హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / ఆహారంలో భాగాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆహారంలో భాగాలు

ఆహారంలో భాగాలు.

పిండిపదార్ధాలు (Carbohydrates)

 • మనం తినే ఆహారంలోని "పిండి పదార్ధాలని" ఇంగ్లీషులో Srarch  అని, వైద్యశాస్త్ర పరిభాషలో "కార్బోహైడ్రేటులు" (Carbohydrates) అని అంటారు.
 • ఇవి రోజువారీ శ్రమలో కావలసిన శక్తిని ఎప్పటికప్పుడు సమకూరుస్తాయి.
 • శరీరానికి శక్తినివ్వటమే కాక, ప్రతినాలతో కలిసి దేహ రక్షణకు తోడ్పడే "రక్షక పదార్ధాల" (Synovial Fluid) తయారీకి పిండి పదార్ధాలు సాయపడ్తాయి.
 • శరీరానికి శక్తినిచ్చే పదార్ధాల్లో పిండిపదార్ధాలు ముఖ్యమైనవి. అంతేగాక మెదడు కార్బోహైడ్రట్లును తప్ప మరి దేనిని శక్తి కోసం వినియెగించుకోలేదు.
 • ఎముకల నిర్మాణానికి, మృదులస్ధి (Cartilage) నిర్మాణానికి పిండి పదార్ధాలు అవసరం.
 • కీళ్ళలో గ్రీజులగా, కందెనలాగా పనిచేసే "సైనోవియల్ ద్రవపదార్ధాల" (Synovial Fluid) తయారీకి పిండి పదార్ధాలు ఉపయెగపడతాయి.
 • కండరాల సంకోచానికి, ప్రేవుల కదలికకు, నాది కానాల మధ్య జరిగే "రసాయంను సందేశాల" న్నింటికీ అవసరమైన "ఎడినోసిన్ ట్రై పస్సాపేటు" (Adenosine Triphosphate) తయారీకి పిండి పదార్ధాలు అవసరం ఉంది.
 • శాకాహారంలో కార్బోహైడ్రాట్లులు ఎక్కువగా పిండి (Starch) రూపంలో ఉంటాయి.

పిండిపదార్ధాలు మూడురకాల (Types of Carbohydrates)

 1. సామాన్య పిండిపదార్ధాలు (Simple Carbohydrates)
 2. సంశిష్ట పిండిపదార్ధాలు (Complex Carbohydrates)
 3. పీచు పిండిపదార్ధాలు (Fibre Carbohydrates)
 • వరి, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, కొర్రలు, యవలు, ఓట్లు, రై, బార్లీ, గోధుమలు మూఢులైన ధాన్యంలోనూ; దుంపల్లోనూ చిలకడ దుంపలు, బంగాళా దుంపలు, చమ, కండ, పెండల, కర్రపెండలం మెదలైన దుంపల్లోనూ పిండి పదారాధలు ఎక్కువగా ఉంటాయి. అవసరమైన ఇంధనంలాగా, "శక్తిదాయకాలు" గా ఉపయెగపడు తుంటాయి.
 • ప్రోటీనులు, క్రొవ్వులు కూడా శక్తిని సమకూరుస్తుంటాయి గాని, ఆ శక్తి "కార్బోహైడ్రేటుల" ద్వారా లభించటమే శ్రేయదాయకం.
 • "కాంప్లెక్స్ కార్బోహైడ్రేటుల" ఉత్తమ తరగతికి చెందిన ఆహారంగా పరిగణిస్తారు. ఇవి విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్ధాలు మెదలైన వారితో మిళితమై ఉంటాయి.
 • అవసరానికి మించి థీమతె పిండి పదార్ధాలు శరీరంలో "గ్లైకోజెన్" గా మరి  కాలేయంలోనూ, కండరాలలోను నిల్వ ఉంటాయి. క్రొవ్వుల నీళ్ల ఉండేది కూడా ఎక్కువగా తినటం వల్లనే!
 • పీచు పదార్ధాలతో కలిసి లభించే కార్బోహైడ్రాట్లులు శరీరానికవసరమైన శక్తిగా మారవు. ఈ పదార్ధాలు అరగకుండానే (Digest) ప్రేవుల ద్వారా ప్రయాణం చేస్తాయి.

వివిధ పదార్ధాలు - అందులో ఎంత పిండి పదార్ధం ఉంటుంది?

 • పంచదార అంటే 99.5% "సుక్రోజ్" మాత్రమే ! సుక్రోజ్ కూడా ఒక పిండి పదార్థమే! ఒక గ్రాము చక్కెరతో నాలుగు క్యాలరీల శక్తి లభిస్తుంది.
 • ధాన్యాలు, తృణ ధాన్యాలు, పండ్లు, దుంపలు - వీటిలో ఎక్కువ పాళ్ళలోనూ, కూరగాయలు, ఆకుకూరల్లో తక్కువ పాళ్ళలోనూ పిండి పదార్ధాలు లభిస్తాయి.
  ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల గోధుమల్లో  71 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల రాగుల్లో  72 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల జొన్నల్లో  66 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల అరటిలో 25 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల సపోటాలో 19 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల ద్రాక్షలో  15 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల చిక్కుళ్ళలో 30 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల చిలకడ దుంపల్లో  28గ్రా.,
  ప్రతి 100 గ్రాముల కందిపప్పులో 17 గ్రా.,

ఇలా అన్ని కూరగాయలు, ఆకూ కూరలతో సహా ప్రతి 100 గ్రా. లకి 3 గ్రా. లకు తగ్గకుండా పిండి పదార్ధాలు లభిస్తున్నాయి. స్ధులకాయం తగ్గటానికి జాగ్రత్తలు తీసుకునే వారు తినే ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు ఈ వివరాలు సాయపడతాయి.

మాంసకృత్తలు (Proteins)

మాంసకృత్తులు రెండు రకాలు :

 1. జంతు సంబంధమైనవి
 2. వృక్ష సంబంధమైనవి

జంతు సంబంధమైనవి:

జంతువుల నుండి వచ్చే మాంసం, గ్రుడ్లు, పాలు, పెరుగు, జున్న, వెన్న, నెయ్య్, మీగడ, చేపలు మొదలైనవన్నీ జంతు సంబంధమైన పదార్ధాలే ! ఇవి ఖరీదెక్కువ. అరుగుదల నిదానంగా ఉంటుంది. ఇవి చాలామంది బీదలకందుబాటులో ఉండవు.

వృక్ష సంబంధమైనవి :

ద్విదళ బీజాల జాతికి చెందిన ధాన్యాలు అన్ని వృక్ష సంబంధమైన మాంసకృత్తులకి చెందినవే ! కందులు, వేరుశనగలు, శెనగలు, పెసలు, మినుములు, ఉలవలు, నువ్వులు, అలసందలు, బిన్స్, చిక్కుళ్ళు, సోయానిన్స్, జీడిపప్పు.

  ప్రతి 100 గ్రాముల సోయానిన్స్ లో 43 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల వేరుశెనగ విత్తునాల్లో 26 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల కోడి మాంసంలో 26 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల చేపల్లో 20 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల మాంసంలో 18 గ్రా.,
  ఒక్కో గ్రుడ్డులో 13 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల కందిపప్పులో 23 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల గోధుమల్లో 13 గ్రా.,
  ప్రతి 100 గ్రాముల బియ్యంలో 8 గ్రా.,
  పాలల్లో 4 గ్రా ... ఇలా మాంసకృత్తులు లభిస్తాయి.
 • ఆహారంలోని మాంసకృత్తుల నుంచే శరీరంలోని ప్రోటీన్లు ఉత్పత్తవుతాయి.
 • శరీరం బరువులో ఇవి 20 శాతం ఉంటాయి. కొంత మేరకు శక్తినిస్తాయి.
 • కంధర నిర్మాణానికి, ఎముకల్ని పుష్టగా తయారుచేయడానికి మాంసకృత్తలవసరం.
 • ఎముకల నిర్మాణానికి కాల్షియం ఉపయెగపడినా, ఎముకలతో హెచ్చు భాగంలో ఉన్న "కొల్లాజెన్" (Collagen) ప్రోటీన్ నిర్మితమే!
 • శరీరంలో అనేక కణజాలాలున్నాయి. వాటి నిర్మాణానికి ప్రోటీన్లు ఆత్మవసరం.
 • పెరిగే పిల్లలకే కాక, పెద్దవాళ్ళతో కూడా కణజాలాలు నశిస్తూ పునరుణించబడుతూ ఉంటాయి. ఈ పునర్నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం.
 • ఆహారాన్ని చిన్న అణువుల క్రీంది విడదీసి, జరణం చేసి, శరీరానికి శక్తిగా అందించే "మెటాబాలిజమ్" (Metabolism) అనే విధి నిర్వహణను ప్రోటీన్లు నిర్వహిస్తాయి.
 • రక్తం తయారు కావటానికి, కొత్త రక్తం పుట్టటానికి, రక్తంలోని అనేక పదార్ధాల నిర్మానికి, గర్భాశయం గర్భధారణ కాలంలో పెరగటానికి, లోపల బిడ్డ పెరుగుదలకు, - మాంసకృత్తులు అవసరం.
 • హివక్రయాలకు, జీర్ణక్రియలకు అవసరమయ్యే అనేక ముఖ్యమైన ఏంజేతిముల, హార్మోనుల వంటి స్రావాలు - నాంసకృత్తుల నుండే తయారవుతాయి.
 • ఎదిగే పిల్లల కండరాలు, ఎముకలు బలంగా తయారవటానికి మాములు కంటే రెండింతలు మాంసకృత్తులు అవసరం.
 • మాంసకృత్తులు జీర్ణక్రియలో అమైనో ఆమ్లాలు (amino acids) గా మరి శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, తెగిన భాగాల మరమ్మత్తులకు చాల అవసరం.
 • శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షక కమలాలు మాంసకృత్తులు నుండే తయారవుతాయి. ప్రోటీన్లు తక్కువైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
 • పిండి పదార్ధాలు తగు మేతదులో లభ్యం కానప్పుడు శరీరం శక్తిని మాంసకృత్తుల నుండి ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే దీని వలన ధాతు (Pigment), కణజాలాల నిర్మానికి ఉపయెగపడే విలువైన మాంసకృత్తులు వృధాగా ఖర్చయిపోతాయి. మాంసంకృత్తులలో 20 రకాల అమైనో యాసిడ్స్ దొరుకుతాయి.
 • వీటిలో 11 రకాల అమైనో ఆమ్లాలను శరీరం తాయారు చేసుకోగలుగుతుంది. 9 రకాలను శరీరం తాయారు చేసికోలేదు.
 • శరీరం తాయారు చేసుకోలేని, ఆహారం ద్వారా అందాల్సిన అమైనో ఆమ్లాలను "ఆవశ్యక అమైనో ఆమ్లాలు" (Essential Amino Acids) అని అంటారు. (అవి : ఎసోల్యుసిన్, ల్యూసిన్, లైసిన్, మేడిఎనిన్, ఫినాయిల్ ఎలావిన్, ట్రిప్టోపెన్, డ్రియునైన, వెలిన్, హిస్టీడిన్).
 • శరీరం తాయారు చేసుకునే ఆమ్లాలని "అనావిశ్యక ఆమ్లాలు" (Non - Essential Amino Acids) అని అంటారు. మనిషి శరీరం మాత్రమే స్వార్ధ సిద్ధంగా అమైనో ఆమ్లాలను తాయారు చేసికోగలడు. ఇవి ఆహారంలో అందుకపోయినా పరవాలేదు. అందుకే వీటిని "అనావశ్యక ఆమ్లాలన్నారు".
 • జంతు సంభందమైన మాంసకృతులలో "ఎస్సెన్షియల్" (Essential) "నాన్- ఎస్సెన్షియల్" (Non-Essential Amino Acids) అమైనో యాసిడ్స్ రెండు లభిస్తాయి.
 • ఒక్కో ప్రోటీను కొన్ని రకాల అమైనో ఆమ్లాల కలయికతో తయారయినట్టుగానే, ఒక్కో కణజాలం కొన్ని రకాల ప్రోటీనులతో తయారువుతుంది. ఉదా: ఎముకలతో "జెలటిన్" అనే ప్రోటీన్; వెంట్రుకల్లోనూ, చర్మం పైన పొలుసులుగా రాలె పొత్తులో "కేరాటిన్" అనే ప్రోటీను ఉంటుంది.
 • ప్రొటీన్లన్నింటిని శరీరం ఒకే రకంగా శోషించుకులేదు.
 • మొత్తం ఖరీయే క్యాలరీలలో 8-10 శాతం వరకు ప్రొటీన్లుండేలా మన ఆహారం ఉండాలి.

కొవ్వు పదార్ధాలు (FATS)

 • మనం తినే ఆహారంలో ఉండే పిండి పదార్ధాల నుండి శరీరం తనకు కావలసిన శక్తిని తీసుకున్న తర్వాత అదనంగా ఉన్న ఆహారాన్ని "క్రొవ్వు" (Fats) రూపంలోకి మర్చి చర్మం క్రైండ దాచుకొంటుంది.
 • కనుక క్రొవ్వు పదార్ధాల్ని శక్తిని నిలువ ఉంచే గోడౌనులు లేదా బ్యాంకులుగా చెప్పుకోవచ్చు.
 • తిరిగి ఎప్పుడైనా అవసరమైతేను, ఆహారం దొరకని సందర్భాల్లోనూ, ఈ క్రొవ్వులు శక్తిగా మారి శరీరానికి ఉపయెగపడతాయి.
 • ఇవి అధికశక్తి జంతికలు. ఒక గ్రాము పిండి పదార్ధం తీసుకుంటే అరగ్రాము క్రొవ్వుకి సమానమైన శక్తి లభిస్తుంది.
 • శీరరంలోని జీవకణాలు గోడల పటుత్వం క్రొవ్వు మీద ఆధారపడి ఉంటుంది.
 • విటమిన్లలో ఒక రకం క్రొవ్వులోనే కరిగి, శోషించబడతాయి. ఎ, డి, ఇ, కె - విటమిన్ల శోషణకు ఆహారంలో క్రొవ్వు అవసరం ఉంది. అంతేకాక వెన్న, నెయ్య వంటి క్రొవ్వు పదార్ధాల్లో ఎ, డి - విటమిన్లు నిలువ ఉంటాయి.
 • శరీరంలో ముఖ్యవయవాలను అమరికగా ఉంచేందుకు, చలి నుండి శరీరాన్ని రాశించేందుకు వీటి అవసరం ఉంది.
 • చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి క్రొవ్వులో ఉండే ఆమ్లాలు అవసరం.
 • క్రొవ్వు పదార్ధాలు ఆహారానికి రుచిని, సువాసనని ఇస్తాయి.
 • వెన్న, నెయ్య లాంటి క్రొవ్వు పదార్ధాలు ఆమ్లాలని, విటమిన్లని తనలో కలుపుకొని జాతరశయం (Stomach) లో ఎక్కువ సేపు నిలబడగలుగుతాయి. ఇలా ఎక్కువసేవు నిలబడటం వలన ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి కాదు. ఆమ్లం ఎక్కువైతే కడుపులో మంట, పులిత్రేస్పులు, ఎప్పుడు ఆకలి వేయటం లాంటి లక్షణాలు వస్తాయి. పేదల ఆహారంలో నూనె, నెయ్య లాంటివి ఎక్కువ ఉండనందువల్ల ప్రేవు పొక్కటం, ప్రేవు పుండు పడటం లాంటి సమస్యలు వస్తాయి. ఈ కారణంతోనే పెదాలకి వచ్చే అవకాశాలు ఎక్కువ.
 • క్రొవ్వులు కూడా మాంసకృత్తులలాగే జీర్ణక్రియలో ఆమ్లాల రూపంలోకి మారుతాయి.
 • వీటిలో కూడా ఆవశ్యక (Essential), అనావశ్యక (Non- Essential) క్రివ్వు ఎమ్మెల్యేలుగా విభజించారు. అంతేకాక వాటి రసాయన నిర్మాణాన్ని బట్టి సంతృప్త (Saturated), అసంతృప్త (Unsaturated) ఎమ్మెల్యేలుగా కూడా విభజించారు.
 • లైనోలిక్, లైనోలినిక్, అరకిడానికే ఆమ్లాలని "ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు" అంటారు.
 • ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు జీవక్రియ సజావులగా సాగటానికి, జీవకణాలు బయటి పోరా (Cell Membrane) ఏర్పడటానికి చాల అవసరం.
 • అన్నింటికన్నా "లైనోలినిక్ ఆమ్లం" ముఖ్యమైనది. దీని నుండి శరీరం మిగతా రెండింటిని ఉత్పత్తి చేస్తుంది.
 • ఆకుకూరలోను, అలాగెలోను, అలాగే మీద బ్రతికే చేపల కాలేయంలోనూ, "లైనోలినిక్ ఆమ్లం" ఎక్కువగా ఉంటుంది.

విటమిన్లు (Vitamins)

చాల ఆహార పదార్ధాలలో, అతి తక్కువ మేతదులలో లభ్యమయ్యే పోషక పదార్ధాలు, ఒక విధమైన రసాయనిక సామ్యేగా పదార్ధాలను "విటమిన్లు" (Vitamins) అంటారు.

 • శరీరం సక్రమంగా పనిచేయటకి అతి తక్కువ పరిమాణంలో ఉంటే విటమిన్లు అవసరమవుతాయి.
 • శరీరంలోని వివిధ రసాయానికి చర్యలలో ఉత్ప్ర్రకల్లా పని చేస్తాయి.
 • "మెబాలిజమ్" (Metabolism) అనే జీవక్రియలో కీలకమయిన పాత్ర వహిస్తాయి.

ఆ విటిమిన్లను రెండు గ్రూపులుగా విభజించారు.

 1. క్రొవ్వులలో కరిగేవి (ఎ, డి, ఇ, కె) (Fat Soluble)
 2. నీటిలో కరిగేవి (బి, సి విటమిన్లు) (Water Soluble)
 • సహజమైన విటమిన్లకు, కృత్రిమ విటమిన్లకు మధ్య చాల తేడా ఉంటుంది.
 • ఇతర ఖనిజ లవణాలతో కలవకుండా ఏ ఒక్క విటమిను పనిచేయలేదు.
 • రక్తం పట్టటానికి ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్ - సి, ఏ, ఇనుము, జింకు, పోలిక, యాసిడ్, విటమిన్ బి అన్ని కావాలి.

విటమిన్ - ఎ (Vitamin - A)

 • చాల రకాల పండ్లలో, కూరగాయలలో "కెరోటిన్" (Kerotin) అనే పసుపు పదార్ధం ఉంది. కెరోటిన్ అనే పేరు "క్యేరేట్" దుంప వల్ల వచ్చింది. దీనిలో కెరోటిన్ పుష్కలంగా ఉంది.
 • కెరోటిన్ ఉన్న పదార్ధాలను మనం తీసుకున్నప్పుడు వీటిలో ఉన్న కెరోటిన్ మన శరీరంలో విటమిన్ "ఎ" గా మార్పు చెందుతుంది.
 • పాలకూర, మునగాకు, కొత్తమీర, మెంతికూర, గొంగూర, చక్కర, బచ్చలి కూర వగైరా ఆకూ కూరల్లోనూ; క్యారెట్, పుచ్చ, కర్బుజా, నారింజ, మామిడి, సపోటా, దానిమ్మ లాంటి లోపాములంత రంగున్న పండ్లలోనూ - కెరోటిన్ ఉంది.
 • ఏదైనా ఒక పండును గాని, దుంపనిగాని, కూరగాయని గని, కోసి చూసినపుడు లోపల ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగుల్లో అవి ఉంటే ఆయా పదార్ధాల్లో కెరోటిన్ ఉన్నట్లే!
 • కోడిగ్రుడ్డులోని పసుపు కోణంలోనూ, పాలు, పెరుగు, వెన్న, నెయ్య, జున్న లాంటి పాడి ఉత్పత్తుల్లోనూ, కాలేయం (Liver) లోను విటమిన్ "ఎ" ఉంటుంది.
 • క్రొవ్వు, నూనెల సహాయంతో విటమిన్ - ఎ గ్రహించబడి లివర్ లో నిల్వ ఉంటుంది.
 • చేప నూనె విటమిన్  "ఎ" సారము అని చెప్పుకోవచ్చు.
 • పిండిపదారాధలు జీవక్రాంయాలో విటమిన్ "ఎ" ఆవశ్యకత ఉంటుంది.

బి కాంప్లెక్స్ (B-COMPLEX)

"కాంప్లెక్స్"  అంటే ఒక గుంపు లేదా సమూహము అని అర్ధం "యూనివర్శటీ కాంప్లెక్స్", "బస్టాండ్ కాంప్లేక్స్", "శారీ కాంప్లేక్స్" అనే పదాలు వింటూ ఉంటారు. యూనివర్శిటీ బిల్డింగులన్నింటిని కలిపి చెప్పటం అన్నమాట. విడివిడిగా చెప్పాల్సివసై ఇంగ్లీష్ డిపార్టుమెంటు, అడ్మినిస్ర్టైతిం ఆపీసు, ఆర్ట్స్ డిపార్లమెంటు అని విడదీసి చెప్తం.

అదే విధంగా బి - విటమిన్లన్నింటిని కలిపి "బి కాంప్లెక్స్" (B-Complex) అంటాం. వీటిని విడివిడిగా చెప్పాల్సి వచ్చినప్పుడు -

  విటమిన్ బి - 1 ని "దయామిన్" (Thiamine) అని;
  విటమిన్ బి - 2 ని "రిబోప్లావిన్" (Riboflavine) అని;
  విటమిన్ బి - 6 ని "పైరిడాక్సిన్" (Pyridoxina, Pyridoxine) అని;
  విటమిన్ బి - 12 ని "సైనో కొబలమిన్" (Cyano Cobalamin) అని అంటారు.

ఇవి కాక బి కాంప్లెక్స్ సమూహంలో "బయేటిన్" (Biotin), "నియాసిన్" (Niacin), "పెంటోడేనికి యాసిడ్" (Pantothenic Acid), "పోలిక యాసిడ్" (Folic Acid) మెదలైన విటిమిన్లు కూడా ఉంటాయి.

ఇవి మెత్తంగాని, ఇందులో కొన్న గన్ని లోపిస్తే వచ్చే రోగ లక్షణాలు సముదాయాన్ని "బి కాంప్లెక్స్ లోపం" (B-Complex Deficiency) అని అంటారు.

 • బి-కాంప్లెక్స్ తనంతట తాను బలం ఇచ్చే పదార్ధం కాదు. దీని నిర్దిష్ట పద్దతులలో అవసరాన్ని బట్టి వాడాలి. పౌష్టికాహార లోపం ఉన్నవారికి, గర్భవతులకు ఇది ఉపయెగకరం.
 • బి-కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను శక్తి కండ మారుస్తాయి.

లక్షణాలు (Symptoms)

 • ఈ విటమిన్లు లోపించటం వలన ఆకలి లేకపోవటం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నోట్లో పుండ్లు పడటం, చేతలు తిమ్మరులెక్కటం, అలసట మెదలైన సమస్యలుంటాయి.
 • బి-కాంప్లెక్స్ ని అవసరానికి మించి తీసుకుంటే ముత్తమలో  బయటకు పోతాయి. శరరంలో నిల్వ ఉండలేవు.
 • పప్పుదినుసులన్నింటిలోను, ధాన్యాలు, కూరగరాలు, మొలకెత్తే విత్తనాలు, మాంసం, పండ్లు మెదలైన వాటిలో ఈ విటమిన్లు దొరుకుతాయి.

నంజు (ANFULAR STOMATITIS) \ (APTHUS ULCERS) :

 • విటమిన్ బి లోపించటం వలన "నంజు వ్యాధి" (Angular Stomatitis \ Apthus Ulcers) వస్తుంది.
 • రోజుకి రెండు మీ.గ్రా. రిబోప్లావిన్ శరీరానికి అవసరం. ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ అవసరం మరింత పెరుగుతుంది.

కారణాలు (Causes)

ఆహారంలో విటమిన్ బి లోపించటమే ప్రధాన కారణం.

లక్షణాలు (Symptoms)

తరుచుగా నోటిపూత, నాలుక మీద పూత, "పెదవుల మూలాల దగ్గర తెల్లగా అవటం" (Angular Stomatitis) పెదవులు, నాలుక పగలటం, నోట్లో నంజా గులాలు రావటం (Apthus Ulcers), కళ్ళు మండటం కంటి రెప్పలు గరుకుగా ఉండటం, చర్మం పై పొలుసులు ఏర్పడటం, ముఖ్యంగా ముక్కు, బుగ్గల దగ్గర చర్మం పొట్టిపోయినట్లయిందట, పొట్టు రేగడం, కాళ్ళ చుట్టూ నల్ల మచ్చులేర్పడటం మెదలైన లక్షణాలుంటాయి. అచ్చంగా రిబోప్లావిన్ ఒక్కటే టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది.

విటిమిన్ - సి (Vitamin - C) (Ascorbic Acid)

 • విటమిన్ "సి" ని "ఆస్కార్బిక్ ఆమ్లం" (Ascorbic Acid) అని అంటారు.
 • రోజుకి 30 మీ. గ్రా. ల "సి" విటమిన్ అవసరముంటుంది.
 • శరీరంలో అడ్రినల్ గ్రంధి వెలుపలి భాగంలో విటమిన్ "సి" ఎక్కువ ఉంటుంది.
 • విటమిన్ "సి" ని ముందు అక్కడే గుర్తించారు.
 • విటమిన్ "సి" లోపిస్తే సంబంధ కన్జమ్లంలోని "కొలాజిన్" (Collagen) సరిగా తయారుకాదు.
 • కణానికి, కణానికి మధ్య ఉండే పదార్ధ సరిగ్గా తయారవదు.
 • దంతాల పైన  "డెంటిన్" సరిగ్గా ఏర్పడదు. రక్త కేశ నాలుకలు చిట్లిపోతుంటాయి.
 • ఎముకలతో అస్ధికణాలు లోపభూయిష్టంగా తయారవుతాయి.
 • "రుమటాయిడ్ అర్ఢ్యటిస్" (Rheumatoid Arthritis) అనే కీళ్ళనొప్పుల జబ్బులో విటమిన్ "సి" ఎక్కువగా ఖర్చువుతుంది. షారాలు తగిలిన నశిస్తుంది. నీటిలో తేలిగ్గా కరుగుతుంది.
 • ఇనుము గ్రహించటానికి విటమిన్ - సి అవసరం.

జాగ్రత్తలు (Precautions)

 • సిట్రస్ జాతి పళ్ళలో - చిన్ని, డబ్బా, నారింజ, కమలాలు, నిమ్మ, పాపారా పనస మెదలైన (తొనలు వలుచుకునే) పళ్ళలో "సి" విటమిన్ ఉంటుంది.
  100గ్రాముల ఉసిరిలో 700 మీ.గ్రా.,
  100 గ్రాముల జామలో  300 మీ.గ్రా.,
  100 గ్రాముల మునగాకులో 220 మీ.గ్రా.,
  100 గ్రాముల మునక్కాయలో 120 మీ.గ్రా.,
  100 గ్రాముల నారింజలో 68 మీ.గ్రా.,
  100 గ్రాముల నిమ్మలో 63 మీ.గ్రా.,
  100 గ్రాముల క్యాబేజి లో 124 మీ.గ్రా., చొప్పను "సి" విటమిన్ లోపం ఉన్నవారు ఎక్కువగా ఆ విటమిన్ లభించే పదార్ధాలు తినటం మంచిది.
 • "సి" విటమిన్ ఉన్న పండ్లను, కూరగాయల్ని కాయల రూపంలో ఉన్నప్పుడే కడగటం మంచిది. కోసిన తర్వాత మొక్కల్ని కడాగారం వలన "సి" విటమిన్ నీళ్ళలో కరిగిపోతుంది.
 • "సి" విటమిన్ ఉన్న పదార్ధాల్ని వీలయినంత వరకు వేడిచేయకుండా ఉపయెగించాలి.

విటమిన్ - డి (Vitamin - D)

 • విటమిన్ "డి" క్రొవ్వు పదార్ధాలలో కరిగే విటమిన్. తల్లి పాలలో "డి" విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.
 • కాల్షియమ్, పసుపేతుల శోషణకి విటమిన్ సాయపడ్తుది.
 • విటమిన్ "డి", ప్రేవుల నుండి కాల్షియంను గ్రహించి ఎముకలకు అందజేస్తుంది.
 • చర్మానికి సూర్యరశ్మి సోకినప్పుడు సూర్మనీలోని అతినీలలోహిత కిరణాల (Ultra Violet Rays) వల్ల చర్మంలోని "డి" విటమిన్ తయారవుతుంది.
 • పాలు, వెన్న, నెయ్య్, మజ్జిగ, గ్రుడ్డులోని తెల్ల సోనా, కేలేయం ఇతర రకాలైన క్రొవ్వులు గల జంతు సంభందమైన పదార్ధాలలోను విటమిన్ "డి" ఉంటుంది. లోపం ఉన్న సందర్భాల్లో ఆయా పదార్ధాలు పెంచి వాడాలి.
 • పిల్లలెక్కువగా ఇష్టపడే కృత్రిమ ఆహార పదార్ధాల ద్వారా, హెల్తూ డ్రీమ్కుల ద్వారా, పిల్లలకు రాసె మందుల ద్వారా విటమిన్ - డి, క్యాల్షియం ఎక్కువగా చేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లలకు ఎక్కువ పరిమాణంలో ఇది తీవ్రమైన హాని చేస్తుంది.
 • దీనికి మూత్రంలో కలిసే గుణం లేదు. కనుక బయటికి పోయే అవకాశం కూడా లేదు. ఎక్కువైతే "హైపర్ విటమినోసిస్-డి"  (Hyper Vitaminosis) అనే జబ్బు వస్తుంది. కునుకు ఎడాపెడా వాడరాదు.

ఖనిజ లవణాలు (Minerals)

మానవ శరీరంలో అనేక రకాల ఖనిజ లవణాలున్నాయి. కొన్న ఎక్కువ మేతదులో, కొన్ని ఎక్కువ మేతదులో, కొన్ని తక్కువ మేతదులో శరీరానికి వీటి అవసరం ఉంది.

సోడియం క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్, మేదనిషియం, సల్పారు, ఇనుము, రాగి, కోబాల్ట్, అయిడిన్,ప్లోరిన్, జింక (తుత్తునాగము), క్లోరిన్, నికెల్, క్రోమియం, కాడ్మియం, సెలీనియం, సిలికాన్, వెనెడియమ్, మాలిబ్డినం, స్ర్టాన్షియం, లిషియమ్, మాంగనీసు, మెదలైనమెన్నో మన శరీరంలో ఉన్నాయి.

 • వీటన్నింటిలో అయిదారు ఖ్నిజాలు లోపించనప్పుడు మాత్రమే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.
 • శరీర పెరుగుసలాకు, శరీరంలోని జీర్ణక్రయ్యకు సంభందించిన కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరగటానికి, శరీరంలో అనేక రసాయానికి చర్యలకు, పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, వినియెగపడటానికి - శరీరంలో కొద్దీ మొత్తాలలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ట్రేస్ ఎలిమెంట్లు ఉంటాయి.
 • ఖనిజ లవణాలు నీటిలో కరిగిపోయి, వివిధ అవయవాలకు నీటి ద్వారా / రక్తం ద్వారా చేరి కణజాలాలు (Tissues) పైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో కొంత భాగం శోషణ కార్యక్రమం తర్వాత విసర్జించబడతాయి.
 • ఒక రకమైన అజరంలో ఒకే రకమైన పోషక విలువలు మాత్రమే ఉండవు. ఒకే పదార్థంలో కొన్న రకాల పోషకాలు కలిపి ఉంటాయి.
 • కేవలం - క్యాల్షియం, కేవలం ఇనుము. ఇలా మనకు కావలసిన ఆ ఒక్క ఖనిజ లవణం మాత్రమే ఉండే పదార్ధాలు దేనికి దానికి విడివిడిగా లభించవు.
 • పండిన పండ్లలో, ఆకుకూరల్లో పాలల్లో. ఇలా అనేక పదర్ధాలలో విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు కూడా కలిసి ఉంటాయి.

ఆధారం : ఆరోగ్య వ్యాయమ విద్య

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు