బాదం పప్పుతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో విటమిన్ ‘ఇ’, కాపర్, మెగ్నీషియంలతో పాటు ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అలాగే, బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాల వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. కాబట్టి వార్ధక్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించవచ్చు. చర్మం కాంతివంతమవుతుంది. అందువల్ల పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అయితే, బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్‌ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్ స్థాయులను సమన్వయం చేస్తాయని చెపుతున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
భోజనంలో సగభాగం కూరగాయలు ఉండాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనాన్ని నాలుగు భాగాలుగా విభజించటం ఉత్తమం. తీసుకునే భోజనంలో కూరగాయులు ఉండాలి.
పావు భాగంలో పిండి ఉత్పత్తులు.. ఇంకొక పావు భాగంలో మాంసం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉంటారు. అలాగే కూల్‌డ్రింక్స్, ప్యాక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.
మంచి ఆరోగ్యం కొరకు రోజుకు 2-3 లీటర్స్ నీటిని త్రాగాలి. నీరు తాగడం ద్వారా శరీరానికి ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి, శరీరంలో వ్యర్థాల వృద్ధిని నిరోధించడానికి సహాయపడుతుంది.
సమర్థవంతమైన ఆరోగ్యకరమైన బరువు నష్టం కోసం హోల్ మిల్క్ నుండి మీగడ తీసిన పాలకు మారటం ఉత్తమం. హోల్ మిల్క్ బరువును పెంచుతుంది.
అలాగే సహజ కేలరీలు కలిగి ఉంటుంది. కానీ మీగడ తీసిన పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు నష్టం కోసం ఒక ఆరోగ్యకరమైన ఎంపికను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
బ్రేక్ ఫాస్ట్‌కు శాండ్‌విచ్.. బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు కొన్ని తృణధాన్యాలలో పిండి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వాటిని అల్పాహారంగా తీసుకుంటే, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలో సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే అల్పాహారంగా బేకరీ వస్తువులను నివారించటం ఉత్తమం. దానికి బదులుగా అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ ఉన్న తృణధాన్యాలను ఎంచుకోండి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే అవిసె లేదా అక్రోట్లను జోడించండి.
అలాగే సమతుల్య బ్రేక్ ఫాస్ట్ అనేది గుడ్డు, మాంసం, జున్ను, టోస్ట్‌తో తయారయి ఉండవచ్చు. కానీ నిజంగా నూనెలో వేగించిన గుడ్డును, ప్రాసెస్ చేసిన పంది మాంసం, పూర్తిగా కొవ్వు చీజ్‌లను బ్రేక్ ఫాస్ట్ శాండ్విచ్‌లో ఉపయోగిస్తే విచ్ఛిన్నం అవుతుంది.
దానికి బదులుగా గుడ్డు మరియు తక్కువ కొవ్వు చీజ్ ఉపయోగించాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో హోం మేడ్ శాండ్‌విచ్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా ఎంచుకోవచ్చు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
వెల్లుల్లిలో యాంటీ ఒబిసిటీ లక్షణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత వెల్లుల్లిని వారానికి మూడుసార్లైనా ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
కార్డియో వాస్కులార్ సిస్టమ్‌కు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. అదే విధంగా ట్రై గ్లిజరైడ్స్ కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
వెల్లుల్లిలోని యాంటీ- ఒబిసిటీ లక్షణాలు ప్రతి క్షణం శరీరంలో కణాలు నశింపజేస్తాయి. అలాగే శరీరం కొత్తకణాలను తయారుచేస్తుంటుంది. వీటి ప్రక్రియను క్రమంగానిర్వర్తించడానికి వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోండి. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని కోరుకొనే వారు పచ్చివెల్లుల్లి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
మతిమరుపుకు విటమన్స్, ప్రోటీన్స్ లోపం కారణం కావొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే తాజాగా, గ్రీన్ ఆకుకూరలు, కూరగాయలతో పాటు బెర్రీ ఫ్రూట్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం.. మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. తద్వారా మతిమరుపు దూరమవుతుంది. ఇవి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తాయి.
అలాగే బాదం, వాల్ నట్స్ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి. ఇవి మెమరీ పవర్‌ను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
అధిక మద్యపానం సమస్యలకు దారి తీస్తుంది. కానీ మిచందా తాగడం ద్వారా ఆరోగ్యానికి కొంత మంచే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్‌ను ప్రతి రోజు పరిమితంగా తీసుకోవటం వలన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది. ముదురు రంగు బీర్‌లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే కరిగే ఫైబర్ ఉంటుంది.
బీర్‌లో బి 12, ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బీర్ త్రాగని వారి కంటే త్రాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బీర్‌లో సిలికాన్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. అయితే మోతాదు మించితే మాత్రం బీర్‌తో ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమ...
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూర...
సేంద్రియ ఎరువులద్వారా వ్యవసాయసాగు విధానము
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే...