పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సమతుల్య ఆహారము

ఈ విభాగంలో సమతుల్య ఆహారము గురించి వరించబడింది

సమతుల్య ఆహారము అంటే విటమిన్లు,ఖనిజాలు,మాంసకృత్తులు వంటి విభిన్న ఆహార పదార్ధాలను రాశిపరంగా నిష్పత్తిపరంగా శరీరావసరాలకు తగ్గట్టు సరఫరా చెయ్యటమే.ఈ అవసరాన్ని తీర్చటమేకాక పోషకపదార్ధాలు లభ్యంకాని కొన్ని చిన్నచిన్నకాలపరిమితులను తట్టుకునే విధంగా కూడా ఇందులో కేటాయింపు ఉంది.

ఆహారపదార్ధాలలోవైవిధ్యం,వాటిపోషక విలువలు,వ్యక్తుల పోషకాహార  అవసరాలు,ఆహారప్రణాళిక యొక్క సిద్ధాంతాలు, సామాజిక-సాంస్కృతిక కారకాలు మొదలైనవాటన్నిటినీ పరిగణనలొకి తీసుకుని సమతుల్య ఆహారాన్నిసూత్రీకరించవచ్చు.

ఆహార సమూహాల వ్యవస్థ

 1. ఆహార సమూహాల వ్యవస్థ పరిమాణాత్మక పోషకాహార సమాచారాన్ని ఆహారసంబంధ సమాచారంగా మారుస్తుంది.
 2. ఇది సిఫారసు చెయ్యబడ్డ  దైనందిన ఆహారాన్ని అనుసరించి బలవర్ధకాహార ప్రణాళికను రూపొందించుకునేందుకు సహాయపడుతుంది.
 3. ఆహారాన్ని వాటిలో  అధికంగా ఉండే పోషకపదార్ధాలపై ఆధారపడి అయిదుసమూహాలుగా విభజించవచ్చు.ఆ అయిదు సమూహాలు;
  • తృణధాన్యాల గింజ ఉత్పత్తులు
  • కాయధాన్యాలు లేదా పప్పుదినుసులు
  • పాలు,గుడ్లు మరియు మాంసాహారాలు
  • పళ్ళు మరియు కూరగాయలు మరియు
  • కొవ్వు మరియు పంచదార

ఈ పంచ ఆహారసమూహవ్యవస్థను వైద్యనిపుణులు ఈ క్రింది ప్రయోజనాలకొరకు ఉపయోగిస్తారు:

 • పోషకాహారపు అంచనా కొరకు,భోగట్టా కొరకు ఒకసాధనముగా
 • పోషకాహారపుసలహాసంప్రదింపులకొరకు ఒక సాధనముగా
 • ఆహారపు ముద్ర కొరకు నిఘాఐదు ఆహారసమూహాల వ్యవస్ధ

ఆహార ప్రణాళికలో  ప్రాధమిక సూత్రాలు మరియి చిట్కాలు

ఐదు ఆహార సమూహాల వ్యవస్ధ

 • ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని రకాల ఆహార పదార్ధాలను జోడించండి. చాలినంత శక్తి, పోషక పదార్ధాలు లభ్యమౌతాయన్నంతగా ఐదు ఆహారసమూహాల నుంచి ఆహారపదార్ధాలను కలిపేందుకు యత్నించాలి.
ఆహార సమూహం ముఖ్య పోషకాలు
తృణధాన్యాలు మరియూ అనుజనితాలు
వరి, గోధుమ, రాగి, కొర్ర, మొక్కజొన్న,జొన్న, బార్లీ అటుకులు, గోధుమ పిండి
శక్తి, ప్రోటీన్లు, కనిపించని క్రొవ్వులు, విటమిను బి1, విటమిను బి2, ఫోలిచ్ ఆమ్లము, ఇనుము మరియు పీచు
అపరాలు మరియూ కాయ ధాన్యాలు
శనగలు, మినుములు, పెసలు, కందులు, సిరి శనగలు( మొత్తంగా మరియూ, పప్పులా), అలచందలు, బఠాణీలు, రాజ్మా, సోయా చిక్కుడు, చిక్కుడు మొ॥
శక్తి, ప్రోటీన్లు, కనిపించని క్రొవ్వులు, విటమిను బి1, విటమిను బి2, ఫోలిచ్ ఆమ్లము, ఇనుము మరియు పీచు
పాలు, మాంసాల అనుజనితాలు
పాలు
పాలు, పెరుగు, జున్ను, క్రొవ్వు తగ్గింపబడిన పాలు
ప్రొటీనులు, క్రొవ్వు, విటమిను బి2, కాల్సియం
మాంసం
కోడి, కాలేయం, చేప, గుడ్డు, మరియూ మంసం
ప్రొటీనులు, క్రొవ్వు, విటమిను బి2
పండ్లు మరియూ కూరలు
పండ్లు
మామిడి, జామ, పండిన టమాటా, బొప్పాయి, కమల, బత్తాయి, పుచ్చ
అ. కూరలు (ఆకుకూరలు)
తోటకూర , పాలకూర, గోంగూర, ములగాకు,  కొత్తిమీర, ఆవాల ఆకులు, మెంతికూర,
ఆ. ఇతరకూరలు
ఎర్ర ముల్లంగి, వంగ, బెండ, సీమమిరప, చిక్కుడు, ములగ, కోసుపువ్వు
కార్టెనోయిడ్లు, విటమిను సి, పీచు


కనిపించని క్రొవ్వులు, కార్టెనోయిడ్లు, విటమిను బి, ఫోలిక్ ఆమ్లం, కాల్సియం, ఇనుము, పీచు

కార్టెనోయిడ్లు, ఫోలిక్ ఆమ్లం,  పీచు
క్రొవ్వులు మరియూ చక్కెర
క్రొవ్వులు
వెన్న, నెయ్యి, హైడ్రోజనేటెడ్ నూనెలు, వంట నూనెలు, వేరుశనగ నూనె, ఆవనూనె, కొబ్బరినూనె లాంటివి
శక్తి, క్రొవ్వు, కావాల్సిన ఫ్యాట్టీ ఆమ్లాలు
చక్కెర
పంచదార, బెల్లం
శక్తి
 • ఎన్ని ఎక్కువ వీలైతే అన్నిరకాల ఆహారపదార్ధాల ను జోడించండి. చాలినంత శక్తి,పోషకపదార్ధాలు లభ్యమవుతాయన్నంతగా అయిదుఅహారసమూహాల నుంచిఆహారపదార్ధాలను కలిపేందుకు యత్నించాలి.
 • తృణధాన్యాలు,చిరుధాన్యాలు,కాయధాన్యాలు గనుక ఆహారములో ఎక్కువభాగము కనుక ఉంటే మాంసకృత్తుల అవసరం దానంతటదే తీరుతుంది,కాకపోతేసరిపడా తీసుకోవాలి .

ఆహారప్రణాళికను రూపొందించేటప్పుడు తీసుకోవాల్సిన ఆచరణ యోగ్యమైన చిట్కాలు

 • సాధారణంగాతీసుకునే మూడుప్రధాన భోజనాల (ఉదయపు ఫలహారం,మధ్యాహ్న,రాత్రిభోజనాలు)వల్ల కావాల్సిన పోషకాహారపు అవసరాలు తీరతాయి.ఫలహారాలు తరచూ తీసుకుంటున్నట్లయితే సరిపడా సర్దుబాటు చేసుకోవాలి.
 • ప్రతి భోజనము లోనూ వైవిధ్యమైన ఆహారపదార్ధాలను కలపటం మంచిది.
 • వంట తయారీ  మసలామయంగా ఉండకూడదు.
 • భోజనసమయములో శుభ్రంగా కడిగి, వలిచిన పచ్చికూరగాయల సలాడులు  తురిమిన క్యారట్లు / బీట్రూట్లు / ఉల్లిపాయలు / టమాటాలు  మొదలైనవి మరియు మొలకెత్తిన శనగలు మరియు పెసలు మొదలైనవాటిని ఉంచేలా సిఫారసు చెయ్యవచ్చు.
 • వండినవంటకాల రంగు,రుచి,చిక్కదనం ఆహ్లాదకరమైన,సంతృప్తికరమైన భావనను కలగజెయ్యాలి.
 • ఒక కుటుంబపుయొక్క కొనుగోలుశక్తిపై ప్రభావం చూపే సాంఘిక-ఆర్ధికకారకాలు, ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు, తిండిప్రాధాన్యతలు అన్నీ ఆహారప్రణాళికను రూపొందించేసమయములో జ్ఞప్తికుంచుకోవాలి.
 • సులభమైన వంటపద్ధతులైన ఉడికించటం,వేయించటం,బేకింగ్,కాల్చటం,పైపైనవేయించటం వంటివాటిని పాటించటం మంచిది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02631578947
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు