పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అధిక రక్తపోటు

ఈ విభాగంలోఅధిక రక్తపోటు ప్రభావము గురించి వివరించబడింది

 • ఒక  వ్యక్తి యొక్క సంకోచ రక్తపోటు నిలకడగా 140 ఎమ్ ఎమ్ హెచ్ జి లేక అంతకన్నా ఎక్కువ (గరిష్ట రీడింగ్) మరియు/లేదా వ్యాకోచ రక్త పోటు నిలకడగా 90 ఎమ్ ఎమ్ హెచ్ జి లేక అంతకన్నా ఎక్కువ (కనిష్ట రీడింగ్) గా ఉంటే దానిని అధిక రక్తపోటుగా పరిగణించవచ్చును.
 • అధిక రక్తపోటు మూత్రపిండాల జబ్బు వలన రావచ్చును లేక అస్పష్టమైన కారణముల వలన కావచ్చును,
 • చికిత్స తీసుకోని యెడల, చాలాకాలం నుండి ఉన్న అధిక రక్తపోటు, పక్షవాతము, గుండె పోట్లు, గుండె ఆగిపోవుట, ధమనులు ఉబ్బుట మరియు మూత్రపిండాలు పనిచేయక పోవుడం వంటివి సంభవించ వచ్చును.

అధిక రక్త పోటుకు కారణములు

 • వంశపారం పర్యం
 • ఊబకాయం
 • ప్రొగ త్రాగుట
 • వయస్సు
 • వత్తిడి
 • ఆడవారి లో గర్భనిరోధక మూత్రలు వాడటం.

సూచనలు మరియు లక్షణములు

 • అధిక రక్తపోటు ఒక్కటే మామూలుగా ఎటువంటి లక్షణాలు కనబరచదు.
 • అయినప్పటికిని, రక్తపోటు విశ్లేషణకి ముందు, రక్తపోటు విశ్లేషణ జరుగుతున్నపుడు తలనొప్పి, చికాకు గా ఉండటం, వికారంగా ఉండటం, మసకబారిన చూపు, మొహం మీద వేడిగా ఉండటం, వేడి వల్ల సరిగ్గా నిద్ర పట్టక పోవటం, చెవిలో మోగుతున్నట్లు అనిపించడం మొదలైనవి అధిక రక్తపోటుతో ఉండే కొన్ని లక్షణాలు.
 • ధీర్ఘకాలిక రక్త పోటు మెదడు, గుండె, మూత్రపిండాలు మరియు కళ్ళు వంటి అవయవాలను దెబ్బ తీయవచ్చును.

రక్తపోటును కొలవటానికి చిట్కాలు

 • సాధారణంగా, నిశ్చలంగా ఉండే అధికమైన రక్తపోటు ఆధారంగా అధిక రక్తపోటు విశ్లేషణని చేస్తారు. కావున సరైన విలువలను తీసుకోనుటలో జాగ్రత్త వహించవలెను.
 • అవయవముల హాని యొక్క సూచనలు కనబడిన యెడల, మామూలుగా రక్త పోటును మూడు సార్లు చూడాలి. ఒకొక్క రీడింగ్ మధ్య వారం రోజులు తేడా ఉండాలి.
 • రక్తపోటును నమోదు చేయునప్పుడు, వ్యక్తి కొన్ని నియమాలను పాటించవలెను.
  • ఉదహరణకి, కేఫైన్ కలిగి ఉన్న కాఫీ లేక కోక్ ఉన్న పానీయములు తీసుకున్న గంట తర్వాత రక్తపోటును చూడవలెను. ప్రొగతాగిన లేక వ్యాయామం చేసిన అరగంట తర్వాత తీయవలెను. వత్తిడి ఉండకూడదు.
  • రోగిని, రీడింగు తీసుకునే 5 నిమిషాల ముందు ప్రశాంత మైన వాతావరణంలో, రెండు కాళ్ళు నేలకు ఆన్చి, కుర్చీలో నిటారుగా కూర్చోబెట్టాలి.
  • చల్లని మందులలో ఉండే ఉత్తేజపరిచే ప్రేరకాలను రోగి వాడకూడదు.
  • మణికట్టు ఛాతీకి దగ్గరగా ఉండి గాలితో నింపవలెను.
  • పీడనాన్ని నమోదు చేయవలెను.  5 నిమిషాల తేడాతో రెండుసార్లు రక్తపోటును చూడవలెను. 5 ఎమ్ ఎమ్ హెచ్ జి కన్నా ఎక్కువ తేడా ఉంటే, మూడవసారి రక్తపోటును చూడవలెను. చూసిన రీడింగులను సగటు చేయవలెను.
  • ఒకొక్కప్పుడు రక్తపోటును రెండు చేతులకు తీసుకుంటారు. తర్వాత తీసుకోవలసిన రీడింగులను ఎక్కువ పీడనము ఉన్న చేతికి తీసుకుంటే మంచిది.

అధిక రక్తపోటుకు దారి తీసే అవయవములకు కలిగే హానిని గుర్తించే వైద్య పరీక్షలు

 • గుండె లేదా కళ్ళు (కంటిమీద ఉన్న పొర - రెటీన) మరియు కిడ్నీలకు హాని కలిగి అధిక రక్తపోటుకు దారి తీసే లక్షణాలను గుర్తించడానికి వైద్య పరీక్షలు జరపబడతాయి.
 • మధుమేహాన్ని మరియు పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించడానికి కూడా పరీక్షలు జరపబడతాయి.
 • ఎందుకంటే వీటివల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే హాని ఎక్కువగా ఉంటుంది.
 • సాధారణంగా జరిపే రక్త పరీక్షలు క్రింది వాటిని కలిగి ఉంటాయి.
  • క్రియటినైన్ (మూత్రపిండము పనిచేయు తీరు) - అధిరక్తపోటు వలన మూత్ర పిండములలో ఉన్న జబ్బు మరియు మూత్రపిండములను నష్టపరచు అధిక రక్తపోటును గుర్తించుటకు.
  • విద్యుద్వాహకములు (సోడియం, పోటాషియం)
  • గ్లూకోజ్ - మధుమేహము యొక్క ఉనికిని గమనించి, ఆ వ్యాధిని ఉందో లేదో తేల్చి చెప్ప డానికి.
  • కోలెస్ట్రాల్

అదనంగా చేయు పరీక్షలు ఏమిటంటే

 • ప్రోటీన్యురియా కోసం మూత్రమును పరీక్షచేయుట – అధిక రక్తపోటు వలన మూత్ర పిండము లలో ఉన్న జబ్బు మరియు మూత్ర పిండములను నష్టపరచు అధిక రక్తపోటును గుర్తించు టకు.
 • ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ఇ.కె.జి/ఇ.సి.జి.) - అధిక రక్తపోటుకు, గుండె వత్తిడికి గురౌతుందన్న ఋజువు కోసం.
 • ఛాతి ఎక్స్ రే - గుండె విస్తరణ చెందినవా లేక గుండె పనిచేయుట లేదా అని గమనించడానికి.

అధిక రక్తపోటును నియంత్రించుకోవటానికి దైనందిన జీవితంలో చేసుకోవలసిన మార్పులు

 • సమతుల్యమైన శరీర బరువు ఉండాలి - బరువు ఎక్కువుంటే తగ్గించుకోవాలి.
 • ఉప్పు ఎక్కువ వాడటంవల్ల రక్తపోటు పెరుగుతుంది. సోడియం తక్కువగా ఉన్న పదార్థాలు తీసు కోవటం వలన అధిక రక్తపోటు నియంత్రించవచ్చును. సోడియంను 2 గ్రాములుకన్నా తక్కువ తీసు కోవాలి.(మాములుగా తీసుకునే దానిలో సగం)
 • కరిగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలు వంటి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి.
 • ఉప్పుకు బదులుగా, సోడియం తక్కువగా ఉండే నిమ్మకాయ, వెనిగర్, చింతపండురసం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా ధినుసులు వంటివి వివిధ రకాలైన రుచి పెంచే సుగంధ ద్రవ్యాలు మరియు సువాసన ఇచ్చే ఏజెంట్లు వాడవచ్చును.
 • సోడియం తక్కువగా ఉండి పోటాషియం ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, అరటి పళ్ళు మరియు బఠాణి గింజలు వంటివి వాడవలెను.
 • ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని మానివేయవలెను.
 • ప్రోసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవటం మానుకొనవలెను. వాటిలో ఉప్పు, పంచదార, కొవ్వు మరియు భద్రపరుచే రసాయనాలు ఉంటాయి. అవి రక్తంలో మరియు కోలెస్ర్టాల్ ను మరియు సీరమ్ సోడియం స్థాయిని పెంచుతాయి.
 • కాఫీ మరియు కోలాలువంటి పానీయములు మానవలెను.
 • మద్యం మానవలెను.
 • ప్రతిరోజు వ్యాయామం చేయవలెను.
 • పనితర్వాత ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండవలెను.
 • ప్రొగత్రాగుట మానవలెను.
 • వైద్యుని నియమానుసారంగా సంప్రదిస్తూ ఉండవలెను.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

 

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు