హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / మధుమేహులకు పోషకాహారం ముఖ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మధుమేహులకు పోషకాహారం ముఖ్యం

మధుమేహులకు పోషకాహారం ముఖ్యం

ప్రస్తుత కాలంలో దాదాపు అందరికి మధుమేహం అంటే ఏమిటో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇందులో టైప్ ఒకటి, టైప్ రెండు అని రెండు రకాలు వుంటాయని, ఇందులో ఒకటోది పిల్లలలో, రెండోది పెద్దలలో మాత్రమే కనబడుతుందని కూడా తెలిసిందే. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నా అత్యాధునిక పరిశోధలనన్ని కూడా రెండు రకాలుగా కాదని, మద్యలో మరి కొన్ని రకాలు ఉంటున్నాయని గుర్తించటం గమనార్హం.మధ్య వాటికీ   1 . 5 అనేటువంటి పేరు  పెట్టడాన్ని చెప్పుకోవాలి. దీని తీరు కొద్దీగ వేరుగా ఉంటుంది. సంగ్రహం గా తేలుకుందాం మరి.

టైప్ 1 అనేది...

క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాకపోవటాన్ని ఇఇ రకంగా గుర్తించ వచ్చు. ఇది చిన్న పిల్లల్లో ముఖ్యనగ పది సంవత్సరాల లోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తక్షణం ఇన్సులిన్ ఇవ్వటం అనివార్యం. లేకపోతె ఇరవై నాలుగు గంటలలో కీటోన్ బోడిస్ అనేది ఏర్పడి కోమాలోకి వెళ్లి పోయితే ప్రమాదముంది. ఇది ప్రమాదకరమైన స్థితి. మొదటి రకాన్ని సకాలంలో గుర్తించటం ఎంతో అవసరం.

టైప్ 2 అనేది..

క్లోమ గ్రంధి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుటూనే ఉంటుంది. అయితే అది సక్రమంగా పని చేయదు. శరీరం లోని కండరాలు ఇన్సులిన్ను తీసుకోవు కూడా. అందుచేత దీనిని ఇన్సులిన్ నోరోధకత అని అంటారు. అది కూడా అంతగా ఉపయోగపడదు. వీరికి వంటిలో వున్నా ఇన్సులిన్ను చక్కగా వినియోగించుకునేలా మాత్రలతో చికిత్స ఆరంభించాలి. సాధారణంగా ఈ రకం మధుమేహం  ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో కనపడుతుంది. లావుగా, బరువు ఎక్కువ వున్నా వారిలో కనపడే వీలుంది.

టైప్ 1 . 5 ఆంటీ.

మధ్య కొందరిలో పారిశ్ఞ్చి చుస్తే టైప్ 1 బాధితుల మాదిరిగా ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా ఉండదు. టైప్ 2 బాధితుల్లో మాదిరిగా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగానే ఉంటుంది. కనుక దిన్ని 1 . 5 గ వ్యవహరిస్తున్నారు. డబుల్ డయాబిటీస్ అని, మిక్సెడ్ డయాబిటీస్ లేదా హైబ్రిడ్ డయాబిటీస్ అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం దీని చర్చ ఎక్కువగా కనబడుతొంది. చాల లావుగా వున్నా వారిలో అందులోను చిన్న వయసులోనే బాగా బయట పడుతొంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేదని అర్ధం.

టైప్ 1 .. దీని బారిన పడిన చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల కీలకం . కనుక వాళ్ళ ఎత్తు, బరువు బాగా ఉండేట్టు, విద్య, జీవన శైలి ప్రభావితం కాకుండా చూడలిసిన అవసరం వుంది. వీరికి పోషక ఆహారం చాల అవసరం. పిండి పదార్ధాలు, మాంస కృతులు, కొవ్వు, వంటివన్నీ కూడా తగుపాళ్లలో ఇస్తూ ఆహార నిబంధనలు లేకుండా, ఎదుగుదలకి హాని లేకుండా చూడటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.

ముందుగా...

ఎత్తు బరువు నిష్పత్తి  అంటే  బీఎంఐ సరి చూసుకోవాలి. దీని ప్రకారం బరువు ఎక్కువ వున్నా వారు మాత్రమే తగ్గటానికి ప్రయత్నించాలి. తక్కువ ఉన్నట్టయితే పెరగాల్సిన అవసరం వుంది. మన భారతీయులకు సగటున బీఎంఐ ఇరవై రెండుకి దగ్గరలో ఉండాలి. తక్కువ ఉంటే పెరగాలి. ఇది ముఖ్యం. మధుమేహుల్లో మరణాలకు సర్వ సాధారణ కారణం గుండె జబ్బులు కాదు, క్షయ. క్షయ లాంటివి రాకుండా ఉండాలంటే తగినంత బరువుతో ఆరోగ్యాంగా ఉండాలి.

కేవలం తీపీ కాదు

మధుమేహులు కాఫీలో చక్కర వాడకుండా వుంటారు. అందునుంచి వచ్చే గ్లూకోజు తక్కువే . చేగోడీలు వంటి నూనె పదార్ధాలు కాసంత ఎక్కువే తింటారు. దింతో క్యాలరీలు వచ్చే వీలుంది. చక్కర మానేసి మరేదైనా తినవచ్చనే ఆలోచన సరికాదు. ఆహారం పైన మంచి అవగాహనా ఉంచుకుని ఆ ప్రకారం నడచుకుంటే నయం.

ఇక రెండోది..

కొవ్వు. నెత్తురులో కొవ్వు ఈ మాత్రం వుందో చుసుకుంటూ ఉండాలి. రెండు వందల కంటే ఎక్కువ ఉంటే నూనెలు, కొవ్వులు జంతు సంబంధ ఉత్పత్తులు తక్కువగా వాడితే నయం. కొబ్బరి, నువ్వులు, వేరు సెనగ పాపు, జీడిలో కూడా కొవ్వు ఉంటుంది కాబట్టి తక్కువగా వాడితే  మంచిది.

మూడో రకం..

ట్రీగ్లిజరైడ్లు నూట యాభై కంటే ఎక్కువ వున్నా వాళ్ళు సులభంగా అరిగే పిండి పదార్ధాలు మానితే మంచిది. నూడుల్స్, జెల్లీ, బ్రెడ్డు వంటివి తేలికగా అరిగేవే. దూరంగా ఉంటే మంచిది. రాగులు, సజ్జలు వంటి చిరు ధాన్యాలు , దంపుడు బియ్యం ముడి ధాన్యం వంటివి ఎక్కువ తీసుకుంటే మేలు.

ఇక నాలుగో రకం   అయితే..

మధు మేహులు అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా తినాలి . ట్రిగ్లిజరైడ్లు కాస్త అధికంగా వున్నా వారు పళ్ళు తగ్గియించుకోవటం మంచిది.  దీని ఆధారంగా ఎలా ఉండాలో ఆలోచించుకుంటే అన్ని రకాల మధుమేహులకు ఉపయోగకరంగా ఉంటుంది.

వ్యాసం... అనూరాధ

2.95145631068
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు