పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

క్రొవ్వు మరియు నూనెలు

ఈ విభాగంలో క్రొవ్వు మరియు నూనెలు పోషణ వివరాల గురించి వివరించబడింది.

 • భారతదేశములో సాధారణంగా ఉపయోగించే క్రొవ్వుల్లో వెన్న,నెయ్యి,వనస్పతి ఉన్నాయి.
 • అలాగే సాధారణంగా ఉపయోగించే నూనెల్లో వేరుశెనగనూనె,పొద్దుతిరుగుడు నూనె, నువ్వులనూనె, కొబ్బరినూనె వగైరాలున్నాయి.
 • అన్ని రకాల క్రొవులు కేంద్రీకృతశక్తికి ఆధారవనరు ఇది ఒక గ్రాముకు 9కిలోక్యాలరీల శక్తిని ఇస్తుంది.
 • శాఖాహారనూనెలు లైనోలెయిక్ మరియు  లైనోలెయిక్ ఆమ్లాలు వంటి బహుఅసంతృప్తక్రొవ్వుఅమ్లాలను కలిగి ఉంటాయి ఇవి శరీరానికి ఆవశ్యకమైన క్రొవ్వు ఆమ్లాలను అందజేస్తాయి..

గుర్తుంచుకోదగ్గ ఆరోగ్య చిట్కాలు

 • ప్రతి నూనెలోనూ కొన్ని మంచి లక్షణాలుంటాయి.కాబట్టి అన్నిరకాల శాఖాహార నూనెలను వంటకు  ఉపయోగించవచ్చని సూచించటం జరిగింది.(అరుదుగా ఉపయోగించే కొబ్బరినూనె,పామాయిల్ లాంటివి మినహా)వేరువేరురకాల నూనెలను కలిపి ఉదాహరణకు బియ్యపు తవుడు నూనె పొద్దుతిరుగుడు నూనె,లేదా నువ్వులనూనె సోయా నూనెల కలయికతో మోనో అన్ సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్(యమ్. యు.యఫ్.ఎ) పాలీ అన్ సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (పి.యు.యఫ్.ఎ) లభ్యమవుతాయి.
 • వేపుళ్ళకు జొన్ననూనె,కుసుమనూనె(ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడిచెయ్యగలిగేవి)ఉపయోగించవచ్చు.
 • పామాయిల్,వెన్న,నెయ్యి,లేదాగుడ్డులోని పచ్చసొన వాడకాన్ని తగ్గించాలి.అధికంగా కొవ్వు పదార్ధాలు తీసుకొనటం వల్ల గుండెజబ్బులకు దారితీయవచ్చు.

కొవ్వు, నూనెల గురించిన పోషకాహార వాస్తవాలు

 1. ఆహారములో కొవ్వు అవసరం ఎందుకనగా
 2. అవసరమైన కొవ్వు ఆమ్లాలను ఇస్తుంది.
 3. ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
 4. శక్తిని,కలిగిస్తుంది ముఖ్యంగా, చిన్నపిల్లలకు.
  • అన్నిరకాల కొవ్వుల నుంచి లభించే క్యాలరీలు 25 -30 శాతానికి పరిమితం చెయ్యటం ఉత్తమం.పసిబిడ్డలు, పాఠశాల వయసుకు వస్తున్నపిల్లలకు కొవ్వుపదార్ధాలు పరిమితంగా ఇవ్వవచ్చు,ఇవి ఆహారపు పరిమాణము పెంచకుండానే క్యాలరీలు అందజేస్తాయి. పాఠశాలకు వెళ్ళే పిల్లలకు,కిశోరప్రాయములోని వారు శారీరకంగా చురుగ్గా ఉండేవారు కూడా కొవ్వుపదార్ధాలను తీసుకొనవచ్చు. మిగిలినవారు కొవ్వుపదార్ధాలను మరి ముఖ్యంగా జంతువులనుంచి లభించేవాటిని తగ్గించాలి.
  • కొన్ని శాఖాహార నూనెలు,ఎర్ర పామాయిల్ లాంటివి అధికంగా బీటా-కెరాటీన్ (800 మైక్రో గ్రాములు/
  • గ్రాములు ) కలిగిఉంటాయి.
  • అత్యధిక అసంతృప్త కొవ్వుకలిగిఉండే కుసుమనూనె లాంటివి  పెద్దస్థాయిలో పాలీ అన్ సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (పి.యు.యఫ్.ఎ) ను కలిగియున్నప్పటికీ అంత స్థాయిలోని పాలీ అన్ సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్  (పి.యు.యఫ్.ఎ)  అవాంఛనీయమని,పెరాక్సీడైజేషన్ దీనికి కారణమని భావిస్తున్నారు.
  • వేరుశెనగనూనె లాగానే బియ్యపుతవుడు నూనె లోకూడా కొవ్వుఆమ్లాల సంవిధానం  ఉన్నది. ఏది ఏమైనప్పటికీ బియ్యపుతవుడు నూనెలో రక్తపు ఒరైజనాల్ అనే కొలెస్టరాల్ ను తగ్గించే పదార్ధము ఉండగా, వేరుశెనగనూనెలో ఆ గుణము లేదు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99419279907
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు