“ఉప్పు... పప్పు... పాలు... పిండి... కాదేది కల్తీకి అనర్హం” అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తుండడం… వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవు ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామ మాత్రపు సొమ్ము నైనా కల్లీల నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరకులపై న్యాయ స్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా... ఆధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూరూమంత్రమే ఆపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదా రులు కూడా కర్తీ ఆహార వస్తువులేవో, అసలువేవో తెలుసుకోవడం అవసరం. ఇందుకు 'భారతీయ ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ’ కొన్ని చిట్కాలను సూచిస్తోంది. త్వరగా కల్లీలను గుర్తించే పరీక్ష (డీ.ఏ.ఆర్.టి) పేరున వీటిని కరదీపికలో పొందుపరిచింది.
ఆహార ధాన్యాల్లో రంగులు
పారదర్శక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోవాలి.
రెండు చెంచాల ఆహార ధాన్యాలను ఆందులో బాగా కలపాలి.
స్వచ్ఛమైన ఆహార ధాన్యాలు ఎలాంటి రంగును విడుదల చేయవు.
రంగు కలిపిన ధాన్యాలైతే వెంటనే ఆయా రంగులు నీళ్లలో కనిపిస్తాయి.
చక్కెరలో సుద్ద
పారదర్శక గాజుగ్లాసు లోకి మంచి నీరు తీసుకోవాలి.
ఆందులో పది గ్రాముల చక్కెర కలపండి.
ఆడుగు భాగంలో సుద్ద పేరుకుంటే ఆది కల్తీదే.
గోధుమ పిండిలో ఊక
పారదర్శక గాజుగ్లాసు లోకి మంచి నీరు తీసుకోవాలి.
దానిలో ఒక చెంచా గోధుమ పిండిని చల్లండి.
స్వచ్ఛమైన గోధుమ పిండి నీటిలో కలిసిపోతుంది.
కల్తీ పిండి నీటిలో కలిపినా, ఉర మాత్రం పైబాగంలో తేలుతుంది.
పాలల్లో నీళ్లు
నున్నగా, ఏటవాలుగా ఉన్న ఏదైనా వస్తువు ఉపరితలంపై పాల చుక్కను వేయండి.
స్వచ్ఛమైన పాలైతే అది నిలిచి ఉంటుంది. లేదా నెమ్మదిగా కిందికి జారుతుంది. ఆ క్రమంలో లెల్లటి మరళ ఏర్పడుతుంది.
నీళ్లు కలిపిన పాలైతే వెంటనే జారిపోతుంది. మరక ఏర్పడదు. గట్టిగా ఊపండి.
పాలల్లో సబ్బు
ఒక సీసాలో 5 – 10 మి.లీ. పాలల్లో అంతే నీటిని జోడించి, గట్టిగా ఉపండి.
సబ్బు కలిపిన పాలపై దట్టమైన నురుగు వస్తుంది. స్వచ్ఛమైన పాలపై సన్నని పొర ఏర్పడుతుంది.
పాల ఉత్పత్తుల్లో పిండి పదార్థాలు
2 - 3 మి.లీ. పాల ఉత్పత్తులను, 5 మి.లీ. నీళ్లు కలిపి మరగబెట్టాలి.
చల్లార్చి ఇంజులో 2 - 3 చుక్కల లేత రంగు అయోడిన్ చేయాలి.
సీలి రంగులోకి మారితే పిండి పదార్ధాలు కలిపినట్లే.
పాలనైతే... నీరు కలపకుండా, మరగ బెట్టకుండానే ఈ విధానంలో పరీక్షించోచ్చు.
కారంలో రంగులు
పారదర్శక గాజగ్లాసు లో సీటిని తీసుకుని, దానిపై మిరప పిండిని చల్లాలి.
కల్తీ కారమైతే... కృత్రిమ రంగు చారికలు జారుతూ కనిపిస్తాయి.
కారంలో చెక్కపొట్టు
పారదర్శక గాజుగ్లాసు లో కారం పొడిని కలపాలి.
స్వచ్ఛమైన కారం పొడి నీటి ఆడుగు భాగానికి చేరుతుంది. చెక్క పొట్టు పైభాగంలో తేలియాడుతుంది.
తేనెలో చక్కెర
పారదర్శకంగా ఉండే గాజుగ్లాసు లో మంచి నీటిని తీసుకోవాలి.
ఇందులో ఒక చుక్క తేనెను వేయాలి.
స్వచ్చమైన తేనే నీటిలో కరిగిపోదు.
ఒకవేళ తేనె సీటిలో అదృశ్యమైతే, అందులో చక్కెర కలిసినట్లే.
మరో పరీక్ష ద్వారా కూడా తేనె నాణ్యతను తెలుసుకోవచ్చు పత్తితో చేసిన వత్తిని స్వచ్ఛమైన తేనెలో మంచి వెలిగిస్తే వెలుగుతుంది. ఒకవేళ కల్తీ తేనె అయితే... నీళ్లు కలిపితే అంటుకోదు. అంటించడానికి ప్రయత్నిస్తే చిటపటలాడుతుంది.