పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మొలకెత్తిన పప్పుదినుసులు - పోషక విలువలు

మొలకెత్తిన పప్పుదినుసులు - పోషక విలువలు.

పప్పుదినుసులు ఆహారములో ఒక ముఖ్య భాగం. కంది పప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగ పప్పు వంటి వాటిని ఎక్కువగా వాడుతుంటాము. పప్పుదినుసులు మాంసకృత్తుల భండాగారాలు అని చెప్పవచ్చు. 100 గ్రాముల పప్పుదినుసులు నుంచి సుమారుగా 15 నుంచి 25 గ్రాముల మాంసకృత్తులు లభ్యమవుతాయి. జంతుసంబంధ ఆహారంతో పోలిస్తే ఇవి చావక్తేనవిని చెప్పవచ్చు. ఇవి పేద ప్రజలకు సమపాళ్లలో మాంసకృతులను అందించే ఆహారం అని చెప్పవచ్చు.

పప్పుదినుసుల పోషక విలువలు ఎండిన పప్పుదినుసుల గింజలలో కంటే మొలకెత్తిన గింజలలో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శనగ, పెసర గింజలను మొలకెత్తిన తరువాత తినడం వలన వాటిలోని మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమినుల అందుబాటులో గణినీయంగా మార్పులు కలుగుతాయి. మొలకెత్తిన సమయంలో గింజలలో పిండి పదార్ధాలు సంశిష్ట రూపం నుంచి సుష్మ / సాధారణ రూపంలోకి విడగొట్టబడి వాతావరణంలోని నత్రజనిని పీల్చుకుంటాయి. దీని వలన తేలికగా జీర్ణంకాగల పదార్ధాలు ఉత్పన్నమవుతాయి. మాంసకృత్తులు అమైనోఆమ్లాలు అమైడ్స్ గా, ట్రిప్టోపాన్ లైసిన్ గా మార్పు చెందుతాయి. అంతేకాక క్రొవ్వు పదార్ధాలు, నూనె పదార్ధాలలో ఉండే ఎంజైమ్ లైపేజ్ వలన పాటి ఆమ్లాలుగా రూపంతరం చెందుతాయి. ఇటువంటి మార్పులు గింజలు మొలకెత్తే సమయంలో జరుగుతాయి. ఈ విధంగా  మార్పు చెందిన ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయెగ పడుతుంది. దీని వలన ప్రేగులలో జీర్ణ ప్రిక్రియ తక్కువ సమయంలో పూర్తి కబాడీ శారీరక శ్రమను తగ్గిస్తాయి. మొలకెత్తిన గింజల ఆహారం పరోషంగా శరీరం నుండి కార్బన్ డై అక్త్సవాయువును విసర్జించడానికి దోహదపడుతుంది. ప్రేగులలో కొంత గ్యాస్ ఉంటుంది. ఈ మిగిలిన గ్యాస్ ఒలిగో సాకరైడ్స్ తాయారు కావడానికి తోడ్పడుతాయి.మొలకెత్తిన గింజల ఆహారం ఈ ఒలిగో సాకరైడ్స్ లభ్యతను 90 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వలన ఇది గ్యాస్ ను పెంచే అవకాశం తగ్గిపోతుంది. పప్పుదినుగులా పై భాగాన ఉండే పొట్టలలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మేతదుకు మించి తీసుకుంటే శరీరంలో హానికరమైన పదార్థంగా మార్పు చెందుతుంది. పప్పుదినుసులు ఒక రాత్రి పూర్తిగా నీటిలో నానబెట్టినప్పుడు ఈ తనిస్ అనే రసాయానికి పదార్ధము 25 నుండి 50 శాతం వరకు తగ్గిపోతుంది. పప్పుదినుసులు అదనంగా 24 నుండి 48 గంటల వరకు నానబెట్టినప్పుడు ఈ టానిన్ అను రసాయానికి పాడెదము అదాహంగా 10 నుండి 25 శాతం వరకు తగ్గిపోతుందని పరిశోధనలు తెలిపినాయి. అందుకని పూర్తి స్ధాయిలో పొట్టుతో ఉన్న పప్పుదినుసులు నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం ఆరోగ్యరీత్యా మంచిది. విత్తినాలను మెలకెత్తిమ్చడం వలన పోషక విలువలు పెరుగుతాయి.

విత్తనంలో స్వమజాగా ఇమిడి ఉన్న జీర్ణప్రయాకు అవరోధం కళించే కొని రసాయనాలు తొలగిపోతాయి. సాధారణంగా పప్పుడుసులు పై పొట్టి తీసిన తరువాత బద్దలుగా తీసి తినడానికి ఉపతెగిస్తారు. పొత్తు తీసి బద్దలు చేసిన పప్పుదినుసులు తొందరగా ఉడుకుతాయి మరియు తొందరగా పొట్టు తీసిన మేళకళలో తొందరగా అరుగుదల కలిగిన పీచుపదార్థం ఉంటుంది. మొలకెత్తిన పప్పుదినుసులలో పీచుపదార్థం ముఖ్యంగా శనగలలో 2.5 శాతం, పెసలు, మినుములలో 4.4 శాతం వరకు అందుబాటులో ఉంటాయి. దీని వలన విరోచనం సాపిగా అవుతుంది. మేతకెత్తిన గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం ఆరోగ్యరీత్యా మంచిది. మొలకెత్తిన విత్తనంలోని పీచుపదార్థం వివిధ రకాల జబ్బులను నివారిస్తుందని పరిశోధనలు తెలుపుచున్నాయి. భారతీయ వైద్య శాస్ర్తంలో మెలకెత్తినాన్ విత్తనాలు రక్తపు గడ్డలు, జీర్ణ కోశంలో పుండ్లు వంటి వారిని నయం చేస్తోయిందని తెలిపారు. పప్పుదినుసులలోని టానిన్, పెట్టేట్లు వంటి హాని కలిగించే రసాయనాలు ఇనుము, కాల్షియం వంటి పోషకాలను బంధించి శరీరానికి అందుబాటులో లేకుండా చేస్తాయి. మొలకెత్తిన గింజలలో టానిన్, ఇతర హాని కలిగించే రసాయనాలు నశిస్తాయి. మొలకెత్తిన తరువాత పప్పుదినుసులలో టానిన్ పరిమాణం తగ్గి శరీరానికి కావలసిన మాంసకృత్తులు మారిమాణం పెరుగుతుంది.

పప్పుదినుసులలో విటమిన్ సి శాతం పెరుగుతుంది. దీని వలన మాంసకృత్తులు తొందరగా లభ్యత చెందుతాయి. విటమిన్ సి పప్పుదినుసులలోను ఇనుము మొలకెత్తిన తరువాత తొందరగా రక్తములో కలవడానికి ఉపయెగపడుతుంది. పప్పుదినుసులు ఉడకబెట్టినప్పుడు విటమిన్ బి నష్టము ఎక్కువగా ఉంటుంది. పూర్తి స్ధాయిలో పొట్టు ఉన్న పప్పు దినుసుల ను నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం ఆరోగ్యరీత్యా మంచిది.

ఆధారం: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.90909090909
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు