నూనెలన్నిట్లో మేలురకం వంటనూనె ‘ఆలివ్ ఆయిల్’. పోషకాలపరంగా, ఉపయోగాలు, నిల్వపరంగా ఆలివ్ నూనె ఉత్తమమైనది. కాబట్టే వంటకాల్లో ఈ నూనె వాడకం క్రమేపీ పెరుగుతోంది. ఆలివ్ నూనె వాడే విధానం, పొందే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే!
న్యూట్రిషనల్ వాల్యూస్
ఆలివ్ ఆయిల్ (100గ్రా)
కెలోరీలు - 884
కొవ్వు - 154ు
శాచురేటెడ్ ఫ్యాట్ - 69శాతం
పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ - 10.5గ్రా
మోనాశాచురేటెడ్ ఫ్యాట్ - 73గ్రా
కొలెసా్ట్రల్ - 0శాతం, ఐరన్ - 3శాతం
ఎలా వాడాలంటే?
ఆలివ్ ఆయిల్ 3 రకాలుగా దొరకుతుంది. 1.ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 2.ఆలివ్ ఆయిల్ 3.ఎక్స్‌ట్రా లైట్ ఆలివ్ ఆయిల్. వంట వండే విధానం ఆధారంగా ఆలివ్ ఆయిల్ రకాన్ని ఎంచుకోవాలి.
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్: ఈ రకం నూనెను స్టిర్ ఫ్రైయింగ్, రోస్టింగ్, మారినేటింగ్, బ్రెడ్ డిప్పింగ్, సలాడ్ డ్రెస్సింగ్‌కి ఉపయోగిస్తారు.
ఆలివ్ ఆయిల్: ఎక్స్‌ట్రా వర్జిన్‌తో పోల్చుకుంటే కాస్త మైల్డ్‌గా ఉండే ఈ నూనె పసుపు రంగులో ఉంటుంది. వంటకాలకు రుచి పెంచడానికి ఈ నూనెను వాడతారు.
ఎక్స్‌ట్రా లైట్ ఆలివ్ ఆయిల్: ఈ నూనె టెక్స్‌చర్, ఫ్లేవర్, కలర్ లైట్‌గా ఉంటాయి కాబట్టే ఈ నూనెకు ఆ పేరు. ఈ నూనెను ఎక్కువ ఉష్ణోగ్రత ఉపయోగించి చేసే సేవరీ కుకింగ్, బేకింగ్‌కు ఉపయోగిస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు
- పప్పులు, విత్తనాలు, ధాన్యాల నుంచి తీసిన నూనెలకంటే ఆలివ్ కాయల నుంచి తీసిన ఆలివ్ నూనె ఎక్కువ వాసన, రుచి కలిగి ఉంటుంది. కాబట్టే దీన్లో వృక్ష ఆధారిత యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టిరాల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని పోషకాలున్నాయి కాబట్టే ఆలివ్ ఆయిల్ వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
- ఈ నూనెను క్రమం తప్పక వంటల్లో వాడితే కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రాకుండా నియంత్రించవచ్చు.
- హైపర్‌టెన్షన్, స్ర్టోక్, హైపర్ లిపిడిమియాలను కూడా నియంత్రించవచ్చు.
- రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్, వాపు, రక్తపు గడ్డలు ఏర్పడటంలాంటి సమస్యలు కూడా దరిచేరవు.
- రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- ఆలివ్ ఆయిల్ వాడకం వల్ల రక్తంలో కొలెసా్ట్రల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
- ఈ నూనెలోని ఫినోలిక్ కాంపౌండ్ అల్జీమర్స్ వ్యాధికి కారణమైన అబ్నార్మల్ బ్రెయిన్ ప్రొటీన్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఇలా నిల్వ చేయాలి
జాగ్రత్తగా నిల్వ చేస్తే ఆలివ్ ఆయిల్ రెండేళ్ల వరకూ పాడవకుండా ఉంటుంది. ఇందుకోసం నూనెను వేడి, సూర్యరశ్మి తగలని చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఒకసారి మూత తీయగానే అప్పటి నుంచి నూనె పాడవటం మొదలవు తుంది. కాబట్టి సాధ్యమైనన్ని తక్కువ నెలల్లోనే నూనెను వాడేయాలి.
ఆధారము: ఆంధ్రజ్యోతి