పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మంచి ఆహరం

మంచి ఆహరం

పోషకాహారం అనగానే పళ్ళు, కాయగూరలు రక రకాల ఆకు కూరలు, పలు రకాలకు చెందిన ధాన్యాలు బలమైన పప్పులు మనకు సహజంగా గుర్తుకి వస్తాయి. అయితే బాదం, జీడిపప్పు, పిస్తా రకాలైన గింజల పప్పులు కూడా మంచివే. అవి అందరికి వెంటనే గుర్తుకి రావు. ఎండిన ద్రాక్ష, ఖర్జురం పండు, అంజీరాల గురించి చాల మందికి తెలియదు. ఇవి మంచి పోషకాలు ఉన్నవి. మంచి రకమైన కొవ్వు విటమినులతో పాటు రాగి, ఇనుము, మంగనిసు వంటి ఖనిజాలు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. కీలకమైన అవయవాలు సరిగ్గా పని చేసేలా చూడటమే కాదు రక రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడతయి కూడా.

  • జీడిపప్పు బాదం వంటి వాటిల్లోని కొవ్వులు (మోనో అసంతృప్త కొవ్వులు) గుండె ఆరోగ్యంగ ఉండటానికి తోడ్పడతాయి. పిస్తాలోని  బి ఆరు విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది కూడా. ఖర్జురం ఐటీ నెత్తురు నాళాలు గట్టి పడకుండా చూస్తుంది.
  • ఎండు ద్రాక్ష , ఖుబానీ వంటి రకాల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఇవి రక్త హీనత బారిన పడకుండా కాపాడతాయి.
  • గింజ పప్పులు, ఎండిన పళ్ళు కొవ్వు తగ్గటానికి ఉపయోగ పడతాయి. జీడిపప్పులో కొవ్వు అసలు ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వు కొలెస్టరాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్ష లోని ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీసు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదం చేస్తాయి.
  • పొటాషియం , విటమిన్ ఏ, పీచు, రాగి ఎక్కువగా గల ఫ్రూన్స్ (ఎండు ఆలుబాకరా ) వంటిలో శక్తీ తగ్గ కుండా చూస్తాయి. జీడిపప్పుతో రాగి ఎక్కువగా ఉండటం వాళ్ళ శక్తీ ఉత్పత్తి అవుతుంది. బాదాం పప్పు కొత్త రక్త కణాల ఉత్పత్తికి హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువ అవటానికి ఉపయోగ కారిగా ఉంటుంది.
  • ఎండు ద్రాక్షలో విటమిన్ ఏ, కషియం ఎక్కువగా ఉంటాయి.  దీంతో ఎముక పుష్టికి, దృష్టి బాగా ఉండటానికి దోహదం చేస్తాయి కూడా. జీడిపప్పులోని మాంగనీసు, కాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదాం పప్పులో కాల్షియంతో పటు విటమిన్ ఈ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు చర్మం ఆరోగ్యాంగా ఉండటానికి కుడా తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లవనాయుడులు ఈ పొత్తులో ఉంటాయట. మెదడు ఆహారం గా పేరొందిన వాల్నట్స్ లోని ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.
వ్యాసం: భాస్కర్
3.08695652174
ముకుంద Jan 17, 2018 01:35 PM

జండిస్ ట్రీట్మెంట్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు