অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వివిధ వయసుల వారిమీద పోషకాహారలోపము యొక్క ప్రభావము.

వివిధ వయసుల వారిమీద పోషకాహారలోపము యొక్క ప్రభావము.

గర్భిణీ స్త్రీ మీద పోషకాహారలోపము చూపించే ప్రభావములు

  • తరచూ ఎదురయ్యే సమస్యలు మాంసకృత్తుల శక్తిపోషకాహార లోపము, అయోడిన్ లోపము వల్ల అవ్యవస్థ, విటమిన్ ఎ, ఫాలికామ్లము మరియు కాల్షియం లోపము.
  • గర్భిణీ స్త్రీపై పోషకాహారలోపము ఈ క్రింది ప్రభావములు చూపుతుంది
  • మాతృత్వపు వయసు మరియు శారీరక పరిమాణము
  • బాలిక ఎదిగే దశల్లోని తీవ్ర పోషకాహారలోపము చిన్నదైన ఆకారము గా పరిణమిస్తుంది. బాల్య వివాహాము మరియు కౌమార వయసులోని (ఎక్కువగా 16 సంవత్సరాల లోపు) గర్భము సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

సూక్ష్మపోషకాల లోపాలు

  • పోషకాహార లోపమున్న మహిళ గర్భ్హిణీగా ఉన్నప్పుడు సూక్ష్మ పోషకాల లోపాలు సమస్య తీవ్రమవుతుంది.
  • ఎక్కువగా ఉండే లోపాలు పోషకాహార రక్తహీనత, బి కాంప్లెక్స్ లోపాలు, కాల్షియం బలహీనత (ఎముకల సాంద్రత తగ్గటం గా చూడవచ్చు) విటమిన్ ఎ లోపము (రేచీకటిగా చూడవచ్చు).

ప్రసూతి మరణాలు

  • రక్తహీనత మరియు మత్తు పదార్ధాల సేవనం వల్ల రక్తంలో కలిగే స్థితి వల్ల దాదాపు 30,-40 శాతం ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి.

వృధా అవుతున్న పిండాలు

  • తీవ్ర పోషకాహార లోపము వల్ల దిగువ తరగతి సాంఘిక, ఆర్ధిక మహిళల్లో సంభవించే గర్భాల్లో సుమారు ఇరవైశాతము  గర్భస్రావాలుగా, నిర్జీవ జననాలుగా అంతమొందుతున్నాయి.

గర్భధారణలోని చిక్కులు

  • తీవ్రమైన వేవిళ్ళు (హైపరెమెసిస్ గ్రావిడారం) పైరిడాక్సిన్ ను ఎక్కువ మోతాదులో ఇవ్వటం వల్ల స్పందిస్తారు,  ఈ పరిస్ధితి విటమిన్ లోపము సూచిస్తుంది .
  • గర్భధారణ వల్ల కలిగే రక్తపుపోటు వల్ల  ప్రసూతి వాతపు ముందు దశకు, తీవ్రమైన ప్రసూతి వాతానికి ఎక్కువగా పోషకాహార లోపమున్న మహిళలలో కనిపిస్తుంది.
  • పోషకాహార లోపమున్న తల్లులకు శిశుజననం దుర్భరంగా ఉంటుంది, కారణం తొడ (పెల్విక) ఎముకలు అపరిపక్వంగా ఉండటం.

రోగ సంక్రమణం  ( ఇన్ఫెక్షన్ )

  • పోషకాహార లోపమున్న మహిళలకు రోగాలు సంక్రమించే ప్రమాదమెక్కువ. ఇందు వల్ల జననానికి ముందు తర్వాత అనారోగ్యస్థితికి, ప్రసూతి మరణాలు వంటి తీవ్ర ప్రమాదాలకు దారితీసే ప్రమాద మెక్కువ.

మాతృత్వపు పోషకాహార లోపము గర్భస్థ పిండము పై చూపే ప్రభావము.

పిండములో పుట్టుకతోవచ్చే వైకల్యాలు

  • బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఎ, మాంసకృత్తులు మరియు ఫాలికామ్లాల లోపము పిండములో పుట్టుక తో వచ్చే వైకల్యాలకు కారణము.

తక్కువ బరువుతో పుట్టటం

  • పోషకాహార లోపముగల స్త్రీల గర్భాశయములోని ఎదుగుదల మందగించటం వల్ల వారికి పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. శిశు మరణాలకు ఇది ఒక ప్రధాన కారణము.

శిశుమరణాలు

  • తల్లియొక్క పోషకాహారస్థాయి ప్రసవ కాలిక శిశుమరణాల (ఏడవనెల గర్భం నుంచి ప్రసవించిన ఒకవారం వరకూ) ను, పుట్టిన నెల రోజుల వరకూ (ప్రసవమయ్యాక వారం నుంచి ఒక నెలరోజుల) శిశు మరణాలను బాగా ప్రభావితం చేస్తుంది.
  • రక్త హీనత యొక్క తీవ్రత పెరిగిన కొద్దీ నెలలు నిండ నిజననాలు, తక్కువ బరువుతో పుట్టటం, ప్రసవ కాలిక శిశు మరణాలు అధికంగా ఉంటాయి.

తల్లి కడుపులో పెరిగే పిండము యొక్క కాలేయములో తగ్గిన పోషకాల నిలువలు

  • తల్లికి పోషకాహార  లోపమున్నట్లయితే  పిండము యొక్క కాలేయము లోని ఇనుము, ఫాలికామ్లము, విటమిన్ బి12, విటమిన్ ఎ మరియు కాల్షియం ప్రత్యేకించి ప్రభావితం అవుతాయి. శిశుదశలో పోష కాహారలొపము కొనసాగినట్లయితే శిశుమరణాలకు ఇదొక కారణమవుతుంది.

మెదడు యొక్క అభివృద్ధి మరియు మానసిక విధులు

  • మెదడు యొక్క ఎదుగుదలలోని కీలకదశ (గర్భాశయములోని జీవితము లోని చివరి ఆరు వారాలు ప్రసవమయ్యాక  మొదటి ఆరునెలలు) లోని పోషకాహార లోపము మెదడు అభివృద్ధి మరియు మానసిక విధుల మీద ప్రభావము చూపుతుంది.
  • తల్లిలోని అయోడిన్ లోపము ఎదుగుతున్న పిండము యొక్క మెదడుకు నష్టం కలిగిస్తుంది.

శిశువుల మీద, చిన్నపిల్లల మీద పోషకాహార లోపము యొక్క ప్రభావాలు

  • మాంసకృత్తుల శక్తి పోషకాహార లొపము ఎదుగుదల మందగించటానికి, అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని పెంచటం మరియు మరణానికి గురయ్యే ప్రమాదానికి మరియు పోషకాహారలోపము కొనసాగటానికి దారితీస్తుంది.
  • అయోడిన్ లోపము అవ్యవస్థ ఎదుగుదల మందగించటానికి మరియు మెదడు దెబ్బతినటానికి మరియు గాయిటర్ వ్యాధికి దారితీస్తుంది.
  • విటమిన్ ఎ లోపము అంధత్వానికి మరియు అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదానికి ఎక్కువగా దారితీస్తుంది
  • ఐరన్ లోపము రక్తహీనతకు, శారీరక కార్య కలాపాలు తగ్గటానికి మరియు నేర్చుకునే సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది.

కౌమారదశలో పోషకాహారలోపముయొక్క ప్రభావములు

  • మాంసకృత్తుల శక్తి పోషకాహారలోపము ఎదుగుదల యొక్క వేగాన్ని తగ్గించటం, యౌవనదశ ఆలస్యంగా వచ్చేలా చెయ్యటం మరియు ఎత్తు ఎదగకుండా చేస్తుంది.
  • అయోడిన్ లోపము అవ్యవస్థ మానసిక ఎదుగుదల ఆలస్యమవటం / మందగించటానికి మరియు గాయిటర్ వ్యాధికి కారణ భూతమవుతుంది.
  • ఐరన్ లోప రక్తహీనత మరియు ఫాలికామ్లపు లోపము రక్తహీనతకు గురిచేసి తద్వారా శారీరక శ్రమచేసే సామర్ధ్యాన్ని తగ్గింపజేస్తాయి.
  • విటమిన్ ఎ లోపము వల్ల అంధత్వము మరియు అంటు వ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తాయి.
  • కాల్షియం యొక్క లోపము వల్ల ఎముకలకు సరైనవిధంగా ఖనిజాలు అందవు.
  • శారీరక శ్రమ పెరగటం, సరిగాలేని ఆహారపు అలవాట్లు, రుతుక్రమం మొదలవటం మరియు త్వరగా వచ్చిన గర్భం వల్ల పై పరిస్ధితులు, మరింతగా దిగజారుతాయి.

పెద్దలు మరియు వృద్ధులలో పోషకాహారలోపము

పెద్దలు

  • మాంసకృత్తుల శక్తి పోషకాహారలోపము (పి ఇ యమ్) మరియు ఐరన్ లోపము, రక్తహీనత గిడసబారటం, దుర్బలులుగా చెయ్యటం, మందకొండి తనానికి గురిచేస్తుంది, ఇవన్నీ పనితీరును తగ్గిస్తాయి మరియు ఉత్పాదక జీవితము యొక్క వయసును తగ్గిస్తాయి.
  • అతి పోషకత ఊబకాయానికి మరియు హృద్రోగాలకు, మధుమేహవ్యాధికి, కాన్సర్లు, రక్తపోటు, పక్షవాతం లాంటి సంబంధితవ్యాధులకు దారితీస్తుంది.

వృద్ధులు

  • వృద్ధులలో ఎక్కువమంది మాంసకృత్తుల శక్తి పోషకాహార లోపము (పి ఇ యమ్) మరియు ఐరన్ లోపరక్తహీనత, ఊబకాయం, మరియు మధుమేహం వంటి ఇతర ఆహారసంబంధమైన వ్యాధులకు లోనవుతారు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate