వ్యక్తిగత మరియు గృహ పరిశుభ్రత
మంచి పరిశుభ్రత మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని వ్యాధులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.
- సోప్ (లేదా బూడిద) మరియు పరిశుభ్రమైన నీటితో చేతులను కడగడం మరియు మీ పిల్లలను సరిగ్గా చేతులు కడగడం నేర్పండి
- తినడానికి ముందు
- మరుగు దొడ్డి ఉపయోగించి న తర్వాత మరియు పిల్లల దిగువన శుభ్రమంగా కడగిన తర్వాత
- జంతువులు నిర్వహణ తరువాత
- ఎల్లప్పుడూ మరుగు దొడ్డిని ఉపయోగించండి మరియు మీ పిల్లలకు మరుగు దొడ్డిని ఉపయోగించడం బోధించండి.
- ఎల్లప్పుడూ గొయ్యి లోనే చెత్త పారవేయాలి మరియు అది ఎప్పుడు కప్పి ఉంచండి
- మీ గోర్లు చిన్నవిగా ఉంచుకోవాలి
- కోళ్ళు మరియు జంతువులను ఇంటి నుండి దూరంగా ఉంచండి.
ఆహారాన్ని సురక్షితంగా మరియు శుభ్రంగా ఉంచడం
మురికైన ఆహారాలు మరియు పానీయాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి
- శుభ్రమైన మరియు సురక్షిత నీటిని ఉపయోగించండి
- త్రాగే నీరు మరియు వండని ఆహారాలు కడగడానికి నీరు సురక్షితమైన ప్రదేశము నుండి పొందండి.
- సేకరించిన నీటిని మరియు నిల్వ చేయడానికి శుభ్రంమైన, కప్పబడిన కంటైనర్లను ఉపయోగించండి
- నీరు త్రాగే ముందు కాచుకోవాలి
- సురక్షితంగా ఆహారాన్ని నిల్వ చేయండి
- కీటకాలు, తెగుళ్లు, ధూళి నుండి కాపాడటానికి ఆహార పదార్థాలను ఎప్పుడు కప్పి ఉంచాలి
- ఎల్లప్పుడూ తాజా ఆహారన్ని వండండి
- పొడి పదార్ధాల వంటి ధాన్యాలు మరియు చిక్కుళ్ళు పొడి, చల్లని ప్రదేశంలో ఉంచండి, అవి కీటకాలు, ఎలుకలు మరియు ఇతర తెగుళ్ళ నుండి రక్షించేటుగా భద్రపరచండి.
- మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కువ సేపు నిల్వ చేయవద్దు
- ఎల్లప్పుడూ వాటిని ఆవిరి వచ్చే వరకు పూర్తిగా వేడి చేయాలి (ద్రవ ఆహారాన్ని పొంగు వచ్చే వరకు కాచుకోండి)
- శుభ్రమైన మరియు సురక్షితమైన మార్గం లో ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి
- శుభ్రమైన నీటితో కూరగాయలు మరియు పండ్లు కడగాలి
- సాధ్యమైనప్పుడు వాటిని పై తొక్క తీయండి
- ఎల్లప్పుడూ ఆహారాన్ని తాకే ముందు చేతులు కడుక్కోవాలి
- ఆహారాన్ని తయారుచేయటానికి ముందు చేతుల్లో ఏదైనా గాయాలు ఉంటె వాటిని కప్పిఉంచాలి.
- ఎల్లప్పుడూ వంటగది శుభ్రంగా ఉంచండి
- ఆహారాన్నిసేవించటానికి మరియు తినడానికి శుభ్రమైన, జాగ్రత్తగా కడిగిన వంటకాలు మరియు పాత్రలకు ఉపయోగించండి
- ఎల్లప్పుడూ తాజా పాలని ఉపయోగించే ముందు కాచుకోవాలి. పుల్లనైన మరియు పులియబెట్టిన పాలు తాజా పాల కంటే సురక్షితమైనవి
- గుడ్లు తినే ముందు ఉడికుంచుకోవాలి.
- ముడి లేదా చీలిన గుడ్లు తినకూడదు, ఎందుకంటే అవి ప్రమాదకరమైన క్రిములు కలిగి ఉండవచ్చు (సాల్మోనెల్లా అనే) ఇది ఆహారాన్ని విషంగా మారుస్తుంది.
- రసాయనాలు మరియు పురుగుమందులను ఒక సురక్షితమైన స్థలంలో నిల్వ చేయండి
- రసాయనాలు మరియు పురుగుమందులు పిల్లల నుండి దూరంగా నిల్వ చేయాలి
- రసాయనాలకు ఉపయోగించే ఖాళీ పాత్రలలో ఆహారాన్ని లేదా నీటిని ఎప్పుడూ ఉంచవద్దు
- రసాయనాలను ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోండి
ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది
- ఆహారం పని చేయడానికి శక్తిని అందిస్తాయి
- ఆహారం పేరుగుదలకు చాలా అవసరం
- ఆహారం శరీరాన్ని అనారోగ్యనికి వ్యతిరేకంగా రక్షిస్తుంది (ఆరోగ్యంగా ఉంచుతుంది)
- ధాన్యాలు మరియు పిండి పదార్ధాలు ప్రధానంగా శక్తిని అందిస్తాయి
- ధాన్యాలు కూడా శరీర పెరుగుదలకు మరియు మరమ్మత్తుకు సహాయ పడతాయి
- చిక్కుళ్లు ప్రధానంగా పెరుగుదలకు మరియు మరమ్మత్తుకు సహాయపడతాయి
- కూరగాయలు మరియు పండ్లు ప్రధానంగా అనారోగ్యంకు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తాయి
- జంతు ఉత్పత్తులు ప్రధానంగా పెరుగుదలకు మరియు మరమ్మత్తుకు సహాయపడతాయి
- ఇవి శక్తి అందించడానికి మరియు అనారోగ్యంకు వ్యతిరేకంగా రక్షించడానికి కొవ్వు, నునెలు,చక్కెర మరియు చక్కెర పదార్థాలు ప్రధానంగా శక్తిని అందిస్తాయి
- ప్రతి రోజు వివిధ రకాల ఆహారాలను తినండి
- ప్రతి రోజు, మరిగించిన నీరు పుష్కలంగా త్రాగండి (ఉదా. ఒక రోజు 8 కప్పులు)
ఇనుము శరీరాన్ని బలంగా చేస్తుంది
శరీరాన్ని బలంగా ఉంచుటానికి మరియు పిల్లలు నేర్చుకోవడానికి ఇనుము సహాయపడుతుంది
ఇనుము క్రింది వాటిలో దొరుకుతుంది:
కొన్ని జంతు ఆహారాలయిన కాలేయం, రక్తం, ఇతర జంతువుల మాంసం, పక్షులు మరియు చేపలు, ముఖ్యంగా ఎరుపు మాంసం మరియు గుడ్లు
తృణధాన్యాలు (ఉదా: మొక్కజొన్న, మిల్లెట్, జొన్న, గోధుమ), చిక్కుళ్ళు (ఉదా. బీన్స్, బటానీలు, కాయధాన్యాలు), ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు (ఉదాహరణకు పాలకూర, బచ్చల కూర, గుమ్మడి ఆకులు, ఒక రకమైన క్యాబేజి)
బాలికలు మరియు అమ్మాయిలు పురుషుల కంటే ఇనుము అధికంగా కలిగిన ఆహారాన్ని తిసుకోవాలి ఎందుకంటే ఋతుస్రావం సమయంలో మహిళలు అధిక ఇనుము కోల్పోతారు
గర్భధారణ సమయంలో, గర్భిణీ స్త్రీలు తరచుగా ఇనుము మాత్రలు తీసుకోవాలని సలహా ఇస్తారు
6 నెలల లోపు పిల్లల కోసం తల్లి పాలే ఇనుము యొక్క ఉత్తమమైన మూలం
విటమిన్ ఎ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
శరీరానికి విటమిన్ ఎ అవసరం ఎందుకంటే:
- ఇది పెరుగుదలకు మరియు అనారోగ్యాలు వ్యతిరేకంగా రక్షిస్తుంది
- 6 నెలల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విటమిన్ ఎ యొక్క ఉత్తమ మూలం తల్లి రొమ్ము పాలు, తల్లికి తగినంత విటమిన్ A ఉంటే వివిధ రకాల జంతు ఆహారాలలో లభించే విటమిన్ ఎ విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న జంతు ఆహారాలు:
- గుడ్లు మరియు పాలు
- వెన్న మరియు జున్ను
- మొత్తం ఎండిన చేప (కాలేయంతో సహా) మొక్కల ఆహారంలో కూడా విటమిన్ ఎ లభిస్తుంది విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న మొక్కల ఆహారాలు
- నారింజ మరియు పసుపు కూరగాయలు (ఉదాహరణకు క్యారెట్లు, గుమ్మడికాయ, నారింజ మరియు పసుపు తియ్యటి బంగాళాదుంపలు)
- ఆకుపచ్చ ఆకు కూరలు (ఉదాహరణకు పాలకూర, బచ్చలకూర)
- నారింజ మరియు పసుపు పండ్లు
అయోడిన్ శరీర పనితీరును సక్రమంగా చేస్తుంది
శారీరక పెరుగుదల మరియు మెదడు అభివృద్ధికి అయోడిన్ ముఖ్యమైనది
- ఎల్లప్పుడూ వంట కోసం అయోడైజ్డ్ ఉప్పునే కొనండి మరియు వాడండి
- అయోడైజ్డ్ ఉప్పు చాలా ఎక్కువగా ఉడికించవద్దు, అది అయోడిన్ను నాశనం చేస్తుంది దీనిని దాదాపు వంట చివరిదశలోనే జోడించండి.
హెచ్చరిక! ఎక్కువ ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు
గర్భిణీ స్త్రీలకు మరియు తల్లిపాలిచ్చే తల్లులకు ఆహారం
గర్భిణీ స్త్రీలకు మరియు పిండం పెరుగుదల కోసం అదనపు మరియు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం
పాలిచ్చె తల్లులకు మరియు శిశువు కోసం అదనపు మరియు ఆరోగ్యకరమైన ఆహారం కావాలి అందువలన:
- గర్భిణి మరియు పాలిచ్చె తల్లులు ఆరోగ్యకరమైన మరియు సమతుల్య భోజనాన్ని తినాలి
- రిమైండర్! మీరు గర్భవతిగా ఉన్నప్పుడు టటానాస్కు వ్యతిరేకంగా రోగనిరోధకం చేసే, ఇనుము మాత్రలను పొందండం మర్చిపోకండి.
హెచ్చరిక! గర్భం మరియు పాలిచ్చె సమయంలో పొగ త్రాగవద్దు మరియు మద్యపానీయాలను తీసుకోవద్దు.
0-6 నెలల వయస్సున్న పిల్లల పోషణ
మొట్టమొదటి ఆరునెలల్లో శిశువు కు తల్లి పాలు మాత్రమె పట్టించండి
- మొట్టమొదటి 6 నెలలలో తల్లి రొమ్ము పాలు మాత్రమే మీ శిశువుకు పట్టించండి
- పుట్టిన తర్వాత వెంటనే శిశువుని మీ రొమ్ముకు తాకి ఉంచండి
- మీ శిశువుకు ముర్రుపాలు (స్తన్యము) ఇవ్వండి
- ఏదైనా ఇతర నీరు లేదా ఆహారం మొదటి 6 నెలల్లో ఇవ్వకండి, అది మీ శిశువును జబ్బుపరుస్తుంది (ఉదా. అతిసారం)
- మీ శిశువు ఏ సమయంలోనైనా అతను / ఆమె కావాలనుకున్నప్పుడే పాలు పట్టించండి.
ఆరు నెలల పై వయస్సున్న పిల్లల పోషణ
6 నెలలున్న శిశువుకు తల్లి పాలు మరియు ఇతర ఆహారాలు అవసరం
ఆరు నెలల వరకు, శిశువుకు తల్లి పాలు మాత్రమే పట్టించాలి.6 నెలల తర్వాత, తల్లి పాలతో పాటు, బిడ్డకు ఇతర ఆహారాలు అవసరం
6 నెలల నుండి కనీసం 3 సంవత్సరాల వరకు:
- బిడ్డకు తల్లి పాలను కొనసాగించండి
- 6 నెలల కన్నాపై పిల్లల కోసం సంపూరక ఆహారాలు మరియు నీటితో కలిపి అనేక రకాల ఆహారాలను తినిపించాలి
- సూపర్ ఫ్లోర్ 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు తినడం కోసం సిఫార్సు చేయబడింది
- సూపర్ ఫ్లోర్ సిద్ధం చేయడం ఎలా?
- దశ 1: రెండు భాగాల ధాన్యాలు మరియు ఒక భాగం చిక్కుళ్ళు(సోయాబీన్)
- దశ 2: ప్రత్యేకంగా వేయించండి
- దశ 3: విడిగా వాటిని గ్రైండ్ చేయండి
- దశ 4: పిండి కలపండి
- దశ 5: ఒక మూసి ఉంచిన పాత్రలో ఉంచండి
- రొట్టెతో పాటు, పిల్లలకు వివిధ రకాల ఆహారాలను ఇవ్వండి
బడి-వయస్సు పిల్లలు మరియు యువత పోషణ
పాఠశాల వయస్సు పిల్లలు మరియు యువత ఆరోగ్యకరమైన మరియు సమతుల్య భోజనం తినడం అవసరం
- మీ బిడ్డకు రోజుకు మూడు పుటల భోజనం ఇవ్వండి మరియు మధ్యలో చిరు తిళ్ళు తినిపించండి
- కౌమార బాలికలు మరింత ఇనుము అధికంగా ఉండే ఆహారాలు ఇవ్వాలి.
- ఋతుస్రావం ప్రారంభమైనప్పట్టి నుండి పురుషుల కంటే ఆడవారికి ఆధిక ఇనుము అవసరం
- అమ్మాయిలు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఇవ్వండి
గుర్తుంచుకో: ప్రతి ఆరు నెలలో, పాఠశాల వయస్సు పిల్లలకు నులిమాత్రలు ఇవ్వాలి హెచ్చరిక! అనేక జిగురు, చక్కెర మరియు లవణం గల చిరు తిళ్ళు (తీపి, చాక్లెట్లు, క్యాండీలు, సోడాలు, లాల్లిస్, క్రిస్ప్స్ వంటివి) పిలల్లకు మంచిది కాదు
వృద్ధుల ఆహారం మరియు సంరక్షణ
వ్రుద్దులకు తక్కువ ఆహారం అవసరం కానీ వారికి నాణ్యమైన ఆహారం అందిచాంలి
చురుకుగా మరియు ఆరోగ్యకరముగా ఉండడానికి, వ్రుద్దులు సమతుల్య ఆహారం తీసుకోవాలి
- చిన్న మెతాదు గల భోజనం రోజు 2-3 సార్లు తీసుకోవాలి, మరియు భోజనం మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్ళూ తీసుకోవాలి
- సరియైన నిష్పత్తిలో వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలి
- శుద్దమైన నీరు పుష్కలంగా త్రాగాలి
- దంతాలు లేకపోయిన లేదా చిగుళ్ళు పగిలి ఉన్నా మృదువైన ఆహార పదార్ధాలు తీసుకోవాలి
- అనారోగ్యం నివారించడానికి పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చెసుకోండి (ఉదా. అతిసారం)
- వ్రుద్దులు చురుకుగా ఉండాలి
అనారోగ్య ప్రజల పోషణ
ఒక అనారోగ్య వ్యక్తి అనారోగ్యం నుండి కోలుకోవడం కోసం బాగా తినడం అవసరం
తరచుగా వివిధ రకాల ఆహారాన్ని చిన్న మోతాదులో తీసుకోండి
ప్రతీ 1-2 గంటలకు (రోజుకు కనీసం 8 కప్పులు) చొప్పున త్రాగడానికి పుష్కలంగా అందించండి, ఉదా. ఉడికించిన నీరు, తాజా పండ్ల రసం, కూరగాయలతో చేసే చారు/సూప్ లేదా గంజి నీరు
అతిసారం లేదా వాంతులు ఉన్న వ్యక్తులు తరచుగా అదనపు ద్రవాలను తీసుకోవడం అవసరం
పిల్లల అనారోగ్యంగా ఉంటే:
- తల్లిపాలు ఆపకూడదు
- అతనికి / ఆమెకు వివిధ రకాల బలమైన ఆహారం ఇవ్వండి
- అతనికి / ఆమెకు సురక్షితమైన నీటిని ఇవ్వండి
పోషకాహార లోపం నివారించడం మరియు నిర్వహించడం
చిన్నపిల్లలు పోషకాహారలోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, ప్రత్యేకించి 6 నెలల వయస్సు నుండి 3 సంవత్సరాల వయసు వరకు
- పిల్లల సంరక్షకులు, సెషన్ల ద్వారా పిల్లల పోషకాహార స్థితిని మరియు బరువును తెలుసుకోవాలి
- ప్రతి బరువు సెషన్ తరువాత, తల్లి మరియు బిడ్ద రక్షణ పత్రంపై వృద్ధి పటాన్ని వ్రాయండి
- ప్రతి శిశువుకు మొదటి సంవత్సరంలో ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షణ కల్పించటానికి వ్యాధి నిరోధక టీకాలు తిసుకునేలా సూచించాలి
- మీ పిల్లలకు పోషకాహారలోపం నివారించడానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారాన్ని ఇవ్వండి
- ఎల్లప్పుడూ పోషకాహారలోపం కలిగించే వ్యాధులను (అతిసారం) నిరోధించడానికి మంచి
పరిశుభ్రమైన పద్ధతులను పాటించండి
హెచ్చరిక! ఒక బిడ్డ చాలా సన్నగా మరియు / లేదా రెండు కాళ్ళ వాపును కలిగి ఉన్నప్పుడు, అది తీవ్రమైన పోషకాహార లోపాన్నిసూచిస్తుంది, వెంటనే పిల్లలకి సమీప ఆరోగ్య కేంద్రం / హాస్పిటల్ కి తీసుకెళ్లండి.
- ఈ శిశువు శుష్కించిన/మరస్ముస్ చిహ్నాలను కలిగి ఉంటారు
- ఈ శిశువు క్వశర్కర్ యొక్క చిహ్నాలు కలిగి ఉంటారు
- బాల ఆరోగ్య కేంద్రం/ ఆసుపత్రి నుంచి డిచ్ఛార్జ్ అయ్యాక,అతడు/ ఆమె వివిధ రకాల బలమైన ఆహారం తీసుకోనేలా జాగ్రత తీసుకోవాలి.
ఆధారం : పోర్టల్ టీమ్