অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆరోగ్యవంతమైన గర్భం దాల్చుట కొరకు కావలసిన ఆహారం

ఆరోగ్యవంతమైన గర్భం దాల్చుట కొరకు కావలసిన ఆహారం

 1. గర్భిణికి ఆహారంలో సిఫారసు చేయబడ్డ అవసరమైన వివిధ రకములైన పోషకాలు  సూచించుట
  1. శక్తి
  2. ప్రొటీన్‌ (మాంసకృత్తులు)
  3. కాల్షియం
  4. ఐరన్‌ (ఇనుము)
  5. విటమిన్‌ ఎ
  6. విటమిన్‌ సి
  7. బి కాంప్లెక్స్‌ (మిశ్రమ) విటమిన్‌ లు
 2. గర్భిణీలకు పోషకాహారం గురించి చిట్కాలు
  1. పాలు మరియు పాల ఉత్పత్తులు
  2. తృణధాన్యాలు
  3. పండ్లు
  4. మాంసం, చేపలు మరియు పక్షిజాతి (పౌల్ట్రీ) మాంసం
  5. ద్రవ పదార్ధములు
 3. వీటిని వదిలి వేయడానికి ప్రయత్నించండి
 4. ప్రసవానికి ముందు అదనంగా  విటమిన్‌ - మినరల్‌ (ఖనిజ లవణాలు) ల ఆవశ్యకత
 5. గర్భిణీగా ఉన్నప్పుడు బరువు పెరగడం, మరియు పోషకాహారం
 6. పోషకాహారం మరియు వేవిళ్ళు(మార్నింగ్‌  సిక్‌నెస్‌)
 7. ఈ అసౌకర్యం నివారించుకోవడానికి లేక కనీసం తగ్గించుకోవడానికి చిట్కాలు
 • స్త్రీ  తన శరీరంలో పెరుగుతుండే గర్భస్థ పిండం యొక్క వృద్ధి పోషణ భారం వహించడంవలన గర్భం దాల్చడం అనేది ఒక స్త్రీకి సారీరకంగా తీవ్రమైన వత్తిడికలిగే సమయం.
 • గర్భం దాల్చుటతో పాటు, తల్లి శరీరంలో ఎన్నో విధాలైన శారీరక, జీవరసాయనిక, హార్మోన్‌ ల మార్పులు, పిండం ఎదిగే క్రమంలో చోటుచేసుకుంటాయి.
 • మాతృత్వ అవయవాలైన గర్భాశయం (యుటరస్‌), మాయ (ప్లసెంటా), స్తన ధాతువు (బ్రెస్ట్‌ టిస్యూ), వంటి వాటి పెరుగుదల వలన, ప్రసవ సమయంలో శరీర నిల్వలను ఉపయోగించుకోవడానికి, మరియు తల్లి స్తన్యమిచ్చే సమయానికి వీలుగా పోషక అవసరాలు కూడా అధికమవుతాయి.
 • ఏమైనప్పటికీ , ( అధికమైన పోషకాహారాన్ని తీసుకోవాలని) , ముఖ్యంగా గర్భిణి యొక్క రెండువ, మరియు  మూడువ  త్రైమాసికాలలో సూచిస్తారు.

గర్భిణికి ఆహారంలో సిఫారసు చేయబడ్డ అవసరమైన వివిధ రకములైన పోషకాలు  సూచించుట

శక్తి

 • గర్భం దాల్చుటకు ముందు ఉన్న శరీర బరువు, శారీరక శ్రమ, వయసుని బట్టి శక్తి అవసరాలు నిర్ణయింపబడతాయి.
 • సామాన్యంగా చురుగ్గా ఉండే ఒక గర్భిణి కానీ యుక్తవయస్కురాలైన స్త్రీకి, 1కె.జి. శరీర బరువుకు 40 కిలో కేలరీల శక్తి అవసరం.
 • భారత వైద్య పరిశోధనా సంస్థ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌- ఐ.సి.ఎం.ఆర్‌.) నిపుణుల వర్గం, స్త్రీ, గర్భవతిగా ఉన్న రెండవ అర్ధ భాగంలో రోజుకు 350 కిలో కేలరీలను తీసుకోవాలని సూచించారు.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ - డబ్ల్యు.హెచ్‌.ఒ), మొదటి త్రైమాసికంలో రోజుకు 150 కిలో కేలరీలను అదనంగాను, మిగిలిన రెండు త్రైమాసికాల్లో రోజుకు 350 కిలో కేలరీలు అదనంగాను  తీసుకోవాలని సూచించింది.
 • నేతి ని వాడకుండా చేసిన రెండు రొట్టెలను గాని, ఒక మధ్య స్థాయి గిన్నెనిండుగా శనగలు లేక రాజ్మగాని, రెండు ఇడ్లీలు గాని, లేక రెండు బంగాళదుంప టిక్కీలు గాని,  గర్భిణి  సాధరణంగా తీసుకునే ఆహారానికి అదనంగా తీసుకున్నట్లైతే, ఐ.సి.ఎమ్‌.ఆర్‌. , డబ్ల్యు.హెచ్‌.ఒ. లు సూచించిన అదనపు శక్తి అవసరాలు సులభంగా సమకూరతాయి.
 • ఈ విధంగా ఒక ఆరోగ్యవంతమైన, తన ఎత్తుకు తగినంత బరువుతో ఉన్న స్త్రీ తన ఆహార మొత్తం కొంచెం పెంచుకుంటే సరిపోతుంది.

ప్రొటీన్‌ (మాంసకృత్తులు)

 • 10 గ్రాముల మాంసక్రత్తులు పాలల్లోగాని, లేక ఒక గుడ్డులోగాని లభించే ప్రొటీన్‌ (మాంసకృత్తులు), గర్భిణికి రోజూ అవసరమయ్యే అదనపు మాంసకృత్తుల అవసరం తీరుస్తుంది. అదే శాకాహారులైతే , ఆమె ఎత్తుకు సూచించిన ఆహార అవసరంతో పాటు, అదనంగా రోజుకు 15 గ్రాములు ప్రోటీను తీసుకొనుట ద్వారా సమకూర్చుకోవచ్చు.
 • స్త్రీలు ఎవరైతే దీర్ఘ కాలంగా పోషకాహార లోపం తో ఉన్నారో, తగినంత బరువు లేరో, అంటువ్యాధులతో జబ్బులతో బాధపడుతున్నారో మరియు చిన్న వయసులో గర్భందాల్చినవారికి అధికంగా మాంసకృత్తులు, కేలరీలు అవసరమవుతాయి. గర్బందాల్చుట వలన కలిగే వత్తిడిని, దానిని అనుసరించి వచ్చే స్తన్యమిచ్చే ప్రక్రియ వలన లోపించే ధాతు మాంసకృత్తులను (టిస్యూ ప్రొటీన్‌) తిరిగి పొందేందుకు అధికమైన ప్రొటీన్‌ లు అవసరం.

కాల్షియం

 • గర్భిణి యొక్క గర్భవతి అయిన తరువాత రెం డవ అర్ధభాగంలో మొత్తం 1.0-1.2 గ్రాముల కాల్షియం ఇవ్వవచ్చు.

ఐరన్‌ (ఇనుము)

 • రోజుకు 30 మిల్లీ గ్రాములు.

విటమిన్‌ ఎ

 • గర్భిణి కాని స్త్రీలో వలెనే, రోజుకు 600 మైక్రో గ్రాములు.

విటమిన్‌ సి

 • గర్భిణి కాని సమయం లో వలెనే, రోజుకు 40 మిల్లీ గ్రాములు.

బి కాంప్లెక్స్‌ (మిశ్రమ) విటమిన్‌ లు

 • థయామిన్‌: అదనంగా 0.2 మిల్లీగ్రాములు.
 • రైబోఫ్లేవిన్‌: అదనంగా 0.2 మిల్లీ గ్రాములు.
 • నియాసిన్‌: అదనంగా 2 మిల్లీ గ్రాములు.
 • ఫోలేట్‌ : రోజుకు 400 మైక్రో గ్రాములు తీసుకోవాలని సూచింపబడింది.
 • విటమిన్‌ బి-12 : గర్భస్థ పిండం ఈ విటమిన్‌ ను నిలువ చేసుకోవడానికి వీలుగా 3.0 మైక్రో గ్రాములు.

గర్భిణీలకు పోషకాహారం గురించి చిట్కాలు

 • వివేకంగా ఆహారాన్ని ఎంచుకోవాలి.
 • సమతులాహారం అన్ని పోషకాలను సమకూర్చగలగాలి.
 • ఆరోగ్యవంతమైన స్త్రీలకు సరిపడినంత పోషకాహారం కొరకు, అదనపు ఆహారం గాని, అదనపు పోషకాలు  గాని అవసరం లేదు.

మీ రోజూవారి ఆహారంలో విభిన్న ఆహారపదార్ధముల నుండి లభించే వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు ఉండాలి ,అవి :

పాలు మరియు పాల ఉత్పత్తులు

 • మీగడ తీసిన పాలు, పెరుగు, మజ్జిగ లలో కాల్షియం, ముఖ్యమైన అమినో ఆవ్లుములు మరియు విటమిన్‌ బి-12 లను అధికంగా కలిగి ఉన్నాయి. ఎముకలు, దంతాల నిర్మాణానికి కాల్షియం ముఖ్యావసరం. మీరు తీసుకునే కాల్షియం సరిపోనట్లైతే, మీ శిశువు, మీ ఎముకల నుండి గ్రహించుటవలన, తరువాత జీవితంలో మీకు ఆస్టియోపొరోసిస్‌ (ఎముకలు బలహీనపడుట) వ్యాధి  సంక్రమించే అవకాశం ఉంది.

తృణధాన్యాలు

 • ధాన్యాలు, పప్పులు మరియు ఇతర కాయధాన్యాలు.
 • కూర గాయలు
 • కూరగాయలు, విటమిన్‌ లలో విటమిన్‌ ఎ మరియు విటమిన్‌ సి ని, ఖనిజ లవణాలు (మినరల్స్‌), పీచు పదార్ధం (ఫైబర్‌ ) (మలబద్ధకం నివారిస్తుంది), లను సమకూర్చుతాయి. పుల్లటి పండ్లు (సిట్రస్‌ ఫ్రూట్స్‌), క్యాబేజి, బంగాళ దుంపలు, పాలకూర (స్పినాక్‌), ఆకుపచ్చని చిక్కుడు, టమాటాల లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంది. వీటిని భుజించడం వలన శరీరం, ఆహార పదార్ధాలలోని ఐరన్‌ ను గ్రహించడానికి తోడ్పడతాయి. శరీరం, విటమిన్‌ సిను నిలువ చేసుకోలేదు కాబట్టి ఈ విటమిన్‌ సి లభించే అహార పదార్ధములను రోజూ భుజించాలి.

పండ్లు

 • కమలా ఫలాలు, ద్రాక్ష, పుచ్చ కాయలు, రేగు పండ్లలో విటమిన్‌ సి సమృద్ధిగా కలిగి ఉంటాయి. గాఢమైన పసుపు రంగు కలిగిన పండ్లు, ఉదాహరణకు బొప్పాయి, మామిడి, విటమిన్‌ ఎ ను అధికంగా కలిగి ఉన్నాయి. తాజా పండ్లు ఏ ఋతువులో దొరికినవి ఆ ఋతువులో భుజించండి. డబ్బాలలో నిలువ ఉంచిన , ప్రత్యేక ప్రక్రియతో  నిల్వ ఉంచిన పండ్లను వాడవద్దు.

మాంసం, చేపలు మరియు పక్షిజాతి (పౌల్ట్రీ) మాంసం

 • ఇవి ఆవశ్యకమైన జంతు సంబంధమైన మాంసకృత్తులను సమకూర్చుతాయి. చేపలు ప్రొటీన్‌ (మాంసకృత్తులు) ను అధికంగా కలిగినప్పటికీ, మాంసాహారులైన చేపలను ముఖ్యంగా అతి పెద్దవైన షార్క్‌, స్వార్డ్‌ (కత్తి) చేపల  ను తినకపోవడమే మంచిది. ఎందుకంటే, వీటిలో పాదరసం (మెర్క్యురీ) ప్రమాదకరమైన పరిమాణ స్థాయిల్లో ఉండే అవకాశం ఉంది.  ఈ చేపలు కలుషిత జలాల్లో నుండి పాదరసంను గ్రహిస్తాయి. ఈ పాదరసం చేప కండరాలను గట్టిగా పట్టి ఉండి, చేపలను ఉడికించిన తరువాత కూడా మిగిలే ఉంటుంది. ఎండు చేపలను, డబ్బాలలో నిలువ ఉంచిన చేపలను కూడా వాడరాదు. ఎందుకంటే, వాటిని నిలువ చేసే ప్రక్రియలో ఉప్పు ఎక్కువగా వాడడం వలన, వాటిని తీసుకోవడం వలన, శరీరంలోని చేరుకునే వ్యాధి (వాటర్‌  రిటెన్షన్‌) వస్తుంది.

ద్రవ పదార్ధములు

 • అధిక మొత్తంలో ద్రవ పదార్ధములను తీసుకోండి. ముఖ్యంగా మంచినీరు, తాజాపళ్ళ రసాలను త్రాగండి. నీరుత్రాగేటప్పుడు, నీరు పరిశుభ్రంగా ఉందో లేదో సరిచూసుకుని త్రాగండి. ఎందుకంటే, చాలా మటుకు వ్యాధులు, నీటిలో ఉండే వైరస్‌ ల ద్వారానే సంక్రమిస్తాయి.

వీటిని వదిలి వేయడానికి ప్రయత్నించండి

 • నత్తలుగుల్లలు వంటివి, (ఓయస్టర్స్‌) పచ్చి సముద్ర ఆహారం.
 • పచ్చి పాలను (మీ ప్రాంతంలోని పాలవాడి నుండి తీసుకునే గేదె మరియు ఆవు పాలు) త్రాగడం మానివేయాలి లేదా బాగా మరిగించి తాగాలి.
 • పచ్చి మాంసం, ఉడికీ ఉడకని మాంసం, పక్షి జాతి (పౌల్ట్రీ) మాంసం మరియు గుడ్లు, ఇవన్నీ బాక్టీరియా కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి, మీ గర్భస్థ శిశువుకు హాని చేయవచ్చు. అందువలన వాటిని బాగా ఉడికించండి.
 • కాలేయం, కాలేయ ఉత్పత్తులను కూడ వాడరాదు, ఎందుకంటే, వీటిలోఎ విటమిన్‌ రూపాంతరమైన రెటినాల్‌ అధికంగా ఉండే అవకాశం ఉంది, అది ఎక్కువగా తీసుకుంటే పెరుగుతున్న శిశువుకు హానికరం.
 • గర్భిణి గాఉన్నప్పుడు ఆల్కహాలు (మద్యం), త్రాగడం, పొగ త్రాగడం చేయరాదు.
 • కెఫైన్‌ ను కూడా తగ్గించడం మంచిది. ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 300 మిల్లీ గ్రాముల కెఫైన్‌ కంటె  ఎక్కువ తీసుకున్నప్పుడు, గర్భ స్రావం జరగడానికి, తక్కువ బరువు ఉన్న శిశువు జన్మించడానికి సంబంధం ఉన్నట్లు చెప్పబడింది. అందువలన జాగ్రత్త కొరకు, రోజుకు రెండు మగ్గుల ఇన్‌స్టెంట్‌ (సిద్ధంగా ఉన్న) కాఫీ, లేదా మూడు కప్పుల టీ, లేదా రెండు కేన్ల కోలా కు మించి త్రాగకుండా నియంత్రించుకోండి.

ప్రసవానికి ముందు అదనంగా  విటమిన్‌ - మినరల్‌ (ఖనిజ లవణాలు) ల ఆవశ్యకత

 • నిజానికి, ఒక మంచి సమతులాహార భోజనం, పోషక అవసరాలన్నిటిని సమకూర్చుతుంది. కాని, సురక్షితంగా ఉండడానికి, అదనంగా కొన్ని పోషకాలను ఇవ్వడం ద్వారా, తరువాత వచ్చే లోపాలను నివారించుకోవచ్చు.
 • ఫోలిక్‌ ఆవ్లుం (ఆసిడ్‌) : గర్భవతి కాక ముందు, గర్భవతి అయిన తరువాత మొదటి మూడు నెలల్లో ఇది తీసుకొనడం మంచిది. ఈ బి విటమిన్‌ లోపం గర్భవతి అయిన తొలినాళ్ళలో ఉండుటవలన శిశువులలో నాడీ నాళాలకు సంబంధించిన పుట్టుకతో వచ్చే లోపాలు (స్పినా బైఫిడా వంటివి) వచ్చే అవకాశం ఉంది. కనుక, స్త్రీలు, 0.4 మిల్లీ గ్రాములు (400 మైక్రో గ్రాములు) ఫోలిక్‌ ఆవ్లుంను గర్భిణీగా ఉన్న 12 వ వారం వరకైనా  అదనంగా తప్పకుండా తీసుకోవాలి.
 • ఐరన్‌ (ఇనుము) : గర్భిణీగా ఉన్నప్పుడు, ఐరన్‌ ఆవశ్యకత పెరుగుతుంది కాబట్టి, చాలా మంది స్త్రీలకు ఐరన్‌ అదనంగా ఇవ్వవలసి ఉంటుంది.
 • కాల్షియం : గర్బిణి ఉన్న రెండవ అర్ధ భాగంలో, కాల్షియం అదనంగా ఇవ్వవలసి ఉంటుంది. మీ ఎముకలు, భవిష్యత్తులో, ఆస్టియోపొరోసిస్‌ (ఎముకల బలహీనత) బారిన పడకుండా ఇది అవసరం.
 • విటమిన్‌ లతో జాగ్రత్తగాఉండాలి:  అతి మోతాదులో తీసుకోకూడదు. పెరుగుతున్న గర్భస్థ శిశువుకు ఇది హానికరం.
 • విటమిన్‌ ఎ అదనంగా ఇచ్చినప్పుడు, అందులో ఉండే రెటినాల్‌ అనే విటమిన్‌ ఎ రూపాంతరం ఎక్కువైనట్లైతే గర్భస్థ శిశువుకు విషపూరితమౌతుంది.
 • స్వంత వైద్యం మానివేయండి: ఎటువంటి యాంటి-బయాటిక్స్‌, ఆంటాసిడ్స్‌, నెప్పి నివారణ మందులను (పెయిన్‌ కిల్లర్స్‌) వాడే ముందు వైద్యుడిని ఎప్పుడూ సంప్రదించండి.

గర్భిణీగా ఉన్నప్పుడు బరువు పెరగడం, మరియు పోషకాహారం

 • గర్భవతిగా ఉన్నప్పుడు సాధరణంగా బరువు పెరగడం సగటున 11-12 కిలోలు ఉంటుంది.
 • చాలామంది స్త్రీలు, మొదటి త్రైమాసికంలో అత్యల్పంగా పెరిగి (1-2కిలోలు) తరువాత, వారానికి 0.4 కేజీల చొప్పున నిలకడగా పెరిగి రెండు, మూడు త్రైమాసికాలనాటికి, శిశువు పెరుగుదల  అధికంగా ఉన్నప్పుడు వారి బరువు కూడ అదే విధంగా పెరుగుతుంది.
 • గర్భిణీగా ఉన్నప్పుడు, తక్కువ బరువు పెరిగితే, తక్కువ బరువు ఉన్న శిశువులు జన్మించడం, లేక నెలలు నిండకముందే శిశువులు జన్మించే ప్రమాదముంది.
 • గర్భవతి కాకముందు పోషకాహార లోపం ఉన్న స్త్రీలు, గర్భవతులైన బాలికలు (టీనెజర్స్‌) కేలరీలు, ప్రొటీన్‌ లు కలిగిన ఆహారాన్ని అధికం చేసుకొని తీసుకోవడం వలన తాము గర్భవతిగా ఉన్నప్పుడు 10-12 కేజీల బరువు పెరుగుతారు.
 • అదిక బరువు కలిగిన స్త్రీలు (ఎత్తుకు తగిన బరువుకు మించి 20 శాతం ఉన్నప్పుడు), అధిక రక్త పోటు (హైపర్‌  టెన్షన్‌), మధుమేహం (డయాబిటిస్‌) వంటి జబ్బుల బారిన పడి నెలలు నిండకముందే శిశువు జన్మించి, మరణించే ప్రమాదముంది. కాని,  వారి బరువు తగ్గడానికి కేలరీలను తీసుకోవడంలో నియంత్రించడం మంచిది కాదు.
 • గర్భవతిగా ఉన్నప్పుడు అతిగా బరువు పెరిగినట్లైతే , ప్రసవం తరువాత బరువు తగ్గడం కష్టసాధ్యం.

పోషకాహారం మరియు వేవిళ్ళు(మార్నింగ్‌  సిక్‌నెస్‌)

 • వేవిళ్ళు అనే పదం, గర్భణీ గా ఉన్నప్పుడు వచ్చే వికారం, వాంతుల కు వాడబడుతుంది.
 • ఇది, గర్భిణీ యొక్క నాలుగవ వారంలో ప్రారంభమై, 12వ వారం వరకు కొనసాగవచ్చు. కొంతమంది లో నైతే, కొన్ని సందర్భాలలో ప్రసవం జరిగే వరకూ కూడా ఉండవచ్చు.
 • ఇది సాధారణమైనది. కాని కొన్ని సందర్భాలలో, మితిమీరి ఆందోళనకరంగా మారుతుంది. హైపర్‌ ఎమిసిస్‌ గ్రవిడరమ్‌ అనే పదం గర్భిణీగా ఉన్నప్పుడు తీవ్రంగా, విరామం లేకుండా వచ్చే వాంతులకు వాడతారు. దీనివలన బరువు తగ్గడం, డీ-హైడ్రేషన్‌ (నీరు కోల్పోవడం), లవణాల సమతౌల్యం దెబ్బ తినడం, మానసిక సమస్యలు, కుంగుబాటు (డిప్రెషన్‌), ఆదుర్డా (ఏంగ్జయిటీ), ఒంటరితనం (ఐసోలేషన్‌) వంటివి  కలుగుతాయి.
 • అతిగా వికారం, వాంతులను ప్రత్యేకమైన భోజనం (పథ్యం), మాత్ర (టాబ్లెట్‌) లతో నివారించవచ్చు. తీవ్రమైన డీ-హైడ్రేషన్‌ కు ఆసుపత్రిలో చేర్చవలసి రావచ్చు. చికిత్స చేయించనట్లైతే, తల్లి, గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లవచ్చు.

ఈ అసౌకర్యం నివారించుకోవడానికి లేక కనీసం తగ్గించుకోవడానికి చిట్కాలు

 • తీవ్రతరంగా లేని వికారం, వాంతులు, సాధారణంగా గర్భందాల్చిన మొదటి మూడు, నాలుగు నెలల తరువాత  ఆగిపోతాయి.
 • వైద్యుడిని సంప్రదించకుండా అనవసరమైన మందుల వాడకంను మానివేయాలి.
 • తక్కువగా, తరచుగా ఆహా రం  తీసుకోవాలి.
 • ఎక్కువ భాగం తాజా పండ్లను, కూరగాయలను భోజనం లో చేర్చుకోవాలి.
 • ఘాటైన (స్పైసీ), కొవ్వుతో కూడిన ఆహారపదార్ధములను తీసుకోకూడదు. ఈ పదార్ధాలు ఉదరకోశంలోని పొరను ఉత్తేజపరచి ఇంకా ఎక్కువగా జఠర ఆవ్లూలను ఉత్పత్తి చేయడం వలన అసౌకర్యం మరింత ఎక్కువవుతుంది.
 • మెదటి మూడు నెలలలో ఐరన్‌/ఇనుము మాత్రలు తీసుకొనడంవలన కొంతమంది స్త్రీలలో వికారం తీవ్రతరమవుతుంది. అందువలన, మీరు ఎనిమిక్‌ (రక్త హీనత) తో బాధపడకపోతే, వికారం తగ్గేవరకు ఐరన్‌ మాత్రలను తీసుకొనకపోవడమే మంచిది.
 • 50 మిల్లీ గ్రాముల విటమిన్‌ బి-6 రోజుకు రెండుసార్లు కొంతమంది స్త్రీలు తీసుకొనడం వలన, వేవిళ్ళను తట్టుకోగలుగుతారు.
 • బిగుతైన దుస్తులు, ముఖ్యంగా, నడుము  వద్ద  ఇరుకుగా ఉన్నవి ధరించడంవలన వికారం అధికమయ్యే అవకాశం ఉంది. అందువలన, సౌకర్యవంతమైన, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది.
 • శ్వాసకు సంబధించిన వ్యాయామములు (ప్రాణాయామం), సులభ మైన శరీరం సాగే వ్యాయామాలు మరియు ప్రశాంతంగా ఉండడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
 • సానుకూల దృక్పధం కూడా ఈ పరిస్థితిని నివారిస్తుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate