హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / ఆరోగ్యం కోసం అవిసె నూనె
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరోగ్యం కోసం అవిసె నూనె

మార్కెట్లో వంట నూనెలకు కొదవే లేదు. బోలెడన్ని బ్రాండ్‌లు, రకరకాల నూనెలు. వీటిలో చేతికందిన నూనెను తీసేసుకుంటూఉంటాం. మరి ఇన్ని నూనెల్లో ఏ నూనె మంచిది?

మార్కెట్లో వంట నూనెలకు కొదవే లేదు. బోలెడన్ని బ్రాండ్‌లు, రకరకాల నూనెలు. వీటిలో చేతికందిన నూనెను తీసేసుకుంటూఉంటాం. మరి ఇన్ని నూనెల్లో ఏ నూనె మంచిది? దేన్ని వాడితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది? ఈ విషయాల మీద అవగాహన మాత్రం శూన్యమే! ఒకరు పొద్దుతిరుగుడు నూనె మంచిదంటే ఇంకొకరు ఆలివ్‌ ఆయిల్‌ మంచిదంటారు. నిజానికి కొలెస్టరాల్‌ను తగ్గించే, పోషకాలను అందించే నూనెను వంటకు ఉపయోగించాలి. ‘అవిసె నూనె’(ఫ్లాక్స్‌సీడ్‌ ఆయిల్‌) ఆ కోవకు చెందినదే!


పోషక విలువలు (అవిసె గింజలు - 100 గ్రాములు)
మొత్తం కొవ్వులు - 40 గ్రా 
(దీన్లో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ - 64 %
పాలీ అన్‌శాచురేటెడ్‌ - 18%) 
కొలెస్టరాల్‌ - 0 మి.గ్రా 
సోడియం - 30 మి. గ్రా 
పొటాషియం - 813 మి.గ్రా 
కార్బొహైడ్రేట్లు - 29 గ్రా 
డైటరీ ఫైబర్‌ - 27 గ్రా 
మాంసకృతులు - 18 గ్రా 
కాల్షియం - 25%
మెగ్నీషియం - 98% 
ఐరన్‌ - 31% 
విటమిన్‌ బి-6 - 25%
ప్రత్యేకతలు
ఈజిప్టు, చైనాల్లో పండించిన అత్యంత పురాతన ఫైబర్‌ క్రాప్స్‌లో ‘అవిసె’ ఒకటి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. కాబట్టే మధుమేహం, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అయితే అవిసె గింజల పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
ఆరోగ్యపరమైన లాభాలు

 • అవిసె నూనె వాడితే ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు.
 • కొలెస్టరాల్‌ శాతం తగ్గుతుంది.
 • మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి.
 • రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
అవిసె నూనెలో రకాలు
 • ఈ నూనెలో కన్వెన్షల్‌, ఆర్గానిక్‌ అనే రెండు రకాలుంటాయి. ఈ రెండూ అవిసె నూనె గింజల్ని దంచి తీసినవే! వేర్వేరు విధానాల్లో పెరిగిన అవిసె గింజలనుంచే ఈ రెండు నూనెలు తీస్తారు. అయితే ఈ రెండు రకాల నూనెలు ఒకే రకమైన రుచిని కలిగి ఉంటాయి.
వంటల్లో ఎలా వాడాలి?
 • అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడాలి.
 • గ్రిల్‌, బేక్‌ చేసేటప్పుడు అవి పూర్తిగా ఉడికాక అవిసె నూనెను పైపూతగా పూయాలి.
 • కూరగాయలు, పప్పుధాన్యాల వంటకాల్లో కూడా అవి పూర్తిగా ఉడికిన తర్వాతే ఈ నూనెను కలపాలి.
 • ప్రొటీన్‌ షేక్స్‌, వెజిటబుల్‌, ఫ్రూట్‌ జ్యూస్‌లకు అవిసె నూనె కలిపి తీసుకోవచ్చు.
 • కెచప్‌, సలాడ్స్‌లో కలుపుకుని తినొచ్చు.
 • సూప్స్‌, స్ట్యూలలో కలిపి తాగొచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు