హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు పరార్‌
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు పరార్‌

కూరలు, అన్నం, రొట్టెలు ఇతర పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు

ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని అవసరానికి తగ్గట్టు వండుకునే సంప్రదాయం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. పల్లెలకు సైతం ఫ్రిజ్‌లు రావడంతో గ్రామాల్లో కూడా ఈ సంస్కృతి విస్తరించింది.

ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని తింటే వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని, ఏ రోజుకారోజు వండుకుని తింటేనే పోషకాలు అందుతాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నిత్యం మనం వినియోగించే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కవ రోజులు నిల్వ చేయరాదు. కూరలు, అన్నం, రొట్టెలు ఇతర పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా శీతలీకరణ యంత్రా ల నుంచి వచ్చే క్లోరో ఫ్లోరో కార్బన్‌(సిఎ్‌ఫసీ) ద్వారా విడుదలయ్యే రసాయనాలతో ఆహార పదార్థాలు పాడైపోతాయని చెబుతున్నారు. ఆహారాన్ని ప్రతి రోజు వండి తినడమే ఉత్తమ లక్షణమని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు.
వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రతతోపాటు విద్యుత్‌ పోయినప్పుడు ఫ్రిజ్‌లో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో అందులో ఉన్న ఆహార పదార్థాలు తినడానికి పనికిరాకుండా పోతాయి. వండిన తరువాత ఆహార పదార్థాలను గంట వరకు బయట పెట్టి అనంతరం ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అందులో కొన్ని మాత్రమే రెండు మూడు రోజుల వరకు పనికి వస్తాయి. ఉపయోగించే సమయంలో బాగా వేడి చేసి తినాలి.
మాంసం,చేపల విషయంలో..
చాలమంది మాంసం, చేపలను తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. నిత్యావసర వస్తువులు విక్రయించే కొన్ని కార్పొరేట్‌ కం పెనీలు, హోటల్స్‌లో సైతం భారీ శీతల యంత్రాల్లో మాంసం, చేపలు నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడంతో రసాయనాలు నేరుగా అందులో ఉన్న పోషక విలువల్ని దెబ్బతీస్తాయి. అందులో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. బీ,సీ విటమిన్లు పూర్తిగా తగ్గిపోతాయి. ఆ మాంసం, చేపలు వండినా అంతగా రుచిగా ఉండదు. ఆందులో ఉన్న పోషక విలువలు నశించిన తరువాత ఆది తిన్నా ఉపయోగం లేదు. ఇదీ తెలీక అనేకమంది ఇలానే వండి తినడం చేస్తుంటారు. దీంతో ఒకవైపు ఆరోగ్య సమస్యలు మరోవైపు డబ్బు వృథా అయ్యే ప్రమాదం ఉందని పౌష్టికాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
కూరగాయలు తరిగి పెట్టకూడదు ..
మహిళలు సమయం ఆదా కోసం ముందుగానే కొన్ని రకాలైన కూరగాయలను తరగి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఇలా చేయడంతో కూరల్లో ఉండే పోషక విలువలు కోల్పోయే ప్రమాదం ఉంది. తరిగి ఫ్రిజ్‌లో లేదా బయట పెట్టడం వల్ల అవి వాడిపోవడం, విటమిన్లను కోల్పోవడం జరుగుతుంది. వాటిని తిన్నా రుచి ఉండకపోవడం ఒకవంతు అయితే మనకు అసరమైన పోషకాలు అందులో ఉండవు
ఆధారము: ఆంధ్రజ్యోతి


 

3.06818181818
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు