অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహారంలో కలిపే పదార్థాలు (ఫుడ్ ఎడిటివ్స్)

ఆహారంలో కలిపే పదార్థాలు

  • ఆహారంలో కలిపే పదార్థాలు (ఫుడ్ ఎడిటివ్స్) అనేవి ఆహారంలో తక్కువ మోతాదులో కలుపే రసాయనాలు.
  • ఆహారం బాగా కనిపించడానికి, రుచిగా ఉండటానికి, పోషక విలువను పెంచడానికి, తాజాగా ఉండటానికి ఆహారం తయారు చేసేటప్పుడు కావాలనే ఈ రసాయనాలని కలుపుతారు.
  • ఎడిటివ్స్ అనేవి రసాయినిక పదార్థాలు కాబట్టి, వాటి వాడకం కల్తీ ఆహారాన్ని నిరోధించే (ఫుడ్ అడల్ ట్రేషన్) చట్టం క్రింద నియంత్రించబడుతుంది.
  • ఈ రసాయినిక పదార్థాలు కేన్సర్, జీర్ణసమస్యలు, నరాల సంభంధించిన సమస్యలు, అధిక బరువు ఇంకా గుండె జబ్బుల్లాంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. కావున వాటిలో వాడమన్న వాటినే వాడాలి.
  • ఎక్కువ మోతాదులో వాడితే ప్రకృతిపరమైన ఎడిటివ్స్ కూడా చాలా హానికరం కావచ్చు. (ఉప్పు ఒక ఉదాహరణ)

ఆహారం తయారు చేసే సంస్థలలో సాధారణంగా వాడే ఎడిటివ్ లు.

  • ఆమ్లములు - వెనిగర్, సిట్రిక్ ఆమ్లము, టార్ టారిక్ ఆమ్లము, మాలిక్ ఆమ్లము, ఫుమారిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము.
  • యాంటి కేకింగ్ ఏజంట్లు - పాలపొడి లాంటి పొడులను అంటుకోకుండా ఆపుతుంది. ఉదాహరణకి - కాల్షియం సిలికేట్ మరియు మెగ్నీషియం స్టీరేట్.
  • యాంటి ఆక్సిడెంట్స్ - విటమిన్ సి లాంటి యాంటి ఆక్సిడెంట్లు ఆమ్లజని యొక్క ప్రభావం పడకుండా ఆహారం నిల్వఉంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
  • బల్కింగ్ ఏజంట్లు - గెంజి లాంటి బల్కింగ్ ఏజంట్లు పోషక విలువలు ఏమి చెదరకుండా ఆహార పరిమాణాన్ని పెంచడానికి దోహద పడతాయి.
  • ఆహారం తయారు చేసేటప్పుడు కోల్పోయిన రంగులను మళ్ళీ రావడానికి లేదా ఆహారం ఇంకా ఆకర్షణీయంగా కనపడటానికి రంగులు వాడతారు.
  • యమల్సి ఫైయర్లు - ఇవి నీరు మరియు నూనె కలిసి పోవటానికి ఉపయోగపడతాయి. దీనివల్ల ఆహారం ఐస్ క్రీం లాగా సమానంగా, మెత్తగాను ఉంటుంది. ఉదాహరణకి - గుడ్డు సొన, లెసిథిన్ మరియు మోనో గ్లిసరైడ్లు.
  • ఫ్లావర్లు - ప్రత్యేకమైన ఆహారం రుచి కొరకు మరియు మంచి సువాసన కొరకు వాడే ఎడిటివ్ లను ప్లావర్లు అంటారు. ఇవి ప్రకృతి మిశ్రితాలు లేక కృత్రిమమైనవి కూడా కావచ్చు.
  • ఫుడ్ ప్రిజర్వేటివ్స్ - ఉప్పు లేక హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి రసాయనాలు,
  • స్టెబిలైజర్స్ - ఒక నిర్ధిష్టమైన రూపును ఇస్తాయి. ఉదా - జామ్ లో వాడేది అగర్ లేక పెక్టిన్
  • స్వీట్నర్స్ - ఉదాహరణకి - ఆస్పెర్టేమ్ మరియు సుక్రాలోజ్.
  • థిక్నర్స్ – ఆహారం యొక్క ధర్మాల్ని పెద్దగా మార్పుచేయకుండా దాని యొక్క సాంద్రతను పెంచుటకు ఉపయోగపడునవి. ఉదాహరణకి గార్ జిగురు మరియు జెలెటిన్.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate