పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్‌లనుండి కాపాడడంలో తోడ్పడతాయి. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల గుండె జబ్బులనుండి మనల్ని కాపాడుతుంది.

శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. గ్రీన్‌టీలో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలోని కొలెస్టరాల్‌ను కరిగించడంలో గ్రీన్‌టీ చక్కగా తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గ్రీన్‌టీ తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది.

ఆధారము: వెబ్ దునియా.కం

గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు

ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

  • క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ, పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్ ప్రమాదము నుండి కాపాడుతుంది.
  • గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.
  • రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
  • కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.
  • మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.
  • కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది.

ఇంకెందుకు ఆలస్యం రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఆధారము: తెలుగు టిప్స్.ఇన్

గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

గ్రీన్ టీ రుచిని ఇవ్వటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఆరోగ్యవంతమైన కణాలు

గ్రీన్ టీ యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది, వీటిని కాటేచిన్స్ (Catechins) అంటారు. ఇవి కణాలకు హానిచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన కణాలకు మంచిది.

మధుమేహం

గ్రీన్ టీ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, అనగా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీ లో 'కాటేచిన్స్' (CATECHINS) ఉండటం వలన శరీరంలోని కొవ్వు మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది, అందువలన మధుమేహం కలుగుతను ఆలస్యం లేదా నియంత్రిస్తుంది.

గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది

గ్రీన్ టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది. గ్రీన్ టీ అధిక రక్త పీడనాన్ని మరియు 'కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్' వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.

బరువు తగ్గటం

గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్'గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలోరిలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి మీరు తీసుకునే చక్కర ద్రావకానికి బదులుగా గ్రీన్ టీ తీసుకోండి.

మెదడు చురుగ్గా ఉండటానికి

గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకి చాలా మంచిది, ఇది ప్లేక్స్ (Plaques) ఏర్పడటాన్ని నివారించి, మతిమరపు (Alzeimer's) రాకుండా చేస్తుంది. గ్రీన్ టీ మెదడులో పనిచేసే మరియు గుర్తుపెట్టుకొనే (Working-Memory) భాగంలో దీని ప్రభావాన్నిచూపిస్తుంది.

క్యాన్సర్

గ్రీన్ టీ చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది, అందులో క్యాన్సర్'ను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ అన్ని రకాల కణాల పెరుగుదలకు సహకరిస్తుంది, దాని వల్ల కాన్సర్ నివారిస్తుంది.

కీళ్ళనొప్పులు

గ్రీన్ టీ చాలా శక్తివంతంగా కీళ్ళనొప్పుల వంటి వ్యాధులకు పని చేస్తుంది అని చాలా పుస్తకాలలో ప్రచూరించారు. గ్రీన్ టీ, జబ్బు పడిన ఇన్ఫ్లమేషన్'కి గురైన కణాలు 'కార్టిలేజ్'తో కలిగి ఉండే సంబంధాన్ని విచ్చిన్నం చేసి కీళ్ళనొప్పుల వంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. మీరు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లైతే రోజుకి ఒక కప్పు గ్రీన్ టీ తాగటానికి ప్రయత్నించండి.

ఒత్తిడి నుండి ఉపశమనం

ఒక కప్పు గ్రీన్ తాగటం వల్ల మీరు ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. గ్రీన్ టీ 'థయామిన్', 'అమినోసిడ్స్'ని కలిగి ఉండటం వల్ల ఇది కామింగ్ (Calming) ఎఫెక్ట్'ని కలుగచేస్తుంది. మీరు ఒత్తిడిగా భావించినపుడు అయినపుడు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల ఉపశమనం పొందుతారు.

రోగనిరోధకత

గ్రీన్ టీలో ఉండే రసాయనాలు, చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. గ్రీన్ టీ రోగనిరోధక వ్యవస్థకి శక్తిని సమకూర్చునని పుస్తకాలలో ప్రచురించారు.

ఆధారము: ఓన్లీ మై హెల్త్.కం

గ్రీన్ టీ మంచిదే... కానీ

కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీని కడుపులో వేస్తే, అది చాలా సమస్యల్ని మీ గడపలోకి తీసుకొస్తుందంటున్నారు పరిశోధకులు. వాళ్లు చెబుతున్నదాని ప్రకారం...

గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. ఉండదనుకుని రోజుకు నాలుగైదు కప్పులు లాగిస్తే, శరీరంలోకి కెఫీన్ ఎక్కువగానే చేరిపోతుంది గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందట గ్రీన్ టీలోని పాలీఫినాల్స్ మోతాదు మించి శరీరంలో చేరినట్లయితే, క్యాన్సర్‌ని నిరోధించే కణాలను అడ్డుకుంటాయని తేలింది ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి గ్రీన్ టీలో ఉంటే ట్యానిన్స్... ఆహారం, పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఇనుమును అడ్డుకుంటాయి .చూశారుగా! ఒక్కోసారి మనం మంచనుకున్నది మన పాలిట చెడవుతుంది. కాబట్టి దేని విషయంలోనైనా అతి ప్రమాదమే!

ఆధారము: సాక్షి.కం

3.1037037037
kavi May 20, 2015 09:49 AM

ఈ పేజి చాల బాగుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు