অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆస్టియోపోరోసిస్‌

ఎముకలు బలహీనమవడం

ఖనిజ లవణాల లోపం - కాల్షియమ్‌, విటమిన్‌-డిల లోపం

ఆస్టియో పోరోసిస్‌ ఎలా వస్తుంది.

  • ఎముకలలో ఉండే ద్రవ్య రాశి తగ్గిపోవడం. ఎముకల సర్వ  సాధారణ జీవ క్రియకు సంబంధించిన జబ్బు.
  • ఎముక దృఢమైన వెలుపలి కర్పరం (కార్టెక్స్‌-రక్షణ కవచం) తోను, లోపలి భాగం నార (ఫైబర్‌ )వంటి ట్రాబిక్యులే తో ఉండి బలమైన ఎముకగా రూపొందుతుంది.
  • ముపై అయిదేళ్ళ వయస్సు వచ్చే వరకు ఎముక ద్రవ్య రాశి స్థిరమైన అభివృద్ధితో ఉంటుంది. పూర్తి రూపాన్ని పొందేటంత వరకునూ తిరిగి నిర్మితమయ్యే వరకు , విరిగి నప్పుడు అతుక్కోవడం, అభివృద్ధి చెందడం జరుగుతుంది.
  • నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంత వరకైతే ఆభివృద్ధి అవుతుందో అంతకన్నా మించి నట్లైయితే ఎముక చిట్లి పోవడం ఎముకలో గల ద్రవ్య రాశి తగ్గి పోవడమే గాకుండా ఎముకలో గల కాల్షియమ్‌ కూడ తగ్గుతుంది.
  • స్త్రీలలో వయస్సుతో ఏర్పడే ఎముక నష్టం తోబాటు బహిష్టు ఆగిపోయే దశలో స్త్రీ సంబంధిత హార్మోన్‌ (ప్రధానంగా ఈస్ట్రోజెన్‌) స్థాయిలు తగ్గిపోవడం ఫలితంగా ముఖ్యంగా  కార్టిక్యులార్‌ , ట్రాబెక్యులార్‌  ఎముక నష్టం జరుగుతుంది. వారిలో ఆస్టియో పోరోసిస్‌ వచ్చినట్లయితే కార్టిక్యులార్‌ , ట్రాబెక్యులార్‌  ఎముక నష్టం 30-40 శాతం ఏర్పడి  ఎముకలు సున్నితమై పెళుసుబారి విరగడానికి సిద్ధంగా ఉంటాయి.

ఆస్టియొపోరోసిస్‌ రావడానికి గలకారకాలు

  • ఆస్టియొపోరోసిస్‌ రావడనికి వివిధ కారణాలున్నాయి.
  • వయస్సు సర్వసాధారణమైన కారకం. వయస్సు పెరుగుతున్న కొద్దీ సరిపడినంతగా కాల్షియమ్‌ తీసుకోకపోతే కాల్షియమ్‌ లవణం క్రమంగా తగ్గిపోతుంది. ఈస్ట్రోజెన్‌ స్థాయిలు తక్కువగా ఉన్న ( ఉదా|| మెనోపాజ్‌- బహిష్టు ఆగిపోయిన తర్వాత) స్త్రీలలో మిగిలిన వారిలో కన్నా తొందరగా ఆస్టియొ పోరోసిస్‌ వస్తుంది. మగవారిలో ఎముక సాంద్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆస్టియొపోరోసిస్‌ అంత సులభంగా రాదు.
  • వయసు పై బడినవారిలో - ముఖ్యంగా స్త్రీలలో సాధారణంగా చిన్నగా ఉన్న ఎముకలు తేలికగా ఉండి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీని వలన వీరిలో ఆస్టియొపోరోసిస్‌ ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది.
  • గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులకు ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. తల్లి గనుక తగినంత కాల్షియమ్‌ను ఆహారంలో తీసుకోక పోయినట్లయితే పిండం పెరుగుదలకు, శిశువు పాలకు సరఫరా కావలసిన కాల్షియమ్‌ తల్లి ఎముకల నుంచి జారుతుంది. చిన్నతనంలో తల్లులు కావడం, ఏటికేడాది పిల్లలు పుట్టడం , మరియుబిడ్డ పుట్టడానికిముందు పుట్టిన తర్వాత ఒత్తిడిచెందే  కాలంలో పోషక విలువలు తక్కువగాగల ఆహారాన్ని తీసుకోవడం వల్ల సర్వ సాధారణంగా భారత దేశపు స్త్రీలలో ఎక్కువగా ఆస్టియోపోరోసిస్‌ వస్తుంది.
  • పొగ త్రాగడం, మద్యపానం , స్థిరంగా కూర్చుని ఉండే జీవన  విధానాలద్వారా ఆస్టియోపోరోసిస్‌ పెరిగే అవకాశం ఎక్కువైంది.
  • బలహీనమైన ఎముకలు సులభంగా విరుగుతాయి ముందుకు వంగి  నిల్చునే విధానాలవలన ఆయా వ్యక్తులకు ఎముకలకు సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి.

రోగ చిహ్నాలు -లక్షణాలు

  • ఎముక విరిగే దాకా చాలా మందికి వారిలో ఆస్టియొపోరోసిస్‌ ఉందని తెలియదు.
  • ఏ ఇతర లక్షణాలు సామాన్యంగా ఉండవు- కొంత మంది ముసలి వారు తాము కొద్దిపాటిగా పొట్టిగా అయినట్లు లేదా నడుము వంగినట్లు గా గుర్తిస్తారు.
  • ఆస్టియొపోరోసిస్‌ ఉన్న ముసలి వారు కింద పడితే  తుంటి ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది. ఆస్టియోపోరోటిక్‌ ఎముక  చాలా నెమ్మదిగా నయమవుతుంది.
  • కీళ్ళనొప్పులు ఉన్న వారిలోఆస్టియోపోరోటిక్‌ ఎముక  చాలనొప్పిగా ఉండి  జీవితం దుర్భరంగా ఉంటుంది.

రాకుండా జాగ్రత్తలు- చికిత్స

  • చిన్న వయస్సులోనే ఎముక ఆరోగ్యాన్నిచూసుకోవడం ప్రధానం.
  • ఆమెకు లేదా అతనికి ఆస్టియోపోరోసిస్‌ ఉన్నదని చెప్పినప్పుడు ఇంకనూ జరిగే ఎముక నష్టాన్ని రాకుండా చూసుకోవాలి. మందులద్వారా చికిత్స పొందుతున్న వారిలో ఎముక నష్టం నెమ్మదిగా జరుగుతుంది. కాల్షియమ్‌ను పూరించడానికి కావలసిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులిచ్చే సలహాను పాటించాలి.
  • ఆస్టియోపోరోసిస్‌ చికిత్సలో ఆహారనియమాలను పాటించి శారీరక వ్యాయామాలను చేయడం ప్రధానమైన అంశాలు.
  • ఆరోగ్యకరమైన, కాల్షియమ్‌ సమృద్ధిగా ఉన్న  వివిధ ఆహారపదార్ధాలను తీసుకోవడంతోబాటు నడక పరుగెత్తడంవంటి క్రమం తప్పని వ్యాయామాలద్వారా ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయి.బరువువిషయంలో శిక్షణ లేదా ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు.కిందపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పిల్లలకు సర్వసాధారణంగా ఆస్టియోపోరోసిస్‌ రాదు కాని తర్వాతి కాలంలో రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడంతో బాటు కాల్షియం సమృద్ధిగాగల ఆహారాలను ( పాలు, వెన్న, పెరుగు, ఆకుకూరలు మరియు సిట్రస్‌ (నిమ్మజాతి) పండ్లను )తినాలి.
  • ఉత్సాహంగా ఉండడానికి ఆటలు బాగా ఆడాలి. పరుగు, దుమకడం వంటి క్రీడలలో పాల్గొనాలి. నాట్యం చేయ్యడంలాంటివి చేయాలి.
  • పొగ త్రాగడం మానివేయాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate