కౌమార దశలో సాధారణంగా వచ్చే పౌష్టిక లోపవ్యాధి రక్త హీనత. దీనిని హీమోగ్లోబిను తక్కువగా ఉండడాన్ని బట్టి గుర్తిస్తారు. మన శరీరానికి ఇనుము అత్యంత అవసరమైన ధాతువు. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తయారికి ఇనుము వినియోగమవుతుంది. హిమోగ్లోబిన్ మనం పీల్చే గాలిలోని ప్రాణవాయువును ఉపిరి తిత్తుల నుండి శరీరం లోకి ప్రతి కణానికి చేర వేస్తుంది. శరీరం లోని ఏ భాగం పని చేయాలన్నా ఆక్సిజన్ చాల అవసరం .
పురుషులకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 14.4-16.5 గ్రాముల శాతం.
స్త్రీలకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 12.5-14.5 గ్రాముల శాతం
రక్త హీనతకు కారణాలు
పౌష్టికాహార లోపం
కొంకి పురుగులు జీర్ణ వ్యవస్థలో వుండడం
దీర్ఘకాలిక విరేచనాల వలన ఆహారంలోని పౌష్టికాలు సరిగ్గా శరీరంలో చేరకపోవడం .
తరచుగా మలేరియా రావటం వలన ఎర్రరక్త కణాలు విచ్చిన్నమవడం .
కౌమార బాలికలు నాజుకుగా, సన్నగా ఉండటం ఫాషన్ గా భావిస్తూ లావైపోతానేమో అనే భయంతో సరిపడా తినకపోవడం.
రుతు స్రావం ఎక్కువగా అవడం .
రక్త హీనత లక్షణాలు
మందగొడిగా ఉండడం.
పాలిపోయి ఉండడం.
త్వరగా నీరసపడి,అలసిపోవడం.
దేనిమీదా శ్రద్ధ, ఆసక్తి లేకపోవడం.
కొద్ది శ్రమకే ఉపిరి అందనట్లవడం.
గుండె వేగంగా కొట్టుకోవడం.
చికాకుగా ఉండడం.
మానసిక అస్థిరత.
ఎప్పుడూ నిద్రపోవడం.
ఆకలి మందగించడం.
తలపోటు.
ఏ పని చెయ్యలేకపోవడం.
కళ్ళు, నోరు, నాలుక పాలిపోయి ఉండడం.
గోళ్ళు పాలిపోవడం, సొట్టలు పడడం.
తీవ్ర రక్త హీనత లక్షణాలు
ఆయాసం.
అలసట.
జుట్టు రాలిపోవడం.
కాళ్ళు, చేతులు, ముఖం వాయడం.
పై లక్షణాలతో పాటు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని రక్త పరీక్ష ద్వా రా తెలుసుకొని రక్త హీనత ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేయవచ్చు .
రక్త హీనతను నివారించటం
సమతుల ఆహారం తినాలి.
ఇనుము ఎక్కువగా ఉన్న మునగ కాయలు , చిలగడ దుంప, గుమ్మడి, బెల్లం, లివరు, మాసం, గుడ్డు, ఖర్జూరం, బొప్పాయి, తృణ ధాన్యాలు, మాంస కృత్తులు ఎక్కువగా ఉండే పప్పులు మొదలైన వాటిని తినాలి.
పరిశుభ్రత పాటించాలి, మల విసర్జన తరువాత, ప్రతిసారి ఆహారాన్ని తినే ముందు సబ్బు తోను, నీటి తోనూ చేతులని కడుక్కుంటే జీర్ణ వ్యవస్థలో కొంకి పురుగులు చేరవు.
ముఖ్యంగా ఇంట్లో మరుగు దొడ్డి సౌకర్యం లేక బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయవలసిన పరిస్థితి వున్నపుడు కొంకి పురుగులు పాదాలకు అంటుకుని జీర్ణ వ్యవస్థ లోకి చేరతాయి. తప్పకుండా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు గోళ్ళను కత్తిరించుకోవడం ద్వార గోళ్ళ క్రింద మట్టి, కొంకి పురుగుల గ్రుడ్లు చేరి ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లడాన్ని నివారించవచ్చు.
ఆధారం:
డాక్టర్. టి.సుప్రజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం కుమారి నస్రీన్, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2009/038.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి