অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీరు

  • నీరు మన శారీరకప్రకృతిలో అధికభాగం ఉంటుంది.
  • మన శరీరముబరువులో 60శాతం నీరే.
  • మానవుల అస్తిత్వానికి అత్యంతావశ్యకమైనది నీరు,శరీరవ్యవస్థ సున్నితంగా పనిచెయ్యటానికి నీరు ఎంతో అవసరం.
  • సాధారణ మానవులలో నీటి నియంత్రణ దప్పిక ద్వారా,మూత్రవిసర్జనద్వారా జరుగుతుంది.
  • శరీరం లో నీరు నిర్జలీకరణ(నీరు లేక ఎండిపోవటం)కు గనుక గురైతే అది శారీరకధర్మాలను ప్రభావితం చేస్తుంది.

మనశరీరములోని నీటిసమతుల్యత

  • శరీరానికి నీరు ఆహారముద్వారా,పానీయాల ద్వారా,మనము త్రాగే నీటిద్వారా లభిస్తుంది. మన ఆహార అలవాట్లను బట్టి,శీతోష్ణస్థితిగతులను బట్టి ఇందులో తేడాలు ఉంటాయి.
  • శరీరం నుంచి నీరు ఇలా పోతుంది
  • మూత్రము ద్వారా 1-2లీటర్లు/రోజుకు
  • చెమట-పరిసరాలను బట్టి మారుతుంటుంది(చల్లనివాతావరణములో 200మిల్లీలీటర్ల నుంచి అతివేడి శీతోష్ణస్థితిలో4లీటర్లవరకూ)
  • గాలి ఆడక ఉక్కపోత వల్లమరియు చర్మము ద్వారా,ఇది శీతోష్ణస్థితిని బట్టి మారుతుంటుంది.
  • మలంద్వారా-సాధారణంగా 200-300  మిల్లీలీటర్లు,కానీ విరేచనవ్యాధులప్పుడు అయిదు లీటర్లకు పైగా.

నీటియొక్క విధులు

  • రక్తప్రవాహం ద్వారా శరీరమంతటికీ ఆక్సిజన్ ను,పోషకపదార్ధాలను మానవశరీరమంతటికీ నీరుసరఫరా చేస్తుంది.
  • చెమట,మలమూత్రాలద్వారా వ్యర్ధాలను,మలినాలను విసర్జించటానికి నీరు అవసరం.
  • మెదడుకు,మెదడుద్వారా సమాచారాన్ని అందుకోవటానికి నీరు అవసరం.
  • మెదడులో 90శాతం నీరు కాబట్టి నిర్జలీకరణ అనే (నీరు లేక ఎండిపోవటమనే) ప్రక్రియద్వారా మెదడు ప్రభావితమవుతుంది.
  • నీరు విద్యుద్విశ్లేషపదార్ధ(ఎలక్ట్రాలైట్)సమతుల్యత నిర్వ్హహణలో సాయం చేస్తుంది.
  • శరీరము యొక్క సాధారణ ఉష్ణోగ్రతలను నీరు కాపాడుతుంది.
  • మన చర్మాన్ని అందంగా,ఆరోగ్యంగా ఉంచేందుకు నీరు సాయం చేస్తుంది.
  • సిఫారసు చెయ్యబడిన విధంగా రోజుకు 1.5 నుంచి 2 లీటర్ల నీటిని సేవించితే మన జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది,జీవక్రియను వృద్ధి చేస్తుంది,రోగనిరోధకశక్తిని పెంపొందించి వివిధవ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది.

నిర్జలీకరణ (నీరు లేక ఎండిపోవటం)

  • మనశరీరం నుంచి బయటకు పోయిననీటి కి మనం తాగే నీటికి పరిణామంలో తేడా వచ్చినప్పుడు నిర్జలీకరణ(నీరు లేక ఎండిపోవటం)జరుగుతుంది.
  • అతిసారం,విపరీతమైన వేడి వాతావరణం,నీటి లభ్యతలేని చోట్ల దీన్ని గమనించవచ్చు.
  • శరీరములోని మొత్తము నీటిపరిమాణములో అయిదుశాతం కోల్పోయినప్పుడు ఈ శరీరముక్షీణించే లక్షణాలు కనిపించటం మొదలవుతుంది.

ఆరోగ్యవంతుడైన వయోజనుడిలో అలసట,సాధారణ అసౌకర్యం దీని లక్షణాలు.

పెద్దవయసువారిలో శరీరపు రసాయన చర్యలో మార్పులు మొదలవుతాయి,ముఖ్యంగా ఎలక్ట్రాలైట్స్,లో సోడియం అధికం అయినప్పుడు.ముసలితనము వస్తున్నందుకు సూచనలుగా ముడుతలు,

సోమరితనము,స్థితిభ్రాంతి కూడా గమనించవచ్చు.

నోటిద్వారా కానీ,నరాలద్వారాద్రవాలు అందజేసి కానీ ఈ స్థితిని నయంచెయ్యకపోతే మూత్రపిండాలు దెబ్బతినటానికీ,మరణానికి కూడా దారితీయవచ్చు. ·

నిరంతరం నీటిని కోల్పోవటం లేదా సరిగ్గా నీరు తీసుకోకపొయినా వయసు మీదపడే ప్రక్రియ వేగవంతమవుతుంది దానితోపాటు వ్యాధులకు గురయ్యే ప్రమాదమూ పెరుగుతుంది.

అన్నిటికన్నా అసంఖ్యాకంగా చిన్నిచిన్న ఆరోగ్యసమస్యలు మలబద్దకం,పొడిబారిన,దురదపుట్టించే చర్మము,మొటిమలు,ముక్కులో నుంచి రక్తం కారడం,మూత్రనాళపు ఇబ్బందులు మొదలైనవి సంభవించవచ్చును.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate