పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆహారం అసహిష్టత మరియు వికటింపు చర్య

ఈ విభాగంలోఆహారం అసహిష్టత మరియు వికటింపు చర్య గురించి వివరించబడింది

ఏదైన ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో వచ్చే అసాధారణ స్పందనను ఆహారం యొక్క అసహిష్టత అంటారు. అటువంటి అసహిష్టత రోగనిరోధక శక్తి యొక్క ప్రతిచర్యలకు దారి తీస్తే దానిని ఆహారం యొక్క వికటింపు చర్య క్రింద భావించవచ్చును.

ఆహారం యొక్క అసహిష్టతకు కారణములు

జన్యు లోపము

 • ప్రత్యేకమైన ఎన్జైమ్ల లోపం వల్ల వ్యక్తి నిర్ధిష్టమైన ఆహారం యొక్క అసహిష్టతకు గురి కావచ్చును.
 • ఉదాహరణలు : జింపిడి లోపం ఉన్నవ్యక్తి పెద్ద చిక్కుళ్ళు తీసుకున్నప్పుడు అతనికి ఫేవిజమ్ రావచ్చును.
 • లాక్టోజు అసహిష్టత :  లాక్టోజు అసహిష్టత ఉన్న వ్యక్తులలో పాలలోని తీపి పదార్ధాలను జీర్ణించుకునే ఎన్జైమ్ని లోపిస్తుంది. అటువంటి వ్యక్తి పాల ఉత్పత్తులను తీసు కున్నప్పుడు, కడుపులోని వాయువు పెరగటం, ఉబ్బరించడం మరియు కడుపు నొప్పి వస్తాయి.

ఆహారంలోని రసాయనాల వల్ల శరీరం విపరీతంగా స్పందించటం

 • ఆహారంలోని కొన్ని పదార్థాలు సున్నితంగా ఉండే కొన్ని వ్యక్తులలో కొన్ని లక్షణాలు కనబరుస్తాయి.
 • ఉదాహరణలు : కాఫీలో ఉండే కెఫైన్ అనే పదార్థం గుండెదడకు మరియు గుండె క్రమ భంగంతో కొట్టుకోవటం జరగవచ్చును.

ఆహారం యొక్క వికటింపుచర్య

 • వికటింపు చర్య అనేది శరీరం, ఆహారం హానికరం అని తప్పుగా భావించే రోగనిరోధకశక్తి యొక్క స్పందన.
 • వికటింపుచర్యలను సామాన్యంగా కలుగజేసే ఆహార పదార్థములు: పాలు,గుడ్లు చెట్టు కాయలు, వేరుశనగపప్పులు,చేప, ప్రత్యేకంగా నక్షత్రపు చేప,గోధుమలు మరియు చాక్లెట్.
 • వయస్సు పరిమితి లేదు కాని 5 సంత్సరముల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ.

సాధారణ లక్షణాలు

క్రింది ఇచ్చిన వాటీలో ఒకటిగాని లేక ఎక్కువగాని రావచ్చును.
 • నోటిలోని దురద పుట్టడం
 • నాలుక మరియు గొంతులో వాపు
 • శ్వాసలో ఇబ్బంది
 • దద్దుర్లు
 • వాంతులు,కడుపులో నొప్పి,అతిసారము
 • రక్తపోటు పడిపోవుట
 • తెలివితప్పుట మరియు మరణముకూడా.
 • లక్షణాలు నిమిషాలలో కాని లేక వ్యక్తి ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత గాని కనబడ వచ్చును. కొంత మందిలో మెల్లగా ఎదుర్కున్న తర్వాత దురదతో కూడిన చర్మ వ్యాధి రావచ్చును.

చికిత్స

 • ప్రస్తుతం, ఆహార వికటింపు చర్యలను తగ్గించడానికి ఎటువంటి మందులు లేవు. పడని ఆహారములను కఠినంగా మానుకోవటమే దీనికి మార్గము. వేరుశనగ పప్పులు,చెట్టు కాయలు, చేపలు,గుల్ల చేపలు వంటివి జీవితాంతము వికటింపుచర్యలు కనబరచినప్పటికీ, కొంత మంది వీటిని అధిగమిస్తారు.
 • ఆరు నెలల వరకు తల్లి పాలు త్రాగినచో తర్వాత పిల్లలకి ఆవుపాల వలన వచ్చే వికటింపు చర్యలను ఆపవచ్చును. ఆరు నెలల తర్వాత ఆవుపాలు,గుడ్డు,చేప మరియు వేరుశనగపప్పు వంటివి అదనంగా స్వల్పాహారం కింద ఇవ్వవచ్చును.
 • పచ్చిపాలు పడనట్లైతే పాలను కనీసం 10 నిమిషాలు మరగనివ్వాలి. గుడ్లు విషయానికి వస్తే వాటిలోని మాంసకృత్తులు వాటి లక్షణాలు మారిపోయేటట్టు ఉడికించవలెను.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు