పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మెదడుకు మేత

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి పోషకాలు అవసరం? ఒకసారి చూద్దాం.

 

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి పోషకాలు అవసరం? ఒకసారి చూద్దాం.

యాంటాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్‌
మన శరీరంలో రోగాల మీద పోరాడేవి యాంటాక్సిడెంట్లు. ఇందులో బాగంగా ఉండే ఏ, సి, ఇ విటమిన్లు సహజ సిద్ధ ఆహారమైన, గుడ్లు, క్యారెట్లు, బ్రకొలి, చేపలు, నట్స్‌, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లలో విరివిగా లభిస్తాయి. ఇవి మెదడుకు శక్తినివ్వడమే కాకుండా, మెదడు కణాల క్షీణతను కూడా అరికడతాయి. ఫ్లవనాయిడ్స్‌ అనేవి రసాయనిక మిశ్రమాలు. ఇవి పండ్లు, ఆకుకూరల్లోంచి, వాటి పచ్చదనంలోంచి లభిస్తాయి. వీటిలో జ్ఞాపకశక్తిని వృద్ధిపరిచే యాంథోసియానిన్లు, క్వెర్‌సెటిన్లు, ఉన్నాయి. వీటికి మెదడు కణాల క్షయానికి వ్యతిరేకంగా పోరాడే గుణం కూడా ఉంది. ఎర్ర ద్రాక్ష, ఉల్లి, ఆపిల్స్‌, గ్రీన్‌, బ్లాక్‌ టీలు ఫ్లవనాయిడ్స్‌ లభించే గొప్ప నిధులు. రోజుకు మూడు కప్పుల గ్రీన్‌టీ, నాలుగైదు కప్పుల పండ్ల నుంచి మనిషికి అవసరమైన ఫ్లవనాయిడ్స్‌ లభిస్తాయి.

లెసిథిన్‌
నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసే ఇది స్వల్పకాలిక జ్ఞాపకశ క్తి పెరగడానికి తోడ్పడటంతో పాటు, మతిమరుపును నివారిస్తుంది. గుడ్లు, పెరుగు, సోయాబీన్‌, కాలీఫ్లవర్‌, చిక్కుడు ధాన్యాలు, ముడిధాన్యాలు, గోదుమల్లోంచి ఈ లెసిథిన్‌ లభిస్తుంది.

కర్‌క్యూమిన్‌
ఈ మిశ్రమం పసుపులోంచి ఎక్కువగా లభిస్తుంది. గ్రహణ శక్తి లోపాలను సవరించడంతోపాటు, ఆల్జీమర్‌ వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడుతుంది.

ఐరన్‌

శరీరంలో ఐరన్‌ లోపిస్తే, మనిషి కార్యదక్షతను కోల్పోతాడు. ఈ లోపాన్ని సరిచేస్తే చాలా త్వరితంగానే మనిషిలోని గ్రహణ శక్తి, కార్య దక్షత పెరుగుతాయి. మేక మాంసం, చేపలు, కోడి మాంసం, చిక్కుడు దాన్యాలు, ఐరన్‌ బాగా లభించే ఽపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒక రకంగా వృక్ష సంబంధిత ప్రొటీన్‌ కన్నా, జంతు సంబంధమైన ప్రొటీన్‌ తీసుకోవడమే ఎక్కువ ప్రయోజనకరం.

కోలిన్‌
ఈ పదార్థం, గుడ్డులోని తెల్లభాగం, సోయా, పల్లీలు, లివర్‌ ఇవన్నీ మనిషి గ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని దెబ్బ తీసే హానికారక అంశాలనుంచి కూడా కోలిన్‌ కాపాడుతుంది.
ఆధారము: ఆంధ్రజ్యోతి
2.9918699187
Dr M Nageswara rao , Guntur. Aug 23, 2017 04:36 PM

బాగుంది.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు