా పటిష్టమైన ఎముకలకు, ఆరోగ్యమైన దాతలకు, ఎంతగానో సహాయపడుతుయి. రక్తంలో ఇనుము శాతాన్ని పెంచడంలో కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరి ముఖ్యంగా రక్తిహీనత ఉన్నవారు, రక్తజనతా వచ్చే అవకాశం ఉన్న ఎదుగుతున్న పిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చేతల్లులు ఆకుకూరలను క్రమంగా తీసుకునే అవసరం ఎత్తెన ఉంది. ప్రతిరోజు 50 గ్రాముల ఆకుకూరలు తింటే, మన శరీరానికి అవసరమైన ఇనుము మరియు కాల్షియం లభిస్తాయి. అంతేకాక ఆకుకూరల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం నివారించడంలోనూ, కాలరీలు మరియు కొవ్వు శాతం తక్కువ ఉండటం వలన బరువు తగ్గడానికి దోహదపడుతాయి. ఆకుకూరలతో ఉన్న విటమిన్ సి శరీరంలో ఇనుమును సరియైన శాతంలో ఉంచడానికి దోహదం చేస్తోయింది. ఆకుకూరలను వివిధ  పద్ధతులద్వారా వండేటప్పుడు పోషక మూల్యాలు నష్టపోతాయి.

ఆకుకూరల పోషక విలువలు నష్టపోకుండా వాడవలసిన పద్ధతులు

ఆకుకూరలలోని విటమిన్ సి వేపుడులు, ఎక్కువనూనెలో వేయంచడం, ఎక్కువ సేపు వండడం, ఎక్కువ వేడి పై వండడం, ఎక్కువ నీరులో వండటం ద్వారా కోల్పోతాం. కానీ ఆకుకూరలు తాజావి వాడడం, కుక్కర్లో లేక తగినన్ని నీరులో పోపుపెట్టడం ద్వారా విటమిన్ సి ని నష్టపోము. కానీ ఖనిజలవణాలు ఎ పద్దతిలో వండిన వాటి విలువల నష్టం తక్కువ. ఆకుకురాలను తరగక ముందే ఎక్కువ నీటిలో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన పోషకాలు మఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు, విటమిన్ సి నష్టపోవడం జరగదు. ఆకుకూరలను మాత వేసి వండినట్లయితే వాటిలోని పోషకాలు నష్టపోము. ఆకుకూరలు కొన్ని తర్వాత సరియైన పద్దతిలో నిల్వ ఉంచకపోతే కెరోటిన్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ మిటమిన్లను కోల్పోతాం. దీని నివారణకై ఆకుకూరలను న్యూస్ పేవర్ లో చుట్టి ఫ్రిడ్జిలో పెడితే తాజాగా ఉంటాయి. మనలో పోషకాహారం ఖరీదైనది అనే దురభిప్రాయం ఉన్నది. ప్రకృతి ఇచ్చిన అన్ని పోశాకమూల్యాలు గల ఆహారం ఆకుకూరలు.

క్రిమి సంహారక మందులను విపరీతంగా వాడుతూ పోషకవిలువలు నష్టం చేయడమే కాకుండా రసాయన అవశేషాలు కారణమవుతున్నాము. కాబట్టి పెరటి తోటల్లో ఎన్నో పోషకవిలువ కలిగిన ఈ ఆకుకూరలను పెంచడం ద్వారా మరియు ప్రతి రోజు మన ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతాము.

ఆధారం: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.94594594595
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు