অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహారాన్ని భద్రపరచే పద్ధతులు

ఆహారాన్ని భద్రపరచే పద్ధతులు

ఆహారం పాడవకుండా కాపాడేందుకు చాలా పద్ధతులున్నాయి,ఆవిధంగా ఏడాదిపొడుగునా వాడుకునేందుకు పనికివస్తాయి

భధ్రపరచే పద్ధతులు మరియు సాంకేతికప్రక్రియలు

  • ఆహారాన్ని తాకేందుకు సరైన పద్ధతులు:కొన్నిఆహారపదార్ధాలకు(వేరుశెనగ,కొబ్బరి,కమలా మరియు అరటి వంటి పళ్ళు)బాహ్యపొర ఉండివాటిని కాపాడుతుంది.సాధారణంగా తనజీవితకాలం ముగిసాక లేదా బాహ్యపొర పాడయినప్పుడు మాత్రమే శిధిలమవుతాయి.
  • అత్యధిక ఉష్ణోగ్రతవద్ద భధ్రపరచటం :భిన్నమైన సూక్ష్మజీవులను నశింపజేసేందుకు వేరువేరు కాలపరిమితుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలవద్ద ఉంచవలసిఉంటుంది.తర్వాత వీటిని సక్రమంగా పొట్లాలుకట్టవచ్చు.పాశ్చరైజేషన్ ద్వారా పాలను సూక్షజీవిరహితంగా చెయ్యవచ్చు.
  • తక్కువఉష్ణోగ్రతవద్ద భధ్రపరచటం :రోగాణువుసూక్ష్మజీవులు 5-7డిగ్రీలసెంటీగ్రేడు వద్ద రెట్టింపు అవవు.ఎక్కువకాలం మన్నేందుకు ఆహారపదార్ధాలనుతక్కువఉష్ణోగ్రతవద్ద భధ్రపరచవచ్చు.
  • ఎండబెట్టటం,నిర్జలీకరణద్వారా ఆహారపదార్ధాలను భధ్రపరచటం:ఆహారపదార్ధాలనుంచి తేమను ప్రకృతిశక్తులైన సూర్యుడు,గాలి ద్వారా కాని లేదా కృత్రిమమార్గాలద్వారా గాని తొలగించవచ్చు. తద్వారా అవిమన్నేకాలాన్ని పొడిగించవచ్చు. చేపలు,గుడ్లు,పాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి కూరగాయలు ద్రాక్షవంటి ఫలాలు తృణధాన్యాలు నిర్జలీకరణకు పాత్రమయినవి.
  • ఉప్పు మరియు పంచదార వల్ల భధ్రపరచటం: చక్కెరయొక్క అధికసాంద్రతతోకూడినచక్కెరపాకం లేదా 20శాతము ఉప్పు ఉన్న ఉప్పుద్రావకము వంటివి సూక్ష్మజీవుల ఎదుగుదలను నిరోధిస్తాయి.పచ్చళ్ళు పెట్టటం లో ఈ పద్ధతినుపయోగిస్తారు.
  • రసాయనాల ద్వారా భద్రపరచటం : ఆహారపదార్ధాలను శిధిలంమవటాన్ని నిరోధించే లేదా నిలిపివేసే పదార్ధమే రసాయనసంరక్షణకారి.కానీ వీటిలో ప్రతిఒక్కదాన్ని నిర్డేశించిన మోతాదులోనే వాడితీరాలి. లేకుంటే అవి క్షేమకరం కావు
  • సాధారణంగా ఉపయోగించే కొన్ని నిరపాయకరమైన సంరక్షణకారులు

    • -బెంజేయేట్స్-పళ్ళరసాలు,జాములు,జెల్లీలు మొదలైనవాటిలో అధికంగా వాడతారు.
    • - సోర్బేట్స్-జున్ను మరియు జున్ను ఉత్పత్తులు,పళ్ళు మరియు జెల్లీలు బేకరీ ఉత్పత్తులలో వాడతారు.
    • ఏసిటేట్స్-వినెగర్ లో ప్రధానభాగముగా అసిటిక్ ఆమ్లాన్ని కలిపి పచ్చళ్ళు,జాములు వంటి ఉత్పత్తులలో వాడతారు.
  • ధార్మికశక్తిద్వారా భధ్రపరచటం: అతినీలలోహితకిరణాలు,ఎక్స్ర్-రే కిరణాలు మరియు బీటా కిరణాలద్వారా భధ్రపరచవచ్చు.
  • ఇది ప్రమాదకరమైన రసాయనిక సంరక్షణకారులకు ప్రత్యామ్నాయం మరియు ఆహారపదార్ధాల రంగు,రుచి మీద ప్రభావం చూపవు.

    పాడైపోయే ఆహారపదార్ధాలయిన పళ్ళు,కూరగాయలు,మాంసం,కోళ్ళ ఉత్పత్తులు,చేపలు మొదలైనవాటిలోని పాడుచేసే సూక్ష్మజీవులను నాశనము చెయ్యటములో శక్తివంతంగా పనిచేస్తాయి.

    ఉల్లి,వెల్లుల్లి మరియు బంగళాదుంపలు మొలకెత్తకుండా వీటిని సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

    మామిడి,బొప్పాయి వంటి ఫలాలు మిగలపండకుండా మరియు పాడవకుండా నిరోధిస్తాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate