హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / మలబద్దకంతో కిడ్నీకి కూడా ప్రమాదమే
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మలబద్దకంతో కిడ్నీకి కూడా ప్రమాదమే

మలబద్దకంతో కిడ్నీకి కూడా ప్రమాదమే

మనం సాధారణంగా చాలామంది నుంచి వింటూనే ఉంటాం పొద్దున్నే సరిగ్గా విరీచనం అవలేదని. అయితే ఈ సమస్య ఎక్కువగా వయస్సు పడిన వారిని వేధిస్తుంటుంది. ఇది జీర్ణానికి చెందినదని అనుకోరు. సాఫీగా విరేచనం అవటానికి ఇక మందుదులు వాడటం ఆరంభిస్తారు. అయితే ఇది పెద్ద పేగుకి మాత్రమే కాకుండా మూత్రపిండాల (కిడ్నీ) మీద దీని ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని పరిశోధకుల వాదన. మల విసర్జన సరిగ్గా కాకపోతే దీర్ఘ కాల మూత్ర పిండాల సమస్య ఏర్పడే ప్రమా ముంది. పొతే ఇది ఎక్కువ అవుతున్న కొద్దీ కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. గుండె వ్యాధులకు మలబద్దకానికి లింకు వున్నదని ఇదివరకే తేలింది. కనుక ఈ సమస్యలే ప్రభావాన్ని చుపుతున్నాయేమోనని పరిశోధకులు భావిస్తున్నారు. మూలం ఏమంటే పేగుల లోని బ్యాక్టీరియా లో ఉండ వచ్చనే అభిప్రాయాన్ని ప్రముఖ వైద్యులు పాల్ కోవెస్టి వెలిబుచ్చారు. మలబద్దకానికి పేగులలో ఉండే బ్యాక్టీరియా లోని మార్పులు తలెత్తటం ఒక కారణంగా అంటున్నారు. మనం తీసుకునే ఆహారం పేగుల గుండా కదిలే ప్రక్రియను నెమ్మది చేసే వీలుంది. వంట్లో దీర్ఘ కాల వాపు ప్రక్రియను ప్రేరేపింప వచ్చు. ఇటువంటి కారణాల వాళ్ళ కిడ్నీ ముప్పు  ఎక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదనేది వైద్య పరిశోధకుల ఆలోచన.మరి చికిత్స ప్రారంభిస్తే జబ్బు ముప్పును నియంతరించుకోవచ్చా?  ఆంటీ ఇంకా శోధన జరగాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందరూ ముఖ్యంగా గురుతుంచు కోవలసింది ఏమంటే మందులు వాడటం కన్న పీచు పదార్ధాలను ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు. దీన్ని వైద్యులు సలహా గా అందిస్తే అందరికి మంచిదే. ప్రో బయోటిక్స్ తీసుకుంటె వంటిలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో కిడ్నీ సమస్యకి ముప్పు కారకమే కావచ్చు.

2.96610169492
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు