অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ప్రాముఖ్యత:

మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ప్రాముఖ్యత:

మన ఆరోగ్యం మనం తీసుసునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంలో అన్ని పోషక పదార్ధాలు సరైన మేతదుల్లో ఉండే ఆహారాన్ని పోషకాహారం అని అంటారు. సాధారణంగా వ్యక్తి  యెక్క శారీరక మరియు మానిసిక పెరుగుదల సక్రమంగా ఉండాలంటే ఆహారం ఎంతో అవసరం. అయితే శరీరం పనిచేయడానికి కేలరీలు, పెరుగుదలకు మసకత్తులు, రకానకు నిటమినులు, ఖనిజ లవణములు వంటి అనేక పోషక పదార్ధాలు తగిన నిష్పత్తిలో లభిసేనే మనిషి ఆరోగ్యంగాను, ఉత్సాహంగాను ఉండును. ఈ పోషక పదార్ధాలు మనం తినే ఆహారం ధ్వారా మనకు లభిస్తుంటాయి. ఆహార పదార్ధాలను ముఖ్యంగా ఐదు రకాలుగా చెప్పవచ్చును.

1.  గింజధాన్యాలు,   2.    పప్పుదినుసులు,  3.   పాలు మరియు మాసపదార్ధాలు,  4.   పండ్లు మరియు కూరగాయలు, 5.   నూనె పదార్ధాలు మరియు చక్యెరా పదార్ధాలు. శరీరినికి అవసరమయ్యే పోషక పదార్ధాలు అన్ని సమపాళ్ళల్లో లభించాలంటే ఈ ఐదు రకాల  ఆహార పదార్ధాలను మనం ప్రతి నిత్యం తినవలసిన అవసరం ఉంది. ఈ విధంగా శరీర అవసరాలను బట్టి పోషక పదార్ధాలను అందించే ఆహారాన్ని సమీకత ఆహారం (లేక) సంతులిత ఆహారం (లేక) సంపూర్ణ ఆహారం అని అంటారు.

ఆహారంలో ఉండవలసిన పోషక పదార్ధాలు: 1.   పిండి పదార్ధాలు, 2. మాంసకత్తులు, 3. కొవ్వు పదార్ధాలు, 4.విటమిన్లు, 5.  ఖనిజ లవణాలు, 6. పీచు పదార్ధాలు.

పోషక పదార్ధము

ఉపయెగాలు

లభ్యమయ్యే ఆహార పదార్ధాలు

లోప లక్షణాలు

పిండి పదార్ధాలు

శక్తి జనకం

ధాన్యాలు, చిరుశాన్యాలు, చక్కర, బెల్లం, దుంపకురాలు

బరువు తగ్గుట, నీరసం

పీచు పదార్ధాలు

రక్తంలోని కొలెస్ర్టాల్ నియంత్రణ, జీర్ణకోశ ఆరోగ్యం

ముడిధాన్యాలు, చిరుధాన్యాలు, మిడిపప్పులు, ఆకుకూరలు, పండ్లు

మలబద్దకం, క్యాన్సరకు  దారితీయగల అవకాశము

మాంసకత్తులు

శరీర నిర్మాణానికి, పెరుగుదలకు వ్యాధి నిరోధక శక్తికి

పప్పులు, నానెగింజలు, మాంసం, గ్రుడ్లు, చేపలు, పాలు, పెరుగు  రోగ నిరోధక శక్తి తగ్గటం.

పెరుగుదల తగ్గుట, కండరాలు కరగడం, శరారంలో నిరుపట్టడం.

కొవ్వు పదార్ధాలు

శక్తిని అత్యధికంగా ఇస్తుంది. చర్మ మధుత్వం

వివిధ నూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి

బరువు తగ్గుట, గరుకు చర్మం 

 

విటమిన్లు:

 

 

 

విటమిన్ 'ఎ'

శరీర పెరుగుదల, మంచి శాంతి చూపు, చర్మ ముదుత్వం, రోగ నిరోధకశక్తి

నెయ్యి, పాలు, పెరుగు, గ్రుడ్లు, పచ్చసొన, కాలేయం, ఆకుకూరలవి, బొప్పాయి, క్యారెట్, మామిడి పండ్లు.

 

గరుకు చర్మం, కంటిచూపు లోపం, గ్రుడ్డితనం, తరచు అనారోగ్యం

'బి' కాంప్లెక్సు విటమిన్లు

నరాల బలానికి, పెరుగుదలకు,  జీర్ణకోశ ఆరోగ్యానికి

ధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, పాల  పదార్ధాలు, పప్పులు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, మాసం, గింజధాన్యాలు

పెదవుల చివరలు పగులుట, నోటిపూత,  ఆకలి తగ్గుట

విటమిన్ 'సి'

పల్లచిగుశలకి, ఎముకల పుష్టికి, రోగ నిరోధకశక్తని పెంచడానికి

నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, జమ, మొలకెత్తిన పప్పుదినుసులు,  పాలు, కాలేయం, సూర్యరశ్మి

పల్లచిగుర్ల ఉబ్బి రక్తం కారడం, చర్మపు పుండ్లు, ఆకలి తగ్గుట.

 

విటమిన్ 'డి'

ఎముకల నిర్మాణానికి, గట్టిదనానికి

పాలు, చేపలు, ముడిపప్పులు, రాగులు, ఆకుకూరలు

రికెట్సవ్యాధి, ఎముకల బలహీనత, పెరుగుదల తగ్గుట

ఖనిజ లవణాలు:

 

 

 

కాల్షియం

ఎముకలు, పళ్ళ ఆరోగ్యానికి

మాంసం, కాలేయం, గ్రుడ్లు, రాగులు ఆకుకూరలు, దంపుడు అటుకులు, ఖర్జురామ్

రికెట్స్ వ్యాధి, పెరుగుదల తగ్గటం, తరచు ఎముకలు విరగటం

ఇనుము

రక్తపుష్టికి

బెల్లం, ఎండ ద్రాక్ష

రాల్తాహీనత

సమీకతహితం:

పోషక పదార్ధాలు మనిషి వయసును బట్టి చేసే పనిని బట్టి అవసరమేన మెత్తదలో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్ర్తి, పురుష అవసరాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది. శారీరకంగా కష్టపడి బరువుపని చేసేవారికి తేలిక పని చేసే వారికంటే సుమారు 1 ½ రేట్లు అధిక పోషక పదార్ధాలు అవసరం. పెరిగే పిల్లలకు, గర్భిమిలకు, పాలిచ్చే తల్లులకు పోషక పదార్ధాల అవసరం ఎక్కువ. ముసలినంలో శక్తి, క్రొవ్వు పదార్ధాలు తక్కువ తీసుకోవాలి. యక్తయస్సులోని ఆడవారికి ఇనుము అవసరం ఎక్కువ. అలాగే మగపిల్లలు కంధర పటుత్వానికి మాంసకాతులు అధికంగా తినాలి.

ఆధారం: వ్యవసాయ సాంకేతిక సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate