పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కోలెస్ట్రాల్

ఈ విభాగంలో కోలెస్ట్రాల్ గురించి వివరించబడింది

 • కోలెస్ట్రాల్ ఒక రకమైన కొవ్వు.
 • ఇది రక్తకణ జాలాలలో ఉండే మైనం వంటి పదార్థము.
 • ఇది ఆరోగ్యవంతమైన కణత్వచమునకు మరియు విటమిన్ “డి "ని తయారుచేయుటకు మరియు కొన్ని గ్రంధుల ఉత్పత్తికి చాలా అవసరము.
 • జీర్ణమైపోయిన కొవ్వు నుండి కాలేయములో తయారుచేయబడి రక్తంలోకి వస్తుంది. గుడ్డుసొనలో మరియు కాలేయము వంటి ఆహారపర్థాలలో కూడా కోలెస్ట్రాల్ ఉంటుంది.
 • రక్తంలో వాటి యొక్క ప్రవాహం మీద ఆధారపడి చాలా రకములైన కోలెస్ట్రాల్ లు ఉన్నాయి. వాటిలో ఒకటైన ఎల్ డి ఎల్  ∕ (లోడెన్సిటి లిపో ప్రోటీన్) తక్కువ సాంద్రతగల లిపోప్రోటీన్,  చెడు చేసే కోలెస్ట్రాల్. ఇది శుద్ధరక్తనాళములలో అడ్డుపడి ఎథిరొస్కీరోసిస్ ను కలుగచేయును.మంచి చేసే కోలెస్ట్రాల్ అయిన హెచ్ డి ఎల్  ∕ (హైడెన్సిటి లిపోప్రోటీన్) ఎక్కువ సాంధ్రతగల లిపోప్రోటీన్ అడ్డుపడకుండా శుధ్ధరక్త నాళములను కాపాడుతుంది.
 • మూసివేయబడిన ధమనుల వల్ల గుండె జబ్బులు,గుండెపోట్లు వస్తాయి.

కోలెస్ట్రాల్ ఉండవలసిన స్థాయి

 • హెచ్ డి ఎల్  మరియు ఎల్  డి ఎల్  రెండూ కలిపి రక్తంలో ఉన్న మొత్తం కోలెస్ట్రాల్ అవుతుంది.
 • ఎంత తక్కువ శాతం ఉంటే అంత మంచిది.
 • మొత్తం కోలెస్ట్రాల్ శాతం మీద వివరణ.
 • హెచ్ డి ఎల్ శాతం ఎక్కువ (60 మిల్లిగ్రాము %కన్నా ఎక్కువ) స్థాయిలు గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మరి తక్కువ (35 మిల్లిగ్రాము% కన్నా తక్కువ) స్థాయిలు గుండె జబ్బు వచ్చే  ప్రమాదాన్ని పెంచుతుంది.
 • ఎల్ డి ఎల్ శాతం 100 మి.గ్రా./డి.ఎల్.  కన్నా తక్కువ స్థాయిలో ఉండాలి.

సూచన : రక్త పరీక్ష చేసుకోవడానికి ముందు కనీసం 8 గంటలు వరకు ఏమి తీసుకోకూడదు.ఆహారం తీసు కోవటం వల్ల కోలెస్ట్రాల్ స్థాయి మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రక్తంలోని కోలెస్ట్రాల్ స్థాయిని ఎలా నియంత్రించాలి?

రక్తంలో ఉండే కోలెస్ట్రాల్ స్థాయి మీద,ఆహారంలో తీస్కోబడే కోలెస్ట్రాల్ కన్నా కొవ్వు ప్రభావమే చాలా ఎక్కువ. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని, ఏరకమైన కొవ్వును ఎంత మోతాదులో తీసుకుంటాము అనే అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి. పశు సంబంధిత ఆహారము లేదా కూరగాయల్నుంచి లభ్యమయ్యే నూనెలో ఉండే సంతృప్త కొవ్వును ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో కోలెస్ట్రాల్  స్థాయి పెరుగుతుంది.

రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయి నియంత్రించుకోవటానికి ఆరోగ్య చిట్కాలు

 • సమపాళ్ళలో ఆహారం తీసుకొనటం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన కోలెస్ట్రాల్ మామూలు స్థాయిలో ఉంచవచ్చును.
 • ఎక్కువ కోలెస్ట్రాల్ ఉండే మాంసము మరియు గుడ్డు లోని పసుపు సొనను మానివేయండి.
 • బయట తయారు చేసే ఆహారపదార్ధాలు,ఎక్కువగా వేపిన పదార్ధాలను మానివేయండి.
 • ఎక్కువగా పళ్ళను, కూరగాయల్ని మరియు ధాన్యాలను తీసుకోండి.
 • వండేటప్పుడు నూనెనుగాని,నెయ్యిగాని తక్కువగా వాడండి.
 • ప్రొద్దుతిరుగుడు పువ్వుల నూనె, సాఫ్లవర్ నూనె,ధాన్యపు తౌడు నుండి తయారుచేయబడ్డ నూనెలను వాడవలెను.కొబ్బరి నూనె,పామ్ నూనె వాడకం తగ్గించుకొనవలెను.
 • మీగడ లేక ప్రోసెస్డ్ వెన్నకి బదులుగా కొవ్వు తీసివేయబడ్డ పాలు,తక్కువ కొవ్వుగల పెరుగు లేదా జున్నులాంటి పాల ఉత్పత్తులను వాడవలెను.
 • ఎక్కువ కోలెస్ట్రాల్ మరియు మధుమేహం,గుండెజబ్బులు లేక అధికరక్తపోటు వంటి ప్రమాదాలు ఉన్న వ్యక్తులు సరైన మందులు కోసం వైద్యనిపుణున్ని సంప్రదించుట అవసరము.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01515151515
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు