హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / శరీర బరువు నియంత్రణలో లోపాలవల్ల పోషకాహార వ్యాధులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

శరీర బరువు నియంత్రణలో లోపాలవల్ల పోషకాహార వ్యాధులు

కిశోర వయస్సులో ఉన్న బాలికలు శరీర బరువు నియంత్రణలో అనేక పోషక వ్యాధులతో బాధపడడం

మొదటి అపరాధం.
కొందరు అమ్మాయిలు తమ శరీరం లో అధిక క్రొవ్వులు ఉన్నట్లుగా తప్పు అంచనాలు వేసుకుని, తమ శరీర సౌష్టవం అందంగా వుండడానికి ఉన్న శరీరాకృతిని సవరించుకోవడానికి నియమాలతో భోజనాన్ని మానెయ్యడం లేదా తగ్గించడం చేస్తుంటారు. తిన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా విరోచనాలు కలిగించే మందులను వాడి బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. దీనినే అనేరోక్సియా నేర్వోసా అంటారు.
రెండవ అపరాధం
తాము చాలా బరువెక్కుతున్నట్లుగా భావించుకుంటారు. అధిక ఆకలి వలన తీసుకున్న ఆహారాన్ని వాంతి చేసుకోవడం లేదా విరోచనం చేసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవాలని చేస్తుంటారు. దీనిని బులీమియా నెర్వోసా అంటాం.

ఇందువలన శరీర సహజ పోషకాహార స్థితి దెబ్బతిని వివిధ రకాల పోషణ లోపాలు ప్రారంభమౌతాయి. అందులో ముఖ్యమైనవి,

1. రక్త హీనత 2. ఎముక బోలుతనం 3. విటమినుల లోపాలు

లక్షణాలు

 1. మోచేతులపై చర్మం గజ్జి గా ఉండడం .
 2. దంత సమస్యలు
 3. నీరసం
 4. ఋతుచక్రం క్రమం తప్పడం.
 5. తక్కువగా తినడం , తిన్నవెంటనే వ్యాయామం చేయటం .
 6. కౌమార దశ త్వరగా పూర్తి కావడం.
 7. శరీర బరువు ఉండవలసిన బరువు కంటే చాల తక్కువగా ఉండటం.
 8. తమకుతాముఅధికబరువు , ఊబకాయస్తులుగా ఊహించుకోవడం
 9. అసాధారణం గా బరువు తగ్గడం.
 10. శరీర బరువును గురించి ఎక్కువగా ఆలోచించడం .
 11. ఆత్మనూన్యతా భావం .
 12. కాళ్ళు చేతులు సన్నగా పుల్లల్లాగా ఉండటం.
 13. తల వెంట్రుకలు ఎరుపు రంగులో ఉండటం, చేతులు, కాళ్ళు మరియు గడ్డంపై సన్నని పల్చని ఎరుపు రంగు వెంట్రుకలు ఉండటం.
 14. త్వరగా అలసిపోవడం.
 15. ఉద్వేగాలు మారుతూ ఉండడం.

ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న కిశోర బాలికలకు వైద్యపరమైన ,ఆహారపరమైన సూచనలివ్వడమే మంచి చికిత్స. పై లోపాలను గుర్తించిన వెంటనే నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.

ఇతర సమస్యలు

అధికంగా తినటం ఆకలిగా లేక పొయినప్పటికీ అధికంగా ఆహారాన్ని భుజించడం, అందువలన ఉత్పన్నమయ్యే అధికబరువు (లేదా) ఊబకాయాన్ని తగ్గించుటానికి అధికంగా వ్యాయామం చేయడం వంటివి చేస్తారు. దీనివలన మధుమేహం, రక్తపోటు, ఎముకలు గుల్లబారటం మొదలైన ప్రధాన సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఎముకలు గుల్లబారుట అతిగా వ్యాయామము చేయటము ,అధికమైన పిచు పదార్థాలు ,అతి తక్కువ నూనెలు మరియు పాలు తీసుకోవటం. వలన శరీరం లోని ఈ స్ట్రోజెను హార్మోను తక్కువ అవుతుంది. దీనివలన, అసంబద్దమైన ఋతు చక్రం కలుగుతుంది, ఎముకలలోని కాల్షియం తగ్గి గుల్లబారుతాయి.

ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం

బహిష్టుమొదలయ్యే 6-7 రోజుల ముందు శరీరబరువుపెరుగుట, కడుపు ఉబ్బరంగా ఉండటం, రొమ్ములోనొప్పి, మలబద్దకం, కాళ్ళు, చేతులువాపు,తలనొప్పి,చిరాకు, ఆత్మానూన్యతాభావం, అలసట, ఏకాగ్రతలోపం, అతిగాఆకలి, తీపి (లేదా) ఉప్పుతోకూడిన ఆహారము పట్ల మక్కువ మొదలగులక్షణాలు కల్గిఉండడం.

ఆధారం:

డాక్టర్. టి.సుప్రజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం
కుమారి నస్రీన్, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2009/038.

3.01652892562
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు