హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / చింతపండు ఉత్పత్తుల తయారీ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చింతపండు ఉత్పత్తుల తయారీ

చింతపండు ఉత్పత్తుల తయారీ

పరిచయం

ప్రపంచంలోకెల్లా మన దేశంలో చింతపండు యొక్క ఉత్పత్తి, వాడకం చాలా అధికంగా ఉంటుంది. సంవత్సరానికి సుమారు 3,00,000 మెట్రిక్ టన్నుల చింతపండు ఉత్పత్తి చేసి 50 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే చింతపండ్లతో చేసిన ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేస్తుందని అంచనా. చింతపండుని మనం పప్పులలో, సాంబారులలో, చట్నీలలో, సాసులలో ఇంకా అనేక రకాలుగా రోజు వాడుతూ ఉంటాము. ఫ్రతి 100 గ్రాముల చింతపండులో ఫాస్ఫరస్ 110 మిల్లీ గ్రాం, కాల్షియం 17 మిల్లీ గ్రాం, ఇనుము17 మిల్లీ గ్రాం, మొదలైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని రోగాల బారి నుండి రక్షిస్తాయి. ఆహార పరిశ్రమలలో ఇది అతిముఖ్యమైన పదార్థం. ఇన్ని ఉపయోగాలున్న ఈ చింతపండుని మనం ఎన్నో రకాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఈ పద్ధతులలో డి హైడ్రేషన్ ఒక ముఖ్యమైన పద్ధతి. ప్రాసెస్సింగ్ పద్ధతుల ద్వారా చింతపండు గుజ్జు, ప్యూరీ, పులిహోర మిక్సు, టాఫీ, కాండీ, జామ్, స్క్వాష్ మొదలైన ఉత్పత్తులను చేయవచ్చు. తద్వారా దీని విలువను పెంచవచ్చు.

చింతపండు నుండి గుజ్జు తీసే విధానం


చింతపండుతో ఏమి చేయాలన్నా ముందుగా గుజ్జు తయారు చేసుకోవాలి. ముందుగా గింజలను తొలగించాలి.
ఇలా చేసిన తర్వాత చింతపండుని నీళ్ళలో 1:15 నిష్పత్తిలో చేర్చి, 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉడికించాలి.
ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఒక జల్లెడ నుండి పంపి, గుజ్జుని వేరు చేసుకోవాలి. ఈ పద్దతి ద్వారా తీసిన గుజ్జును ఇతర ఉత్పత్తుల తయారీ కొరకు వాడుకోవాలి.

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

జామ్


100 గ్రాం.ల చింతపండు గుజ్జుకు 175 గ్రాం.ల చక్కెరను చేర్చి ఉడికించాలి. మనకు కావలసిన చిక్కదనం వచ్చేదాకా దీనిని మరిగించాలి. ఉడికిస్తున్న సమయంలో 1 గ్రాం పెక్టిన్ ను జోడిస్తే జాం తయారైపోతుంది. దీనిని శుభ్రమైన గాజు సీసాలలో వేడిగా ఉన్నప్పుడే వేసి మూత బిగించాలి.

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

స్క్వాష్150 గ్రాం.ల చక్కెరను, 50 మిల్లీ లీటర్ల నీళ్ళలో వేసి పాకాన్ని తయారుచేసుకోవాలి. పాకం చల్లారిన తర్వాత దాంట్లోకి 100 మిల్లీ లీటర్ల చింతపండు రసాన్ని చేర్చి బాగా కలపాలి. ఈ స్క్వాష్ నిల్వ ఉండడానికి పొటాషియం మెటాబైసల్ఫేట్ ను చేర్చాలి. ఇప్పుడు దీన్ని పరిశుభ్రమైన గాజుసీసాలలోకి నింపి మూత పెట్టాలి. ఒక వంతు స్క్వాష్ కి నాలుగు వంతుల నీరు చేర్చి వాడుకోవాలి. (జ్యూస్1 :నీళ్ళు 4)

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

కాండీచింతపండు గుజ్జు నుండి తీసిన రసాన్ని (100గ్రా), చక్కెర(200గ్రా) మరియు గ్లూకోజ్ సిరప్(400గ్రా) లకు చేర్చి, 222డిగ్రీల - 223 డిగ్రీల ఫారన్ హీట్ దాకా మరిగించాలి. 1 1/2 ఇంచుల లోతు గుంతలు ఉన్న గిన్నెకు వెన్నె/నెయ్యి నూనె/  గాని రుద్దాలి. ఈ గుంతలలోకి ఉడికించిన మిశ్రమాన్ని ఉండలు లేకుండా గట్టిపడేదాక ఉంచాలి. గట్టిపడ్డాక దానిపై ఐసింగ్ చక్కెరను చల్లి, బట్టర్ పేపరులో చుట్టాలి. గదిలో ఉండే సాధారణ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచుకోవాలి.

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

టోఫీ100 గ్రాం.ల చింతపండు గుజ్జుకు 75 గ్రాం.ల చక్కెరను చేర్చి ఉడికించాలి. చిక్కని మిశ్రమంలా అయ్యేంతవరకు మరిగిస్తూనే ఉండాలి. ఉడుకుతున్న సమయంలో 15 గ్రాముల  పాలపొడి మరియు  స్టెబిలైజర్ (HDF 8 gr./CMC 5 gr.) ను చేర్చాలి. ఒక గిన్నెకు వెన్నను పూతపూసి దాంట్లోకి ఈ మిశ్రమాన్ని చేర్చాలి. చల్లారి సాంద్రతకు చేరుకున్నాక మనకు కావలసిన విధంగా కోసుకొని ప్యాక్ చేసి, భద్రపరచుకోవాలి.

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

చింతపండు ప్యూరీగింజలు తొలగించిన చింతపండును 1:1 నిష్పత్తిలో నీళ్ళను కలుపుకొని 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కిలోచింతపండు గుజ్జుకి  100 మెక్రొగ్రాముల పొటాషియం బై సల్ఫేట్ అనే నిల్వకారిణిగా అందులోవేయాలి. పొటాషియం మెటా బై సల్ఫేట్ చింతపండు గుజ్జులో శిలింద్రాలు పెరగకుండా రక్షిస్తుంది. ఈమిశ్రమాన్నిఇప్పుదు గజు సీసాలో నిల్వచేస్తారు.

 

తయారు చేసే విధానం - ఫ్లో చార్టు

ఉపయోగాలు

  1. ఖర్చు తక్కువగా ఉంటుంది
  2. ముడి సరుకులు చౌకగా లభిస్తాయి
  3. సులభంగా తయారు చేసుకోవచ్చు
  4. అధిక వ్యయంతో కూడిన పరికరాలు అవసరం లేదు
  5. చిన్న పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవచ్చు
  6. కోత తర్వాత నష్టాలను నివారించుకోవచ్చు.


ఆధారం:

డాక్టర్ కె. ఉమా మహేశ్వరి, ప్రొఫెసర్ మరియు యూనివర్శిటీ హెడ్, ఆహారం & పోషణ విభాగం
కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.

2.95762711864
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు