অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సోడియమ్‌

  • ద్రవాభిసరణ పీడనం, ద్రవతుల్యతను నిర్వహించడంలో సోడియమ్‌ ఆవశ్యకతగలదు.
  • సామాన్యకండర బాధల ఉపశమనానికి ఇది అవసరం.
  • గ్లూకోజ్‌, గేలక్టోజ్‌ మరియు అమైనో ఆవ్లూలను ప్రేవులు శోషణంచేసుకోవడానికి సోడియమ్‌ ప్రమేయముంటుంది.
  • గుండె కొట్టుకోవడం ప్రారంభానికి, నిర్వహించడానికి దీని ఆవశ్యకత ఉంది.
  • సోడియమ్‌ ఉండే పదార్ధాలుః వంట కాలలో వినియోగించే సాధారణ ఉప్పులో ప్రధానంగా సోడియమ్‌ ఉంటుంది. అన్ని ధాన్యాలు, ఆకు కూరలు, గింజలు, గ్రుడ్లు మరియు పాల ల్లోను ఉంటుంది.

పోషకాలల్లో సోడియమ్‌ సంబంధిత అవ్యవస్థలు

  • సాధారణ వ్యక్తులందరికి సోడియమ్‌ రోజుకి 5-10 గ్రాములు తీసుకునే ఆవశ్యకతగలదు.
  • కుటుంబ చరిత్రలో అధిక రక్త పీడనం గలవారెవరైనా ఉంటే ఆ కుటుంబపు వ్యక్తులు వారు వాడే సోడియమ్‌ పరిమాణాన్ని 5 గ్రాములకన్నా తక్కువకు తగ్గించాలి.
  • అధిక రక్త పీడనంతో బాధపడే రోగులు వారి ఆహారంలో రోజుకి కేవలం 1 గ్రాము మాత్రమే ఉండాలి.
  • 10 గ్రాముల సోడియమ్‌ క్లోరైడ్‌ (సాధారణ ఉప్పు) లో 4 గ్రాముల సోడియమ్‌ ఉంటుంది.

జబ్బులు స్థాయి లోపాలు

  • సోడియమ్‌ లోపముంటే గనుక సీరమ్‌ సోడియమ్‌ స్థాయి సాధారణ స్థాయికన్నాతక్కువగా పడిపోతుంది. ఈ స్థితినే హైపోనేట్రీమియా అంటారు .
  • అతిసారం (డయేరియా), వాంతులు దీర్ఘకాల మూత్రనాళ సంబంధిత రోగాలు దలగున్నవి సోడియం లోపానికి దారితీస్తాయి.
  • సోడియమ్‌ లోపం వలన రక్తపీడనం తగ్గడం, ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
  • నీటిలోకరిగిన ఉప్పును తీసుకుంటే సామాన్యంగా శరీరం తేరుకుంటుంది.

అధికంగా ఉంటే

  • అధిక స్థాయిలో సోడియమ్‌ ఉంటే సీరమ్‌ సోడియమ్‌ స్థాయి పెరుగుతుంది. ఈస్థితినే హైపర్‌ నేట్రీమియా  అంటారు.
  • సామాన్యంగా దీని వలన కొన్ని హార్మోనులలో ఎక్కువతక్కువలు ఏర్పడతాయి.
  • రక్త పీడనంపెరగడం (హైపర్‌ టెన్షన్‌), శరీరంలో నీరు చేరడం తో ఎడిమా రావడం. వంటి లక్షణాలు హైపర్‌  నేట్రీమియాలో కన్పిస్తాయి.
  • కొంత వరకు మూత్రపిండాల సమస్యలు కూడ ఏర్పడతాయి. గర్భవతులకు అధిక రక్తపీడనం కల్గే అవకాశం ఉంటుంది. కొన్ని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate