పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఊబకాయం

ఈ విభాగంలోఊబకాయం వల్ల కలిగే లోపాలు గురించి వివరించబడింది

ఒక వ్యక్తి ఉండవలసిన బరువు కన్నా 20శాతం ఎక్కువగా ఉంటే ఆతను  ఊబకాయం ఉందని చెప్పవచ్చు.

ఉండవలసిన శరీరం బరువు

 • యువకులు చక్కటి శరీరనిర్మాణ తీరు కోసం ఎత్తుకు  తగ్గ బరువు ఉండాలి.
 • సర్వసాధారణంగా శరీరం ఉండవలసిన బరువు గణించడానికి వినియోగించే కొలమానం శరీర ద్రవ్యరాశి సూచిక ( బాడీ మాస్‌ వేట్‌ ఇండెక్స్‌- బిఎమ్‌ఐ)
 • ఎత్తును మీటర్ స్క్వేరులోను బరువును కిలోగ్రాములలోను భాగాహారంలో గణించి బిఎమ్‌ఐని గణిస్తారు. ( కిలోగ్రాములలో బరువు/ మీటర్‌ స్క్వేర్‌ లో ఎత్తు)
రకం - బిఎమ్‌ఐ హద్దు కిలోగ్రాములు/మీటరు స్క్వేర్‌
అతి తక్కువ బరువు 16.5 కన్నా తక్కువ
తక్కువ బరువు 16.5నుండి - 18.5 వరకు
సాధారణం 18.5 నుండి - 25వరకు
ఎక్కువ బరువు 25 నుండి - 30 వరకు
చాలా లావైన 30నుండి - 35 వరకు
వైద్య పరంగా లావైన 35నుంచి -  40 వరకు
అనారోగ్యకరమైన బరువు 40 పైన
 • అన్ని వయస్సులవారికి , స్త్రీ, పురుషులకు బిఎమ్‌ఐ ఒకేలాగా ఉంటుంది.
 • మధ్యస్థ లావు ఇది సామాన్య స్థితి, ఎక్కడైతే కొవ్వుచేరి ఉంటుందో అక్కడ నడుము పరిమాణం   పెరుగుతుంది.
 • నడుము- తుంటి నిష్పత్తి లేదా నడుము నుండి తుంటి నిష్పత్తి (డబ్ల్యు హెచ్‌ ఆర్‌ )ని తీవ్రమైన మధ్యస్థ లావుకి నిర్ణయిస్తారు. డబ్ల్యు హెచ్‌ ఆర్‌ నిష్పత్తి నడుము నుండి తుంటి వరకు గల పరిధిని తెల్పుతుంది. తుంటి పరిధిని వెడల్పు భాగం నుంచి నడుము పరిధిని విభజిస్తూ (తుంటి ఎముకకు కొద్దిగా పై భాగంలో ఉండేది). డబ్ల్యు హెచ్‌ ఆర్‌  స్త్రీలలో 0.7ను పురుషులకు 0.9ని చూపిస్తూ సామాన్య ఆరోగ్యానికి సాపేక్షంగా ఉంటుంది.

ఊబకాయానికి ప్రభావితం చేసే కారకాలు

 • చాలా కారకాలు అతి బరువుకి లేదా ఊబ కాయానికి ప్రభావితం చేస్తాయి. ఇందొలో ముఖ్యమైనవి
 • తినే అలవాటు- శారీరక కృత్యాలు చేయకుండా చాలా కేలరీలుగల ఆహారాన్ని తిసుకోవడం.
 • పరిసర వాతావరణం-వ్యక్తుల యొక్క జీవన విధానాలపై ఇల్లు, పని, బడి, లేదా సమాజం ప్రభావితం చేస్తాయి.
 • జన్యుపరంగా – శరీర ప్రకృతికి, శక్తి కొరకు లేదా కొవ్వు నిల్వలకు  ఎంత కేలరీల ఖర్చు జరుగుతున్నది ఆను వంశికత ప్రధాన పాత్రను నిర్వహిమచి నిర్ణయిస్తాయి.
 • కొన్ని వైద్య పరమైన రోగాల వల్ల ఊబకాయం రావచ్చు.

ఊబకాయం మరియు ఆరోగ్యం

 • ఊబ కాయంగల వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవి ఏవంటే
 • గుండె జబ్బు
 • గుండె నొప్పి
 • మధుమేహం
 • కేన్సర్‌ (కోలాన్‌ -ప్రేవు, గర్భాశయ కేన్సర్‌ , బహిష్టు ఆగిపోయిన తర్వాత వచ్చే రొమ్ము కేన్సర్‌ )
 • బ్లాడర్‌-పిత్తాశయ జబ్బు
 • నిద్రలో శ్వాసకు ఆటంకం కల్గడం
 • ఆస్టియో ఆ ర్థైటిస్‌(కీళ్లు పనిచేయలేవు)
 • ఊబకాయంవలన అనేకరకాలైన గర్భిణీ సమస్యలు వస్తాయి.

బరువును ఎలా తగ్గించాలి?

 • తక్కువ కేలరీలుగల ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామంచేయడం బరువు తగ్గించుకోవడంలో కీలక విధానాలు
 • బరువు తగ్గించుకోవడానికి అభ్యాసం చేయవలసిన కొన్ని అంశాలు.
 • వేయించిన ఆహారాలను తినడం తగ్గించాలి.
 • పండ్లను , కాయగూరలను ఎక్కువగా తినాలి.
 • సంపూర్ణఆహారధాన్యాలను, పప్పుధాన్యాలను, మొలకెత్తు గింజల వంటి పీచుపదార్ధములు అధికంగాగల ఆహారాలను తినాలి.
 • తీవ్రమైన ఉపవాసాలు ఆరోగ్య ప్రమాద హేతువులు
 • మీ శారీరక కార్యకలాపాలకు అనుగుణమైన వివిధ రకాలైన ఆహారాలను తిని ఆనందపడండి.
 • తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లుగా క్రమబద్ధంగా తీసుకోండి. చక్కెర, కొవ్వు గల ఆహారాలను మద్యాన్ని తీసుకోవడం మాని వేయాలి.
 • మాంసకృత్తులు అధికంగా ఉండి, పిండి పదార్ధాలు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం రోజూ తీసుకుంటే బరువు తగ్గుతుంది.
 • సామాన్య పరిమితులతో శరీర బరువు ఉండేటట్లుగా చూసుకోవడానికి క్రమబద్ధమైన వ్యాయామాలు చేయాలి .
 • నెమ్మదిగా స్థిరంగా మాత్రమే బరువు తగ్గాలి.

వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవితం

వ్యాయామం వలన ప్రయోజనాలు

 • మెదడుతో సహా శరీరంలోని ప్రతీ భాగానికి వ్యాయామంవలన ప్రయోజనముంటుంది.
 • యామంతో చూడతానికి గూడ బాగుంటావు.
 • వ్యాయామం దోహదపడడమేగాక కొన్ని జబ్బుల బారినపడకుండా  కూడా ఉంటాము.
 • మితమైన వ్యాయామం చేయడంవలన ఎక్కువ బరువుగల స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.
 • యామం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి.

చక్కటి శారీరక తుల్యత కొరకు చేయవలసిన వ్యాయామాలు

శారీరక సమతుల్యతకు  ప్రతీరోజు చేయవలసిన వ్యాయామ విభాగాలలో  ఏరోబిక్‌ ఎక్సర్‌ సైజ్‌, శారీరక ద్రూఢత్వానికి శిక్షణ,  సులభంగా శరీరావయవాలు కదలడానికి శిక్షణ.

ఏరోబిక్‌(శ్వాసకు సంబంధించిన ) వ్యాయామం

 • ఏరోబిక్‌ (శ్వాసకు సంబంధించిన) వ్యాయామంతో గుండె సక్రమంగా కొట్టుకోవడానికి, శ్వాస క్రియావేగాన్ని పెంచాడానికి తోడ్పడుతుంది.
 • ఉదాహరణలు :  ఈతకొట్టడం, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌, హాకీ, పరుగు, నాట్యం, త్వరితంగా నడవడం వంటి ఆటలు.

దృఢత్వానికి శిక్షణ

 • కండరాల దృఢత్వానికి చేసే కార్య కలాపాలు కీలకమైనవి.
 • భిన్నమైన రకాల వ్యాయామాలు భిన్న కండరాల సమూహాలకు దృఢత్వానికి దోహదంచేసే వాటికి ఉదాహరణః
 • బలమైన చేతుల కొరకు పుల్లప్స్‌- పుష ప్స్‌
 • బలమైన కాళ్ళ కొరకు – పరుగు
 • పొట్ట సరైన అకారంలో ఉండడానికి - యోగ, పైలేట్స్‌ , క్రంచ్
 • సులభంగా శరీర అవయవాలు కదలడానికి శిక్షణ కండరాల, కీళ్ల కార్యకలాపాల కదలికలు మెరుగవడానికి
 • ఉదా|| పైలెట్స్‌, యోగ, సరళమైన సాగుతీత వ్యాయామాలు

ఆరోగ్య చిట్క: శరీర బరువు తగ్గించడంలోనడక, పరుగు, మరియు సైక్లింగ్‌ ఎ క్కువ ప్రభావంచూపే వ్యాయామాలు

తక్షణ ఆహారాలు/ జంక్‌ ఫుడ్‌ (పోషకవిలువలులేని ఆహారం)

 • తక్షణ ఆహారాలను త్వరితంగా తయారుచేసి వేగంగా అందిస్తారు .
 • ఉదా|| పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్‌, సమోసాలు, కచోరీలు మరియు కట్‌ లెట్స్‌
 • జంక్‌ ఫుడ్‌ ఇది అనారోగ్యకరమైనది. అంతేగాక అతి తక్కువగా లేదా అసలే పోషక విలువలులేని ఆహారం.
 • జంక్‌ ఫుడ్‌ను తినడంవల్ల ఊబకాయం, గుండెజబ్బు, రెండవ రకపు మధుమేహం, దంతాలలో ఖాళీలు వంటివి వస్తాయి.
 • దీనిని మితంగా తినాలి లేదా అసలే తినకూడదు.
 • శీతల పానీయాలు తగడం వలన ఆరోగ్యానికి హానీకరం. వీటిలో కెఫిన్‌ ఉంటుంది. ఇది శరీరంలోని నీటిని నష్టపరుస్తుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.17
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు