অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాయగూరలు

కాయగూరలు

కూరగాయలు యాంటిఆక్సిడెంట్లు విరివిగా ఉండటంతోపాటు వివిధాలైన పోషకాలను అందిస్తాయి. కూరగాయల్ని ఈ విధంగా సమూహాలుగా విభజించవచ్చు

 • ఆకుకూరలు
 • వేర్లు మరియూ దుంపలు
 • మిగతా కూరగాయలు.

అకుకూరలు

 • ఎన్నోరకాల ఆకుపచ్చఅకుకూరలు వినియోగిస్తున్నారు.సాధారణంగా వాడేవి పాలకూర, కొయ్యతోటకూర, మెంతికూర, ములక్కాయలు, పుదీనా మొదలైనవి.
 • ఆకుపచ్చఅకుకూరలలో అధికంగా కాల్షియం,ఐరన్,బీటా-కెరొటిన్,విటమిన్-సి, రైబోఫ్లోవిన్, ఫాలికామ్లాలు ఉంటాయి.

వేర్లు మరియు దుంపలు

 • సాధారణంగా తినే ముఖ్యమైన దుంపకూరలు కర్రపెండలం,బంగళాదుంప,చిలగడదుంప,క్యారట్,కంద,చేమదుంప
 • ఇవన్నీ పిండిపదార్ధాలను పుష్కలంగా కలిగియుంటాయి, మన ఆహారములో శక్తిని కలిగించే ముఖ్యమైన వనరులు.
 • క్యారట్ మరియు పసుపచ్చరకాల కందలో సమృద్ధిగా కెరటిన్,బంగాళాదుంపల్లో విటమిన్ సి లభిస్తాయి.
 • కర్రపెండలం,కందలో కాల్షియం విరివిగా లభిస్తుంది.

మిగతా కూరగాయలు

 • ఈ సమూహములో ఆకుకూరలలోనికి, వేర్లు,దుంపలోనికి రానివి ఉంటాయి.
 • ఎక్కువగా తినే కూరగాయల్లో బీన్సు , వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, పొట్లకాయ, సొరకాయ లాంటివి , రామములగపళ్ళు ఇవి భోజనములో వైవిధ్యంగా ఉండటమేకాక విటమిన్ సి మరియు కొన్ని ఖనిజాలను కలిగియుంటాయి.
 • ఈ కూరగాయలు పధ్య సంబంధమైన పీచుపదార్ధాలను కలిగియుండటమే గాక ఆహారానికి స్ధౌల్యాన్ని అందిస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్య సలహా

 • అన్నీ కూరగాయలూ తాజాగా ఉన్నప్పుడు మంచి రుచిని కలిగిఉండి విరివిగా పోషక విలువల్ని ఇస్తాయి. పోషక విలువలు కోల్పోకుండా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో శుభ్రపరచడం మరియూ  తయారు చేసుకోవటం ముఖ్యం.
 • కూరగాయల్ని తరిగేముందు శుభ్రంగా కడుక్కోవాలి మరియూ తరిగిన కూరలని నీటిలో నాననివ్వ కూడదు దేనికంటే అలాచేస్తే అవి నీటిలో కరిగిపోయ్యే విటమినులు కోల్పోతాయి
 • కూరగాయలను తరిగిన వెంటనే వంటచేసేయ్యాలి తద్వారా ఎక్కువ విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.తరిగిన కూరగాయలు ఎక్కువసేపు వాతావరణములో ఉంటే కూడా విటమిన్లను కోల్పోతాయి.
 • ఎక్కువ విటమిన్లు వేడిని తట్టుకొలేవు. కాబట్టి ఎక్కువగా ఉడికించటం,వేయించటం వల్ల విటమిన్లు తగ్గుతాయి. ఉదాహరణకు క్యాబేజీని ఉడికించటంవల్ల సగానికి పైగా విటమిన్లు నశిస్తాయి.
 • పరిమాణం తో పాటు వైవిధ్యం కూడా ముఖ్యమైనదే.మనం ఆరోగ్యంగా ఉండేందుకు విభిన్నమైన కూరగాయలు విభిన్నమైన పోషకాలను సమకూరుస్తాయి.విభిన్నమైన వర్ణాలలో ఉండే వాటిని వాడండి . ముదురు ఆకుపచ్చఅకుకూరలు,పసుపు,కమలా మరియు ఎర్రరంగు కూరగాయలు.

గుర్తుంచుకోదగ్గ ఆరోగ్య చిట్కాలు

 • ఆకుపచ్చఅకుకూరలు చౌకగా దొరకటమేగాక పౌష్టికాహారం కూడా.కాబట్టి ప్రతిదిన ఆహారములో కనీసం50గ్రాముల ఆకుపచ్చఅకుకూరలు ఉండేలాచూసుకోవటం మంచిది.
 • ఆకుపచ్చఅకుకూరలను పిల్లలు,గర్భిణీ మరియు బాలింతలు ఇలా అందరూ తినవచ్చు.
 • ఏడాదిపొడవునా ఆకుపచ్చఅకుకూరలను ఉచితంగా పొందాలంటే వాటిని ఇంటిపెరడులో,పాఠశాలల్లో పెంచండి.
 • పెరటిలో ములగ,మద్రి లాంటి చెట్లను పెంచినట్లైతే పెద్ద శ్రమలేకుండానే నిత్యమూ పచ్చ్టటిఆకుకూరలను పొందవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు      © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
      English to Hindi Transliterate