పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పిండి పదార్ధాలు

ఈ విభాగంలో పిండి పదార్ధాల పోషక వాస్తవాల గురించి వివరించబడింది

 • చాలా ఆహార పదార్ధాలలో పిండి పదార్ధమే ఉంటుంది.
 • మనఆహారంలో పిండి పదార్ధమే ప్రధాన భాగముగా ఉంటుంది.
 • వీటి వల్ల మనకు ముఖ్యంగా శక్తి అందుతుంది.
 • పిండి పదార్ధాలు అధికంగా గల ఆహార పదార్ధాలుః- బియ్యం, జొన్న లేదా మొక్కజొన్న, గోధుమ ఇతర తృణ ధాన్యాలు బంగాళా దుంపలు మరియు చక్కెర.

పిండి పదార్ధాలలోని రకాలు

పిండి పదార్ధాలు రెండు రకాలుగా ఉన్నాయి. అవి సరళ, సంక్లిష్ట పిండి పదార్ధాలు.

సరళ పిండి పదార్ధాలు

 • వీటినే సరళమైన చక్కెరలు అంటారు.
 • సరళ చక్కెరలు కల్గిన ఆహార పదార్ధాలకు ఉదా||
  • కృత్రిమంగా లభించేవిః శుద్ధిచేయబడిన చక్కెరల వంటివి మనం వాడుకగా వినియోగించే పంచదార, కార్బన్‌ డయాక్సైడ్‌ తో గల పానీయాలు.
  • సహజంగా లభించేవి : పాలు, పండ్లు

ఆరోగ్య చిట్కా కృత్రిమంగా దొరికే వాటికన్నా సహజంగా లభించె పిండి పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి.

ఎందుకో మీకు తెలుసా?
 • సరళమైన పిండి పదార్ధములుగల సహజంగా లభించే పండ్లలో విటమిన్లు, పీచు, ముఖ్య పోషకాలైన కాల్షియమ్‌ వంటివి ఉంటాయి. కనక ఇవి కృత్రిమంగా లభించే వాటికన్నా ఆరోగ్యదాయకం.

గుర్తుంచుకోవలసిన ఆరోగ్యచిట్కాః  బాగా శుద్ధిచేసిన గింజ ధాన్యాల కన్నా శుద్ధిచేయని గింజ ధాన్యాలు ఆరోగ్యానికి శ్రేష్టమైనవి .

ఎందుకో మీకు తెలుసా?
 • శుద్ధిచేసిన తెల్లపిండిలో(మైదా) బాగా పాలీషు పట్టించిన తెల్లని బియ్యంలోనుంచి పోషక పదార్ధాలు , పీచు తొలగింపబడతాయి.శుద్ధిచేయని గింజధాన్యాలలో విటమిన్లు , ఖనిజ లవణాలు మరియు అధికంగా పీచు ఉండడంవల్ల జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతుంది. పీచు పదార్ధంతో పొట్ట నిండుగా ఉన్న భావం కల్గడంవల్ల తక్కువ తిన్నాకూడా ఎక్కువ తిన్నట్టుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన ఆరోగ్యచిట్కాః సరళ పిండి పదార్ధాల కన్నా  సంశ్లిష్ట పిండిపదార్ధాలను మనం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయ దాకా శక్తి ఉంటుంది.

ఎందుకో మీకు తెలుసా?
 • సంశ్లిష్టపిండి పదార్ధాలకన్నా సరళ పిండి పదార్ధాలను మన శరీరం వేగవంతంగా వినియోగించుకుంటుంది.    అందువల్ల మనకు వెంటనే ఆకలన్పిస్తుంది.    సంశ్లిష్ట పిండిపదార్ధాలతో ఉన్న సంపూర్ణాహారాన్ని  తీసుకున్నప్పుడు ఎక్కువ సమయం దాకా ఆహారం తిన్న సంతృప్తి ఉండి మనం అవసరంకంటే అధికంగా తినకుండా చూసుకోగలుగుతాము.

సంశ్లిష్ట పిండి పదార్ధాలు

 • వీటినే స్టార్చ్‌లని కూడ  అంటారు.
 • ఉదా|| గింజ ధాన్య ఉత్పత్తులు,  బ్రెడ్‌ రొట్టె, చపాతి, అన్నం మరియు దుంపలు, బంగాళాదుంప మరియు చిలగడ దుంప (యామ్‌) వంటి వేరుదుంపలు.

పిండి పదార్ధాలను శరీరం ఎలా వినియోగించుకుంటుంది

 • మనం పిండి పదార్ధాలను తిన్నప్పుడు శరీరం ఆ పదార్దాన్ని సరళ చక్కెరలుగా విడగొడుతుంది.
 • రక్త ప్రసరణంలో ఈ చక్కెరలు శోషింపబడతాయి.
 • మన రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు క్లోమ గ్రంధి ఇన్స్యులిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేసి మన రక్త కణాలలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.
 • అప్పుడు కణాలలోగల చక్కెర శక్తిగా వినియోగింపబడుతుంది.

మీరు తీసుకునే ఆహారం విలువను నిర్ణయించండి

 • గ్లైసిమిక్‌ సూచిక (జిఐ) అనె  కొలమానంతో రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను మనం రోజువారీగా తీసుకునే రొట్టెలు లేదా గ్లూకోజును ఇచ్చే ప్రామాణికాహారంతో పోలుస్తూ  తీసుకున్న ఆహారాన్ని శ్రేణులుగా ప్రామాణీకరిస్తుంది. ఆహారపు హెచ్చుతగ్గులను గ్లైసిమిక్‌ సూచికద్వారా కొలవవచ్చును.
 • మిగితా ఆహారపదార్ధాల కన్నా కొన్ని ఆహారాలలో గలపిండి పదార్ధాలు (ఈపదార్ధాలలో అధికంగా సరళ చక్కెరలుంటాయి.) రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచుతాయి.  వీటినే గ్లైసిమిక్‌ సూచిక ఎక్కువగా సూచిస్తుంది.   ఉదా|| బాగా శుద్ధి చేసిన పొట్టిబియ్యపు గింజలు, తెల్లరొట్టె,  మిఠాయిలు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు  మొదలగునవి.
 • గ్లైసిమిక్‌ సూచిక తక్కువగా సూచించే ఆహారాలుః  గోధుమ పిండి, అన్ని తృణ ధాన్యాలు, ఓట్‌ మీల్‌, బాగుగా వేడిచేసిన  బియ్యం, బార్లీగింజలు, సొయాబిన్స్ , పండ్లు , కాయకూరలు, తక్కువ కొవ్వు శాతం ఉన్న పాల ఉత్పత్తులు.

గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా:  జిఐ తక్కువగాగల ఆహార పదార్ధాలు తినడం మంచిది.

ఎందుకో మీకు తెలుసా?
 • గ్లైసిమిక్‌ సూచికతక్కువగా సూచించిన  తినే ఆహారపదార్ధాలు ఈవిధంగా తోడ్పడతాయి.
 • రక్తంలోగల గ్లూకోజ్‌ శాతాన్ని నియంత్రిస్తుంది..
 • సీరమ్‌ కోలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తుంది.
 • ఆకలిని నియంత్రిస్తుంది.
 • గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తక్కువ చేస్తుంది.
 • డయాబిటీస్‌ ( షుగర్ వ్యాధి)  2వ రకం రావడాన్ని తగ్గిస్తుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97297297297
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు