హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / పుష్టికరమైన ‘పామాయిల్‌’
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పుష్టికరమైన ‘పామాయిల్‌’

పామాయిల్‌ను వంటకాల్లో ఎలా ఉపయోగించాలి?

అన్ని నూనెల్లో చవకైనది పామాయిల్‌. ఈ నూనెలో కొలెస్టరాల్‌ శాతం కూడా తక్కువే! పైగా ఆరోగ్యకరమైన శాచురేటెడ్‌ వెజిటబుల్‌ ఫ్యాట్స్‌ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. పామాయిల్‌ను వంటకాల్లో ఎలా ఉపయోగించాలి?

ఆ నూనెతో ఒరిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం! 
పోషకాల వివరాలు
పామాయిల్‌ (ఒక టే.స్పూన్‌) 
కెలోరీలు - 117 
టోటల్‌ ఫ్యాట్‌ - 14 గ్రా 
శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 7గ్రా 
పాలీశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 1.5గ్రా 
మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 5గ్రా 
కొలెస్ట్రాల్‌ - 0శాతం 
విటమిన్‌ ఎ - 80శాతం
విటమిన్‌ ఈ - 25శాతం 
ఫైటో న్యూట్రియంట్స్‌ - కెరోటినాయిడ్స్‌, స్టిరాల్స్‌, యాంటిఆక్సిడెంట్స్‌

పామాయిల్‌తో ఈ వ్యాధులు దూరం

అల్జీమర్స్‌ డిసీజ్‌: ఈ నూనెలోని విటమిన్‌ ఈ టోకోట్రినాల్‌ డిస్ట్రక్టివ్‌ డ్యామేజీని అరికట్టి మెదడు కణాలకు రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా డిమెన్షియా, అల్జీమర్స్‌లాంటి రుగ్మతలు దరిచేరవు.

ఆర్టీరియల్‌ థ్రాంబోసిస్‌: పామాయిల్‌ రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా హృద్రోగాలు దరిచేరవు. ఈ నూనె ఫ్రీ ర్యాడికల్స్‌ను కట్టడి చేసి గుండె రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే సమస్య ఉండదు.

క్యాన్సర్‌: ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌కు గురికాకుండా కణాలకు రక్షణనిస్తాయి. దీన్లోని టోకోఎట్రినాల్‌ అనే విటమిన్‌ ఈ చర్మం, పొట్ట, పాంక్రియాస్‌, కాలేయం, ఊపిరితిత్తులు, పెద్ద పేగు, రొవ్వు ఇతర క్యాన్సర్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.
కాటరాక్ట్స్‌
కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌
మస్క్యులర్‌ డిజనరేషన్‌

వంటల్లో ఇలా వాడాలి
పామాయిల్‌లో పామాయిల్‌, పామ్‌ కెనెల్‌ ఆయిల్‌ అనే రెండు రకాలున్నాయి. పామ్‌ కెనెల్‌ ఆయిల్‌లో కెరోటినాయిడ్స్‌ ఉండవు కాబట్టి లేత రంగులో ఉంటుంది. పామాయిల్‌లో టొమాటో, క్యారెట్లలోకంటే ఎక్కువ కెరోటినాయిడ్స్‌ ఉంటాయి కాబట్టి ఇది ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇదే వంటకు అనువైన నూనె.
వెన్న జోడించి వండే వంటకాల్లో పామాయిల్‌ను కలిపితే రుచి రెట్టింపవుతుంది.
ఈ నూనెతో పాప్‌ కార్న్‌ తయారుచేస్తే రుచిగా ఉంటాయి.
ఆమ్లెట్స్‌, స్ర్కాంబిల్డ్‌ ఎగ్స్‌కు ఈ నూనె అనువైనది.
క్యారెట్‌, ఉల్లిపాయలను స్టిర్‌ ఫ్రై చేయటానికి పామాయిల్‌ను ఉపయోగించవచ్చు.

అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మరసం, పసుపు, కొత్తిమీర మొదలైన ఘాటైన పదార్థాలను వంటల్లో ఉపయోగించేటప్పుడు పామాయిల్‌ వాడితే వంటకం రుచికరంగా ఉంటుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి
2.9649122807
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు