హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / కాజు నూనెతో గుండెకు హాయి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాజు నూనెతో గుండెకు హాయి

పంటికింద మెత్తగా నలుగుతూ, గమ్మత్తయిన రుచితో మైమరపిస్తూ.. తింటున్నంతసేపు కమ్మగా అనిపించే జీడిపప్పు మాధుర్యమే వేరయా! ఇక, వంటనూనెల్లో క్యాష్యు నట్‌ ఆయిల్‌గా పిలుచుకునే ఈ నూనెతో ఎన్నో ప్రయోజనాలు.

పంటికింద మెత్తగా నలుగుతూ, గమ్మత్తయిన రుచితో మైమరపిస్తూ.. తింటున్నంతసేపు కమ్మగా అనిపించే జీడిపప్పు మాధుర్యమే వేరయా! ఇక, వంటనూనెల్లో క్యాష్యు నట్‌ ఆయిల్‌గా పిలుచుకునే ఈ నూనెతో ఎన్నో ప్రయోజనాలు.


జీడిపప్పును కోల్డ్‌ ప్రెస్‌ మెథడ్‌తో నూనెను వేరు చేస్తారు. క్యాష్యు ఆయిల్‌ను ఔషధాలు, ఆహారపదార్థాల తయారీకి ఎక్కువగా వాడతారు. ఈ మధ్య కాలంలో సౌందర్య ఉత్పత్తుల్లోను విరివిగా ఉపయోగిస్తున్నారు.


క్యాష్యు ఆయిల్‌ పోషకవిలువల గని. విటమిన్లు, ఖనిజాలు అధికం. క్యాలరీలు కూడా ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇన్‌స్టంట్‌ ఎనర్జీ దీని సొంతం. మంచి కొవ్వును ఉత్పత్తి చేసే గుణమూ ఈ నూనెకు ఉంది.
మిగిలిన నూనెలతో పాటు కాజు నూనెను అప్పుడప్పుడు వంటల్లో వాడుకోవచ్చు. వంటల రుచి రెట్టింపు అవుతుంది. దాంతోపాటు శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, కాల్షియం సమకూరతాయి. తద్వార పళ్లు, ఎముకలు ధృడంగా మారతాయి.


చర్మానికి అవసరమైన మిలనిన్‌ అనే పదార్థం లోపిస్తే నల్లపొడలు వచ్చే అవకాశం ఉంది. జుట్టు కూడా రాలుతుంది. ఈ లోపాన్ని సరిచేసే గుణం కాజు నూనెకు ఉంది. తరచూ దీన్ని తీసుకునే వాళ్లలో ఇటువంటి సమస్యలు రావన్నది అధ్యయనాల సారాంశం.


కొందరు మహిళలకు మెనోపాజ్‌ సమయంలో సరిగా నిద్రపట్టదు. ఇదే సమస్య దీర్ఘకాలంగా వేధిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. క్యాష్యు ఆయిల్‌ వాడితే సుఖనిద్ర పడుతుంది.
క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకర వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కీలకపాత్ర పోషిస్తుందీ ఆయిల్‌. దీంతోపాటు శరీరం చిన్నాచితక జబ్బులకు గురికాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కూడా. యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ ఇ సైతం ఈ ఆయిల్‌ ద్వారా లభిస్తాయి.

మోనోశాచురేటెడ్‌ యాసిడ్స్‌ గుండెజబ్బుల్ని దరి చేరనీయవు. ఎల్‌డిఎల్‌ కొలెసా్ట్రల్‌ స్థాయిని తగ్గించే ఔషధ లక్షణాలు క్యాష్యు ఆయిల్‌లో పుష్కలం.


క్యాష్యు ఆయిల్‌ను ఎక్కువమంది బరువు తగ్గడానికి, చురుకైన కంటిచూపునకు, మెదడు ఆరోగ్యానికి వాడుతున్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.99285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు