పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అయొడిన్‌

ఈ విభాగంలో అయొడిన్‌ (సూక్ష్మ పోషకం ) గురించి వివరించబడింది.

థైరాయిడ్‌ హార్మోన్‌ల (థైరాక్సిన్‌) సంశ్లేషణానికి అయొడిన్‌ అవసరముంది. మానవ శారీరక, మానసిక పెరుగుదలలో అయొడిన్‌ బాధ్యత గలదు.

ప్రతీరోజు 100-150 మ్యు ( µ ) గ్రాముల అయొడిన్‌ (0.0001 నుండి 0.00015 గ్రాముల మధ్య ) కావలసి ఉంటుంది. వారి వారి వయస్సులను బట్టి శరీరధర్మ పరిస్థితులను బట్టి దీని పరిమాణం మారుతూ  ఉంటుంది.

అయొడిన్‌ లోపం వలన వచ్చే రుగ్మతలు

  • భారతదేశపు ప్రజ ల ఆరోగ్యంలో  అన్నింటికన్నా ముఖ్యమైనది సూక్ష్మపోషకలోపాలలో అయొడిన్‌ లోపం వలన వచ్చే రుగ్మతలు ప్రధానమైనవి.
  • గర్భవతులైన స్త్రీలలో అయొడిన్‌ లోపం ఉంటే గనుక పిండం పెరుగుదల, మానసికాభివృద్ధుల పైన ప్రభావం చూపిస్తుంది. దీని వలన గర్భ విచ్చిత్తి జరగవచ్చును. మానసిక వైకల్యంగల శిశువు జన్మించవచ్చు.
  • శిశు పూర్వదశలో అయొడిన్‌ లోపం ఉంటే  శిశువు యొక్క శారీరక మానసిక పెరుగుదల (క్రెటిన్‌) మందగింప బడుతుంది.
  • వయోజనులలో అయొడిన్‌ లోపం ఉంటే హైపోథైరాయిడజమ్‌ మరియు కంఠవాపుకు (గొయిటర్‌ ) దారి తీస్తుంది.
  • ఆవ(మస్టర్డ్‌)జాతికి చెందిన కొన్ని ఆహారాలలో (క్యాబేజి, కాలిఫ్లవర్‌ , బ్రోకోలా మొదలగున్నవి క్రూసిఫెరె కుటుంబానికి చెందిన కొన్ని కాయగూరలు) అయొడిన్‌ వినియోగంలో జోక్యంవలన గొయిటర్‌  వ్యాధికి దారితీస్తుంది. వీటిని గొయిట్రోజెన్స్‌ అంటారు.
  • గనులు లేనిచోట్ల 60-75 శాతం అయొడిన్‌ అవసరాలు తీరాలంటే మనంతీనే ఆహారంలో ఆయొడిన్‌ ఉండాలి. మిగితాశాతం నీటి ద్వారా దొరుకుతుంది. స్థానికంగా గొయిటర్‌  వ్యాధి ఉన్న ప్రాంతాలలో నేల, నీరు, స్థానికంగా పండే పంటలలోను అయొడిన్‌ లోపం ఉంటుంది.
  • భారత దేశంలో ఉప హిమాలయ ప్రాంతాలలో స్థానికంగానే గొయిటర్‌ వ్యాధి ఉంది. ఇటీవలి కాలంలో మనదేశంలోని స్థానికంగా ఈ వ్యాధి లేనిచోట్ల కూడ అనేక ప్రత్యేక ప్రాంతాలలో గొయిటర్‌ వ్యాధిని గుర్తించడం జరిగింది. ఈవిధమైన ప్రత్యేక విభాగాలు గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి.

గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా

  • సముద్రం నుంచి లభించే ఆహారపదార్ధాలను తీసుకోవడం ద్వారా లేదా అయొడిన్కల్గిన ఉప్పు వాడకం వల్ల, అయొడిన్లోపాన్ని నివారించవచ్చును అంటే సాధారణ ఉప్పు లోని ప్రతీ గ్రాము ఉప్పునందు కనీసం 15మ్యు గ్రాముల అయొడిన్‌ ఉంటుంది. .

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0303030303
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు