క్రొవ్వులు మన శరీరానికి అవసరమైన పోషక పదార్దం. ప్రతి రోజు ఆహరంలో క్రొవ్వులు అవసరమే కాని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. క్రొవ్వులు శక్తిని ఇస్తాయి, శరీరంలోని విటమిన్ల శోషణకు ఉపయోగపడతాయి, చర్మం మరియు వెంట్రుకలు ఆరోగ్యముగా ఉండటానికి సహయపడతాయి.
మంచి క్రొవ్వులు
మంచి క్ర్రొవ్వులను అన్ సాచ్యురేటెడ్ కొవ్వులు అని కూడా అంటారు. ఇవి రెండు రకాలు- మొనో అన్ సాచ్యురేటెడ్, పాలీ శాకరైడ్స్. పాలీ శాకరైడ్స్ మరలా రెండు రకాలు అవి ఒమెగా-3, ఒమెగా -6. వీటిని ఆవశ్యక క్ర్రొవ్వు ఆమాల్లు అని కూడా అంటారు. ఆవశ్యక క్ర్రొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. కాబట్టి వాటిని మనం ఆహరం నుంచి తీసుకోవాలి. అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వులు ధమనులలో ఉన్న మలినాలను తొలిగించడంలో సహాయపడతాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసి దానిని శరీరానికి ప్రసరింపజేస్తుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధులను నిర్మూలించవచ్చు. ఈ అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వులు కలిగి ఉన్నఆహరం తీసుకోవడం మంచిది. ఒమెగా-3 గర్భంలోని పిండంకు మొదటి ఆరు నెలల వరకు కళ్ళు, మెదడు పెరుగుదలకు సహయపడుతుంది. పెద్దలలో గుండె సంబందిత వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
చెడు క్రొవ్వులు
చెడు క్రొవ్వులు అనేవి రెండు రకాలు అవి సాచ్యురేటెడ్ క్రొవ్వు మరియు ట్రాన్స్ క్రొవ్వు రూపంలో ఉంటుంది. చెడు క్రొవ్వులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. చెడు క్రొవ్వులు వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో ఉండే క్రొవ్వు
క్రొవ్వులు శరీరంలో శక్తిని నిల్వ చేయడంలో ప్రధమ పాత్రను పోషిస్తాయి. ఒక పౌండ్/ 380 గ్రాముల నిల్వ ఉన్న క్రొవ్వు 3500 కిలో క్యాలరీల శక్తి ఇస్తుంది. క్రొవ్వు కణాల పోరలలో ఉండే ముఖ్య పదార్దం. కణాల పెరుగుదలకు అవసరమైన పదార్దాలను క్రొవ్వు రవాణా చేస్తుంది. శరీరంలో జరిగే ఎన్నో జీవ క్రియలకు తోడ్పడుతుంది. చర్మం క్రింద క్రొవ్వు ఒక పొరలా నిల్వ ఉంటుంది. ఆ క్రొవ్వు శరీరం నుండి వేడిని బయటకు పోనివ్వకుండా ఆవాహకంలా పని చేస్తుంది. శరీరంలో క్రొవ్వు అతి ముఖ్యమైన అవయవాలు అయిన మూత్రపిండాలు, గుండె మొదలైన వాటి చుట్టూ ఒక పొరలా ఏర్పడి ఉంటుంది. ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు నష్టం జరగకుండా రక్షిస్తుంది.
ఆహరంలో ఉండే క్రొవ్వు
మనం రోజు తీసుకునే ఆహరంలో ఎక్కువ శాతం శక్తి క్రొవ్వుల నుండే వస్తుంది ఒక గ్రాము క్రొవ్వు 9 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది. మనం ఆహరం తీసుకులేని పరిస్థితులలో ఉన్నప్పుడు శరీరంలో నిల్వ వున్న క్రొవ్వు జీవక్రియలకు కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. ఆహరంలోఉండే క్రొవ్వు ఎ, డి, ఇ, మరియు కె విటమిన్లకు వాహకంలా పని చేస్తుంది.
క్రొవ్వులు - ఆహారపదార్దాలు
మొనో అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వులు: అలివ్ నూనె, ద్రాక్ష గింజల నూనె, నట్స్ మరియు గింజలు, లేత మాంసం.
పాలీ శాకరైడ్స్ క్రొవ్వులు: సాల్మన్ మరియు ట్యూన చేపలు.
ఒమెగా 3: సాల్మన్ మరియు ట్యూన చేపలు, అక్రోలు, సొయా పదార్దాలు, ఆకు కూరలు, చిక్కుళ్ళు.
ఒమెగా 6: పొద్ధుతిరుగుడు పువ్వుల నూనె, వేరుశెనగ నూనె, సొయా నూనె.
సాచ్యురేటెడ్ క్ర్రొవ్వులు: జంతువుల మాంసం, బిస్కెట్స్, చిప్స్, వెన్న, మరియు క్రీం మొదలైనవి.
ట్రాన్స్ క్ర్రొవ్వు: కేక్స్, బిస్కెట్స్, చిప్స్ మొదలైనవి.
మంచి కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు |
ఒమెగా 6 మి.గ్రా/100 గ్రా. |
ఒమెగా 3 మి.గ్రా/100 గ్రా. |
ద్రాక్ష గింజల నూనె ఆలివ్ నూన్ అవిస నూనె సోయా నూనె మాంసం కోడి గుడ్డు పచ్చసొన బాదం పప్పు నువ్వులు ఆక్రోలు అరిసెలు టునా సాల్ మాన్ చేప |
6959 9763 12701 50293 100 3538 12053 25226 38092 5911 1664 2506
|
100 761 53300 7033 20 282 6 376 9079 22813 68 982 |
చెడ్డ కొవ్వు ఉండే ఆహర పదార్థాము |
గ్రా./100 గ్రా. |
జంతుమాంసం చాకొలెటు చీజ్ క్రీం కేక్ వెన్న పిజ్జా(ఒక్క ముక్క) చిప్స్ |
52.3 32.4 24.6 23 14.9 51.4 4.3 2.3 |
నట్స్ మరియు నూనె గింజలలో క్రొవ్వు అధికంగా ఉంటుంది. పండ్లు మరియు కూరగాయలలో క్రొవ్వు తక్కువగా ఉంటుంది. చేపలు, సోయాబీన్ నూనె మరియు ఆకుకూరలలో ఒమెగా-3 క్రొవ్వు అధికంగా ఉంటాయి. ఎక్కువగా కూరగాయల నూనెలలో, మాంసం, కాలేయం మరియు మెదడు లలో ఒమెగా 6 క్రొవ్వు అధికంగా ఉంటాయి.
ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాల యొక్క విధులు
లినోలిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లాలను ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు అని అంటారు. వీటినే ఒమెగా 3, ఒమెగా 6 మరియు n-6, n-3 క్రొవ్వు ఆమ్లాలు అని కూడా అంటారు. క్రొవ్వు ఆమ్లాలు మన శరీరంలోని హార్మోన్ లాంటి పదార్థమైన ఇకోసినాయిడ్స్ కు పూర్వగాములుగా పనిచేస్తాయి. శరీరంలో జరిగే ఎన్నో ప్రక్రియలను ఇకోసినాయిడ్స్ నియంత్రిస్తాయి.
ప్రోస్టాగ్లాడిన్స్, ప్రోస్టాసైక్లిన్స్, త్రోంబాక్సిన్ మరియు ల్యూకోట్రిన్స్ ఇవన్నీ ఇకోసినాయిడ్స్ వర్గానికి చెందినవి. ఈ ఇకోసినాయిడ్స్ శరీరంలోని ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అవి రక్తపోటును నియంత్రించడం, ప్రత్యుత్పత్తి చక్రంను పర్యవేక్షించడం, రక్తం గడ్డకట్టడానికి సహాయపడడం. ఇంకా ప్రోస్టాగ్లాడిన్స్ మెదడు సక్రమంగా పనిచేసేట్లుగా చూడడం, రక్తనాళాలు, రక్తకణాలు, రక్తఫలకికలు మొదలైన వాటి విధులను నిర్వహించడం వంటివి కూడా చూసుకుంటుంది. అంతేకాక గర్భం దాల్చడానికి, పురిటి నొప్పులు రావడానికి, కణ ప్రచోదనాల రవాణా, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. ఈ ప్రోస్టాగ్లాడిన్స్ ఎక్కువగా ఉత్పత్తి జరిగినప్పుడు రక్తం ఎక్కువగా గడ్డకట్టడం, రక్తనాళాలు సన్నబడటం లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఒమెగా - 3 క్రొవ్వు ఇకోసినోయిక్ యాసిడ్ మరియు డెకోహెక్సోనోయిక్ యాసిడ్ లు తగ్గిస్తాయి. ఇవి చేపనూనెలో లభిస్తాయి. రక్తఫలకికలు ఒకదానికొకటి అతుక్కోకుండా చేసి రక్తం గడ్డకట్టకుండా చేసి గుండెపోటును నివారిస్తుంది.
శక్తి నిల్వలు
ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు చర్మంలోని ఫాస్పోలిపిడ్స్ లో ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ రూపంలో సెబం పూర్వగాములకు శక్తిని అందిస్తాయి. ఇవి సాచ్యురేటెడ్ క్రొవ్వు ఆమ్లాల కంటే త్వరగా ఆక్సీకరణ చెందుతాయి.
సూక్ష్మజీవులను సంహరించే క్రియ
ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు బ్యాక్టీరియాలను నాశనం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా స్టెప్టోకోకైల్, స్టెఫాలోకోకైల్ మరియు నియోనోకోకైల్ లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. రోగనిరోధక వ్యవస్థలోని థైమస్ ఆధారిత కణాల పొరల కూర్పుకు సహాయపపడతాయి. రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి.
పెరుగుదల మరియు అభివృద్ధి
ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు పిండ దశలో పెరుగుదలకు, జీవిత ప్రారంభ దశలో శరీర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆహారం ద్వారా అరాచిడోనిక్ ఆమ్లంను, డెకోసాహెక్సనోయిక్ యాసిడ్ ను సమపాళ్ళలో తీసుకున్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బరువు, తల చుట్టుకొలత, బొడ్డు, ప్రేగు బరువు సరైన విధంగా ఉంటాయి.
ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు లోపించినప్పుడు ఆహారంలో ఉండే శక్తిని శరీరం అభివృద్ధికి కావాల్సిన జీవక్రియ శక్తిగా మార్చుకోవడం జరగదు. అందువలన పెరుగుదల లోపిస్తుంది.
గుండె సంబంధిత వ్యాధులలో ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాల పాత్ర
కంటి చూపు మరియు కేంద్ర నాడీ వ్యవస్థలో ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాల పాత్ర
మెదడు మరియు నాడీ కణజాలంలో ఉండే క్రొవ్వులలో ఎక్కువ శాతం అరాచిడోనిక్ మరియు డెకోసాహెక్సనోయిక్ యాసిడ్ ఉంటాయి. కళ్ళలో ఉండే రెటీనాలోని ఫోటోరిసెప్టార్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
చర్మ సంరక్షణ
బాహ్య చర్మంలో ఉండే క్రొవ్వు పదార్థాలలో ఎక్కువభాగం అరాచిడోనిక్ ఆమ్లమే ఉంటుంది. చర్మం నిర్వహించే అన్ని విధులకు ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. చర్మ పొరల నిర్మాణానికి మరియు పొరలు స్థిరంగా ఉండడానికి ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు తప్పనిసరి.
క్యాన్సర్ నివారణకు
ఒమెగా -3 క్రొవ్వు ఆమ్లాలు క్యాన్సర్ ను నివారించడంలో మంచి పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ మరియు కోలాన్ క్యాన్సర్ ట్యూమర్లు ఏర్పడడాన్ని ఒమెగా -3 ఆమ్లాలు నివారిస్తాయి. ఇంకా ఆర్థ్రరైటిస్ మరియు జీర్ణకోశ వ్యాధి అయిన ఇంఫ్లామేటరీ బావెల్స్ డిసార్డర్ సోకిన వారు ఆవశ్యక క్రొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. గర్భాశయ కండరాలను, రక్తనాళాలను విశ్రాంతపరిచే గుణం వల్ల ఋతుస్రావ సమయంలో వచ్చే నొప్పులను నివారిస్తాయి.
ఆవశ్యక క్రొవ్వు వల్ల వచ్చే వ్యాధులు
క్రొవ్వుపదార్ధాలు అతిగా తీసుకోవడం వల్ల చాలా అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం లాంటి సమస్యల తీవ్రత పెరిగిపోతుంది. క్రొవ్వుపదార్ధాలు మితంగా తినడం, ఎక్కువగా మంచి క్రొవ్వులున్న, పదార్ధాలను తినడంవల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలా కాకుండా అధిక మోతాధులో బేకరి పదార్ధాలు,వేపుడులు, మార్కెట్లోఉండే కేకులు, చిప్స్, ఇంకా అనేక చెడ్డక్రొవ్వులు కలిగిన పదార్ధల వల్ల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఊబకాయం: క్రొవ్వు పదార్ధాలను, పిండి పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. పిండి పదార్ధాలు తీసుకున్నప్పుడు అవి జీర్ణం అయి గ్లూకోజ్ లా మారుతుంది. శరీరానికి కావల్సిన గ్లూకోజ్ వాడుకోబడి మిగిలినవి క్రొవ్వు రూపంలో నిల్వ చేయబడతాయి. దీనికి తోడూ క్రొవ్వు అతిగా తీసుకోవడం వల్ల అది కూడా నిల్వ చేయబడి ఊబకాయం బారిన పడడం జరుగుతుంది. ఊబకాయం ఇతర ఆరోగ్య సమస్యలైన గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, వంటి వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి ఆహారం ఎంపిక విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
అతిరోస్క్లిరోసిస్: ఆహారంలో క్రొవ్వులను అధికంగా తీసుకున్నపుడు అతిరోస్క్లిరోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అతిరోస్క్లిరోసిస్ అంటే గుండె ధమనులు గట్టిపడతాయి. అందువల్ల రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. శరీరంలో చెడ్డుక్రొవ్వులు ఎక్కువ అయినప్పుడు ఈ సమస్యను చూస్తాము.
క్యాన్సర్: మాంసాహారంలో క్రొవ్వులు అధిక శాతంలో ఉంటాయి. అతిగా తినే వారిలో క్రొవ్వు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇలాంటి వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాక చెడ్డ క్రొవ్వులు ఎక్కువగా తీసుకునే వారిలో మెదడులోని హైపోథాల్మియా దెబ్బతింటుంది.
శరీరంలో ఉండవలసిన కొలెస్ట్రాల్ స్థాయి
కొలెస్ట్రాల్ |
స్థాయి |
చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) 100 ఉంటే |
ఉండదగిన స్థాయి దగ్గరలో ఉన్నట్లు |
100-129 |
ఉండదగిన స్థాయికి దగ్గరలో ఉన్నట్లు |
130-159 |
ఉండదగిన స్థాయికి కొంచెం ఎక్కువ ఉన్నట్లు |
160-189 |
ఎక్కువ ఉన్నట్లు |
>190 |
చాలా ఎక్కువ ఉన్నట్లు |
మొత్తం కొలెస్ట్రాల్ <200 |
తగినంత ఉన్నట్లు |
200-239 |
సరైన స్థాయికి కొంచెం ఎక్కువ ఉన్నట్లు |
>240 |
ఎక్కువ ఉన్నట్లు |
మంచి కొలెస్ట్రాల్ <40 |
తక్కువ ఉన్నట్లు |
>60 |
ఎక్కువ ఉన్నట్లు |
నూనెలు ఎలా వాడాలి?
కలయిక |
నిష్పత్తి |
వేరుశనగ నూనె + సోయాబీన్ నూనె |
2:1 |
పామాయిల్ + సోయాబీన్ నూనె |
1:1 |
కుసుమ నూనె + పామాయిల్ |
1:2 |
ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనె + పామాయిల్ |
1:1 |
నువ్వుల నూనె + పామాయిల్ |
1:1 |
కుసుమ నూనె + వేరుశనగ నూనె/రైస్ బ్రాన్ నూనె |
2:3 |
ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనె + వేరుశనగ నూనె/ రైస్ బ్రాన్ నూనె |
1:3 |
నువ్వుల నూనె + వేరుశనగ నూనె |
1:3 |
రెండు, మూడు రకాలు వాడటం: కూరల తాలింపులకు ఒక రకం, బాగా ఎక్కువసేపు నూనెలో వేగవలసిన పకోడి, గారెలు వంటి వాటికి ఒక రకం వాడాలి. అయితే నూనె యొక్క స్మోకింగ్ పాయింట్ను బట్టి( అంటే నూనె వేడి చేసినప్పుడు పొగ వచ్చే స్థితి) నూనెల ఎంపిక చేసుకోవాలి. త్వరగా పొగ వచ్చే నూనెలను తాలింపులకు వాడడం మంచిది. ఆలస్యంగా వచ్చే వాటిని నిలువ ఉండే చిరుతిళ్ళ తయారికి, పకోడి, గారెలకు వాడుకోవచ్చు.
స్మొకింగ్ పాయింట్స్
నూనెలు |
నాణ్యత |
స్మొకింగ్ పాయింట్స్ |
పొద్దుతిరుగుడు పువ్వు నూనె
|
శుద్ది చేయనివి పాక్షితంగా శుద్ది చేసినది శుద్ది చేసినది |
107 232 227
|
సోయాబీన్ నూనె |
శుద్ది చేయనివి పాక్షితంగా శుద్ది చేసినది శుద్ది చేసినది |
160 177 238 |
నువ్వుల నూనె |
శుద్ది చేయనివి పాక్షితంగా శుద్ది చేసినది
|
177 232
|
కుసుమ నూనె |
శుద్ది చేయనివి పాక్షితంగా శుద్ది చేసినది శుద్ది చేసినది |
107 160 266 |
ఆలివ్ నూనె |
- |
199 |
పామాయిల్ |
- |
235 |
వేరుశెనగ నూనె |
పాక్షితంగా శుద్ది చేసినది శుద్ది చేసినది |
160 232 |
ద్రాక్ష నూనె |
- |
216 |
కొబ్బరి నూనె |
- |
204 |
కార్న్ నూనె |
పాక్షితంగా శుద్ది చేసినది శుద్ది చేసినది |
178 232 |
ఒకసారి బాగా వేడిచేసిన నూనెను మరలా బాగా వేడిచేయడం వలన నూనె విషపూరితం అవుతుంది. కాబట్టి, దానిని తాలింపులకు వాడడం మంచిది.
సాధారణంగా ఇంట్లో వాడుకునే నూనెలలో ఉండే క్రొవ్వు పదార్థాలు
వంటనూనెలు |
స్యాచ్యురేటేడ్క్రొవ్వు ఆమ్లాలు |
మోనో అన్స్యాచ్యురేటేడ్క్రొవ్వు ఆమ్లాలు |
పాలి అన్స్యాచ్యురేటేడ్క్రొవ్వు ఆమ్లాలు |
ఒమెగా-3 కొవ్వుఆమ్లాలు |
ఒమెగా-6 కొవ్వుఆమ్లాలు |
ఒమెగా 6 ఒమెగా- 3 నిష్పత్తి |
SFA:MUFA:PUFA |
కొబ్బరి నూనె |
89.5 |
7.8 |
2 |
|
2 |
|
1:0.9:0.02 |
పామాయిల్ |
47.7 |
41.4 |
10.6 |
0.3 |
10.3 |
34.3:1 |
1:0.9:0.2 |
ఆలివ్ నూనె |
14.8 |
74.5 |
10 |
|
10 |
- |
1:5:0.6 |
ఆవాల నూనె |
10.7 |
56 |
32.6 |
14.5 |
18.1 |
1.2:1 |
1:5.2:3 |
వేరుశనగ నూనె |
20.9 |
49.3 |
30.9 |
|
30.9 |
- |
1:2.3:1.5 |
రైస్ బ్రాన్ నూనె |
22.1 |
41 |
35.7 |
1.4 |
34.3 |
245:1 |
1:1.8:16 |
కుసుమ నూనె |
10.7 |
16.7 |
73.5 |
|
73.5 |
- |
1:1.5:6.8 |
ప్రొద్దుతిరుగుడు నూనె |
9.1 |
25.1 |
66.2 |
|
66.2 |
- |
1:2.7:7 |
కార్న్ నూనె |
12.7 |
29.6 |
57.6 |
|
57.6 |
- |
1:2.3:4.5 |
సోయాబీన్ నూనె |
13.1 |
28.9 |
57.2 |
6.5 |
50.7 |
7.8:1 |
1:2.2:4.3 |
ఆధారం: కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020