పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పప్పులు మరియూ నూనె విత్తనాలు

ఈ విభాగంలో పప్పులు మరియూ నూనె విత్తనాలు పోషకాహార వాస్తవాల గురించి వివరించబడింది.

 • పప్పులు మరియూ నూనె విత్తనాలు మంచి ప్రోటీను విలువలు మరియూ కేంద్రీకృతశక్తిని కలిగి ఉంటాయి.
 • ఇలాంటివాటిల్లో బాగా వాడుకలో ఉన్నవి వేరుశనగలు మరియూ నువ్వులు
 • వీటిల్లో బి విటమిన్ అధికశాతంలో ఉంటుంది. వేరుశనగల్లో మరీ ముఖ్యంగా,థియామైన్ మరియూ నికోటినిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటాయి.·
 • వీటిల్లో ఎంచదగిన శాతాల్లో పిండిపదార్ధాలు ఉండవు.

పప్పులు మరియూ నూనె విత్తనాలలో వాస్తవ పోషక విలువలు

 • భారతదేశంలో నూనె విత్తనాలు ముఖ్యంగా నూనె ఉత్పత్తికి ఉపయోగిస్తారు. నూనె గింజల కన్నా ఆ గింజలనుండి నూనెని తీసాక వచ్చిన పదార్ధం చాలా ప్రొటీనుల్ని కలిగిఉంటుంది.నూనెగింజ చెక్కని సహజంగా పశువుల ఆహారంగా వాడతారు. ఇటీవలి కాలంలో, కొన్ని అభివృద్ధి పరిచిన మరియూ మెరుగైన నూనె తీసే పద్దతులతో మరియూ చెక్కని తయారు చేసే పద్ధతులతో, నూనె ఎక్కువగా లేని తినతగిన చెక్క దొరుకుతున్నది. ఈ అధిక ప్రోటీను కలిగిన చెక్కని రకరకాల మేతలుగా తయారు చేస్తున్నారు.ఈ నూనెలేని పదార్ధంతో ప్రోటీను ఐసోలేట్సు కూడా ఉత్పత్తి చేస్తున్నారు.
 • సాధారణంగా నూనెగింజల నుండి వచ్చిన ప్రోటీనులో అమినో ఆమ్లమైన మెథియొనైన్ తక్కువగా ఉంటుంది కానీ లైసిన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వుపప్పు ప్రోటీనులో ఈ మెథియొనైన్ ఎక్కువగా ఉంటుంది.
 • అస్పర్ గిల్లస్ ఫ్లవస్ వల్ల ఉత్పత్తి అయ్యే అఫ్లటాక్సిన్ వల్ల చెడిపోయిన వేరుశనగల వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక, వేరుశనగల నుండి నూనె ఉత్పత్తి చేసే ముందూ, మరియూ ఆహారంలా తీసుకునే ముందూ
 • శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. అఫ్లటాక్సిన్ అంటుకోకుండా ఉండాలంటే వేరుశనగ విత్తనాలని సరిగ్గా ఎండబెట్టి, సరైన విధానాలతో వాటిని నిల్వ చేసుకుని, సరైన విధానంతో రవాణా చేసుకోవాలి.

గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్య చిట్కా

 • నూనె గింజల కన్నా ఆ గింజలనుండి నూనెని తీసాక వచ్చిన పదార్ధం చాలా ప్రొటీనుల్ని కలిగిఉంటుంది. ఇలా నూనె గింజల నుండి నూనెని వేరు చేసిన పదార్ధం లేక ఆ ప్రోటీనుల్ని తృణధాన్యాలతో పాటుగా పెరిగే పిల్లలకి ఆహారంగా వాడతారు.
 • అఫ్లటాక్సిన్ తో చెడిపోయిన వేరుశనగలు తింటే కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00231213873
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు