హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / తీసుకునే ఆహారంతో గుండె పైన కూడా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తీసుకునే ఆహారంతో గుండె పైన కూడా

తీసుకునే ఆహారంతో గుండె పైన కూడా

మనం తీసుకునే ఆహరంతో మన గుండె పైన కూడా ప్రభావం కనిపిస్తుంది. అంతటితో ఊరుకోకుండా శరీరంలో వున్నా పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా సైతం గుండె జబ్బు ముప్పుల విషయం లో ప్రభావం చూపిస్తుంది. అందువల్లనే శాస్త్ర వేత్తలు ప్రత్యేకంగా దీని మీద నిశితమైన పరిశోధనలు ప్రారంభించారు.

శరీరం లో వున్న పేగుల్లోని వ్యక్తీరియా మానవుడికి ఎంతగానో మేలే చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవటం నుంచి కొన్ని రకాల విటమినుల తయారీ వరకు పలు విధాలుగా తోడవుతుంది. విష తుల్యాలను విడగొట్టడంతో పటు ఆయా సందర్భాలకు ఎలా స్పందించాలో వ్యాధి నిరోధక శక్తికి నేర్పుతుంది కూడా. కనుకే ఎంతో కాలంగా పరిశోధకులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. మధుమేహం ఊబకాయం వంటి సమస్యలకు పేగుల లోని వ్యక్తీరియాలకు ఎంతో సంబంధం ఉంటోందని ఇప్పటికే గుర్తించారు కూడా.

ఇవి రెండూ గుండె జబ్బు ముప్పునకు   కారకులే. పేగుల లోని బ్యాక్టీరియా ఆహారాన్ని విడదీసే క్రమంలో రక్త నాళాలను దెబ్బతీసే వాపు ప్రక్రియను తోడ్పడుతున్నట్టు ఇటీవల జరిగిన అధ్యయనాలె పేర్కొంటున్నాయి. ఈ ఫలితాలు తోలి దశలోనే వున్నా ముందు ముందు గుండె జబ్బు ముప్పు నివారణకు ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను సూచించేందుకు సహకరించ గలదని నిపుణులు భావిస్తున్నారు.

మరి జరిగేది ఏమిటో తెలుసుకుందామా

మాంసం, గుడ్లు, పల వంటి పదార్ధాలలో ఖోలిన్ అనే రసాయనం ఉంటుంది. పేగుల్లోని బ్యాక్టీరియా దీన్ని తినేటప్పుడు టి ఎంఏ అనే ఒక విధమైన రసాయనం ఉత్పత్తి అవుతుందిట. ఆ తరువాత కాలేయంలో టిఎంఏగ మారిపోతుంది. అంతే కాదు రక్త నాళాలు గట్టిగ ఉండేట్టు చేసి గుండె జబ్బుకి కారణమవుతుందని క్లివ్లాండ్ క్లినిక్లో జరిగిన అధ్యయనం చెబు తున్నది.

ఈ ఉత్పత్తిని అడ్డుకునేందుకు డిఎంబి అనే అణువును ఎలుకలకు ఇచ్చి చూడగా, వాటి రక్త నాళాలు మంచి ఆరోగ్యంతోనే ఉంటున్నట్టు తేలింది. అయితే చైనా దేశంలోని పరిశోధకులు దీని మీద మరు అడుగు ముందుకెళ్లి పేగుళ్ల లోని బ్యాక్టీరియాను మార్చటంతో కనపడే ఫలితాలను బేరీజు వేశారు కూడా. అకేర్ మ్యాంసియా ముసినీఫీల  అనేటువంటి బ్యాక్టీరియా రకాన్ని ఎలుకల పేగులలో జొనిపి పరిశీలించారు కూడా. దింతో రక్త నాళాలు గట్టిపడే ముప్పు గణనీయంగా తగ్గుతుండటం గమనించాల్సిన విషయం.

పేగుల్లోని బ్యాక్టీరియా స్థాయిలో మార్పులు చేయటంతో రక్త నాళాలు దెబ్బ తినటం తగ్గించుకోవచు అని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అంతే కాదు కొవ్వు, రక్తపోటు పైన కూడా బ్యాక్టీరియా ప్రభావం పడటం గమనించాల్సిన విషయం. కనుక తాజా పండ్లు, కూరగాయలు,, మంచి ధాన్యాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే మంచిది మరి. మాంసాహారం కన్నా శాఖాహారం తినివేరికి పేగుల్లో బ్యాక్టీరియా రకాలు ఎక్కువగా ఉంటాయట. కనుక బ్యాక్టీరియా మిశ్రమం మన ఆరోగ్యానికి ఎంతో మేలుతో పటు మంచిని కూడా కలిగిస్తుంది అని అంటున్నారు నిపుణులు.

వ్యాసం.. అనూరాధ

2.9387755102
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు