పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పీచుపదార్ధాలు

ఈ విభాగంలో పీచుపదార్ధాల గురించి వివరించబడింది.

 • మానవుని చిన్నప్రేవుల నుండి జీర్ణప్రక్రియకు తోడ్పడె ఎంజైమ్‌లను నిరోధించడంలో మొక్కల కణకుడ్యాలను ఆవరించిన పీచుపదార్ధం తోడ్పడుతుంది.
 • నీటిలో కరిగేవి(పెక్టిన్‌,గమ్స్‌,మ్యూసిలేజ్‌) మరియునీటిలో కరగని (లెగ్నిన్‌, సెల్యులోజ్‌) పీచు పదార్ధాలుగా వర్గీకరించడమైనది.
 • లభ్యమయ్యే వనరులుః మొక్కల నుండి లభించే ఆహార ఉత్పత్తులలోనే ఇవి అత్యధికంగా కన్పిస్తాయి.  జంతు సంబంధిత ఉత్పత్తులలో ఉండవు. మనం తినగల్గే ఆహార పదార్ధాలలోని బాహ్య చర్మం మరియు పై పొరలలోను పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.

పీచు పదార్ధం చేసే పనులు

 • మనం తీసుకున్న ఆహారం స్ధూలాన్ని ఇస్తుంది
 • పిండి పదార్ధాల, క్రొవ్వుపదార్ధాల శోషణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.
 • పొట్ట నిండుగా ఉన్నట్లనిపించడం వల్ల అధికంగా తినడం తగ్గుతుంది.
 • కరిగే పీచుపదార్ధములు సీరమ్‌ కోలెస్టరాల్‌ మొత్తంలోస్థాయిని తగ్గిస్తుంది.
 • మధ్యాహ్న భోజనానంతరం మన రక్తంలోగల చక్కెరస్థాయిని తగ్గిస్తుంది.
 • కరగని పీచుపదార్ధాలు మలాన్ని ఎక్కువచేస్తాయి.
 • ఏమైనప్పటికిజీర్ణింపబడేపీచుపదార్ధాలుతీసుకోవడంవల్ల విలువైన సూక్ష్మ పోషకాల శోషణం తగ్గుతుంది.

మన ఆహారంలో తగినంత పీచు పదార్ధాలను తీసుకునే విధానాలు

 • రోజుకి 30-40 గ్రాముల పీచు పదార్ధం మనం తీసుకునే ఆహారంలో ఉండడం శ్రేయస్కరం.
 • భారతీయ సాంప్రదాయపు ఆహారంలో ప్రధానధాన్యపు భోజనంలోపప్పు జాతులు, కాయగూరలు ఎక్కువ మొత్తంలో తీసుకోవడంలో రోజుకి 50-100 గ్రాముల పీచు పదార్ధం లభిస్తుంది.
 • జల్లెడ పట్టని గోధుమ పిండి వినియోగించడం.
 • మైదాను పరిమితంగా వినియోగించడం.
 • లెగ్యూమ్‌ జాతులనుండి లభించే ఆహార పదార్ధాలను పదార్ధాలను కనీసం వారానికి రెండు సార్లు వినియోగించడం తప్పనిసరి.
 • పై పొరతో తినగల్గే పండ్లను వినియోగిచుకోవడం.
 • శుద్ధిప్రక్రియలతో చేసిన ఆహారాలను, బజారులో దొరికే తక్షణ ఆహార పదార్ధాల (ఫాస్ట్‌ ఫుడ్‌)ను పరిమితంగా తినాలి లేదా మానేయ్యాలి.
 • మెంతుల లో నీటిలో కరిగే పీచుపదార్ధం అధికంగా ఉండడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని, సిరమ్‌ కోలెస్ట్రా ల్‌, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో ప్రభావితం చేస్తుంది కాబట్టి వీటిని ఆహారంలో వినియోగించడం అధికం చేయాలి.
 • పీచు పదార్ధముండే ఆహార పదార్ధాలను మనం తీసుకుంటే పెద్ద ప్రేవులలో నిల్వ ఉండే మలాన్ని తొలగించడానికి, మలబద్దకాన్ని నివారించడానికి హెమరాయిడ్స్‌, మరియు డైవర్టిక్యులోసిస్‌, మధుమేహం , హైపర్‌ లిపిడిమియా మరియు స్థూలకాయం వంటి పరిస్థితులను మెరుగు పరచబడతాయి.

సాధారణ ఆహార పదార్ధాలలో గల పీచు పదార్ధ పరిమాణం (100గ్రాములకు)

అధికం (10 కన్నా ఎక్కువ) మధ్యస్థం (1నుండి10) తక్కువ
(1కన్న)
లేనివి
గోధుమ వరి శుద్ధిచేసిన బాగా వేయించి వండిన  ఆహారపదార్ధాలు చక్కెర
జొన్న చాలా కాయగూరలలో కొవ్వులు/నూనెలు
బజ్రా కొబ్బరి పాలు
రాగి చాలా పండ్లలో అన్నిరకాల మాంసం
మొక్కజొన్న నువ్వులు
లెగ్యూమ్‌లు,పప్పులు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00884955752
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు