অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శిశువు

శిశువు
 1. తల్లిపాలివ్వడం
 2. తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
 3. తల్లిపాలివ్వటం-మొదటి ఆరునెలలలో మెరుగైన శిశుపోషకాహారం కోసం సిఫారసు చెయ్యబడ్డ పద్ధతులు.
  1. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలివ్వటం వలన
  2. చక్కగా తల్లిపాలిచ్చే నైపుణ్యాన్నిపెంచటం
  3. బిడ్ద తల్లిపాలు తాగేందుకు మంచిభంగిమలొ ఉంది అనేందుకు గుర్తులు
  4. బిడ్డ చనుబాలు తాగేందుకు సరైన విధంగా పట్టుకోకపోతే కలిగే ఇబ్బందులు
  5. బిడ్డ చక్కగా పలు తాగుతుందనేందుకు గుర్తులు
  6. ప్రతి తల్లీ చాలినన్ని పాలను ఎలా ఉత్పత్తి చెయ్యగలదంటే
  7. మొదటి ఆరుమాసాలు తల్లిపాలివ్వటం తప్పనిసరి
  8. రాత్రివేళలతో సహా అడిగినప్పుడల్లా పాలివ్వటం అలవాటు చేసుకోవాలి.
  9. తరచూ పాలివ్వటం వల్ల -
  10. విటమిన్ ఎ ను అనుబంధింపచేయటం
 4. 3:6- 24 నెలలపిల్లలకు సిఫారసు చెయ్యబడ్డ పాలిచ్చేపద్ధతులు.
 5. తల్లియొక్క పోషకాహార స్థాయి మీద చనుబాలు ఇవ్వటం  ప్రభావం చూపుతుందా?
  1. పాలిస్తున్న తల్లికి ఎంతమేరకు అధికంగా ఆహారం అవసరమవుతుంది?
  2. పాలిస్తున్న తల్లులు తీసుకోకూడని ఆహారపదార్ధాలు ఏమన్నా ఉన్నాయా?
  3. తల్లి తనబిడ్డకు పాలివ్వలేకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి?
  4. పని చేస్తున్న తల్లి ఏమి చెయ్యాలి?
 6. తల్లిపాలు మరియి అవుపాల పోలిక
 7. తల్లి పాలు మానిపించడం
  1. తల్లిపాలు మానిపించటం పక్రియను ఎప్పుడు ఆరంభించాలి?
  2. తల్లిపాలు మానిపించే ఆహారం లో ఉండాల్సిన లక్షణాలు ఈ ఆహారపదార్ధాలు ప్రాధమికంగా శక్తినిచ్చే అదనపు వనరులుకానీ యితర అవసరమైన పోషకపదార్ధలైన మాంసకృత్తులు,ఐరన్,విటమిన్ ఎ,విటమిన్ సి వంటివాటిమీద శ్రద్ధవహించాలి.కాబట్టి
  3. ఈ ఆహారపదార్ధాలు తప్పనిసరిగా
  4. తల్లిపాలు మానిపించేందుకు తగిన ఆహారసమూహాలు
  5. ఆహారపు పోషకవిలువలను మెరుగుపరచేందుకు కొన్ని ముందుజాగ్రత్తలను తీసుకోవాలి.
  6. అమిలేస్ సమృద్ధ ఆహారం(ఎ ఆర్ యఫ్)
 8. తల్లిపాలు మానిపించేటప్పుడు పోషకాహారం
  1. 6-9 నెలలు
  2. 9-12 నెలలు
  3. 12-18 నెలలు
  4. జబ్బుపడ్డాక,కోలుకున్నాక పాలివ్వటం

తల్లిపాలివ్వడం

స్తన్యమివ్వడం తల్లీబిడ్డలిద్దరికీ ఒక అద్భుతమైన అనుభవం.తద్వారా ఆదర్శవంతమైన పోషణ మరియు ఒక ప్రత్యేకమైన అనుబంధపు అనుభవం ఎందరో పాలిచ్చేతల్లులు చవిచూస్తారు.

తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు

 • పోషకాహారం మరియు సులభమయిన జీర్ణక్రియ: తరచూ మానవశిశువుకు "సంపూర్ణ ఆహారం" అని పిలవబడే స్తన్యములోని భాగాలు-పాలచక్కెర, మాంసకృత్తులు మరియు కొవ్వు అనేవి నూతనంగా జన్మించిన శిశువు యొక్క అపరిపక్వమైన వ్యవస్థలో అతిసులభంగా జీర్ణం చేసుకోబడతాయి. కాబట్టి తల్లిపాలు తాగే పిల్లలు అతితక్కువగా అతిసారం ,అజీర్ణానికి లోనవుతారు.
 • ఉచితం: తల్లిపాలు ఉచితం,ఏమాత్రం ఖర్చు కాదు
 • సౌలభ్యం: తల్లిపాలు ఎల్లప్పుడూ సరైన ఉష్ణోగ్రతలో ఉండటంతో పాలసీసాను కడిగి శుభ్రం చేసి,సిద్దంచేసే సమయాన్ని ఆదా చేస్తుంది.
 • అంటురోగాలతో పోరాటం: పాలిచ్చే తల్లినుంచి తనశిశువుకు చేరే ప్రతిరక్షకపదార్ధాలు చెవికి వచ్చే అంటువ్యాధులు, అతిసారము, ఊపిరితిత్తుల  అంటువ్యాధులు,నాడీమండలపుటలశోధ(మెనింజైటిస్)తదితరవ్యాధుల నుంచి రక్షిస్తాయి.తల్లిపాలు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చాలా ఉపయుక్తం మరియు చిన్నపిల్లలను ఉబ్బసం,మధుమేహం,ఊబకాయం,అలర్జీలు,అకస్మాత్తుగాశిశువులు మరణించే లక్షణం వంటివాటినుంచికూడా కాపాడుతుంది.
 • చురుకైన శిశువులు: అచ్చంగా తల్లిపాలు మాత్రం ఆరునెలలు తాగినశిశువులు పోతపాలు తాగినవారికన్నా 5 నుంచి 10 పాయింట్లు అధికంగా ఐక్యూ కలిగియున్నారని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి.
 • "చర్మం నుంచి చర్మానికి" స్పర్శ: ఎంతోమంది పాలిచ్చేతల్లులు వారి పిల్లలతో అతిసన్నిహితమైన బంధపు మాధుర్యాన్ని అనుభవిస్తారు.తల్లీపిల్లలమధ్య"చర్మం నుంచి చర్మానికి" స్పర్శ.వారి భావోద్వేగ బంధాన్ని మరింతపెంపొందిస్తుంది.
 • తల్లికీ ప్రయోజనకరమే: తనశిశువుకుస్తన్యమివ్వటం వల్ల తనబిడ్డమీద తనుతీసుకోగలిగే శ్రద్ధపట్ల కొత్తగా తల్లిఅ యిన మహిళకు విశ్వాసాన్ని కలిగిస్తుంది.
 • తల్లిపాలివ్వటం వల్ల కాలరీలు కరిగి,గర్భిణీగా ఉన్నకాలములో పెద్దదిగా అయిన గర్భాశయాన్ని మరలా మామూలుగా తొందరగా అవుతుంది
 • తద్వారా బాలింతలు తమగర్భంకలగకపూర్వపు ఆకారాన్ని,బరువును త్వరగా పొందగలరు.
 • తల్లిపాలివ్వటం వల్ల ఋతుక్రమం ఆగిపోయేముందువచ్చే రొమ్ము కాన్సరు ప్రమాదాన్ని తగ్గిస్తుంది,పైగా గర్భాశయ,అండాశయ కాన్సరు వచ్చేప్రమాదాన్ని తగ్గిస్తుంది
 • తల్లిపాలివ్వటం మరలా గర్భంరావటాన్ని ఆలస్యం చేస్తుంది, తద్వారా బిడ్డల పుట్టుక మధ్య ఎడం వస్తుంది.
 • తల్లిపాలివ్వటం వల్ల, కాన్పు అయిన ఆరునెలలవరకూ మరలా గర్భం రాకుండా 98 శాతం రక్షణపొందాలంటే. 
  • ఆమెకు రుతిక్రమం మరలా ప్రారంభం కాకుండా ఉండాలి
  • రాత్ర్రీ పగలూ తరచూ తల్లిపాలివ్వాలి
  • తల్లిపాలు కాకుండా మరే ఇతర ఆహారం కానీ పానీయం కానీ ఇవ్వకుండా ఉండాలి లేదా పాపాయికి పాల పీకలులాంటివి ఏమన్నా ఇవ్వకుండా ఉండాలి.

తల్లిపాలివ్వటం-మొదటి ఆరునెలలలో మెరుగైన శిశుపోషకాహారం కోసం సిఫారసు చెయ్యబడ్డ పద్ధతులు.

పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలివ్వటం వలన

 • తల్లిపాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
 • మొర్రు పాలు (ప్రసవం తరువాత మెదట వచ్చే తల్లిపాలు - కొలొస్ట్రోమ్)  బిడ్డకు మొదటి వ్యాధినిరోధక ఔషధం లా పనిచేస్తుంది
 • ప్రధమస్తన్యం లో ఉండే ప్రతిరక్షకపదార్ధాల వల్ల శిశువు తక్షణం ప్రయోజనం పొందుతుంది
 • ప్రసవం అయినవెంటనే గర్భాశయం నుంచి జరిగే రక్తస్రావాన్ని చాలావరకు తగ్గిస్తుంది
 • తల్లీబిడ్డల బంధానికి అంకురార్పణ జరుగుతుంది.

చక్కగా తల్లిపాలిచ్చే నైపుణ్యాన్నిపెంచటం

తల్లి తన బిడ్డను ఎలా పట్టుకుంటుందో,బిడ్డ స్తనాన్ని తననోటిలోకి ఎలాతీసుకుంటుందో అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సరైన భంగిమలో పాపాయిని పట్టుకోవటం వల్ల బిడ్డకు తల్లి స్తనాన్ని నోటిలోకి తీసుకుని పాలుతాగటం సులభమవుతుంది

బిడ్ద తల్లిపాలు తాగేందుకు మంచిభంగిమలొ ఉంది అనేందుకు గుర్తులు

 • బిడ్డశరీరం మొత్తం తల్లివైపు తిరిగి ఉండటం
 • బిడ్డ తల్లికిహత్తుకుని ఉండటం
 • బిడ్డ ఆనందంగా,హాయిగా ఉండటం

బిడ్డ చనుబాలు తాగేందుకు సరైన విధంగా పట్టుకోకపోతే కలిగే ఇబ్బందులు

 • చనుమొనలు పగలటం, పుళ్ళుతో పచ్చిగా ఉండటం
 • చాలినన్ని పాలు ఉండకపోవడం
 • బిడ్డ పాలు తాగేందుకు నిరాకరించటం

బిడ్డ చక్కగా పలు తాగుతుందనేందుకు గుర్తులు

 • బిడ్డ నోరు బాగా తెరిచిఉంటుంది
 • బిడ్డ గడ్డం తల్లి రొమ్ములకు తగులుతుంటుంది
 • తల్లి చనుమొనల  చుట్టూ ఉండే నల్లటిరంగు బిడ్డ నోటికిందకన్నా నోటిపైన ఎక్కువ కనిపిస్తుంది
 • బిడ్డ పైకి వినిపించే గుటకలతో, లోతుగా పాలు పీలుస్తుంది,
 • తల్లికి చనుమొనలలో ఎలాంటి నొప్పి అనిపించదు

ప్రతి తల్లీ చాలినన్ని పాలను ఎలా ఉత్పత్తి చెయ్యగలదంటే

 • ఆమె అచ్చం చనుబాలివ్వాలి
 • బిడ్డ సరైన భంగిమలో ఉండి,రొమ్మును చక్కగా నోటిలో పెట్టుకుని ఉండాలి
 • రాత్రిసమయాల్లో సహా పాపకు  వీలయినంత తరచుగా,వీలయినంత ఎక్కువసేపు పాలు తాగించాలి.

పుట్టిన దగ్గర్నుంచి పాపాయి ఎప్పుడుకోరుకుంటే అప్పుదుతల్లిపాలివ్వాలి. ఒకసారి తల్లిపాలిచ్చాక కొత్తగాపుట్టిన బిడ్ద మూడుగంటలకన్నా ఎక్కువగా నిద్రపొతే సుతారంగా తట్టిలేపి మరలా పాలివ్వాలి.

పాప ఏడుస్తుందంటే ఇతర ఆహారము గానీ,పానీయాలుగానీ కోరుకుంటున్న దని అర్ధం కాదు,దానికి అర్ధం తనని దగ్గరకు తీసుకుని హత్తుకొమ్మని.

కొందరుబిడ్డలు తల్లిరొమ్మును సౌకర్యం కోసం చప్పరిస్తుంటారు. బిడ్డలు తల్లి రొమ్మును ఎక్కువగా చీకడం/ చప్పరించటం వల్ల ఎక్కువపాలు పడతాయి.

కొందరు తల్లులు తమవద్దచాలినన్ని పాలు లేవేమో అని భయపడి మొదటినెలలలో తమపాపాయిలకు యితరాఅహారపానీయాలు ఇస్తుంటారు

కానీ దీనివల్ల పాపాయిలు తక్కువగా తల్లిపాలు తాగుతారు తద్వారా తక్కువపాలు పడుతుంటాయి.

సీసాలు,పాలపీకలు లాంటివాటిని పాలుతాగేశిశువులకు ఇవ్వకూడదు.ఎందుకనగా తల్లిరొమ్మును చప్పరించటానికీ ఈ యితరవస్తువులను చప్పరించటానికీ చాలా తేడా ఉంది.ఈపీకలు,సీసాలు లాంటివి తల్లిని తక్కువపాలు ఇచ్చేలా చేస్తాయి మరియు పాపను పాలుతాగటం తగ్గించేలా లేదా పూర్తిగా మానేలా చేస్తాయి.

మొదటి ఆరుమాసాలు తల్లిపాలివ్వటం తప్పనిసరి

 • మొదటి ఆరుమాసాలు అచ్చంగా తప్పనిసరిగా తల్లిపాలు మాత్రం ఇవ్వాలి.తల్లిపాలు ఎక్కువయ్యేందుకు ఎదురుచూసేటప్పుడు కూడా మరొక ఆహారపానీయాల అవసరం పాపాయికి లేదు.నీరు,తదితర ద్రవాలు లేదా తేనే,ఆముదము లేదా చక్కెరనీరు లాంటి ఆహారాల వంటి వాటి అవసరమూలేదు.
 • మొదటి ఆరుమాసాలలో  శిశువుయొక్క పోషకాహార, ద్రవాహార అవసరాలన్నిటినీ తల్లిపాలు పూర్తిగా తీరుస్తాయి. శరీరములో ద్రవాలస్థాయిని నిర్వహించేందుకు గాను శిశువులకు ఔషద కషాయాలు (ఎంత వేడివాతావరణమైనా సరే) మెదలైన నీరును అదనంగా ఇవ్వటం వల్ల మలినాలు చేరటం తో పాటు  తీసుకునే పోషకాహారంకూడా తగ్గుతుంది.
 • ఆరునెలలలోపు శిశువును తరచుగా బరువు చూస్తున్నప్పుడు ఎదుగుదల సక్రమంగా లేదని గమనిస్తే :
 • బిడ్డకు మరింత తరచూ తల్లిపాలివ్వాలి. 24 గంటల సమయములో కనీసం 12 సార్లు పాలివ్వాలి. పాపాయి కనీసం పదిహేను (15 నిమిషాలు చప్పరించాలి.
 • తల్లిరొమ్మును తననోటిలోకి తీసుకునేలా శిశువుకు ఒకరు సాయం చెయ్యాలి.
 • శిశువుకు ఆరోగ్యం సరిలేకపొయి ఉండవచ్చు,శిక్షణపొందిన ఆరోగ్యకార్యకర్త దగ్గరకు తీసుకెళ్ళాల్సి రావచ్చు.
 • బిడ్డకు నీరు లేదా ఇతరద్రవాలు ఇస్తుంటే తల్లిపాలు ఎక్కువగా తాగకుండా చెయ్యవచ్చు.తల్లి తనబిడ్డకు తన పాలు తప్ప మరే యితర ద్రవాలను ఇవ్వకూడదు.

రాత్రివేళలతో సహా అడిగినప్పుడల్లా పాలివ్వటం అలవాటు చేసుకోవాలి.

 • ప్రతి 24 గంటలకు 8-12  సార్లు శిశువులకు పాలుపట్టాలి,ప్రత్యేకించి మొదటి నెలల్లో ప్రతి 2-3 గంటలకొకసారి లేదా  అంతకన్నా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
 • చిన్నారిపాపాయిలవి చిన్నిబొజ్జలు కాబట్టి తరచూ వాటిని నింపాల్సిఉంది.  త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పాపాయి చిన్నపొట్టకు తల్లిపాలు సరిగ్గా తగినవి.

తరచూ పాలివ్వటం వల్ల -

 • తల్లిపాల సరఫరాను సరిగ్గా ఉంచుతాయి,
 • గర్భనిరోధాన్ని గరిష్ఠస్థాయికి చేరుస్తాయి
 • ప్రతిసారి బిడ్డకు రోగనిరోధకాలను అందజేస్తాయి.
 • తల్లి రొమ్ములు ఉబ్బటం వంటి సమస్యలు ఎదురవ్వకుండా నిరోధిస్తాయి, రొమ్ములు ఉబ్బటం  వల్ల తల్లి పాలివ్వలేకపోవచ్చు.
 • పాపాయి 24గంటలలో ఆరుసార్లు మూత్రవిసర్జన చేస్తే తనుచాలినంతగా పాలు తాగుతుందని గుర్తు.
 • అంతకుమించి తల్లిపాలివ్వటం అనవసరం లేదా తల్లిపాలిచ్చే తీరుతెన్నులను గమనించాలి సరిగ్గా లేకపోతే నేర్పించాలి

విటమిన్ ఎ ను అనుబంధింపచేయటం

 • ‘ఎ’  విటమిన్ లోపమున్న ప్రాంతాల్లో,పాలిచ్చే తల్లులు ప్రసవం అయినవెంటనే పెద్దమొతాదులో  విటమిన్ ‘ఎ’  ను అనుబంధాలను తీసుకోవాలి. తల్లిపాలల్లో తగినంత ఎ విటమిన్ లభ్యమయ్యేందుకు గాను ప్రసవానంతరం ఎనిమిదివారాల్లోగానే తీసుకోవాలి.
 • తల్లిపాలలోని విటమిన్ ఎ కేంద్రీకరణ అ మహిళయొక్క విటమిన్ ఎ స్థాయిని బట్టి మరియు ఎదుగుతున్న ఆమె బిడ్డ యొక్క మారుతున్నఅవసరాలను బట్టి ఉంటుంది.నెలలు విటమిన్ ఎ లోపమున్న ప్రాంతాలలో నిండకముందే పుట్టిన బిడ్డల విటమిన్ ఎ లోపానికి గురయ్యే అవకాశముంది.
 • బిడ్డకు పాలిస్తున్న తల్లికి ఎంతత్వరగా విటమిన్ ఎ అనుబంధం ఇస్తే అంతత్వరగా ఆమెపాలలోని ఎ విటమిన్ స్థాయి పెరుగుతుంది.
 • కాన్పు జరిగాక ఎనిమిదివారాలు  తర్వాత (ముఖ్యంగా వారు పూర్తిగా పాలివ్వకపోతే)విటమిన్ ఎ అనుబంధాన్ని ఇవ్వకూడదు

3:6- 24 నెలలపిల్లలకు సిఫారసు చెయ్యబడ్డ పాలిచ్చేపద్ధతులు.

 • రాత్రివేళలతో సహా పిల్లలు కోరినప్పుడల్లా పాలివ్వటం కొనసాగించాలి.
 • ఆరునెలల వయసు మొదలవగానే అనుబంధ ఆహారాన్ని మొదలుపెట్టాలి
 • పిల్లలు పెద్దవుతుండగా తరచూ పాలిస్తూనే ఆహారపు పరిమాణాన్నిపెంచాలి.
 • పిల్లలు పెద్దవుతూ ఆహారము ఫలహారము చేస్తుండగా ఆహారాన్నిచ్చే సందర్భాలు పెంచాలి.

తల్లియొక్క పోషకాహార స్థాయి మీద చనుబాలు ఇవ్వటం  ప్రభావం చూపుతుందా?

 • చనుబాలలోని శక్తినిచ్చే మాంసకృత్తులు మరియు ఇతర పోషకాలు తల్లియొక్క ఆహారము  నుండి లేదా ఆమె దేహములోని ఇతర నిల్వలనుండి వస్తాయి.
 • మహిళలు తమ ఆహారముద్వారా శక్తి మరియు పోషకాలను పొందలేకపోయినా,పిల్లల మధ్య తక్కువ ఎడం ఉన్నప్పుడు తరచూ గర్భం దాల్చి పాలివ్వాల్సి రావటం వారిలోని శక్తి మరియు పోషకాహార నిల్వలను హరింపజేస్తాయి.ఈ ప్రక్రియను మాతృత్వక్షీణత అంటారు.
 • సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు ముఖ్యంగా పాలిస్తున్నప్పుడు స్త్రీలకు ఆకలి అధికంగా ఉంటుంది.కాబట్టి వారికి అధికంగా ఆహారాన్ని అందజేయాల్సి ఉంటుంది.

పాలిస్తున్న తల్లికి ఎంతమేరకు అధికంగా ఆహారం అవసరమవుతుంది?

 • మాతృత్వవనరులను,పాలివ్వటానికి మద్దతుగా,ఎక్కువమంది తల్లులకు ప్రతిరోజూ సుమారు 650 కిలోకాలరీలు(ఒక అదనపు భోజనానికి సమానం) అవసరమవుతుంది.
 • మంచిపోషణ ఉన్న పాలిచ్చే తల్లులు,గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్కువబరువు పెరిగినవారికి అదనపుఆహారపు అవసరము తక్కువగా ఉంటుంది,ఎందుకనగా వారు గర్భముతో ఉన్నప్పుడు శరీరము సమకూర్చుకున్న  కొవ్వును మరియు యితర నిల్వలను ఉపయోగించుకుంటారు.
 • తల్లులు తమ దప్పికను సంతృప్తి పరచుకునేందుకు గాను నీరు ఇతరద్రవాల వాడకాన్ని పెంచుకోవాలి.
 • పాలిస్తున్న తల్లి అధికశారీరక శ్రమలో నిమగ్నమైతే(ఉదాహరణకు వ్యవసాయం)ఆమెకు చాలినంతగా అధికాఆహారము తీసుకోవాలి.

పాలిస్తున్న తల్లులు తీసుకోకూడని ఆహారపదార్ధాలు ఏమన్నా ఉన్నాయా?

 • లేదు.పాలిస్తున్న తల్లులు తినితీరాల్సినవి కానీ,తినకూడనివీ అంటూ లేవు.
 • ఆహారలోపమున్న తల్లులు చాలినంతగా పాలను ఇవ్వగలరా?
 • అవును.ఆహారలోపము పాలనాణ్యతను ప్రభావితం చేసినా,ఎంత ఎక్కువగా ఎంత ఒడుపుగా బిడ్డ తల్లి స్తన్యాన్ని చప్పరిస్తుంది అన్న దాని మీద చనుబాలు తయారవుతాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి.తన బాగుకోసం,బిడ్డ బాగుకోసం తల్లి పుష్థిగా ఆహారము తీసుకోవాలి.

తల్లి తనబిడ్డకు పాలివ్వలేకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి?

 • తల్లిపాలను మించిన ఆహారము లేదు కాబట్టి బిడ్డకు మరొక ఆరోగ్యవంతురాలైన తల్లిపాలు ప్రత్యామ్నాయం.
 • తల్లిపాలు లభించికపోతే,ప్రత్యామ్నాయంగా మరొక ఆరోగ్యవంతురాలైన తల్లిపాలు కప్పు ద్వారా ఇవ్వాలి.
 • పాపాయికి తల్లిపాలకు బదులు ప్రత్యామ్నాయాలు (డబ్బాపాలు) ఇచ్చినట్లయితే ఎదుగుదల సక్రమంగా లేకపోవచ్చు లేదా మరీ ఎక్కువగా కాని ,తక్కువగా కాని నీరు కలపటం వల్ల లేదా సీసా శుభ్రంగా లేకపోవటం వల్ల వ్యాధులు రావచ్చు.నీటిని కాచి తర్వాత చల్లార్చి ఇచ్చిన గమనికలను శ్రద్ధగా పాటించి తల్లిపాల ప్రత్యామ్నాయలను కలపాలి.
 • మామూలుగా ఐతే జంతువుల పాలు శిశువులకు ఇచ్చే డబ్బాపాలు  సాధారణ ఉష్ణోగ్రతలో కొన్ని గంటలు ఉంచితే పాడవుతాయి.కానీ సాధారణ ఉష్ణోగ్రతలో పాడవకుండా చనుబాలు ఎనిమిది గంటలవరకూ భద్రపరచవచ్చు.వాటిని ఒక శుభ్రమైన,మూతపెట్టిన పాత్రలో ఉంచాలి.

పని చేస్తున్న తల్లి ఏమి చెయ్యాలి?

 • పనిగంటల్లో తల్లి తన బిడ్డతో ఉండలేకపోతే,ఇద్దరూ ఒక్కచోట ఉన్నప్పుడు ఎక్కువగా పాలివ్వాలి.తరచూ పాలివ్వటం వల్ల పాల సరఫరానిలకడగా ఉంటుంది.
 • పనిచేసే స్థలంలో తల్లిపాలివ్వలేకపోతే ఆరోజులో రెండుమూడుసార్లుగా ఆమె పాలను పిండి ఒక శుభ్రమైన పాత్రలో భద్రపరచవచ్చు.చనుబాలను సాధారణ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలుంచినా పాడవవు.అలా పిండినపాలను బిడ్డకు ఒక శుభ్రమైన కప్పుద్వారా ఇవ్వవచ్చు.
 • కుటుంబాలు,సాంఘికసమూహాలు యాజమాన్యాలను ప్రోత్సహించి వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు,శిశుసంరక్షకకేంద్రాలు మరియు తల్లులు బిడ్డలకు పాలిచ్చేందుకు లేదా పిండుకునేందుకు సమయము,సరైన ప్రదేశము సమకూర్చావచ్చు.

తల్లిపాలు మరియి అవుపాల పోలిక

అంశం తల్లిపాలు ఆవుపాలు

కాలరీలు(కిలో కాలరీలు/100 మి.లీ  డియల్)
పిండిపదార్ధాలు 74 70
పాలచక్కెర 7.3 4
మాంసకృత్తులు 1 3.2
పాలమాంసకృతులు  (కెసిన్)
పాలకొవ్వుపదార్ధాలు
0.2 2.62
ట్రిగ్లిసెరైడ్స్ 4% 4%
ఫాస్ఫలిపిడ్స్ 0.04% 0.04%
ఖనిజాలు మరియు యితర అయోనిక్ భాగాలు
అంశం తల్లిపాలు ఆవుపాలు
సోడియం 5 15
పొటాషియం 15 43
కాల్షియం 7.5 30
ఫాస్ఫరస్ 1.8 11
ఐరన్ 0.5 0.45
జింకు 1.18 3.9
 • ఆరురెట్లు అధికంగా పాలమాంసకృతులు (కేసిన్)  ఉండటం వల్ల ఆవుపాలలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.ఆవుపాలలో 22:78 నిష్పత్తిలో  మీగడ/పాలవిరుగుడు ఉండగా తల్లిపాలలో 75:25 నిష్పత్తిలో ఉంటాయి.కాబట్టి తల్లిపాలు ఉత్తమమైనవి,సులభంగా జీర్ణమవుతాయి.
 • ఆవుపాల కన్నా తల్లిపాలల్లో పాలచక్కెర అధికంగా ఉంటుంది.
 • ఆవుపాలలో ఐరన్ చాలినంత ఉండదు.తల్లిపాలలో ఐరన్ తక్కువగా ఉన్నా త్వరగా గ్రహించబడుతుంది.
 • ఆవుపాలలో సి, మరియు డి విటమిన్లు తక్కువగా ఉంటాయి.

తల్లి పాలు మానిపించడం

 • పాపాయి ని తల్లిపాలదశనుంచి మామూలు కుటుంబ ఆహారానికి క్రమంగా పురోగతిలోకి తీసుకువెళ్ళడాన్ని తల్లిపాలు మానిపించటం అని నిర్వచిస్తారు.తల్లిపాలు మానిపించటం అంటే పాపాయిని పూర్తిగా తల్లిపాలనుంచి దూరం చేయటం అని అర్ధం చేసుకోకూడదు,శిశువు యొక్క
 • పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తల్లిపాలకు అనుబంధంగా ఇతర ఆహారపదార్ధాలను అందజేయటం అని అర్ధం.

తల్లిపాలు మానిపించటం పక్రియను ఎప్పుడు ఆరంభించాలి?

 • ఆరుమాసాలవరకూ శిశువుకు అచ్చంగా తల్లిపాలు ఇవ్వాలి.అక్కడి నుంచి మెల్లగా తల్లిపాలు మానిపించటం మొదలుపెట్టాలి.

తల్లిపాలు మానిపించే ఆహారం లో ఉండాల్సిన లక్షణాలు

ఈ ఆహారపదార్ధాలు ప్రాధమికంగా శక్తినిచ్చే అదనపు వనరులుకానీ యితర అవసరమైన పోషకపదార్ధలైన మాంసకృత్తులు,ఐరన్,విటమిన్ ఎ,విటమిన్ సి వంటివాటిమీద శ్రద్ధవహించాలి.కాబట్టి

ఈ ఆహారపదార్ధాలు తప్పనిసరిగా

 • అధికస్థాయి శక్తి కలిగి ఉండాలి
 • పరిమాణములో,చిక్కదనం లో తక్కువగా ఉండాలి
 • సులభంగా జీర్ణమవాలి
 • తాజాగా శుభ్రంగా ఉండాలి
 • అర్ధఘనపదార్ధ చిక్కదనం మంచిది.
 • తక్కువ ఖర్చుతో  మరియు సులభంగా తయారుచెయ్యగలది

తల్లిపాలు మానిపించేందుకు తగిన ఆహారసమూహాలు

 • గోధుమ,వరి లేదాచిరుధాన్యాలు గల ప్ర్ధధానాహారానికి అదనంగా మాంస కృత్తులనిచ్చే మరియొక వనరును జతచెయ్యటం ముఖ్యం.పశువులపాలు,పాల ఉత్పత్తులు,కాయధాన్యాలు,బీన్సు,గుడ్లు,చేపలు, లేదా మాంసంను ఉపయోగించవచ్చు.
 • మరియొక ముఖ్యమైన ఆహారసమూహం నూనెలు మరియు కొవ్వులు,వీటిలో కాలరీలు సమృద్ధిగా కేంద్రీకృతరూపములో ఉంటాయి మరియు ఇవి తల్లిపాలు మానిపించేందుకు తగిన ఆహారాన్ని రుచికరంగా,మృదువుగా చేస్తాయి.
 • కూరగాయలు మరియు పళ్ళు విటమిన్లను,ఖనిజాలను అందిస్తాయి.ఆయా రుతువులలో దొరికే  చౌకయైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
 • తల్లిపాలు మానిపించేందుకు తగిన ఆహారపు పోషకాహారవిలువలను మెరుగుపర్చటం.

ఆహారపు పోషకవిలువలను మెరుగుపరచేందుకు కొన్ని ముందుజాగ్రత్తలను తీసుకోవాలి.

 • జావను మరీ పలచగా చెయ్యకూడదు,ఎందుకంటే అందులోని కాలరీలు తగ్గిపోతాయి.
 • వంటచేసే విధానాలు తరిగే ముందు కూరగాయలను కడగటం,కనీసపరిమాణములో వంటకు నీటిని వాడటం  లాంటి తప్పనిసరిగా అవలంబించాలి
 • మొలకలలెత్తించటం వల్ల విటమిన్ బి సమూహములోని కాయధాన్యాలు,బీన్స్ వంటివాటి సారం అధికమవుతుంది.

అమిలేస్ సమృద్ధ ఆహారం(ఎ ఆర్ యఫ్)

 • ఇది ఎంజైమ్ ఆల్ఫా అమిలేస్ సమృద్ధిగా గల మొలకెత్తిన తృణధాన్యపుపిండి. ఇది కొద్దిమొత్తాల్లో తీసుకుంటే ఆహార పరిమాణాన్ని తగ్గిస్తుంది ఎందుకనగా ఆల్ఫా అమిలేస్ తృణధాన్యాలలోని పొడవైన పిండిపదార్ధపు గొలుసులను
 • కొద్దివైన డెక్స్ ట్రిన్లుగా విభజిస్తుంది.ఈ విభిన్నమైన పదార్ధం పాలుమానబోతున్న బిడ్డకు తక్కువ చిక్కదనం అయినా ఎక్కువసాంద్రతతో కూడిన పాకాన్ని అందిస్తుంది.సంప్రదాయంగా రాగి,గోధుమ,పెసలు లాంటివాటిని మొలకలెత్తించి పిండిచేసి ఈ పాలుమానిపించేఆహారంగా వాడతారు.

తల్లిపాలు మానిపించేటప్పుడు పోషకాహారం

6-9 నెలలు

 • అన్నిఆహారాలను గుజ్జుగా చెయ్యాలి
 • అర్ధఘనాహారంగా ఇవ్వాలి,పలచగా చెయ్యకూడదు
 • ఒకటి లేదా రెండు చెంచాలతో మొదలుపెట్టాలి
 • మూడునాలుగు చెంచాలకు పెంచి రోజుకు 50 - 60 గ్రాములకు లేదా అరకప్పుకు పెంచాలి
 • ఆహారపుపరిమాణాన్ని క్రమంగా పెంచాలి
 • ఆహారములో వైవిధ్యాన్ని పెంచాలి
 • తల్లిపాలిస్తూనే ఉండాలి

9-12 నెలలు

 • మరిన్ని రకాల ఇంటిఆహారాన్ని కలపవచ్చు
 • తల్లిపాలిస్తూనే ఉండాలి

12-18 నెలలు

 • వెయ్యి కాలరీలు లేదా తల్లితినేదానిలో దాదాపు సగం ఆహారం అవసరమవుతుంది
 • తల్లిపాలిస్తూనే ఉండాలి

జబ్బుపడ్డాక,కోలుకున్నాక పాలివ్వటం

 • వైద్యుడు సలహా యిస్తేతప్ప సామాన్య చిన్నపిల్లల రుగ్మతలయిన తిసారం,శ్వాసకోశవ్యాధులు వచ్చినా సరే పాలిస్తూనే ఉండాలి.చిన్నచిన్న పరిమాణాలలో మరింతతరచూఇస్తుండాలి.
 • అతిసారం వచ్చినప్పటికీ తల్లిపాలిస్తూనే ఉండాలి.త్వరగా ఇచ్చే ఆహారంవల్ల త్వరగా కోలుకోవచ్చు మరియు ఆహారలోపాన్ని రాకుండాచేస్తుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate