অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తల్లి స్తన్యమిచ్చే కాలంలో కావలసిన పోషకాహారం

తల్లికి సరైన పోష ణ లభించడం, శిశువుకు బలవర్ధకమైన స్తన్యం సమకూరడం, స్తన్యమిచ్చే కాలంలో తల్లికి ఇచ్చే పోషకాహారం యొక్క లక్ష్యం.

తల్లి స్తన్యమిచ్చే కాలంలో పోషకావసరాలు

ప్రాధమికంగా పాల ఉత్పత్తి పరిమాణం, మరియు తల్లి యొక్క తొలి పోషకావసరాలను బట్టి పోషకాహార ఆవశ్యకత ఆధారపడి ఉంటుంది.

  • శక్తి : స్త్రీలలో కొందరు ఎవరైతే తమ శిశువులను, కేవలం తమ స్తన్యం తోనే పోషిస్తారో, వారి శక్తి అవసరాలు , గర్భిణి కాక ముందు అవసరాల కంటే స్తన్యమిచ్చే కాలంలో, రోజుకు మొదటి ఆరు నెలలలో,  సుమారు 550 కిలో కేలరీలు అధికంగా నూ, ఒకవేళ తల్లి స్తన్యమివ్వడం కొనసాగిస్తే తరువాత ఆరు నెలలలో 400 కిలో కేలరీలు అధికంగానూ ఉంటుంది. ఇది గర్భిణి యొక్క చివరి రెండు త్రైమాసికాలతో పోలిస్తే,రోజుకు 300 కిలో కేలరీల ఎక్కువ.
  • ప్రొటీన్‌ (మాంసకృత్తులు) : రోజూవారి ప్రొటీన్‌ తో పాటు, మొదటి ఆరునెలలు రోజుకు 16 గ్రాముల ప్రొటీన్‌, , తరువాతి ఆరునెలలు రోజుకు 12 గ్రాముల ప్రొటీన్‌ అదనంగా తీసుకోవలసి ఉంటుది.
  • కాల్షియం: శరీరంలోని, కాల్షియం నిలవలు హరించిపోకుండా, శిశువుకు సరిపడినంత స్తన్యం సమకూర్చడానికి, కాల్షియం తగినంత మొత్తంలో తీసుకోవలసి ఉంటుంది. భారత వైద్య పరిశోధనా కేంద్రం (ఐ.సి.ఎమ్‌.ఆర్‌ ) ప్రకారం, 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవడం అవసరం. మరియు నియమబద్ధంగా తీసుకోవడం ఇంకా ముఖ్యం. 600 మిల్లీ లీటర్ల ( 2 - 2 1/2 కప్పుల) పాలు త్రాగాలి, లేక దానితో సమానమైన పాల ఉత్పత్తులను రోజూ తీసుకోవాలి.
  • ఐరన్‌: గర్భిణీ సమయం లో కంటే, స్తన్యమిచ్చే కాలంలో ఇది తక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తులను తగినంత తీసుకోనప్పుడు, ఐరన్‌ ను ఈ సమయంలో అదనంగా ఇవ్వవలసి ఉంటుంది.
  • విటమిన్‌ ఎ: అదనంగా 350 మైక్రోగ్రాముల విటమిన్‌ ఎ గాని, లేక 1400 మైక్రో గ్రాముల బీటా-కెరొటిన్‌  గాని ఇవ్వవలసి ఉంటుంది. అదనంగా విటమిన్‌ లను, పాల ఉత్పత్తుల ను తగినంత తీసుకోనప్పుడు ఇవ్వవలసి ఉంటుంది.
  • విటమిన్‌ సి: ఒక వ్యక్తికి అవసరమైన (రిక్వైర్డ్‌ డైటరీ అలవెన్స్‌) విటమిన్‌ సి  రోజుకు 800 మిల్లీ గ్రాములు, కంటే రెట్టింపు అవసరం.
  • థయామిన్‌: మొదటి ఆరు నెలలలో అదనంగా  రోజుకు 0.3 మిల్లీగ్రాములు, తరువాత రోజుకు 0.2 మిల్లీగ్రాములు అవసరం.
  • రైబోఫ్లేవిన్‌: మొదటి ఆరు నెలలలో, అదనంగా రోజుకు 0.3 మిల్లీ గ్రాములు, తరువాత, రోజుకు 0.2 మిల్లీ గ్రాములు అవసరం..
  • నియాసిన్‌: మొదటి ఆరు నెలలలో అదనంగా రోజుకు 4 మిల్లీ గ్రాములు, తరువాత రోజుకు 4 మిల్లీ గ్రాములు అవసరం.
  • ఫోలేట్‌: అదనంగా రోజుకు 150 మైక్రో గ్రాములు అవసరం.
  • ఆవశ్యకమైన కొవ్వు ఆవ్లుములు ( ఫాటీ ఆసిడ్స్‌) :  ఇవి, శిశువు శిశువు కంటి మరియు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యం. నూనెతో ఉండే చేపలు (ఆయిలీ ఫిష్‌), గోధుమ మొలకలు, ఆకు కూరలు, కూరగాయలు, మరియు గింజలతో తీసే నూనె లలో  ఇవి ఎక్కువగా లభిస్తాయి.
  • పరిశోధన ప్రకారం తల్లి స్తన్యం: ఆమె తీసుకునే ఆహార పదార్ధాలవలన స్వల్పంగానే ప్రభావితమవుందని తెలుస్తుంది.  కాని కొన్ని సార్లు, శిశువుకు తల్లి భుజించే పదార్ధాలవలన (ఘాటైన ఆహారం, వాయు కారక ఆహారం వలన, లేక పాల ఉత్పత్తులు) ప్రతిక్రియ (రియాక్షన్‌) కనిపిస్తుంది. తల్లి తీసుకునే ఆహార పదార్ధాలవలన శిశువులో కనిపించే ప్రతిక్రియ (ఎలర్జీ) లక్షణాలు, డయేరియా (అతి సారం), రాష్‌ ( దద్దుర్లు), చికాకు (ఫస్సీనెస్‌), వాయువు (గ్యాస్‌), పొడిబారిన చర్మం, లేక శిశువు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ బిగ్గరగా ఏడవడం  వంటివి ఉంటాయి. ఇలా జరగడానికి తల్లి స్తన్యం శిశువుకు పడకపోవడం కారణం కాదు. కొన్ని సార్లు శిశువుకు ఇబ్బంది కలిగించే ఆహారపదార్ధములను తల్లి భుజించడం  మానివేసినప్పుడు, ఈ సమస్య తనంతట తానే పరిష్కారమై పోతుంది.
  • స్తన్యం నణ్యత: స్తన్యమిచ్చే తల్లి మంచి ఆహారం తీసుకున్నప్పుడు, తన శిశువుకు ఆరోగ్యవంతమైన తల్లి పాలను అందజేయగలుగుతుంది. దీర్ఘకాలంగా పోషకాహార లోపం ఉన్న స్త్రీలు, వారి ఆహారం లో చాలా తక్కువగ ఖనిజ లవణాలు (మినరల్స్‌), విటమిన్‌ లు ఉండి , వీటి యొక్క శరీర నిల్వలు కూడా స్వల్పంగా ఉంటే , వారిచ్చే స్తన్యంలో కూడా సాధారణం కంటే తక్కువగా కొన్ని విటమిన్‌లు, ముఖ్యంగా విటమిన్‌ ఎ, డి, బి-6, బి-12, ఉంటాయి. ఇటువంటి స్తన్యమిచ్చే తల్లులు, తమ భోజనం సమతులంగా ఉండేటట్లు చూసుకోవడం ద్వారా గాని, లేక అదనంగా విటమిన్‌ లను తీసుకోవడం ద్వారా గాని తమ స్తన్యంలో విటమిన్‌ ల పరిమాణం పెంచుకోవచ్చు.

స్తన్యమిచ్చే తల్లులకు ఆచరించడానికి వీలుగా కొన్ని చిట్కాలు

  • కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ (మిశ్రమ పిండి పదార్ధములు), ముడి గోధుమలతో చేసిన బ్రెడ్‌ వంటివి, ముడి ధాన్యాలతో చేసిన ఆహారపదార్ధాలు రొట్టెలు, అన్నం వంటివి భోజనంలో చేర్చుకోండి. స్తన్యమివ్వడం వలన తల్లి రక్తంలో ఉండే చక్కెరల పై అధిక భారం పడి, భోజనంలో మిశ్రమ పిండి పదార్ధాలు సరిపడినంత లేనప్పుడు, తియ్యటి పదార్ధాలు తినాలనే కోరిక, విపరీతమైన ఆకలి ఏర్పడవచ్చు.
  • ప్రతీ రెండు, మూడు గంటలకొకసారి భుజించండి. రక్తంలో చక్కెర సరఫరా సరిగా జరిగేందుకు, తీవ్రమైన ఆకలిని నియంత్రించేందుకు ప్రతీ భోజనం , భోజనానికీ మధ్య తాజా పండ్లను తినండి.
  • రోజు మొత్తం మీద ఎనిమిది గ్లాసులకు మించి ద్రవపదార్ధాలను త్రాగండి. శిశువుకు స్తన్యమిచ్చిన ప్రతీసారి, కనీసం ఒక గ్లాసుడు నీళ్ళుగాని, పోషకవిలువలు కలిగిన పానీయం గాని త్రాగండి  . తగినంత పరిమాణం లో స్తన్యం సమకూరడానికి ద్రవపదార్ధాలు చాలా ముఖ్యమైనవి. చక్కెర ఎక్కువగా వేసిన పళ్ళ రసాలు, శీతల పానీయాలు, కెఫైన్‌ కలిగిన పానీయాలు మరియు మద్యం (అల్కహాల్‌) లను తగ్గించండి.
  • కొవ్వు పదార్ధాలను నియత్రించండి. ఎందుకంటే వీటి వలన కేలరీలు ఎక్కువ కావడం, దానివలన బరువుసమతూకంలో ఉండకపోవడం జరుగుతుంది.
  • అధికంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోండి. సూక్ష్మపోషకాలన్నిటినీ ఇవి కలిగి ఉన్నాయి.
  • మద్యం (ఆల్కహాల్‌) ను పూర్తిగా వదిలి వేయండిః స్తన్యంలోనికి మద్యం చేరుతుంది. తల్లి లో నీటిని తగ్గించి  (డీ-హైడ్రేషన్‌), స్తన్యం పరిమాణం తగ్గడానికి, శిశువు మీద దుష్పరిణామాలు కలుగడానికి కారణమవుతుంది.
  • కొన్ని రకాల వ్యాయామాలు చేయండి. చాలామంది స్త్రీలు, గర్భిణి గా ఉన్నప్పుడు , ఉండవలసిన బరవు అదనంగా పొందుతారో, వారు ప్రసవం తరువాత, వారాల్లో, నెలల్లో ఆ బరువును కోల్పోతారు. స్తన్యం ఇవ్వడం వలన కూడా కేలరీలు ఖర్చు అయ్యి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. స్తన్యం ఇస్తున్న కాలంలో రోజుకు కనీసం 500 కేలరీలు ఖర్చు అవుతాయి. సమతులాహారం తీసుకుంటూ, శిశువులకు స్తన్యమిచ్చే స్త్రీలు, తమ ఎత్తుకు తగిన బరువును 9 నెలలనుండి సంవత్సరం లోపల తిరిగి పొందగలుగుతారు.
  • పొగ త్రాగడం మానండి : సిగరెట్‌ లలో ఉండే పొగాకు, నికోటిన్‌ అనే మత్తు పదార్ధం కలిగి ఉండి అది స్తన్యంలోనికి నేరుగా చేరుతుంది. అది స్తన్యం పరిమాణం పై కూడా ప్రభావం చూపుతుంది. పొగ త్రాగడం లేక పొగ త్రాగే వ్యక్తుల సమీపంలో (పాసివ్‌ స్మోకింగ్‌ ) ఉండడంవలన, శిశువులలో ఊపిరితిత్తుల, చెవి వ్యాధులు (ఇన్ఫెక్షన్స్‌) అధికమయ్యే అవకాశం ఉంది.  మీరు పొగ త్రాగడంమానలేక పోతే కూడా స్తన్యం ఇవ్వండి. ఎందుకంటే, తల్లి పాల వల్ల వచ్చే లాభాల ముందు నికొటిన్‌ వల్లవచ్చే హాని ని విస్మరించవచ్చు.
  • స్వంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుడిని కలిసినప్పుడు, ఒక స్తన్యం ఇచ్చే తల్లి తాను ఒక చంటి బిడ్డ తల్లిగా వైద్యుడికి తెలుపాలి.
  • అతి సాధారణ వ్యాధులైన జలుబు, ఫ్లూ, డయేరియా వంటివి స్తన్యం వల్ల  శిశువుకు రావు. కాని ఒక స్తన్యం ఇచ్చే తల్లి రోగగ్రస్తమైనప్పుడు, ఆమె స్తన్యం లో కూడా యాంటీ బాడీస్‌ (రక్షణ కణాలు) ప్రవేశిస్తాయి. ఈ యాంటీ బాడీస్‌ , శిశువుకు అదే వ్యాధి రాకుండా రక్షిస్తాయి.
  • ప్రాధమికమైన శుభ్రతను శిశువును సంరక్షించే సమయంలో పాటించాలి. ఉదాహరణ కు చేతులను ఎప్పటికప్పుడు కడుగుకొనడం వంటివి.
  • శిశువును సంరక్షించడానికి, వ్యాధులబారిన పడకుండా ఉండడానికి, తగినంత విశ్రాంతి, సరైన పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate